2023 క్రొత్త నిబంధన
నవంబరు 20-26. 1 మరియు 2 పేతురు: “చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుము”


“నవంబరు 20-26. 1 మరియు 2 పేతురు: ‘చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“నవంబరు 20-26. 1 మరియు 2 పేతురు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ఆత్మ లోకములో సువార్త ప్రవచించుచున్న యేసు క్రీస్తు

ఆత్మ లోకములో ప్రవచించుచున్న క్రీస్తు, రాబర్ట్ టి. బార్రెట్ చేత

నవంబరు 20-26

1 మరియు 2 పేతురు

“చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుము”

మీరు పేతురు వ్రాసిన పత్రికలను చదివినప్పుడు, మీరు ఆత్మీయ ప్రేరేపణలు పొందగలరు. “మీరు ఇంకను ఆత్మయందుండగా” (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:80) ఆ ప్రేరేపణలను నమోదు చేయండి, ఆ విధంగా దేవుడు మీకు బోధించే దానిని మీరు సరిగ్గా సంగ్రహించగలరు.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఆయన పునరుత్థానము తరువాత వెంటనే రక్షకుడు ఒక ప్రవచనము చేసారు, అది పేతురును ఇబ్బంది పెట్టేలా ఉన్నది. పేతురు ముసలివాడైనప్పుడు, “(అతనికి) ఇష్టము కాని చోటికి అతడు మోసుకొనిపోబడునని … , అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాని సూచించి” ఆయన ఈ మాట చెప్పెను (యోహాను 21:18–19). చాలాకాలం తర్వాత పేతురు తన పత్రికలను వ్రాసినప్పుడు, ప్రవచించబడిన అతని మరణము సమీపములో ఉన్నదని అతనికి తెలుసు: “మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసివచ్చును” (2 పేతురు 1:14). అయినప్పటికీ అతని మాటలు భయముతో లేదా నిరాశావాదంతో నిండియుండలేదు. దానికి బదులుగా, వారు “నానావిధములైన శోధనలచేత దుఃఖించుచున్నప్పటికీ,” అతడు “ఆనందించమని” పరిశుద్ధులకు బోధించాడు. “(వారి) విశ్వాసము పరీక్షకు నిలిచినదై, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు” మరియు “(వారి) ఆత్మరక్షణకు” కారణమగునని జ్ఞాపకముంచుకోమని అతడు వారికి సలహా ఇచ్చాడు (1 పేతురు 1:6–7, 9). ఆనాటి పరిశుద్ధులకు పేతురు యొక్క విశ్వాసము తప్పక ఓదార్పునిచ్చియుండవచ్చు, నేటి పరిశుద్ధులకు అది ప్రోత్సాహకరముగా ఉన్నది, వారు కూడా “క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు (మనము) మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో పాలివారైయున్నారు” (1 పేతురు 4:13).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 పేతురు 1:3–9; 2:19–24; 3:14–17; 4:12–19

శ్రమ మరియు బాధ గల సమయాల్లో నేను ఆనందాన్ని కనుగొనగలను.

క్రీస్తు సిలువ వేయబడిన తర్వాతి కాలంలో క్రైస్తవునిగా ఉండుట సులువుగా లేకుండెను మరియు పేతురు యొక్క మొదటి పత్రిక దానిని గుర్తించును. మొదటి నాలుగు అధ్యాయాలలో మీరు కష్టకాలమును వర్ణించే పదాలు మరియు వాక్యభాగాలను గమనిస్తారు: విచారము, శోధనలు, దుఃఖము, అగ్నివంటి మహాశ్రమ, మరియు శ్రమలు (see 1 పేతురు 1:6; 2:19; 4:12–13). అయితే, మీరు ఆనందకరముగా అనిపించే పదాలను కూడా గమనిస్తారు—మీరు కనుగొనే వాటి జాబితా చేయాలని మీరు కోరవచ్చు. ఉదాహరణకు, మీరు 1 పేతురు 1:3–9; 2:19–24; 3:14–17; మరియు 4:12–19 చదివినప్పుడు, ఏది మీకు కష్టసమయాలలో కూడా మీరు ఆనందాన్ని కనుగొనగలరనే నిరీక్షణను ఇస్తుంది?

రక్షణ ప్రణాళిక మరియు యేసు క్రీస్తు యొక్క సువార్త గురించి ఏది మీకు ఆనందాన్నిస్తుంది?

1 పేతురు 3:18–20; 4:1–6

వారు న్యాయముగా తీర్పు పొందునట్లు మృతులకు కూడా సువార్త ప్రకటించబడింది.

ఒకనాడు ప్రతి వ్యక్తి తీర్పు సింహాసనము వద్ద నిలబడి, “సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి లెక్కచెప్పెదరు” (1 పేతురు 4:5). సువార్తను అర్థం చేసుకోవడానికి మరియు జీవించడానికి వారికి గల అవకాశాలు భిన్నంగా ఉన్నప్పుడు, దేవుడు జనులందరికి న్యాయముగా ఎలా తీర్పుతీర్చగలడు? 1 పేతురు 3:18–20; 4:6 లో పేతురు బోధించిన సిద్ధాంతం ఈ ప్రశ్నకు జవాబివ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనించండి. దేవుని ధర్మము మరియు న్యాయమందు మీ విశ్వాసాన్ని ఈ వచనాలు ఎలా బలపరుస్తాయి?

ఈ సిద్ధాంతాన్ని ఇంకా పరిశోధించడానికి, సిద్ధాంతము మరియు నిబంధనలు 138 అధ్యయనం చేయండి, పేతురు వ్రాతలను ధ్యానిస్తున్నప్పుడు అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ పొందిన బయల్పాటిది. అధ్యక్షులు స్మిత్ నేర్చుకున్న అదనపు సత్యములేవి?

topics.ChurchofJesusChrist.org

2 పేతురు 1:1–11

యేసు క్రీస్తు యొక్క శక్తి ద్వారా నేను నా దైవిక స్వభావాన్ని వృద్ధిచేసుకోగలను.

యేసు క్రీస్తులా మారడం మరియు ఆయన లక్షణాలను వృద్ధిచేయడం అసాధ్యమని మీరెప్పుడైనా భావించారా? క్రీస్తు వంటి లక్షణాలను మనమెలా వృద్ధిచేయగలమనే దాని గురించి ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ ఈ ప్రోత్సాహకరమైన ఆలోచనను అందించారు: “రక్షకుని లక్షణాలు … అవి ఒకదానితో ఒకటి అల్లుకొనే లక్షణాలు, ఒకదానికి మరొకటి జోడించి వున్నాయి, అవి మనలో పరస్పరం అభివృద్ధిచెందుతాయి. ఇతర మాటలలో, మనము క్రీస్తు వంటి లక్షణాలు కలిగియుండకుండా మరియు ఇతరులను ప్రభావితం చేయకుండా వాటిని పొందలేము. ఒక లక్షణం బలపడినట్లుగా, అలాగే అనేకమైనవి బలపడును” (“మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా మారుట,” లియహోనా, మే 2017, 46).

చిత్రం
నేర్పుగా నేసిన వస్త్రము

మనం వృద్ధిచేసుకొనే ప్రతీ క్రీస్తు వంటి లక్షణము, శిష్యత్వము యొక్క ఆత్మీయ వస్త్రాన్ని నేయడానికి మనకు సహాయపడుతుంది.

మీరు 2 పేతురు 1:1–11 చదివినప్పుడు, ఈ వచనాలలో జాబితా చేయబడిన “దైవిక స్వభావం యొక్క” లక్షణాలను ధ్యానించండి. మీ అనుభవంలో, ఎల్డర్ హేల్స్ వివరించినట్లుగా, అవి ఎలా “ఒకదానితో ఒకటి అల్లుకున్నాయి”? అవి ఒకదానిపై ఒకటి ఎలా వృద్ధిచెందుతాయి? ఎక్కువగా క్రీస్తువలె మారే ప్రక్రియ గూర్చి ఈ వచనములనుండి మీరు ఇంకా ఏమి నేర్చుకున్నారు?

మీతోపాటు—తన పరిశుద్ధులకు దేవుడు ఇచ్చే “అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను” కూడా మీరు ధ్యానించవచ్చు (2 పేతురు 1:4).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 పేతురు 2:5–10.మీ కుటుంబంతో మీరు ఈ వచనాలను చదివినప్పుడు, రక్షకుడు మన “ప్రధాన మూలరాయి” అనే పేతురు బోధనలను ఊహించడానికి కుటుంబ సభ్యులకు సహాయపడేందుకు రాళ్ళను ఉపయోగించడం గురించి ఆలోచించండి. ఆయన రాజ్యాన్ని నిర్మించడానికి దేవుడు ఉపయోగిస్తున్న “సజీవమైన (జీవముగల) రాళ్ళ” వలె మనమెట్లున్నాము? రక్షకుడు మరియు ఆయన రాజ్యములో మన పాత్ర గురించి పేతురు నుండి మనమేమి నేర్చుకుంటాము? మీ కుటుంబానికి పేతురు సందేశమేమిటి?

1 పేతురు 3:8–17.మన విశ్వాసము గురించి మనల్ని ప్రశ్నించేవారికి “సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా” మనమెట్లుండగలము? ఒకరు సువార్త గురించి ఒక ప్రశ్నతో వారిని సమీపించే పరిస్థితులను నటించి చూపడాన్ని మీ కుటుంబము ఆనందించవచ్చు.

1 పేతురు 3:18–20; 4:6.మీ పూర్వీకులతో సంబంధాన్ని భావించడానికి మీ కుటుంబం ఏమి చేయగలదు? బహుశా మీరు మరణించిన ఒక పూర్వీకుని పుట్టినరోజును వారికిష్టమైన వంటకాలు తయారుచేసి, చిత్రాలను చూస్తూ లేదా వారి జీవితాల నుండి కథలను చెప్తూ జరుపుకోవచ్చు. సాధ్యమైనట్లైతే, దేవాలయంలో ఈ పూర్వీకుని కొరకు విధులను పొందడానికి కూడా మీరు ప్రణాళిక చేయవచ్చు.

2 పేతురు 1:16–21. ఈ వచనాలలో పేతురు, రూపాంతరపు కొండ మీద తన అనుభవాన్ని పరిశుద్ధులకు గుర్తుచేసాడు (మత్తయి 17:1–9 కూడా చూడండి). ప్రవక్తల బోధనల గురించి ఈ వచనాల నుండి మనమేమి నేర్చుకుంటాము? (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:38 కూడా చూడండి). నేడు జీవించియున్న మన ప్రవక్తను అనుసరించడానికి మనకు నమ్మకాన్ని ఇచ్చేది ఏది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

“ఎల్లప్పుడు సిద్ధముగా ఉండండి.” ఇంటిలో క్రమరహితమైన బోధనావకాశాలు త్వరగా వచ్చి పోతుంటాయి, కాబట్టి అవి వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవడం ముఖ్యము. బోధనావకాశాలు వచ్చినప్పుడు సువార్త సత్యాలను మీ కుటుంబ సభ్యులకు బోధించడానికి మరియు “మీలో ఉన్న నిరీక్షణను” (1 పేతురు 3:15) పంచుకోవడానికి “ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేందుకు“ మీరెలా ప్రయత్నించగలరు? (Teaching in the Savior’s Way16 చూడండి.)

చిత్రం
ఒక జనసమూహానికి ప్రవచించుచున్న పేతురు

పేతురు చాలా హింసను, వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, క్రీస్తు గురించి అతని సాక్ష్యమందు అతడు స్థిరముగా నిలిచియున్నాడు.

ముద్రించు