2023 క్రొత్త నిబంధన
అక్టోబరు 23-29. 1 మరియు 2 తిమోతికి; తీతుకు; ఫిలేమోనుకు: “విశ్వాసులకు మాదిరిగా ఉండుము”


“అక్టోబరు 23-29. 1 మరియు 2 తిమోతికి; తీతుకు; ఫిలేమోనుకు: ‘విశ్వాసులకు మాదిరిగా ఉండుము,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“అక్టోబరు 23-29. 1 మరియు 2 తిమోతికి; తీతుకు; ఫిలేమోనుకు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
దేవాలయము వెలుపల నడుస్తున్న ముగ్గురు స్త్రీలు

అక్టోబరు 23-29

1 మరియు 2 తిమోతికి; తీతుకు; ఫిలేమోనుకు

“విశ్వాసులకు మాదిరిగా ఉండుము”

కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని మీ లేఖనాలను అధ్యయనం చేయడం మీకు సహాయపడుతుంది. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు సమాధానాలకు మార్గనిర్దేశం చేయడానికి ఆత్మను ఆహ్వానించండి మరియు మీకు కలిగే ప్రేరేపణలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

పౌలు తిమోతికి, తీతుకు, ఫిలేమోనులకు రాసిన పత్రికలలో, ప్రభువు సేవకుడి హృదయంలోనికి మనకు క్షణికదృష్టి లభిస్తుంది. మొత్తం సమాజాలకు పౌలు ఇచ్చిన ఇతర పత్రికల మాదిరిగా కాకుండా, ఇవి వ్యక్తులకు—అనగా పౌలు యొక్క సన్నిహితులకు మరియు దేవుని పనిలో సహచరులకు వ్రాయబడ్డాయి—మరియు వాటిని చదవడం ఒక సంభాషణను వినడం వలె ఉంటుంది. పౌలు తిమోతి మరియు తీతు అనే ఇద్దరు సమూహ నాయకులను వారి సంఘ సేవలో ప్రోత్సహించడం మనం చూస్తాము. తోటి పరిశుద్ధునితో సమాధానపడి, సువార్తలోని సహోదరుడిలా అతనితో వ్యవహరించమని ఆయన తన స్నేహితుడైన ఫిలేమోనును వేడుకోవడం మనం చూస్తాము. పౌలు మాటలు మనకు నేరుగా ప్రసంగించబడలేదు మరియు చాలామంది ప్రజలు ఒక రోజు వాటిని చదువుతారని ఆయన ఎప్పుడూ ఊహించలేదు. క్రీస్తు సేవలో మన వ్యక్తిగత పరిచర్య ఏమైనప్పటికీ, ఈ పత్రికలలో మనకు ఉపదేశము మరియు ప్రోత్సాహం లభిస్తుంది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

తిమోతి మరియు తీతు ఎవరు?

పౌలు యొక్క సువార్త పరిచర్య ప్రయాణాలలో కొన్నింటిలో తిమోతి మరియు తీతు అతనితోపాటు సేవ చేశారు. వారి సేవలో వారు పౌలు యొక్క గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించారు. తిమోతి తరువాత ఎఫెస్సీలో నాయకుడిగా పిలువబడ్డాడు మరియు తీతు క్రేతులో నాయకుడిగా పిలువబడ్డాడు. ఈ పత్రికలలో, వారి బాధ్యతల గురించి పౌలు తిమోతికి మరియు తీతుకు సూచనలను, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, ఇందులో సువార్తను ప్రకటించడం మరియు బిషప్పులుగా పనిచేయడానికి పురుషులను పిలువడం వంటివి ఉన్నాయి.

చిత్రం
ఒక వ్యక్తితో మాట్లాడుతున్న ఇద్దరు సువార్తికులు

“నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, విశ్వాసులకు మాదిరిగా ఉండుము” (1 తిమోతికి 4:12).

1 తిమోతికి 4:10–16

“విశ్వాసులకు మాదిరిగా ఉండుము.”

తిమోతి సాపేక్షంగా చిన్నవాడు, కాని యవ్వనంలో ఉన్నప్పటికీ అతడు గొప్ప సంఘ నాయకుడు కాగలడని పౌలుకు తెలుసు. 1 తిమోతికి 4:10–16 లో పౌలు తిమోతికి ఏ ఉపదేశము ఇచ్చాడు? రక్షకుడు మరియు ఆయన సువార్త వైపు ఇతరులను నడిపించడానికి ఈ ఉపదేశము మీకు ఎలా సహాయపడుతుంది?

ఆల్మా 17:11 కూడా చూడండి.

2 తిమోతికి

“దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.”

2 తిమోతికి పౌలు వ్రాసిన చివరి ఉపదేశమని నమ్ముతారు మరియు భూమిపై తన సమయం తక్కువగా ఉందని ఆయనకు తెలుసని అనిపిస్తుంది (2 తిమోతికి 4:6–8 చూడండి). త్వరలోనే తన విశ్వసనీయ గురువు మరియు నాయకుడు తనతో ఉండడని తెలుసుకొని తిమోతి ఏవిధంగా భావించియుండవచ్చు? అతడిని ప్రోత్సహించడానికి పౌలు ఏమి చెప్పాడు? మీ స్వంత సవాళ్ళు మరియు భయాలను మనస్సులో ఉంచుకొని కూడా మీరు చదువవచ్చు. 2 తిమోతికిలో ప్రభువు మీ కోసం ఏ నిరీక్షణను, ప్రోత్సాహాన్ని కలిగియున్నారు?

2 తిమోతికి 3

సువార్తను జీవించడం చివరి రోజుల్లోని ఆత్మీయ ప్రమాదాల నుండి భద్రతను అందిస్తుంది.

పౌలు మాట్లాడిన “అంత్యదినములలో” మనం జీవిస్తున్నాము మరియు “అపాయకరమైన కాలములు” వచ్చియున్నవి (2 తిమోతికి 3:1). మీరు 2 తిమోతికి 3 చదివినప్పుడు, పేర్కొనబడిన అంత్యదినములలోని అపాయములను వ్రాయండి (1 తిమోతి 4:1–3 కూడా చూడండి):

మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో—లేదా మీ స్వంత జీవితంలో ఈ ప్రమాదాల ఉదాహరణల గురించి మీరు ఆలోచించగలరా? 6వ వచనము లో వివరించిన వ్యక్తుల మాదిరిగా ఈ ప్రమాదాలు ఎలా “[మీ యిండ్లలో] చొచ్చి, [మిమ్మల్ని] చెరపట్టుకొనిపోవును”? ఈ ఆత్మీయ ప్రమాదాల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచగల ఏ ఉపదేశాలను 2 తిమోతికి 3లో మరియు ఈ పత్రికలలో మరెక్కడైనా మీరు కనుగొంటారు? (ఉదాహరణకు, 1 తిమోతికి 1: 3–11; 2 తిమోతికి 2:15–16 ; తీతుకు 2: 1–8 చూడండి).

ఫిలేమోను ఎవరు?

ఫిలేమోను ఒక క్రైస్తవుడు, అతడు పౌలు చేత సువార్తకు పరివర్తన చెందాడు. ఫిలేమోనుకు ఒనేసిము అనే దాసుడు ఉండేవాడు, అతడు రోమాకు తప్పించుకుపోయాడు. అక్కడ ఒనేసిము పౌలును కలిసాడు మరియు సువార్తకు మార్పు చెందాడు. ఒనేసిమును క్షమించి, “అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగా” (ఫిలేమోనుకు 1:16) ఉండునట్లు అతడిని చేర్చుకోమని పౌలు ఫిలేమోనును ప్రోత్సహిస్తూ వ్రాసిన లేఖతో పాటు ఒనేసిమును తిరిగి ఫిలేమోను వద్దకు పంపాడు.

ఫిలేమోనుకు

యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఒకరినొకరు సహోదర సహోదరీలవలె ఆదరిస్తారు.

ఫిలేమోనుకు పౌలు వ్రాసిన పత్రికను మీరు చదివినప్పుడు, ఇతరులతో మీ సంబంధాలకు అతని ఉపదేశాన్ని మీరెలా వర్తింపజేస్తారో ధ్యానించండి. మీరు పరిగణించడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి:

  • 1–7 వచనాలు: పరిశుద్ధుల మధ్య సంబంధాల గురించి “జతపనివాడు” మరియు “తోడి యోధుడు” వంటి పదాలు మీకేమి సూచిస్తున్నాయి? మీరు ఎప్పుడు క్రీస్తు నందు ఒక సహోదరుడు లేదా సహోదరి “మూలముగా విశ్రాంతి పొందారు”?

  • 8–16 వచనాలు: “ఆజ్ఞాపించుట” మరియు “వేడుకొనుట” అనగా అర్థమేమిటి? ఫిలేమోనును ఆజ్ఞాపించుటకు బదులుగా పౌలు అతడిని వేడుకొనుటకు ఎందుకు ఎన్నుకున్నాడు? ఒనేసిమును ఫిలేమోను వద్దకు పంపడం ద్వారా ఏమి సాధించబడుతుందని పౌలు ఆశించాడు?

  • 16వ వచనము: “ప్రభువు విషయమును … ప్రియ సహోదరుడు [లేదా సహోదరి]గా ఉండుట” అనగా అర్థమేమిటి? ఈవిధంగా మీరు చేర్చుకోవలసిన వారెవరైనా మీకు తెలుసా?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 తిమోతికి 2:9–10.“సత్‌క్రియలచేత [మనల్నిమనము] అలంకరించు కొనవలెను” అనగా అర్థమేమిటి? ఈ వారం మన కుటుంబం చేయగలిగే కొన్ని మంచి పనులు ఏమిటి?

1 తిమోతికి 4:12.మీ కుటుంబ సభ్యులు “విశ్వాసులకు మాదిరిగా ఉండవలెనని” కోరిక కలిగియుండుటకు సహాయపడేందుకు, వారికి మంచి ఉదాహరణలుగా నిలిచిన వారి చిత్రాలను గీయడానికి వారిని ఆహ్వానించడాన్ని పరిగణించండి. యేసు క్రీస్తును అనుసరించడానికి ఈ వ్యక్తులు మనకు ఎలా ప్రేరణనిచ్చారు?

1 తిమోతికి 6:7–12.“ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము” అని మీరెందుకు అనుకుంటున్నారు? మన జీవితాలను ధనముపై లేదా ఆస్తులపై కేంద్రీకరించడం వలన కలిగే ప్రమాదాలేవి? మనకు లభించే దీవెనలతో మనం ఎలా సంతృప్తి చెందగలం?

2 తిమోతికి 3:14–17.ఈ వచనాల ప్రకారం, లేఖనాలు తెలుసుకొని, అధ్యయనం చేసే వారికి ఏ దీవెనలు కలుగుతాయి? బహుశా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వారికి “ప్రయోజనకరము” అని కనుగొన్న లేఖనాలను పంచుకోవచ్చు.

ఫిలేమోనుకు 1:17–21.ఒనేసిము కోసం పౌలు ఏమి చేయడానికి సిద్ధంగా ఉండెను? రక్షకుడు మన కోసం ఇష్టపూర్వకంగా చేసినదానిని ఇది ఎలా పోలియున్నది? (1 తిమోతి 2:5–6; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3–5 కూడా చూడండి). పౌలు మరియు రక్షకుని ఉదాహరణలను మనం ఎలా అనుసరించగలం?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

స్పష్టమైన మరియు సరళమైన సిద్ధాంతాన్ని బోధించండి. సువార్త దాని సరళతతో అందంగా ఉంటుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 133:57 చూడండి). చాలా సన్నాహాలు అవసరమయ్యే పాఠాలతో మీ కుటుంబాన్ని అలరించడానికి ప్రయత్నించే బదులు, స్వచ్ఛమైన మరియు సరళమైన సిద్ధాంతాన్ని బోధించడానికి ప్రయత్నించండి (1 తిమోతికి 1: 3–7 చూడండి).

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న ఇద్దరు పిల్లలు

“క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీవెరుగుదువు” (2 తిమోతికి 3:14).

ముద్రించు