2023 క్రొత్త నిబంధన
నవంబరు 13-19. యాకోబు: “మీరు వినువారు మాత్రమైయుండక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి”


“నవంబరు 13-19. యాకోబు: ‘మీరు వినువారు మాత్రమైయుండక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“నవంబరు 13-19. యాకోబు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
గోడను శుభ్రం చేస్తున్న యువత

నవంబరు 13-19

యాకోబు

“మీరు వినువారు మాత్రమైయుండక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి”

మీరు యాకోబు పత్రికను చదువుతున్నప్పుడు, మీకు ప్రత్యేకమనిపించిన వాక్యభాగాలపై శ్రద్ధవహించండి. ఈ మాటల ప్రకారం ప్రవర్తించువారై” యుండాలని మీరెలా ప్రేరేపించబడ్డారు? (యాకోబు 1:22).

మీ మనోభావాలను నమోదు చేయండి

కొన్నిసార్లు కేవలం లేఖనములోని ఒక వచనం ప్రపంచాన్ని మార్చివేయగలదు. యాకోబు 1:5 ఒక చిన్న సలహాగానే అనిపిస్తుంది—మీకు జ్ఞానము అవసరమైతే, దేవుడిని అడగండి. కానీ 14 ఏళ్ళ జోసెఫ్ స్మిత్ ఆ వచనాన్ని చదివినప్పుడు, “అది (అతని) హృదయము యొక్క ప్రతి భావనలోనికి గొప్ప శక్తితో ప్రవేశించినట్లు అనిపించింది” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:12). ఆ విధంగా ప్రేరేపించబడి జోసెఫ్, యాకోబు యొక్క సలహాననుసరించి ప్రార్థన ద్వారా దేవుని నుండి జ్ఞానమును వెదికాడు. మరియు దేవుడు నిజంగా ధారాళముగా ఇచ్చాడు, మానవ చరిత్రలో అత్యంత విశేషమైన పరలోక దర్శనములలో ఒకటైన మొదటి దర్శనమును జోసెఫ్‌కిచ్చాడు. ఈ దర్శనము జోసెఫ్ యొక్క జీవిత గమనాన్ని మార్చింది మరియు భూమిపై యేసు క్రీస్తు సంఘము యొక్క పునఃస్థాపనకు దారితీసింది. జోసెఫ్ స్మిత్ యాకోబు 1:5 చదివి, దాని ప్రకారము చేసినందువలన నేడు మనమందరం దీవించబడ్డాము.

యాకోబు పత్రికను చదువుతున్నప్పుడు మీరేమి కనుగొంటారు? బహుశా ఒకటి రెండు వచనాలు మిమ్మల్ని లేదా మీరు ప్రేమించేవారిని మారుస్తాయి. జీవితంలో మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు నడిపింపును కనుగొనవచ్చు. దయతో మాట్లాడడానికి లేదా మరింత సహనంతో ఉండడానికి మీరు ప్రోత్సాహాన్ని కనుగొనవచ్చు. మీ క్రియలను మీ విశ్వాసంతో సమన్వయం చేయడానికి మీరు ప్రేరేపించబడినట్లు భావించవచ్చు. మిమ్మల్ని ఏది ప్రేరేపించినప్పటికీ, ఈ పదాలు “(మీ) హృదయము యొక్క ప్రతి భావనలోనికి ప్రవేశించనివ్వండి.” అప్పుడు యాకోబు వ్రాసినట్లుగా, “వాక్యమును సాత్వీకముతో అంగీకరించినప్పుడు, వినువారు మాత్రమైయుండక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి” (యాకోబు 1:21–22 చూడండి).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యాకోబు ఎవరు?

యాకోబు పత్రికను వ్రాసినది యేసు క్రీస్తు తల్లియైన మరియ కుమారుడని సాధారణంగా నమ్మబడింది, కావున ఆయన రక్షకుని తోడబుట్టినవాడు. యాకోబు గురించి మత్తయి 13:55; మార్కు 6:3; అపొస్తలుల కార్యములు 12:17; 15:13; 21:18; మరియు గలతీయులకు 1:19; 2:9లలో చెప్పబడింది. ఈ లేఖనముల నుండి తెలుస్తున్నదేమనగా, యాకోబు యెరూషలేములో ఒక సంఘ నాయకుడు మరియ ఒక అపొస్తలునిగా పిలువబడ్డాడు (గలతీయులకు 1:19 చూడండి).

యాకోబు 1:2–4; 5:7–11

సహనంతో సహించడం పరిపూర్ణతకు దారితీస్తుంది.

యాకోబు 1:2–4; 5:7–11 చదివిన తర్వాత, సహనం గురించి యాకోబు యొక్క ప్రధాన సందేశమేదని మీరు చెప్తారు? ఓర్పు తన “క్రియను కొనసాగింపనీయుడి” అనగానేమి? (యాకోబు 1:4). మీరు సహనంతో ఉండడానికి సమ్మతిస్తున్నారని ప్రభువుకు మీరెలా చూపగలరు?

యాకోబు 1:3–8, 21–25; 2:14–26; 4:17

విశ్వాసానికి చర్య అవసరము.

యేసు క్రీస్తునందు మీకు విశ్వాసము గలదని మీకెలా తెలుసు? మీ క్రియలు దేవుని యందు మీ విశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తాయి? విశ్వాసం గురించి యాకోబు బోధనలు మీరు చదివినప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి. యాకోబు చెప్పిన రెండు ఉదాహరణలైన అబ్రాహాము మరియు రాహాబు గురించి కూడా చదవడం ఆసక్తికరంగా ఉండవచ్చు (ఆదికాండము 22:1–12; యెహోషువ 2 చూడండి). దేవుని యందు వారికి విశ్వాసమున్నదని వారెలా చూపించారు?

మీరు వాక్యప్రకారము బాగా ప్రవర్తించువారైయుండగల మార్గాలను ఆలోచించడానికి యాకోబు 1:3–8, 21–25; 2:14–26; 4:17 చదవడం మీకు సహాయపడవచ్చు. మీరు పొందే మనోభావాలను నమోదు చేయండి మరియు వాటిపై పనిచేయడానికి ప్రణాళికలు వేయండి.

ఆల్మా 34:27–29; 3 నీఫై 27:21 కూడా చూడండి.

చిత్రం
తన గుడారము వెలుపల ప్రార్థిస్తున్న అబ్రాహాము

“అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను” (యాకోబు 2:23). మమ్రే మైదానమందు అబ్రాహాము, గ్రాంట్ రామ్ని క్లాసన్ చేత

యాకోబు 1:26; 3:1–18

నేను మాట్లాడే మాటలు ఇతరులను గాయపరచడానికి లేదా దీవించడానికి శక్తి కలిగియున్నాయి.

తన పత్రిక అంతటా యాకోబు ఉపయోగించిన వివరణాత్మక రచనలలో భాష గురించి చెప్పిన అతని సలహాలో అతని అత్యంత స్పష్టమైన భాషలో కొంత కనుగొనబడుతుంది. నాలుకను లేదా నోటిని యాకోబు వర్ణించిన విధాలన్నిటిని జాబితా చేయడం గురించి ఆలోచించండి. ప్రతి పోలిక లేదా భావము మనం మాట్లాడే మాటల గురించి ఏమి సూచిస్తున్నది? మీ మాటలతో ఒకరిని దీవించడానికి మీరు చేయగలదాని గురించి ఆలోచించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 108:7 చూడండి).

యాకోబు 2:1–9

యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా నేను, వారి పరిస్థితులతో సంబంధం లేకుండా జనులందరినీ ప్రేమించాలి.

ధనవంతులకు మేలు చేసి, పేదవారిని ఈసడించుకోవడానికి వ్యతిరేకంగా యాకోబు ప్రత్యేకించి పరిశుద్ధులను హెచ్చరించాడు, కానీ అతని హెచ్చరిక ఇతరుల పట్ల మనం కలిగియుండగల ఏదేని పక్షపాతం లేదా దురభిమానాలకు వర్తించగలదు. మీరు ప్రార్థనాపూర్వకంగా యాకోబు 2:1–9 చదివినప్పుడు, మీ స్వంత హృదయాన్ని వెదకండి మరియు పరిశుద్ధాత్మ ప్రేరేపణల కొరకు వినండి. ఈ వచనాలలో “మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు” (2వ వచనము) వంటి వాక్యభాగాలను అన్యాయంగా తీర్పుతీర్చడానికి మీరు శోధింపబడగల వారొకరిని వర్ణించే ఇతర మాటలు లేదా వాక్యభాగాలతో భర్తీ చేయడం సహాయకరంగా ఉండవచ్చు. ఇతరులను మీరు ఆదరించే లేదా వారి గురించి ఆలోచించే విధానంలో ఏవైనా మార్పులు చేయాలని మీరు భావించారా?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యాకోబు 1:5.యాకోబు 1:5 చదిన తర్వాత, మొదటి దర్శనము (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8-20 చూడండి) యొక్క వృత్తాంతమును మీ కుటుంబము సంక్షిప్త పరచవచ్చు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ గురించి తమ సాక్ష్యాలను మరియు పరలోక తండ్రి వారి ప్రార్థనలకు జవాబిచ్చిన అనుభవాలను పంచుకోమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

యాకోబు 1:26–27. తర్వాత, యాకోబు 1:26–27లో “స్వచ్ఛమైన మతం” గురించి యాకోబు నిర్వచనాన్ని చదవండి మరియు మీ మతాన్ని మరింత స్వచ్ఛంగా మీ కుటుంబం అభ్యసించగల మార్గాలను చర్చించండి.

యాకోబు 3.యాకోబు 3 లో అనేక వర్ణనలు ఉన్నాయి, దయతో మాట్లాడడాన్ని గుర్తుంచుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు అవి విశేషమైన వస్తుపాఠాలను ప్రేరేపించగలవు. ఉదాహరణకు, మీరు ఒక మంటను వెలిగించి, నిర్దయగల చిన్న మాట ఎలా పెద్ద సమస్యకు కారణం కాగలదో మాట్లాడవచ్చు (5–6 వచనాలు చూడండి). లేదా తియ్యని పదార్థం కోసం ఉపయోగించే దానిలో మీరు ఏదైనా పుల్లని దానిని చేర్చవచ్చు—తేనె సీసాలో నిమ్మరసం వంటిది. ఇది తియ్యని, ఉత్తేజకరమైన మాటలను ఉపయోగించడం గురించి చర్చకు దారితీయవచ్చు (9–14 వచనాలు చూడండి).

యాకోబు 4:5–8.మనం శోధనను ఎదుర్కొన్నప్పుడు, మనం “దేవునికి ఎందుకు దగ్గరవ్వాలి?” (యాకోబు 4:8).

యాకోబు 5:14–16.“తల్లిదండ్రులు కుటుంబంలో మరిన్ని యాజకత్వ దీవెనలను ప్రోత్సహించాలి” అని అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ బోధించారు (“యాజకత్వము యొక్క శక్తులు,” లియహోనా, మే 2018, 67). బహుశా యాకోబు 5:14–16 చదవడం మరియు యాజకత్వ దీవెనను పొందడం గురించిన అనుభవాలను పంచుకోవడం, కుటుంబ సభ్యులు అస్వస్థతతో ఉన్నప్పుడు లేదా ఆత్మీయ బలం అవసరమైనప్పుడు ఒక దీవెన కొరకు అడిగేలా వారిని ప్రోత్సహించగలదు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీరు నేర్చుకునే దానిపై పనిచేయండి. మీరు చదువుతున్నప్పుడు, మీరు నేర్చుకునే దానిని మీ జీవితానికి ఎలా అన్వయించగలరనే దాని గురించి ఆత్మ నుండి ప్రేరేపణలను వినండి. ఈ ప్రేరేపణలను అనుసరించడానికి మరియు మరింత సంపూర్ణంగా సువార్తను జీవించడానికి అంకితమవ్వండి. (Teaching in the Savior’s Way, 35 చూడండి.)

చిత్రం
బైబిలు చదువుతున్న జోసెఫ్ స్మిత్

“దేవుని అడగుము” (యాకోబు1:5) అనే యాకోబు సలహా దేవుని నుండి జ్ఞానమును వెదకడానికి జోసెఫ్ స్మిత్‌ను ప్రేరేపించింది. క్రిస్టీనా స్మిత్ చేత ఛాయాచిత్రము.

ముద్రించు