2023 క్రొత్త నిబంధన
డిసెంబరు 11-17. ప్రకటన 6–14: “వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టి … జయించియున్నారు”


“డిసెంబరు 11-17. ప్రకటన 6–14: ‘వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టి … జయించియున్నారు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“డిసెంబరు 11-17. ప్రకటన 6-14,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
నక్షత్రాల మధ్య నిలబడియున్న యేసు

ఎరిక్ జాన్సన్ చేత మిశ్రమ కళ: The Grand Council (మహా సభ), రాబర్ట్ టి. బార్రెట్ చేత; నక్షత్రాల సమూహము, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి సౌజన్యము

డిసెంబరు 11-17

ప్రకటన 6-14

“వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టి … జయించియున్నారు”

అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ ఇలా ఉపదేశించారు: “లేఖనాల యొక్క భాష మొదట్లో మీకు వింతగా అనిపించినప్పటికీ, చదువుతూనే ఉండండి. త్వరలోనే ఆ పేజీలలో కనుగొనబడే సౌందర్యాన్ని, శక్తిని మీరు గుర్తిస్తారు” (“The Key to Spiritual Protection,” Liahona, Nov. 2013, 27).

మీ మనోభావాలను నమోదు చేయండి

“గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్న” ఒక స్త్రీని ఊహించండి. ఇప్పుడు, “ఎర్రని మహాఘటసర్పము, ఏడు తలలును పది కొమ్ములును కలిగియుండి,” “కననైయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మ్రింగివేయవలెనని ఆ స్త్రీ యెదుట నిలుచుండుటను”(ప్రకటన 12:2–4) ఊహించండి. యోహాను ప్రకటనలోని ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి, ఈ ఊహాచిత్రాలు సంఘమును, దేవుని రాజ్యమును, అవి ఎదుర్కొను అపాయాలను సూచిస్తున్నాయని గుర్తుంచుకోండి. యోహాను దినములలో తీవ్రమైన హింసను అనుభవించిన పరిశుద్ధులకు, చెడును జయించే అవకాశం కనిపించియుండకపోవచ్చు. “ప్రతి వంశము మీదను ఆయా భాషలు మాటలాడువారి మీదను ప్రతి జనము మీదను అధికారమియ్యబడి,” అపవాది “పరిశుద్ధులతో యుద్ధము చేస్తున్నప్పుడు” (ప్రకటన 13:7), మన రోజులలో కూడా ఈ విజయాన్ని ముందుగా చూడడం కష్టం కాగలదు. కానీ, మంచి చెడును జయిస్తుందని యోహాను ప్రకటన యొక్క అంతము మహిమకరముగా చూపుతుంది. బబులోను పతనమవుతుంది. పరిశుద్ధులు తెల్లని అంగీలతో “మహాశ్రమలనుండి” వచ్చెదరు—వారి అంగీలు ఎన్నడూ మచ్చపడనందువలన కాదు, కానీ పరిశుద్ధులు “గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనినందువలన” (ప్రకటన 7:14).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ప్రకటన 6–11

భూమి యొక్క చరిత్రలో అనేక సంఘటనలు, ప్రత్యేకించి కడవరి దినములలోని వాటిని యోహాను చూసాడు.

ఈ అధ్యాయాలలో మీరు ఏడు ముద్రలతో ఉన్న ఒక గ్రంథమును గూర్చి చదువుతారు. దాని అర్థమేమిటని ఆశ్చర్యపడినవారు మీరు మాత్రమే కాదు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ కూడా. ప్రతి ముద్ర వెయ్యి సంవత్సరములను సూచించడంతో పాటు, ఈ గ్రంథము మరియు దాని ముద్రలు భూమి యొక్క “భౌతిక ఉనికి” కథను సూచిస్తాయని ప్రభువు జోసెఫ్‌కు బయల్పరిచారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 77:6–7 చూడండి). కేవలం ఎనిమిది వచనాలలో యోహాను దర్శనంలోని మొదటి నాలుగు ముద్రల సంఘటనలు సంక్షిప్తపరచబడ్డాయని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు (ప్రకటన 6:1–8). తరువాతి మూడు వచనాలు ఐదవ ముద్రను వివరిస్తాయి (9–11 వచనాలు). ప్రకటన గ్రంథము యొక్క మిగతాభాగములో అత్యధికము చివరి రెండు ముద్రల సంఘటనలతో నిండియుంటుంది. ఇతర మాటలలో, యోహాను దర్శనము యొక్క ముఖ్య దృష్టి చివరి రోజులు—మన రోజులకు సంబంధించినది. మీరు చదువుతున్నప్పుడు, కడవరి దినముల గురించి యోహాను వ్రాసినది తెలుసుకోవడం ఎందుకు విలువైనదో ధ్యానించండి.

యోహాను ప్రవచించిన సంఘటనల గురించి మీరు చదువుతున్నప్పుడు, క్రింది సూచనలు మరియు ప్రశ్నలను పరిగణించండి:

ప్రకటన 12-13

పరలోకములోని యుద్ధము భూమిపై కూడా కొనసాగును.

పరలోకములోని యుద్ధము గురించి ఎక్కువగా మనకు తెలియదు, కానీ దాని యొక్క స్పష్టమైన సంక్షిప్త వర్ణన ప్రకటన 12:7–11 లో ఉంది. మీరు ఈ వచనాలను చదివినప్పుడు, మర్త్యత్వమునకు ముందు జరిగిన ఆ యుద్ధములో మిమ్మల్ని ఒక భాగంగా ఊహించుకోండి. సాతాను ఎలా జయించబడ్డాడనే దాని గురించి మీరేమి నేర్చుకుంటారు? (11వ వచనము చూడండి).

“యేసు క్రీస్తు గురించి సాక్ష్యము కలిగియున్న (వారితో) యుద్ధము చేయుటను” సాతాను కొనసాగించుచుండగా, పరలోకములోని యుద్ధము భూమిపై కూడా కొనసాగును (ప్రకటన 12:17). నేడు ఆ యుద్ధమును అతడు ఎలా చేస్తున్నాడనే దాని గురించి ప్రకటన 13 నుండి మీరేమి నేర్చుకుంటారు? “ గొఱ్ఱెపిల్ల రక్తము” మరియు… “[మీ] సాక్ష్యము” (ప్రకటన 12:11) ఈ యుద్ధములో మీకు సహాయపడడాన్ని ఎలా కొనసాగిస్తాయి?

1 నీఫై 14:12–14; మొరోనై 7:12–13; మోషే 4:1–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 29:36–37; సువార్త అంశములు, “పరలోకమందు యుద్ధము,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

ప్రకటన 14:6–7

“అప్పుడు నిత్యసువార్త కలిగియున్న … మరియొక దూతను చూచితిని.”

జోసెఫ్ స్మిత్‌కు మొరోనై ప్రత్యక్షమై, అతడు అనువదించి, మోర్మన్ గ్రంథముగా ప్రచురించబడిన గ్రంథాల వద్దకు అతడిని నడిపించినప్పుడు ఈ వచనాలలోని ప్రవచనము యొక్క ఒక నెరవేర్పు సంభవించింది. “ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడువారికిని ప్రతి ప్రజకును” మనం ప్రకటించవలసిన “నిత్య సువార్తను” ఈ గ్రంథము కలిగియుంది (ప్రకటన14:6).

నిత్య సువార్తను పునఃస్థాపించడంలో పాల్గొనిన ఇతర దేవదూతల గురించి నేర్చుకోవడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 13; 27:5–13; 110:11–16; 128:20–21 చూడండి.

యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచమునకు ద్విశతాబ్ది ప్రకటన,” ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ప్రకటన 7:9, 13–15.బాప్తిస్మము మరియు దేవాలయ విధుల కొరకు మనము తెలుపు ఎందుకు ధరిస్తామనే దాని గురించి ఈ వచనాలు మనకు ఏమి బోధించగలవు?

ప్రకటన 7:14–17.ఈ వచనాలలో ప్రభువు వాగ్దానాల గురించి వారి మనోభావాలను పంచుకోమని కుటుంబ సభ్యులను ఆహ్వానించడాన్ని పరిగణించండి. మనము ”మహాశ్రమలలో” ఉన్నప్పుడు ఆయన వాగ్దానాలు మనకు ఎలా సహాయపడగలవు? (14వ వచనము).

ప్రకటన 12:7–11; 14:6.ప్రకటనలో వివరించబడిన దర్శనముల చిత్రాలు గీయడాన్ని కుటుంబ సభ్యులలో కొందరు ఆనందించవచ్చు. ఉదాహరణకు, ప్రకటన 12 మీద ఆధారపడి చిత్రాలు గీయడం, పరలోకమందు యుద్ధమును (7–11 వచనాలు చూడండి) గురించి చర్చలకు దారితీయవచ్చు. ప్రకటన 14:6 మీద ఆధారపడిన చిత్రాలు, సువార్త యొక్క పునఃస్థాపన గురించి చర్చలకు దారితీయవచ్చు.

ప్రకటన 14:6 కలిసి చదివిన తర్వాత, మన కాలంలో సువార్తను పునఃస్థాపించడంలో సహాయపడిన దేవదూత మొరోనై మరియు ఇతర దేవదూతల చిత్రాలను చూపడాన్ని పరిగణించండి. బహుశా కుటుంబ సభ్యులు వంతులవారీగా ఒక చిత్రాన్ని పైకెత్తి పట్టుకొని, “[మనకు] ప్రకటించునట్లు నిత్య సువార్తతో” దేవదూతలు వచ్చినందుకు వారు కృతజ్ఞత కలిగియున్నారనడానికి గల కారణాలను పంచుకోవచ్చు.

ప్రకటన 12:11.“తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు“ అను వాక్యభాగమునకు అర్థము ఏమైయుండవచ్చు? యేసు క్రీస్తు గురించి మన సాక్ష్యాలు సాతానును జయించడానికి మనకు మరియు ఇతరులకు ఎలా సహాయపడతాయి?

ప్రకటన 13:11-14.మోసపుచ్చుచున్న క్రూరమృగము గురించి మీ కుటుంబ సభ్యులు కలిగియున్న ఆలోచనలేవి? నేడు ప్రపంచంలో మనము చూస్తున్న మోసాలను మనమెలా కనిపెట్టి, తప్పించుకుంటాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

లేఖనములందు మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి. “ప్రత్యేకించి ఉపద్రవం పెరుగుతున్న ఈ రోజుల్లో, ఆధ్యాత్మిక మనుగడకు దేవుని వాక్యంలో రోజువారీ నిమగ్నత చాలా ముఖ్యమైనది” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు (“ఈయనను ఆలకించుము,” లియహోనా, మే 2020, 89). మీ ఉద్దేశ్యములో, “దేవుని వాక్యంలో నిమగ్నత” అనగా అర్థమేమిటి?

చిత్రం
పునఃస్థాపన యొక్క దేవదూతలు

పైన ఎడమ వైపునుండి సవ్యదిశలో: Moroni Delivering the Golden Plates [బంగారు పలకలను ఇస్తున్న మొరోనై], గ్యారీ ఎల్. కాప్ చేత; Upon You My Fellow Servants [నా తోటి సేవకులైన మీపై], లిండా కర్లీ క్రిస్టెన్సన్ మరియు మైఖెల్ టి. మామ్ చేత (బాప్తిస్మమిచ్చు యోహాను జోసెఫ్ స్మిత్‌పై అహరోను యాజకత్వమును అనుగ్రహించును); Keys of the Kingdom [రాజ్యపు తాళపుచెవులు], లిండా కర్లీ క్రిస్టెన్సన్ మరియు మైఖెల్ టి. మామ్ చేత (పేతురు, యాకోబు మరియు యోహానులు జోసెఫ్ స్మిత్‌పై మెల్కీసెదెకు యాజకత్వమును అనుగ్రహించెదరు); Vision in the Kirtland Temple [కర్ట్‌లాండ్ దేవాలయములో దర్శనము], గ్యారీ ఇ. స్మిత్ చేత (జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లకు మోషే, ఎలియాసు మరియు ఏలీయా అగుపించారు).

ముద్రించు