2023 క్రొత్త నిబంధన
అక్టోబరు 2-8. ఎఫెసీయులకు: “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు”


“అక్టోబరు 2-8. ఎఫెసీయులకు: ‘పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“అక్టోబరు 2-8. ఎఫెసీయులకు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ఫోటోలు చూస్తున్న కుటుంబము

అక్టోబరు 2-8

ఎఫెసీయులకు

“పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు”

సర్వసభ్య సమావేశములలోని సందేశాలు మరియు ఎఫెసీయులకు పౌలు యొక్క పత్రిక మధ్య ఏవైనా అనుసంధానాలను మీరు చూసారా?

మీ మనోభావాలను నమోదు చేయండి

ఎఫెసులో సువార్త వ్యాప్తిచెందుట ప్రారంభమైనప్పుడు, అది ఎఫెసీయుల మధ్య “చాలా అల్లరి” కలిగించెను (అపొస్తలుల కార్యములు 19:23). అన్యమత దేవతకు పుణ్యక్షేత్రాలను నిర్మించిన స్థానిక హస్తకళాకారులు క్రైస్తవత్వమును వారి జీవనోపాధికి ముప్పుగా భావించారు, త్వరలో “వారు రౌద్రముతో నిండిన వారైరి, … మరియు పట్టణము మొత్తము బహు గలిబిలిగా ఉండెను” (అపొస్తలుల కార్యములు 19:27–29 చూడండి). అటువంటి సందర్భములో సువార్తకు క్రొత్తగా మార్పు చెందిన వారిగా ఉండుటను ఊహించుకోండి. అనేకమంది ఎఫెసీయులు అంగీకరించారు మరియు “గలిబిలి” (అపొస్తలుల కార్యములు 19:40) మధ్య సువార్తను జీవించారు, మరియు “క్రీస్తు … మన సమాధానము” (ఎఫెసీయులకు 2:13–14) అని పౌలు వారికి అభయమిచ్చాడు. “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి” (ఎఫెసీయులకు 4:31) అన్న అతని ఆహ్వానముతోపాటు, ఈ మాటలు అప్పుడున్నట్లుగా ఇప్పుడు సమయానుకూలంగా, ఓదార్పుగా కనిపిస్తాయి. మనలో ప్రతిఒక్కరి వలె, ఎఫెసీయులకు అపవాదిని ఎదుర్కొనుటకు బలము “ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు” (ఎఫెసీయులు 6:10–13 చూడండి) వచ్చును.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఎఫెసీయులకు 1:4–11, 17–19

భూమిపై నిర్దిష్టమైన బాధ్యతలు నెరవేర్చడానికి దేవుడు నన్ను ఎన్నుకొన్నారు లేదా ముందుగా నియమించారు.

దేవుని చేత “ముందుగా నిర్ణయించబడెను” మరియు ఆయన జనులుగా ఉండుటకు “లోక పునాది వేయకముందే … ఏర్పరచుకొనెను,” అని పరిశుద్ధులను గూర్చి పౌలు మాట్లాడెను. అయినప్పటికీ, అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ గమనించినట్లుగా దీని అర్థము, “సువార్తను ఎన్నడూ వినని వారు కేవలము ‘ఎంపిక చేయనివారు’ కాగా, దేవుడు తన బిడ్డలలో ఎవరిని రక్షించాలి మరియు వారికి సువార్తను లభ్యముగా చేయాలో ముందుగా నిర్ణయిస్తాడని కాదు. … కానీ … దేవుని యొక్క ప్రణాళిక దీనికంటే మరింత ప్రేమగలది మరియు న్యాయమైనది. మన పరలోక తండ్రి తన సమస్త కుటుంబాన్ని సమకూర్చి, దీవించడానికి ఆత్రుతగా ఉన్నారు,” (“దేవుని యొక్క కుటుంబాన్ని సమకూర్చుట,” లియహోనా, మే 2017, 20–21). పరిశుద్ధ దేవాలయములలో మృతుల కొరకు నెరవేర్చబడిన కార్యము వలన దేవుని యొక్క పిల్లలందరు సువార్తను, దాని విధులను అంగీకరించగలరు.

ఏ ఒక్కరు రక్షించబడుటకు ముందుగా నిర్ణయించబడనప్పటికీ లేదా రక్షించబడనప్పటికీ, దేవుని పిల్లలలో కొందరు భూమి మీద నిర్దిష్టమైన బాధ్యతలను నెరవేర్చడానికి ఎన్నుకోబడ్డారు లేదా పూర్వ మర్త్య లోకములో “ముందుగా నియమించబడ్డారు” అని ఆధునిక బయల్పాటు బోధిస్తుంది. ఎఫెసీయులకు 1 మరియు సువార్త అంశములు, “పూర్వనియామకము” (topics.ChurchofJesusChrist.org) మీరు చదివినప్పుడు, ఈ సత్యము మీకెలా అన్వయిస్తుందో ధ్యానించండి.

ఎఫెసీయులకు 1:10

దేవుడు “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చును.”

మన కాలము “కాలముల యొక్క సంపూర్ణ యుగము” గా ఎందుకు పిలువబడిందని మీరనుకుంటున్నారు? “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుట” అనగా అర్థము ఏమైయుండవచ్చు? ఈ వాక్యభాగములను మీరు ధ్యానించినప్పుడు, క్రింది లేఖనాలను చదవండి: ఎఫెసీయులకు 4:13; 2 నీఫై 30:7–8; సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11–16; 112:30–32; 128:18–21. ఈ వాక్యభాగములను గూర్చి మీ స్వంత వివరణలు వ్రాయుటకు మీరు ప్రేరేపించబడినట్లు భావించవచ్చు.

ఎఫెసీయులకు 2:19–22; 3:1–7; 4:11–16

యేసుక్రీస్తు ప్రధాన మూలరాయియై ఉండగా, సంఘము అపొస్తలులు మరియు ప్రవక్తలపై స్థాపించబడింది.

ఎఫెసీయులకు 2:19–22; 3:1–7; 4:11–16 ప్రకారము, మనము అపొస్తలులు మరియు ప్రవక్తలను ఎందుకు కలిగియున్నాము? సర్వసభ్య సమావేశములో మీరు ప్రవక్తలు మరియు అపొస్తలుల నుండి వినిన సందేశాల గురించి ఆలోచించండి. పౌలు వర్ణించిన ఉద్దేశ్యాలను వారి బోధనలు ఎలా నెరవేరుస్తాయి? ఉదాహరణకు, ఈ బోధనలు “ప్రతీ సిద్ధాంతపు గాలితో తీసికొనిపోబడకుండా” ఉండుటకు మీకు ఎలా సహాయపడినవి?

సంఘము కొరకు యేసు క్రీస్తు ఒక మూలరాయి వలె ఎట్లున్నారు? మీ జీవితం కొరకు ఆయన ఒక మూలరాయి వలె ఎట్లున్నారు?

అపొస్తలుల కార్యములు 4:10-12 కూడా చూడండి.

చిత్రం
ఒక భవనము యొక్క మూలరాయి

యేసు క్రీస్తు, సంఘము యొక్క మూలరాయి.

ఎఫెసీయులకు 5:216:4

రక్షకుని మాదిరిని అనుసరించడం నా కుటుంబ అనుబంధాలను బలపరచగలదు.

ఎఫెసీయులకు 5:216:4 మీరు చదివినప్పుడు, ఈ వచనాలలోని సలహా మీ కుటుంబ అనుబంధాలను ఎలా బలపరచగలదని ఆలోచించండి.

ఎఫెసీయులకు 5:22–24 లో పౌలు మాటలు అతని యుగములో సామాజిక ఆచారముల సందర్భములో వ్రాయబడినవని గమనించుట ముఖ్యమైనది. పురుషులు స్త్రీల కంటె గొప్పవారు కాదని, సహవాసులు “సమాన భాగస్వాములు”గా ఉండాలని నేడు అపొస్తలులు మరియు ప్రవక్తలు బోధిస్తున్నారు (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org చూడండి). అయినప్పటికీ, ఎఫెసీయులకు 5:25–33 లో సంబంధిత సలహాను మీరు ఇంకా కనుగొనవచ్చు. ఉదాహరణకు, క్రీస్తు పరిశుద్ధుల కొరకు తన ప్రేమను ఎలా చూపారు? సమాన భాగస్వాములుగా సహవాసులు ఒకరినొకరు ఎలా ఆదరించాలని ఇది సూచిస్తుంది? ఈ వచనాలలో మీకైమీరు కనుగొన్న సందేశాలేవి?

ఎఫెసీయులకు 6:10–18

దేవుని కవచం చెడు నుండి నన్ను కాపాడుటలో సహాయపడుతుంది.

మీరు ఎఫెసీయులకు 6:10–18 చదివినప్పుడు, అతడు కవచములో ప్రతీ భాగాన్ని ఆవిధంగా ఎందుకు పిలిచియుండవచ్చో ఆలోచించండి. “దేవుని యొక్క సర్వాంగకవచము” మిమ్మల్ని దేని నుండి కాపాడుతుంది? ప్రతీరోజు కవచములో ప్రతీ భాగాన్ని మరింత సంపూర్ణంగా ధరించడానికి మీరేమి చేయగలరు?

2 నీఫై 1:23; సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15-18 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఎఫెసీయులకు 1:10. కుటుంబ సభ్యులకు ఒక తాడును చూపించి, ఎల్డర్ బెడ్నార్ సందేశంలోని భాగాలను మీరు పంచుకొనుచుండగా వారు దానిని పట్టుకొని, పరీక్షించేలా చేయడాన్ని పరిగణించండి. ఏవిధంగా దేవుడు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుచున్నాడు? ఈ సమకూర్పు కారణంగా మనము ఏవిధంగా దీవించబడతాము?

ఎఫెసీయులకు 2:4–10; 3:14–21ఈ వచనములలో వివరించబడిన దేవుని యొక్క మరియు యేసు క్రీస్తు యొక్క ప్రేమను, కనికరమును వారు అనుభవించిన అనుభవాలను పంచుకోమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

ఎఫెసీయులకు 2:12-19.తలగడలతో లేదా మీ ఇంటిలో ఉన్న ఇతర వస్తువులతో గోడలను కట్టి, వాటిని పడగొట్టుటను మీ కుటుంబము ఆనందించవచ్చు. అన్యులు మరియు యూదుల మధ్య పౌలు సూచించిన “గోడ” వలె నేడు ఏ రకమైన గోడలు మనుష్యులను వేరుచేస్తున్నాయి? ఈ గోడలను యేసు క్రీస్తు ఏవిధంగా “పడగొట్టారు”? ఆయన ఎలా “దేవునితో [మనల్ని] సమాధానపరిచెదరు”? (16వ వచనము).

ఎఫెసీయులకు 6:10-18.మీ కుటుంబము ఇంటిలోని వస్తువులను ఉపయోగిస్తూ వారి స్వంత “దేవుని యొక్క కవచము”ను చేయవచ్చు. కవచములో ప్రతీఒక్కటి ఆత్మీయంగా మనల్ని ఎలా కాపాడుతుంది? ప్రతీరోజు “దేవుని యొక్క సర్వాంగకవచమును ధరించుటకు” (ఎఫెసీయులకు 6:11) మనము ఒకరికొకరం సహాయపడేందుకు ఏమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ఆత్మ మీ అధ్యయనమును నడిపించనివ్వండి. మీరు ముందుగా ప్రణాళిక చేయని ఒక విషయమును అధ్యయనము చేయుటకు అది నడిపించినప్పుడు కూడా, ప్రతీరోజు మీరు నేర్చుకోవాల్సిన విషయాల వైపు ఆత్మ మిమ్మల్ని నడిపించినప్పుడు, ఆయనపట్ల మృదువుగా ఉండండి.

చిత్రం
క్రొత్త నిబంధన యుగపు కవచముతో మనుష్యుడు

దేవుని యొక్క కవచమును ధరించుట మనల్ని ఆత్మీయంగా కాపాడగలదు.

ముద్రించు