2023 క్రొత్త నిబంధన
డిసెంబరు 25-31. ప్రకటన 15–22: “జయించువాడు అన్నిటిని స్వతంత్రించుకొనును”


“డిసెంబరు 25-31. ప్రకటన 15–22: ‘జయించువాడు అన్నిటిని స్వతంత్రించుకొనును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“డిసెంబరు 25-31. ప్రకటన 15–22,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ఆయన రెండవ రాకడ సమయమున జనులను పలకరిస్తున్న యేసు క్రీస్తు

నిత్య పట్టణము, కీత్ లార్సన్ చేత

డిసెంబరు 25-31

ప్రకటన 15–22

“జయించువాడు అన్నిటిని స్వతంత్రించుకొనును”

మనం నేర్చుకోవలసిన అవసరం లేదు—మనకు ఇదివరకే తెలుసు అనే మన ఊహ కొన్నిసార్లు నేర్చుకోవడానికి అతిపెద్ద అడ్డంకి అవుతుంది. మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు, ప్రభువు మీకివ్వాలని కోరిన క్రొత్త అంతరార్థాలకు సిద్ధంగా ఉండండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మీరు గుర్తు చేసుకోగలిగితే, రక్షకుడు తననుతాను “ఆదియును అంతమును” (ప్రకటన 1:8) అని ప్రకటించుకోవడంతో ప్రకటన గ్రంథము మొదలవుతుంది. దానికి తగినట్లుగా, అవే పదాలతో అది ముగుస్తుంది: “నేనే … ఆదియు అంతమునై యున్నాను” (ప్రకటన 22:13) కానీ, దాని అర్థమేమిటి? దేనికి ఆదియు అంతమునై యున్నారు? యేసు క్రీస్తు ప్రతిది—మానవ ఉనికి మరియు రక్షణ యొక్క గొప్ప, విస్తృత నాటకము యొక్క ఆదియు అంతమునై యున్నారని ప్రకటన గ్రంథము శక్తివంతముగా సాక్ష్యమిస్తుంది. ఆయన “జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱపిల్ల” (ప్రకటన 13:8). ఆయన రాజులకు రాజు, దుష్టత్వము, బాధ మరియు మరణమునకు కూడా అంతమును తెచ్చును మరియు “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” ప్రవేశపెట్టును (ప్రకటన 21:1).

అయినను ఈ క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు రాకమునుపు మనము జయించవలసినవి చాలా ఉన్నాయి: తెగుళ్ళు, యుద్ధాలు, హద్దుమీరిన దుష్టత్వము—వీటన్నిటి గురించి ప్రకటన స్పష్టముగా వివరిస్తుంది. కానీ ఇందులో కూడా యేసు క్రీస్తు మనతో ఉన్నారు. ఆయన “ప్రకాశమానమైన వేకువ చుక్కయై” యున్నారు, త్వరలో వేకువ కాబోతున్నది అనడానికి వాగ్దానముగా అది చీకటి ఆకాశంలో ప్రకాశిస్తుంది (ప్రకటన 22:16). మరియు అది త్వరగా వస్తున్నది. ఆయన వస్తున్నారు. “నా యొద్దకు రండి” (మత్తయి 11:28) అని ఆయన మనల్ని ఆహ్వానించినట్లుగా, ఆయన కూడా మన యొద్దకు వస్తారు. “నేను త్వరగా వచ్చుచున్నాను,” అని ఆయన ప్రకటిస్తారు. మరియు కడవరి దిన ప్రతికూలత యొక్క అగ్నిలో శుద్ధిచేయబడిన నిరీక్షణ మరియు విశ్వాసంతో మనము, “ప్రభువైన యేసూ, రమ్ము” (ప్రకటన 22:20) అని జవాబిస్తాము.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ప్రకటన 16–18; 21–22

బబులోను నుండి పారిపోయి, “పరిశుద్ధ పట్టణము”ను స్వాస్థ్యముగా చేసుకొమ్మని ప్రభువు నన్ను ఆహ్వానిస్తారు.

అంత్యదినముల యొక్క వినాశనము మరియు అపాయములు చూసిన తర్వాత, “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” (ప్రకటన 21:5) అనే ప్రభువు యొక్క ప్రకటనలో సంక్షిప్తపరచగల భవిష్యత్ కాలమును యోహాను చూసాడు. దాని అర్థమును గ్రహించడానికి గల ఒక విధానము ఏదనగా, లౌకికజ్ఞానము మరియు దుష్టత్వానికి చిహ్నమైన బబులోను (ప్రకటన 16–18 చూడండి) గురించి యోహాను యొక్క వర్ణనను దేవుని సన్నిధిలో సిలెస్టియల్ మహిమకు చిహ్నమైన నూతన యెరూషలేము (ప్రకటన21–22 చూడండి) గురించి అతని వర్ణనతో పోల్చడం. దిగువనివ్వబడిన పటము మీకు సహాయపడవచ్చు:

బబులోను

నూతన యెరూషలేము

బబులోను

ప్రకటన 16:3-6

నూతన యెరూషలేము

ప్రకటన 21:6; 22:1–2, 17

బబులోను

ప్రకటన16:10; 18:23

నూతన యెరూషలేము

ప్రకటన 21:23–24; 22:5

బబులోను

ప్రకటన 17:1–5

నూతన యెరూషలేము

ప్రకటన 21:2

బబులోను

ప్రకటన 18:11, 15

నూతన యెరూషలేము

ప్రకటన 21:4

బబులోను

ప్రకటన 18:12–14

నూతన యెరూషలేము

ప్రకటన 21:18–21; 22:1–2

ఏ ఇతర తేడాలను మీరు చూస్తున్నారు?

మీ ఉద్దేశ్యంలో బబులోనును “విడిచిరావడం” (ప్రకటన 18:4) అంటే అర్థమేమిటని కూడా మీరు ధ్యానించవచ్చు. ఆవిధంగా చేయడానికి ప్రకటన 21–22 లో మీరు కనుగొన్నది ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది?

చిత్రం
ఆయన కుడివైపున వెలుగులో ఉన్న జనులు మరియు ఆయన ఎడమవైపున అంధకారంలో ఉన్న జనులతో యేసు

అంతిమ తీర్పు, జాన్ స్కాట్ చేత

ప్రకటన 20:12–15; 21:1–4

దేవుని పిల్లలందరు జీవగ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తీర్పుతీర్చబడుదురు.

మీ జీవితం గురించి ఒక గ్రంథం వ్రాయడానికి ఒక రచయిత ముందుకు వచ్చాడని అనుకోండి. ఏ వివరాలు లేదా అనుభవాలు అందులో చేర్చబడాలని మీరు కోరుకుంటారు? మీ భవిష్యత్ చర్యలు కూడా అందులో నమోదు చేయబడతాయని మీకు తెలిసినట్లయితే, ఏ విధంగా మీ జీవితాన్ని మీరు భిన్నంగా జీవిస్తారు? మీరు ప్రకటన 20:12–15 చదువుతున్నప్పుడు, దీని గురించి ఆలోచించండి. జీవగ్రంథములో మీ గురించి ఏమి వ్రాయబడాలని మీరు ఆశిస్తున్నారు? మీ జీవగ్రంథములో రక్షకుని పాత్రను మీరు ఎలా వివరిస్తారు? మీ ఉద్దేశ్యములో అది, “గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథము” అని పిలువబడుట ఎందుకు ముఖ్యము? (ప్రకటన 21:27).

తీర్పుతీర్చబడడానికి దేవుని ముందు నిలబడాలనే ఆలోచన మీకు అసౌకర్యంగా అనిపిస్తే, ప్రకటన 21:1–4 చదవడాన్ని పరిగణించండి. ఈ వచనాలను ఉదహరిస్తూ, ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఇలా అన్నారు:

“తీర్పు యొక్క ఆ దినము దయ మరియు ప్రేమ యొక్క దినమగును—విరిగిన హృదయాలు స్వస్థపరచబడే దినము, బాధతో నిండిన కన్నీళ్ళకు బదులుగా కృతజ్ఞతతో నిండిన కన్నీళ్ళు ఉంచబడే దినము, అన్నీ సరియైనవిగా చేయబడే దినము. అవును, పాపము వలన అధిక బాధ ఉంటుంది. అవును, మన తప్పిదాలు, మన మూర్ఖత్వం మరియు మన మొండితనం కారణంగా విచారాలు మరియు వేదన కూడా ఉంటాయి, అవి మరింత గొప్ప భవిష్యత్తు కొరకు అవకాశాలను మనం కోల్పోవడానికి కారణమవుతాయి.

“కానీ, మనము దేవుని తీర్పుల వలన మాత్రమే తృప్తిపరచబడము; ఆయన అనంతమైన కృప, దయ, ఔదార్యము మరియు ఆయన పిల్లలమైన మన కొరకు గల ప్రేమ చేత కూడా మనము ఆశ్చర్యపోతాము మరియు ముంచివేయబడినట్లు భావిస్తాము అనే నమ్మకం నాకు ఉంది” (“O How Great the Plan of Our God!,” Liahona, Nov. 2016, 21).

మీరు అంతిమ తీర్పును చూసే దృష్టిని ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి? మీ జీవితములో దేనిని మార్చడానికి ఈ సత్యాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి?

బైబిలు నిఘంటువు, “జీవ గ్రంథము” కూడా చూడండి

ప్రకటన 22:18–19

ఈ వచనాలకు అర్థము బైబిలుకు అదనంగా మరేయితర లేఖనము ఉండజాలదనా?

మోర్మన్ గ్రంథాన్ని మరియు ఇతర కడవరి దిన లేఖనాలను నిరాకరించడానికి కారణంగా కొందరు ప్రకటన 22:18–19 ని ఉదహరించారు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ప్రకటన 15:2-4.“మోషే కీర్తన” మరియు “గొఱ్ఱెపిల్ల కీర్తన” లను సూచించే ఈ వచనాలను మీ కుటుంబము చర్చిస్తున్నప్పుడు, సిద్ధాంతము మరియు నిబంధనలు 84:98–102 వంటి లేఖనాలలో చెప్పబడిన ఇతర కీర్తనలతో పాటు మీరు నిర్గమకాండము 15:1–19లో మోషే కీర్తనను చదువవచ్చు. “క్రూరమృగమును జయించిన వారు” (ప్రకటన 15:2) ఇటువంటి కీర్తనలు పాడాలని ఎందుకు భావిస్తుండవచ్చు? బహుశా, మీ కుటుంబము ఒక కీర్తనను లేదా స్తుతించే పిల్లల పాటను పాడవచ్చు.

ప్రకటన 19:7-9.బహుశా, మీ కుటుంబ చరిత్ర నుండి మీరు పెళ్ళి ఫోటోలను చూడవచ్చు లేదా మీ కుటుంబము ఒక వివాహ వేడుకకు హాజరైనప్పటి సమయం గురించి మాట్లాడవచ్చు. తన సంఘముతో ప్రభువు యొక్క నిబంధన కొరకు వివాహము ఎందుకు మంచి పోలిక అవుతుంది? (మత్తయి 22:1-14 కూడా చూడండి.)

ప్రకటన 20:2-3.సాతాను “బంధింపబడుట” అనగా అర్థమేమిటో మనం గ్రహించడానికి 1 నీఫై 22:26 మనకు ఎలా సహాయపడుతుంది?

ప్రకటన 22:1-4.రక్షకుని నామమును “(మన) నొసళ్ళమీద” ఉంచుకోవడానికి అర్థము ఏమైయుండవచ్చు? (ప్రకటన 22:4; నిర్గమకాండము 28:36–38; మోషైయ 5:7–9; ఆల్మా 5:14; మొరోనై 4:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 109:22 కూడా చూడండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

చర్య తీసుకోవడానికిచ్చిన ఆహ్వానాలపై విచారణ చేయండి. “చర్య తీసుకోవడానికిచ్చిన ఒక ఆహ్వానంపై మీరు విచారణ చేస్తున్నప్పుడు, మీరు వారిపట్ల శ్రద్ధ చూపుతున్నారని మరియు సువార్త వారి జీవితాలను ఎలా దీవిస్తున్నదోనని (మీ కుటుంబ సభ్యులకు) మీరు చూపుతారు. వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా మీరు వారికి అవకాశాలనిస్తారు” (Teaching in the Savior’s Way, 35).

చిత్రం
ఆయన రెండవ రాకడ సమయమున పరలోకము నుండి క్రిందికి గుఱ్ఱంపై స్వారీ చేస్తున్న యేసు క్రీస్తు

ఎర్రని అంగీ ధరించి తెల్లని గుఱ్ఱముపై కూర్చున్న క్రీస్తు

ముద్రించు