2023 క్రొత్త నిబంధన
డిసెంబరు 18-24. క్రిస్మస్: “సంతోషకరమైన సువర్తమానము”


“డిసెంబరు 18-24. క్రిస్మస్: ‘సంతోషకరమైన సువర్తమానము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“డిసెంబరు 18-24. క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
క్రొత్తగా జన్మించిన శిశువు

చిన్న గొఱ్ఱెపిల్ల, జెనెడి పేయిజ్ చేత

డిసెంబరు 18-24

క్రిస్మస్

“సంతోషకరమైన సువర్తమానము”

రక్షకుని జననము మరియు పరిచర్యను గూర్చి ధ్యానించడం క్రిస్మస్ ఋతువుకు సమాధానముగల ఆత్మను మరియు పరిశుద్ధతను తెచ్చుటకు ఎలా సహాయపడగలదో ఆలోచించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఒక బిడ్డ యొక్క పుట్టుక ఎందుకు అంత ఆనందాన్ని తెస్తుంది? బహుశా క్రొత్తగా పుట్టిన బిడ్డ నిరీక్షణకు చిహ్నముగా ఉండవచ్చు. అవకాశాలతో నిండిన సరికొత్త జీవితములో ఏదో విశేషముంది, జీవితం ఆ బిడ్డ కోసం ఎలాంటి భవిష్యత్తును కలిగియున్నది మరియు అతడు లేదా ఆమె నెరవేర్చగల అద్భుతమైన విషయాలు ఏమిటో అని ధ్యానించడానికి అది మనల్ని ఆహ్వానిస్తుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు పుట్టినప్పటికంటే ఎక్కువగా ఇది ఎన్నడూ నిజము కాలేదు. ఒక బిడ్డపై ఎన్నడూ ఇంత ఆశ పెట్టుకొనబడలేదు మరియు ఇంత ఎక్కువ వాగ్దానముతో జన్మించిన వారు ఎన్నడూ లేరు.

ఒక దేవదూత గొఱ్ఱెల కాపరులను పశువుల తొట్టెలో క్రొత్తగా పుట్టిన బిడ్డ కొరకు వెదకమని అడిగినప్పుడు, ఆయన ఆ బిడ్డ గురించి ఒక సందేశాన్ని కూడా వారికిచ్చాడు. అది ఒక పవిత్ర కార్యమును నెరవేర్చుటకు ఈ బిడ్డ భూమి మీదకు వచ్చాడనే—నిరీక్షణగల సందేశము. గొఱ్ఱెల కాపరులు వారి సందేశమును “ప్రచురము చేసిరి … గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.” (లూకా 2:17–19). బహుశా ఈ క్రిస్మస్ సందర్భంగా మరియ యొక్క మాదిరిని అనుసరించుట మంచిది: ఈ సంవత్సరము రక్షకుని గూర్చి మీరు నేర్చుకున్న విషయాలను మీ హృదయములో ధ్యానించండి. మీరు చదివిన వృత్తాంతములలో ఆయన తన విమోచన యొక్క కార్యమును ఎలా నెరవేర్చారు? అతి ముఖ్యమైనది, ఆయన నియమితకార్యము మీ జీవితాన్ని ఎలా మార్చింది? అప్పుడు మీరు గొఱ్ఱెల కాపరుల మాదిరిని అనుసరించడానికి ప్రేరేపించబడియుండవచ్చు: యేసు క్రీస్తు మీ కోసం చేసిన దానిని మీరు ఎలా “ప్రచురము చేస్తారు”?

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 1:18–25; 2:1–12; లూకా 1:26–38; 2:1–20

భూమి మీద మన మధ్య జన్మించుటకు యేసు క్రీస్తు దిగివచ్చారు.

మీరు యేసు క్రీస్తు యొక్క పుట్టుక వృత్తాంతమును ఇంతకుముందు అనేకసార్లు చదివినా లేదా వినినా కూడా, ఈ ఆలోచనను మనస్సులో ఉంచుకొని ఈసారి దీనిని అధ్యయనము చేయండి: “క్రిస్మస్ యేసు లోకములోనికి ఎలా వచ్చారని జరుపుకొనే పండుగ మాత్రమే కాదు, కానీ మన ప్రభువు, రక్షకుడైన యేసు క్రీస్తు—ఎవరో తెలుసుకొనుట—మరియు ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకొనుట కూడా” (Craig C. Christensen, “The Fulness of the Story of Christmas” [First Presidency Christmas devotional, Dec. 4, 2016], broadcasts.ChurchofJesusChrist.org).

ఆయన పుట్టకముందు యేసు క్రీస్తు గురించి మీకు తెలిసినదేమిటి? (ఉదాహరణకు యోహాను 17:5; మోషైయ 3:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 76:13–14, 20–24; మోషే 4:2 చూడండి). ఆయన పుట్టుక గురించి మీరు చదివినప్పుడు, మీరు భావించిన విధానమును ఈ జ్ఞానము ఎలా ప్రభావితం చేస్తుంది?

యేసు క్రీస్తు భూమి మీదకు ఎందుకు వచ్చారనే దాని గురించి మీకు తెలిసినది ఏమిటి? (ఉదాహరణకు, లూకా 4:16–21; యోహాను 3:16–17; 3 నీఫై 27:13–16; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:20–28 చూడండి). ఈ జ్ఞానము రక్షకుని గురించి మీరు భావించిన విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది మీరు జీవించు విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది?

2 కొరింథీయులకు 8:9; హెబ్రీయులకు 2:7–18; 1 నీఫై 11:13–33; ఆల్మా 7:10–13 కూడా చూడండి.

1 కొరింథీయులకు 15:21–26; కొలొస్సయులకు 1:12–22; 1 పేతురు 2:21–25

యేసు క్రీస్తు తన నియమిత కార్యమును నెరవేర్చారు మరియు నిత్యజీవమును వారసత్వముగా పొందడాన్ని నాకు సాధ్యము చేసారు.

క్రీస్తు యొక్క పుట్టుక అద్భుతమైన సంఘటనలతో చుట్టబడియున్నప్పటికీ, తరువాత ఆయన జీవితములో నెరవేర్చిన గొప్ప కార్యము కోసం కాకపోతే ఆయనది కేవలము మరొక పుట్టుక అయ్యుండేది. అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ చెప్పినట్లుగా, “బేత్లెహేములోని శిశువైన యేసు గెత్సేమనే మరియు కల్వరికి చెందిన విమోచించు క్రీస్తు, పునరుత్థానము యొక్క విజయవంతమైన వాస్తవము లేకుండా కేవలము మరొక బిడ్డగా ఉండేవాడు” (“The Wondrous and True Story of Christmas,” Ensign, Dec. 2000, 5).

చిత్రం
గెత్సేమనే వనములో మోకరించిన యేసు

గెత్సేమనే, జె. కర్క్ రిచర్డ్స్ చేత

రక్షకుని యొక్క దైవిక పరిచర్య మరియు ఇతరుల కొరకు ఆయన శక్తివంతమైన ప్రేమను గూర్చిన సాక్ష్యము క్రొత్త నిబంధన అంతటా కనబడుతుంది. మీ మనస్సులోనికి వచ్చే లేఖన భాగములు లేదా వృత్తాంతములేవి? మీరు ఈ వనరు లేదా మీ అధ్యయన దినచర్య పుస్తకము ద్వారా తిరిగి చూడవచ్చు మరియు మీరు నమోదు చేసిన భావనలలో కొన్నిటిని సమీక్షించవచ్చు. మీరు 1 కొరింథీయులకు 15:21–26; కొలొస్సయులకు 1:12–22; 1 పేతురు 2:21–25 కూడా చదువవచ్చు మరియు రక్షకుడు, ఆయన కార్యము మీ జీవితాన్ని ఎలా ఆశీర్వదించిందో ధ్యానించవచ్చు. మీ జీవితములో దేనిని మార్చడానికి ప్రేరేపించబడినట్లు మీరు భావించారు? రక్షకుని శక్తిని మీరు ఎలా పొందుతారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మత్తయి 1:18–25; 2:1–12; లూకా 1:26–38; 2:1–20.యేసు క్రీస్తు యొక్క పుట్టుకను మీ కుటుంబముతో మీరు ఎలా జరుపుకుంటారు? ఇక్కడ కొన్ని ఉపాయములున్నాయి లేదా మీ స్వంత వాటిని మీరు ఆలోచించవచ్చు:

  • క్రీస్తు పుట్టుక వృత్తాంతములో భాగములు చదవండి లేదా అభినయించండి.

  • సేవ చేయండి.

  • యేసు క్రీస్తును గూర్చి వారికి జ్ఞాపకము చేయు ఆభరణాలు లేదా అలంకరణలు చేయుటకు వారికి ఉపాయములను ఇచ్చునట్లు క్రీస్తు పుట్టుక వృత్తాంతములో వివరణల కొరకు చూడమని కుటుంబ సభ్యులను అడగండి.

1 కొరింథీయులకు 15:21–26; కొలొస్సయులకు 1:12–22; 1 పేతురు 2:21–25.యేసు క్రీస్తు జన్మించినందుకు మనము ఎందుకు కృతజ్ఞత కలిగియున్నాము? ఆయన మనకు ఇచ్చిన బహుమానములేవి? ఆయనకు మన కృతజ్ఞతను మనము ఎలా చూపగలము?

జీవముతోనున్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము.”క్రిస్మస్ సమయంలో రక్షకునిపై దృష్టిసారించుటకు మీ కుటుంబానికి మీరు సహాయపడాలని కోరిన యెడల, బహుశా మీరు కలిసి “జీవముగల క్రీస్తు: అపొస్తులుల యొక్క సాక్ష్యము” (ChurchofJesusChrist.org) చదివి, అధ్యయనము చేయుటలో కొంత సమయాన్ని గడపవచ్చు. “జీవముగల క్రీస్తు” నుండి వాక్యభాగములను మీరు కంఠస్థము చేయవచ్చు లేదా దానిలోని వ్యాఖ్యానాలను బలపరచునట్లు రక్షకుని యొక్క జీవితములోని వివరణల కొరకు క్రొత్త నిబంధనలో వెదకవచ్చు. యేసు క్రీస్తును గూర్చి అతడు లేదా ఆమె సాక్ష్యమును వ్రాయమని ప్రతీ కుటుంబ సభ్యుని మీరు అడగవచ్చు మరియు ప్రేరేపించబడిన యెడల, దానిని కుటుంబానికి చదివి వినిపించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

యేసు క్రీస్తు కొరకు చూడండి. అన్ని విషయాలు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తాయని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి (మోషే 6:62–63 చూడండి), కాబట్టి మనము అన్ని విషయాలలో ఆయన కొరకు చూడాలి. మీరు లేఖనాలను చదివినప్పుడు, ఆయన గురించి మీకు బోధించు వచనాలను గుర్తించుట లేదా గమనించుటను పరిగణించండి. క్రిస్మస్‌ సమీప దినములలో మీ చుట్టూ ఉన్నవిషయాలలో యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చు వాటి కొరకు వెదకుటకు సమయాన్ని వెచ్చించండి.

చిత్రం
శిశువైన యేసు చుట్టూ ఉన్న మరియ, యోసేపు మరియు గొఱ్ఱెల కాపరులు

క్రీస్తు యొక్క పుట్టుక, బ్రైయన్ కాల్ చేత

ముద్రించు