2023 క్రొత్త నిబంధన
అక్టోబరు 30–నవంబరు 5. హెబ్రీయులకు 1–6: “యేసు క్రీస్తు, ‘నిత్య రక్షణకు కారకుడు’”


“అక్టోబరు 30–నవంబరు 5. హెబ్రీయులకు 1– 6: ‘యేసు క్రీస్తు, “నిత్య రక్షణకు కారకుడు,”’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“అక్టోబరు 30–నవంబరు 5. హెబ్రీయులకు 1-6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ఒక యువతితోపాటు నిలబడిన యేసు

గిలాదులో గుగ్గిలము, ఆన్నీ హెన్రీ చేత

అక్టోబరు 30–నవంబరు 5

హెబ్రీయులకు 1–6

యేసు క్రీస్తు, “నిత్య రక్షణకు కారకుడు”

ఆత్మీయ మనోభావాలను నమోదు చేయడం, పరిశుద్ధాత్మ మీకు నేర్పాలని కోరిన దానిని మీరు గుర్తించడానికి సహాయపడుతుంది. మీ మనోభావాలపై పనిచేయడం, ఆ ప్రేరేపణలు నిజమైనవనే మీ విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు సువార్తను అంగీకరించడానికి మనమందరం ఏదో ఒకటి వదులుకోవాలి—అవి చెడు అలవాట్లు, తప్పుడు నమ్మకాలు, తగని సహవాసాలు లేదా మరేవైనా కావచ్చు. అన్యుల కొరకు, పరివర్తన అనగా తరచూ అబద్ధ దేవుళ్ళను వదిలివేయడమని అర్థము. కానీ హెబ్రీయుల కొరకు (లేదా యూదులు), పరివర్తన అనేది చాలా కష్టమైనది కానప్పటికీ, కొంత సంక్లిష్టమైనదిగా నిరూపించబడింది. ఎంతైనా వారి విలువైన నమ్మకాలు మరియు ఆచారాలు, నిజమైన దేవుని ఆరాధనపై మరియు వేల సంవత్సరాల నుండి ఉన్న ఆయన ప్రవక్తల బోధనలపై ఆధారపడియున్నాయి. అయినప్పటికీ, మోషే ధర్మశాస్త్రము యేసు క్రీస్తు యందు నెరవేర్చబడిందని, ఒక ఉన్నత చట్టము ఇప్పుడు విశ్వాసులు అనుసరించవలసిన ప్రామాణికమని అపొస్తలులు బోధించారు. క్రైస్తవత్వమును అంగీకరించడం అంటే హెబ్రీయులు తమ పూర్వ నమ్మకాలను, చరిత్రను తప్పక వదిలివేయాలని అర్థమా? మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, విధులు అన్నీ ముఖ్యమైనవే, కానీ యేసు క్రీస్తు వాటిని మించినవారని బోధిస్తూ అటువంటి ప్రశ్నలను పరిష్కరించడానికి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక సహాయపడాలనుకుంది (హెబ్రీయులకు 1:1–4; 3:1–6; 7:23–28 చూడండి). వాస్తవానికి ఇవన్నీ క్రీస్తును దేవుని కుమారుడిగా, యూదులు వేచిచూస్తున్న వాగ్దాన మెస్సీయగా సూచించి, సాక్ష్యమిస్తున్నాయి.

ఆ రోజులలో మరియు నేడు పరివర్తన అనగా అర్థము, యేసు క్రీస్తును మన ఆరాధనకు మరియు మన జీవితాలకు కేంద్రముగా చేయడం. దాని అర్థము సత్యాన్ని గట్టిగా పట్టుకొని, ఆయన నుండి మన దృష్టి మరల్చేవాటిని వదిలిపెట్టడం, ఎందుకనగా ఆయన “తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను” (హెబ్రీయులకు 5:10).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

హెబ్రీయులకు పత్రిక ఎవరు వ్రాసారు?

హెబ్రీయులకు పత్రికను పౌలు వ్రాసాడా అని కొందరు పండితులు సందేహించారు. హెబ్రీయుల సాహిత్య శైలి పౌలు యొక్క ఇతర లేఖల నుండి కొంత భిన్నంగా ఉంది, మరియు మూలగ్రంథపు మొట్టమొదటి సంస్కరణలలో రచయిత పేరు లేదు. అయినప్పటికీ, హెబ్రీయులలో వ్యక్తపరచబడిన ఆలోచనలు పౌలు యొక్క ఇతర బోధనలకు అనుగుణంగా ఉన్నందువల్ల, పౌలు ఈ పత్రికను వ్రాయడంలో కనీసం జతచేరాడని, క్రైస్తవ ఆచారానికి కట్టుబడి కడవరి దిన పరిశుద్ధులు సాధారణంగా అంగీకరించారు.

బైబిలు నిఘంటువు, “పౌలు వ్రాసిన పత్రికలు” కూడా చూడండి

హెబ్రీయులకు 1–5

యేసు క్రీస్తు, పరలోక తండ్రి యొక్క ”స్పష్టమైన ప్రతిబింబము”.

యేసు క్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించడం యూదులనేకులకు కష్టతరమైంది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ఆయన గురించి ఎలా సాక్ష్యమిస్తుందో గమనించండి. ఉదాహరణకు, మొదటి ఐదు అధ్యాయాలను మీరు చదివినప్పుడు, అక్కడ చెప్పబడిన యేసు క్రీస్తు యొక్క బిరుదులు, పాత్రలు, గుణాలు మరియు కార్యాల జాబితాను మీరు చేయవచ్చు. ఈ విషయాలు రక్షకుని గురించి మీకేమి బోధిస్తాయి? అవి పరలోక తండ్రి గురించి మీకేమి బోధిస్తాయి?

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ నుండి క్రింది వ్యాఖ్యానము, ఈ అధ్యాయాలలోని బోధనలపై మీ అవగాహనకు ఏమి జతచేస్తుంది? “యేసు … దేవునిపై మనుష్యుల అభిప్రాయాన్ని మెరుగుపరచేందుకు మరియు పరలోక తండ్రి వారిని ఎల్లప్పుడూ ప్రేమించినట్లు, ప్రేమిస్తున్నట్లు ఆయనను ప్రేమించమని వారిని అభ్యర్థించడానికి వచ్చారు. … కాబట్టి ఆకలిగొన్న వారికి ఆహారమివ్వడం, రోగులను స్వస్థపరచడం, వేషధారులను గద్దించడం, విశ్వాసం కొరకు అభ్యర్థించడం—ఇలా తండ్రి యొక్క మార్గాన్ని యేసు మనకు చూపారు” (“The Grandeur of God,” Liahona, Nov. 2003, 72).

హెబ్రీయులకు 2:9–18; 4:12–16; 5:7–8

యేసు క్రీస్తు శోధనలను, బలహీనతలను అనుభవించారు, ఆలాగున నేను బాధపడినప్పుడు ఆయన నన్ను అర్థం చేసుకొని, సహాయపడగలరు.

మీరు “ధైర్యముతో కృపాసనమునొద్దకు వచ్చి,” కనికరమును కోరగలరని మీరు భావిస్తున్నారా? (హెబ్రీయులకు 4:16). హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ఒక సందేశమేదనగా, మన పాపాలు మరియు బలహీనతలు ఉన్నప్పటికీ, దేవుడిని చేరుకోవచ్చు మరియు ఆయన కృపను పొందవచ్చు. మీ మర్త్య సవాళ్ళలో యేసు క్రీస్తు మీకు సహాయపడతారనే మీ నమ్మకాన్ని బలపరిచేలా హెబ్రీయులకు 2:9–18; 4:12–16; 5:7–8 లో మీరేమి కనుగొంటారు? రక్షకుడు మీ కొరకు చేసిన దాని గురించి మీ ఆలోచనలు, అనుభూతులను ఒక పుస్తకంలో నమోదు చేయడం గురించి ఆలోచించండి.

మోషైయ 3:7–11; ఆల్మా 7:11–13; 34; మాథ్యూ ఎస్. హాలండ్, “కుమారుని యొక్క మిక్కిలి శ్రేష్టమైన వరము,” లియహోనా, నవ. 2020, 45–47 కూడా చూడండి.

హెబ్రీయులకు 3:74:11

“[తమ] హృదయాలను కఠినపరచుకొనని” వారందరికి దేవుని దీవెనలు లభ్యమవుతాయి.

ప్రాచీన ఇశ్రాయేలీయుల వృత్తాంతాన్ని తిరిగి చెప్పడం ద్వారా, వారి పూర్వీకులు చేసిన అదే తప్పు — అవిశ్వాసం కారణంగా దేవుని దీవెనలను నిరాకరించడం—చేయకుండా ఉండేందుకు యూదులను సమ్మతింపజేయాలని పౌలు ఆశించాడు. (పౌలు పేర్కొన్న వృత్తాంతాన్ని మీరు సంఖ్యాకాండము 14:1–12, 26–35 లో చదువగలరు.)

హెబ్రీయులకు 3:74:11 మీకెలా అన్వయించబడగలదో ఆలోచించండి. దీనిని చేయడానికి, మీరు ఇటువంటి ప్రశ్నలను ధ్యానించవచ్చు:

  • ఇశ్రాయేలీయులు ప్రభువును ఏవిధంగా రెచ్చగొట్టారు? (హెబ్రీయులకు 3:8–11 చూడండి). కఠిన హృదయం కలిగియుండడం వల్ల కలిగే పర్యవసానాలేవి?

  • నా హృదయం కఠినంగా మారడానికి నేనెప్పుడు అనుమతించాను? దేవుడు నాకివ్వాలని కోరుతున్న ఏ దీవెనలనైనా విశ్వాసం లేని కారణంగా నేను పొందలేకపోతున్నానా?

  • మృదువైన, నలిగిన హృదయాన్ని వృద్ధిచేయడానికి నేనేమి చేయగలను? (ఈథర్ 4:15; సామెతలు 3:5–6; ఆల్మా 5:14–15 చూడండి).

1 నీఫై 2:16; 15:6–11; జేకబ్ 1:7–8; ఆల్మా 12:33–36 కూడా చూడండి. Neill F. Marriott, “Yielding Our Hearts to God,” Liahona, Nov. 2015, 30–32.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

హెబ్రీయులకు 1:8–9.ఆయన నీతిని ప్రేమించునని, అన్యాయమును ద్వేషించునని యేసు ఏ విధాలుగా చూపారు? మనము నీతిలేని కోరికలను కలిగియున్నట్లయితే, వాటిని మార్చుకోవడానికి మనమేమి చేయగలము?

హెబ్రీయులకు 2:1-4.“మనము వినిన” సువార్త సత్యాలను శ్రద్ధగా అనుసరించడమంటే అర్థమేమిటో గ్రహించడానికి మీ కుటుంబ సభ్యులకు సహాయపడేందుకు మీరు ఒక వస్తుపాఠము గురించి ఆలోచించగలరా? పట్టుకోవడానికి గట్టిగా ఉండే ఒక వస్తువును ఉపయోగించి మీరు ఈ సూత్రాన్ని నిరూపించవచ్చు. మన సాక్ష్యాన్ని నిలుపుకోవడానికి మన ప్రయత్నాలు, ఈ వస్తువును గట్టిగా పట్టుకోవడం వలె ఎలా ఉన్నాయి? “మనము వినిన సంగతులు” మన నుండి “కొట్టుకొనిపోకుండునట్లు” మనమెలా నిశ్చయపరచగలము? (1వ వచనము).

హెబ్రీయులకు 2:9-10.“రక్షణకర్త” అను వాక్యభాగాన్ని వెదకడానికి, నాయకుడు ఏమి చేస్తాడో చర్చించడం ద్వారా మీరు ప్రారంభించగలరు. రక్షణ అనగా అర్థమేమిటి? మన కొరకు, మన రక్షణ కొరకు యేసు క్రీస్తు నాయకుని వలె ఎట్లున్నారు?

హెబ్రీయులకు 5:1-5.అధికారము గలవారి ద్వారా దేవునిచేత పిలువబడడం అనగా అర్థమేమిటో చర్చించడానికి ఈ వచనాలు మీకు సహాయపడగలవు. పిలుపులను అందుకోవడం మరియు నెరవేర్చడం గురించి యేసు క్రీస్తు యొక్క మాదిరి నుండి మనమేమి నేర్చుకోగలము?

చిత్రం
అహరోనును నియమించుచున్న మోషే

“ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును” (హెబ్రీయులకు 5:4). పరిచర్యకు అహరోనును పిలుస్తున్న మోషే, హార్రీ ఆండర్సన్ చేత

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

విభిన్న విధానాలను ప్రయత్నించండి. లేఖనాలను ఎల్లప్పుడూ ఒకేవిధంగా చదివే బదులు, రకరకాల అధ్యయన ఉపాయాల గురించి ఆలోచించండి. కొన్ని ఉపాయాల కొరకు, ఈ వనరు ఆరంభంలో ఉన్న “మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు” చూడండి.

చిత్రం
యేసు క్రీస్తు

లోకమునకు వెలుగు, వాల్టర్ రానె చేత

ముద్రించు