2023 క్రొత్త నిబంధన
నవంబరు 27–డిసెంబరు 3. 1–3 యోహాను; యూదా: “దేవుడు ప్రేమాస్వరూపి”


“నవంబరు 27–డిసెంబరు 3. 1–3 యోహాను; యూదా: “దేవుడు ప్రేమాస్వరూపి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“నవంబరు 27–డిసెంబరు 3. 1–3 యోహాను; యూదా,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
నవ్వుతున్న పిల్లలతో కూర్చొని నవ్వుతున్న యేసు క్రీస్తు

పరిపూర్ణమైన ప్రేమ, డెల్ పార్సన్ చేత

నవంబరు 27–డిసెంబరు 3

1–3 యోహాను; యూదా

“దేవుడు ప్రేమాస్వరూపి”

మీరు యోహాను మరియు యూదా యొక్క పత్రికలను చదువుతున్నప్పుడు, మీ ప్రేమను దేవునికి ఎలా చూపించవచ్చనే దాని గురించి ప్రేరణ కొరకు అపేక్షించండి. ఈ మనోభావాలను నమోదు చేయండి మరియు వాటిపై చర్య తీసుకోండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

యోహాను మరియు యూదా తమ పత్రికలను వ్రాసినప్పుడు, తప్పుడు సిద్ధాంతం అనేకమంది పరిశుద్ధులను విశ్వాసభ్రష్టత్వం లోనికి నడిపించి వేయడం అప్పటికే మొదలైంది. కొంతమంది అసత్య బోధకులు యేసు క్రీస్తు నిజంగా “శరీరంలో” కనిపించెనా అని కూడా ప్రశ్నించారు (ఉదాహరణకు, 1 యోహాను 4:1–3 ; 2 యోహాను 1:7 చూడండి). అటువంటి పరిస్థితులలో ఒక సంఘ నాయకుడు ఏమి చేయగలడు? అపొస్తలుడైన యోహాను రక్షకుని గురించి తన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇవ్వడం ద్వారా స్పందించాడు: “జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, దానిని గూర్చి మేము ఇచ్చే సాక్ష్యం ఇది” (జోసెఫ్ స్మిత్ అనువాదం, 1 యోహాను 1:1 [1 యోహాను 1:1, పాదవివరణ లో]). అప్పుడు యోహాను ప్రేమ గురించి బోధించాడు: దేవునికి మనపట్ల ఉన్న ప్రేమ మరియు ఆయన పట్ల, ఆయన పిల్లలందరిపట్ల మనకు ఉండవలసిన ప్రేమ. ఎంతైనా, యోహాను దానికి కూడా సాక్షియైయున్నాడు. రక్షకుని ప్రేమను అతడు వ్యక్తిగతంగా అనుభవించాడు (యోహాను 13:23; 20:2 చూడండి) మరియు పరిశుద్ధులు అదే ప్రేమను అనుభవించాలని అతడు కోరాడు. యేసు క్రీస్తు యందు విశ్వాసము ప్రశ్నించబడినప్పుడు మరియు అబద్ధ బోధనలు పుష్కలంగా ఉన్న నేడు ప్రేమ గురించి యోహాను సాక్ష్యము మరియు బోధనలు ఎంతో అవసరము. యోహాను పత్రికలను చదవడం నేటి దుర్దశలను ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకు సహాయపడగలదు, ఎందుకనగా “ప్రేమలో భయముండదు; అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును” (1 యోహాను 4:18).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 యోహాను; 2 యోహాను

దేవుడు వెలుగును, దేవుడు ప్రేమాస్వరూపియునై యున్నాడు.

దేవుని వర్ణించడానికి మీరు ఒకటి లేదా రెండు పదాలను ఎంచుకోవలసినట్లయితే, అవి ఏమిటి? యోహాను తన పత్రికలలో, “వెలుగు” మరియు “ప్రేమ” (1 యోహాను 1:5; 2:8–11; 3:16, 23–24; 4:7–21) అనే పదాలను ఉపయోగించాడు. యోహాను యొక్క మొదటి రెండు పత్రికలను మీరు చదివినప్పుడు, రక్షకుని వెలుగు మరియు ప్రేమతో యోహాను కలిగియున్న అనుభవాలను ధ్యానించండి. ఉదాహరణకు, యోహాను 3:16–17; 12:35–36, 46; 15:9–14; 19:25–27లో యేసు బోధనల నుండి యోహాను నేర్చుకున్న దానిని పరిగణించండి. దేవుని వెలుగు మరియు ప్రేమ గురించి ఈ బోధనలు మరియు 1 యోహాను బోధించే దాని మధ్య మీరు ఏవైనా పోలికలను చూసారా? దేవుడు వెలుగు మరియు ప్రేమ అని ఏ అనుభవాలు మీకు నేర్పించాయి?

1 యోహాను 2–4; 2 యోహాను

“మనమొకని నొకడు ప్రేమించిన యెడల, దేవుడు మనలో నిలుచును.”

యోహాను పత్రికలంతటా “నిలిచియుండు” మరియు “నివసించు” వంటి పదాలు పదేపదే చెప్పబడడాన్ని కూడా మీరు కనుగొంటారు. ప్రత్యేకించి మీరు 1 యోహాను 2–4 మరియు 2 యోహాను చదివినప్పుడు ఈ పదాల కొరకు చూడండి. దేవుడు మరియు ఆయన సిద్ధాంతమందు “నిలిచియుండు” లేదా “నివసించు” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (2 యోహాను 1: 9 చూడండి). మీ ఉద్దేశ్యములో దేవుడు మీలో “నిలిచియుండుట” లేదా “నివసించుట” అనగా అర్థమేమిటి?

1 యోహాను 2: 243: 3

నేను యేసు క్రీస్తు వలె మారగలను.

క్రీస్తువలె మారాలనే లక్ష్యం ఎప్పుడైనా మీకు చాలా ఉన్నతమైనదిగా అనిపించిందా? యోహాను యొక్క ప్రోత్సహించే సలహాను పరిగణించండి: “చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన యెదుట ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి … [మరియు] ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలియుందుము” (1 యోహాను 2:28; 3:2). యేసు క్రీస్తు శిష్యునిగా మీకు విశ్వాసం మరియు ఓదార్పునిచ్చే దేనిని 1 యోహాను 2:243:3 లో మీరు కనుగొన్నారు? మీరు యోహాను యొక్క పత్రికలను అధ్యయనం చేస్తున్నప్పుడు, క్రీస్తువలె మరింతగా మారడానికి మీ ప్రయత్నంలో మీకు సహాయపడే ఇతర సూత్రాలు లేదా సలహాల కోసం చూడండి.

మొరోనై 7:48; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:67–68; స్కాట్ డి. వైటింగ్, “ఆయన వలే అగుట,” లియహోనా, నవ. 2020, 12–14 కూడా చూడండి.

1 యోహాను 4:12

“ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదా”?

జోసెఫ్ స్మిత్ అనువాదం, 1 యోహాను 4:12 ఇలా స్పష్టం చేస్తుంది, “నమ్మిన వారు తప్ప ఎవ్వరూ దేవుణ్ణి ఏ సమయంలోనూ చూడలేదు,” (1 యోహాను 4:12, పాదవివరణ లో; యోహాను 6:46; 3 యోహాను 1:11 కూడా చూడండి). తండ్రియైన దేవుడు యోహానుతో సహా విశ్వాసపాత్రులైన వ్యక్తులకు ప్రత్యక్షమైన అనేక సందర్భాలను లేఖనాలు నమోదు చేస్తాయి ( ప్రకటన 4 చూడండి; అపొస్తలుల కార్యములు 7:55–56 ; 1 నీఫై 1:8 ; సిద్ధాంతము మరియు నిబంధనలు 76:23; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:16–17 కూడా చూడండి).

1 యోహాను 5

నేను యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగి, మళ్ళీ జన్మించినప్పుడు, నేను ప్రపంచాన్ని జయించగలను.

మీరు 1 యోహాను 5 చదివేటప్పుడు, లోకాన్ని జయించి నిత్యజీవము పొందడానికి మనం ఏమి చేయాలో చూడండి. ప్రపంచాన్ని అధిగమించడం మీ జీవితంలో ఎలా ఉండవచ్చు?

యూదా 1

“మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దానిమీద మిమ్మును మీరు [కట్టుకొనుము].”

దేవుడు మరియు ఆయన కార్యమునకు వ్యతిరేకంగా పోరాడువారి గురించి యూదా 1:10–19 మీకు ఏమి బోధిస్తుంది? యేసు క్రీస్తు యందు మీ విశ్వాసమును బలముగా ఎలా నిలుపుకోవాలో అనేదాని గురించి 20--25 వచనాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 యోహాను 2:8–11.మీ కుటుంబ సభ్యులు యోహాను బోధనలను ధ్యానించడంలో సహాయపడడానికి చీకటి గదిలో సమావేశమై, “చీకటిలో” నడవడం మరియు “వెలుగులో” నడవడం మధ్య వ్యత్యాసాన్ని కుటుంబ సభ్యులను అనుభవించనివ్వండి. మనం చీకటిలో నడవడానికి మరియు పొరపాట్లు చేయడానికి ద్వేషం ఎలా కారణమవుతుంది? ఒకరినొకరు ప్రేమించడం మన జీవితాల్లోకి ఎలా వెలుగును తెస్తుంది?

1 యోహాను 3:21–22.ఈ వచనాలలో ఏది మనకు దేవునిపై ఉన్న “విశ్వాసాన్ని” మరియు మన ప్రార్థనలకు సమాధానాలు పొందగల సామర్థ్యాన్ని పెంచుతుంది?

చిత్రం
ప్రార్థనలో కలిసి మోకరించిన కుటుంబం

దేవుని ఆజ్ఞలను పాటించడం లోకాన్ని జయించడానికి మనకు సహాయపడుతుంది.

1 యోహాను 5:2–3.“భారమైనవి” లేదా పాటించడం కష్టమని మనం భావించే ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా? దేవుని పట్ల మనకున్న ప్రేమ ఆయన ఆజ్ఞల గురించి మనం భావించే విధానాన్ని ఎలా మారుస్తుంది?

3 యోహాను 1:4.“సత్యమును అనుసరించి నడుచుకొనుట” అనగా అర్థమేమిటి? వారు సత్యమును అనుసరించి నడుచుకోవడాన్ని మీరు ఎలా చూసారో కుటుంబ సభ్యులకు చెప్పడానికి మరియు అది మీకిచ్చిన ఆనందాన్ని గురించి మాట్లాడడానికి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వారు నేర్చుకున్న సత్యాలను కాగితపు అడుగుజాడలపై వ్రాయడాన్ని లేదా గీయడాన్ని మరియు మీ కుటుంబం కలిసి వాటిపై నడవగలిగేలా ఒక మార్గం తయారు చేయడానికి వాటిని ఉపయోగించడాన్ని కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు.

యూదా 1:3–4.మన జీవితాలలోనికి మరియు కుటుంబాలలోనికి “జొరబడిన” ఆధ్యాత్మిక ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? (యూదా 1:4). “బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని” మరియు ఈ ప్రమాదాలను ఎదిరించమని యూదా చెప్పిన ఉపదేశాన్ని మనం ఎలా అనుసరించగలము? (యూదా 1:3). మన కుటుంబంలో “సమాధానమును ప్రేమయు విస్తరించుటకు” మనం ఏమి చేయగలము? (యూదా 1:2).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

దేవుని ప్రేమను కనుగొనండి. అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ ఇలా బోధించారు, “సువార్త అంటే ప్రేమ యొక్క సువార్త—దేవుని పట్ల ప్రేమ మరియు ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ” (“God’s Love for His Children,” Ensign, May 1988, 59). మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు, దేవుని ప్రేమకు సాక్ష్యాలను గుర్తించండి.

చిత్రం
ఒక సరస్సు ఒడ్డున నడుస్తున్న క్రీస్తు

నాతో నడవండి, గ్రెగ్ కె. ఓల్సన్ చేత

ముద్రించు