2023 క్రొత్త నిబంధన
నవంబరు 6-12. హెబ్రీయులకు 7–13: “రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడు”


“నవంబరు 6-12. హెబ్రీయులకు 7–13: ‘రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడు,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“నవంబరు 6-12. హెబ్రీయులకు 7–13,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
అబ్రాముకు ఒక దీవెననిస్తున్న మెల్కీసెదెకు

మెల్కీసెదెకు అబ్రామును దీవించును, వాల్టర్ రానె చేత. కళాకారుని బహుమానము

నవంబరు 6-12

హెబ్రీయులకు 7–13

“రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడు”

మీరు హెబ్రీయులకు 7–13 చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రేరణలు పొందవచ్చు. మీరు వాటిని నమోదు చేయగల మార్గాలను పరిగణించండి; ఉదాహరణకు, మీరు వాటిని ఈ సారాంశములో, మీ లేఖనాల అంచులలో లేదా పుస్తకములో లేదా దినచర్య పుస్తకంలో నమోదు చేయవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

నమ్మకమైన పరిశుద్ధులు కూడా కొన్నిసార్లు వారి విశ్వాసాన్ని కదిలించే “నిందలు మరియు బాధలు” అనుభవిస్తారు (హెబ్రీయులకు 10:32–38 చూడండి). క్రైస్తవ మతంలోకి మారిన యూదులు వారి క్రొత్త విశ్వాసం కారణంగా తీవ్రమైన హింసను అనుభవిస్తున్నారని పౌలుకు తెలుసు. వారి సాక్ష్యాలకు యధార్థంగా ఉండడానికి వారిని ప్రోత్సహించడానికి, వారి స్వంత చరిత్ర నుండి నమ్మకమైన విశ్వాసుల సుదీర్ఘ సాంప్రదాయం గురించి అతడు వారికి గుర్తు చేసాడు: హేబేలు, హనోకు, నోవాహు, అబ్రాహాము, శారా, యోసేపు, మోషే—దేవుని వాగ్దానాలు నిజమైనవని, వాటి కోసం వేచి ఉండడం మేలని చెప్పుటకు వీరందరు “సాక్షుల మేఘం” వలె ఉన్నారు (హెబ్రీయులకు 11; 12:1 చూడండి). ఈ ఆచారం మీది కూడా. విశ్వాసం యొక్క ఈ వారసత్వము “మన విశ్వాసమునకు కర్త[యు] దానిని కొనసాగించువాడునైన యేసు వైపు” చూసిన వారందరి చేత పంచుకొనబడింది (హెబ్రీయులకు 12:2). ప్రతికూలత మనల్ని “వెనుకతీయువారముగా” చేయాలనుకున్న ప్రతీసారి, ఆయన వల్ల, “విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము” (హెబ్రీయులు 10:22, 38). ప్రాచీన పరిశుద్ధుల వలె మనకైతే యేసు క్రీస్తే “రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడు” (హెబ్రీయులు 9:11).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

హెబ్రీయులకు 7

మెల్కీసెదెకు యాజకత్వము నన్ను యేసు క్రీస్తు వైపు చూపుతుంది.

శతాబ్దాలుగా, యూదులు అహరోను యాజకత్వము అని కూడా పిలువబడే లేవీయుల యాజకత్వమును సాధన చేసారు. యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత్వముతో గొప్ప మెల్కీసెదెకు యాజకత్వము వచ్చింది, ఇది మరింత గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చింది. హెబ్రీయులకు 7 నుండి మెల్కీసెదెకు యాజకత్వము గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? అన్ని లేఖనాల వలె—ఈ పత్రిక యొక్క ఉద్దేశము కూడా యేసు క్రీస్తు నందు విశ్వాసమును వృద్ధిచేయడమేనని మనస్సులో ఉంచుకొని, ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చే వాక్యభాగాలను మీరు గుర్తించవచ్చు.

మీరు కనుగొనగలిగే ఇతర సత్యాలకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:

మెల్కీసెదెకు యాజకత్వము మరియు దాని “అనుబంధ విధుల” నుండి మీరు ఏ దీవెనలు పొందారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20). క్రీస్తునొద్దకు వచ్చుటకు మెల్కీసెదెకు యాజకత్వము మీకేవిధంగా సహాయపడింది?

ఆల్మా 13:1–13; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:36–46; సువార్త అంశములు, “మెల్కీసెదెకు యాజకత్వము,” topics.ChurchofJesusChrist.org; లేఖనదీపిక, “మెల్కీసెదెకు,” scriptures.ChurchofJesusChrist.org; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ నిధులు,” లియహోనా, నవ. 2019, 76–79; డాల్లిన్ హెచ్. ఓక్స్, “మెల్కీసెదెకు యాజకత్వము మరియు తాళపుచెవులు,” లియహోనా, మే 2020, 69–72 కూడా చూడండి.

హెబ్రీయులకు 9; 10:1–22

ప్రాచీన మరియు ఆధునిక విధులు యేసు క్రీస్తును సూచిస్తాయి.

ఈ పత్రిక యొక్క ప్రథమ హెబ్రీ పాఠకులకు ప్రాచీన గుడారము మరియు పౌలు వివరించిన విధులు బాగా తెలిసి ఉండేవి. కానీ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగాన్ని సూచించడమే ఈ విధుల ఉద్దేశ్యం అని కొందరు పూర్తిగా గుర్తించలేదు.

బైబిలు కాలంలో, ప్రాయశ్చిత్త దినం అని పిలువబడే వార్షిక సెలవుదినమున, ఒక ప్రధాన యాజకుడు యెరూషలేము దేవాలయంలోని అత్యంత పరిశుద్ధ స్థలములో (లేదా అతిపరిశుద్ధస్థలము) ప్రవేశించి ఇశ్రాయేలీయుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి మేక లేదా గొఱ్ఱెపిల్లను బలి ఇచ్చేవారు.

ఈ విధుల గురించి పౌలు వర్ణనను మీరు చదివినప్పుడు, రక్షకుని ప్రాయశ్చిత్త కార్యమును బాగా గ్రహించునట్లు మీకు సహాయపడగల చిహ్నములు మరియు బోధనల కొరకు చూడండి.

నేడు మనం పాల్గొనే విధులు పౌలు కాలం నాటి వాటికంటే భిన్నంగా ఉన్నప్పటికీ, వాటి ఉద్దేశ్యము ఒక్కటే. నేటి విధులు యేసు క్రీస్తు గురించి మీకేవిధంగా సాక్ష్యమిస్తున్నాయి?

హెబ్రీయులకు 11

విశ్వాసానికి దేవుని వాగ్దానాలపై నమ్మకం అవసరం.

విశ్వాసాన్ని నిర్వచించమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరు ఏమి చెబుతారు? సహోదరి ఆన్నీ సి. పింగ్రీ ఈ నిర్వచనాన్ని ఇవ్వబడానికి హెబ్రీయులకు 11 లో ఉన్న భాషను ఉపయోగించారు: “విశ్వాసం అనేది ‘బహు దూరంలో’ కనిపించేవే కానీ ఈ జీవితంలో పొందలేని వాగ్దానాల గురించి ఒప్పించగల ఆత్మీయ సామర్థ్యం” (“Seeing the Promises Afar Off,” Liahona, Nov. 2003, 14).

హెబ్రీయులకు 11 లోని ఆలోచనలను మీరు ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసం యొక్క మీ స్వంత నిర్వచనాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని పరిగణించండి. ఈ అధ్యాయంలో పేర్కొన్న వ్యక్తుల ఉదాహరణలు విశ్వాసం గురించి మీకు ఏమి బోధిస్తాయి? (ఈథర్ 12:6–22 కూడా చూడండి.)

“బహు దూరంలో” మీరు ఏ వాగ్దానాలు చూస్తారు? మీరు “వాటిచేత ఒప్పించబడ్డారని మరియు వాటిని హత్తుకున్నారని” ప్రభువుకు మీరెలా చూపగలరు? (హెబ్రీయులకు 11:13).

ఆల్మా 32:21, 26–43; సువార్త అంశములు, “యేసు క్రీస్తు యందు విశ్వాసము,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

హెబ్రీయులకు 10:32–36.మీ కుటుంబ సభ్యులు సత్యంతో “ప్రకాశించబడినట్లు” భావించినప్పటి ఆత్మీయ అనుభవాలను పంచుకోమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. ఈ అనుభవాలు శ్రమ లేదా సందేహ సమయాల్లో “[మన] ధైర్యమును విడిచిపెట్టకుండా” మనకు ఎలా సహాయపడతాయి?

హెబ్రీయులకు 11.హెబ్రీయులకు 11 లో పేర్కొన్న నమ్మకమైన ఉదాహరణల నుండి మీ కుటుంబ సభ్యులు నేర్చుకొనుటకు మీరు ఎలా సహాయపడగలరు? ఈ ఉదాహరణలలో కొన్ని కథలను నటించడం సరదాగా ఉండవచ్చు. ఈ కథలలో కొన్నిటిని మీరు పాత నిబంధన కథలులో పునర్వీక్షించవచ్చు. లేదా పూర్వీకులు, సంఘ నాయకులు మరియు మీ సమాజంలోని సభ్యులతో సహా మీకు తెలిసిన ఇతర నమ్మకమైన వ్యక్తుల ఉదాహరణలను మీ కుటుంబం చర్చించవచ్చు.

హెబ్రీయులకు 12:2.ఈ వచనం ప్రకారం, సిలువపై బాధను, శ్రమను భరించడానికి యేసు ఎందుకు సమ్మతించారు? మన శ్రమలను మనమెలా భరించగలం అనే దాని గురించి ఇది మనకు ఏమి బోధిస్తుంది? అధ్యక్షుడు రస్సెల్ ఎన్. నెల్సన్ తన సందేశం “ఆనందం మరియు ఆత్మీయ మనుగడ” (లియాహోనా, నవ. 2016, 81–84) లో ఈ వచనం గురించి కొన్ని సహాయకరమైన అంతరార్థాలను ఇచ్చారు.

హెబ్రీయులకు 12:5-11.ప్రభువు మనలను ఎందుకు గద్దిస్తారు మరియు సరిదిద్దుతారు? ప్రభువు గద్దింపును ఎలా చూస్తారనే దాని గురించి ఈ వచనములలో మనమేమి గమనిస్తాము? మీరు గద్దింపును ఇచ్చే లేదా స్వీకరించే విధానాన్ని ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఆత్మను ఆహ్వానించడానికి మరియు సిద్ధాంతాన్ని నేర్చుకోవడానికి సంగీతాన్ని ఉపయోగించండి. ప్రథమ అధ్యక్షత్వము ఇలా చెప్పారు, “[మనల్ని] ఎక్కువ ఆధ్యాత్మికత వైపు తరలించడానికి సంగీతానికి అనంతమైన శక్తులు ఉన్నాయి” (“First Presidency Preface,” Hymns, x). విశ్వాసము గురించిన ఒక కీర్తన బహుశా హెబ్రీయులకు 11 నుండి ఒక కుటుంబ చర్చకు సహాయపడవచ్చు.

చిత్రం
ప్రాచీన యెరూషలేము యొక్క నమూనా

ప్రాచీన దేవాలయం యొక్క చిహ్నాలు మరియు విధులు యేసు క్రీస్తు యొక్క పాత్ర గురించి బోధించాయి.

ముద్రించు