2023 క్రొత్త నిబంధన
అక్టోబరు 16–22. 1 మరియు 2 థెస్సలొనీకయులకు: “మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు”


“అక్టోబరు 16–22. 1 మరియు 2 థెస్సలొనీకయులకు: ‘మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“అక్టోబరు 16–22. 1 మరియు 2 థెస్సలొనీకయులకు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
యువకునితో మాట్లాడుతున్న సువార్తికురాళ్ళు

అక్టోబరు 16-22

1 మరియు 2 థెస్సలొనీకయులకు

“మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు”

ఆత్మ నుండి మనము పొందే మనోభావాలను వ్రాయకపోతే, మనము వాటిని మరచిపోవచ్చు. మీరు 1 మరియు 2 థెస్సలొనీకయులకు చదివినప్పుడు, దేనిని వ్రాయాలని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించును?

మీ మనోభావాలను నమోదు చేయండి

థెస్సలొనీకయలో, “భూలోకమును తలక్రిందు చేసిన వారు” (అపొస్తలుల కార్యములు 17:6 అని పౌలు మరియు సీలలు నిందింపబడ్డారు. వారి బోధన యూదుల మధ్య కొందరు నాయకులకు కోపం తెప్పించింది మరియు ఈ నాయకులు జనులలో కలకలం రేపారు (అపొస్తలుల కార్యములు 17:1–10 చూడండి). ఫలితంగా, పౌలు, సీలలు థెస్సలొనీకయను విడిచి వెళ్ళమని సలహా ఇవ్వబడ్డారు. క్రొత్తగా మార్పు చెందిన థెస్సలొనీకయుల గురించి మరియు వారు ఎదుర్కొంటున్న హింస గురించి పౌలు చింతించాడు, కానీ వారిని దర్శించడానికి తిరిగి వెళ్ళలేకపోయాడు. “ఇందుచేత నేనింక సహింపజాలక, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని నేను పంపితిని,” అని ఆయన వ్రాసాడు. జవాబుగా, పౌలు యొక్క సహాయకుడు, థెస్సలొనీకయలో సేవ చేస్తున్న తిమోతి, “మీ విశ్వాసమును గూర్చియు, ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను” (1 థెస్సలొనీకయులకు 3:5–6). వాస్తవానికి, థెస్సలొనీకయలోని పరిశుద్ధులు “విశ్వాసులందరికి” (1 థెస్సలొనీకయులకు 1:7) మాదిరులుగా పేరు పొందారు మరియు వారి విశ్వాసము యొక్క వార్తలు దూరముగా ఉన్న పట్టణములకు వ్యాప్తి చెందాయి. వారి మధ్య తన కార్యము “వ్యర్థము కాలేదని”(1 థెస్సలొనీకయులకు 2:1) వినుట పౌలు పొందిన ఆనందము మరియు ఉపశమనమును ఊహించండి. కానీ గతములోని విశ్వాసము భవిష్యత్తులో ఆత్మీయంగా బ్రతుకుటకు సరిపోదని పౌలు ఎరుగును మరియు అతడు పరిశుద్ధుల మధ్య అబద్ధ బోధకుల ప్రభావమును బట్టి జాగ్రత్తపడ్డాడు (2 థెస్సలొనీకయులకు 2:2–3 చూడండి). వారికి మరియు మనకు అతని సందేశమేదనగా, “(మన) విశ్వాసములో ఉన్న లోపము తీర్చుటను” మరియు ప్రేమయందు “మరియెక్కువగా వృద్ధినొందుచుండుటను” 1 థెస్సలొనీకయులకు 3:10; 4:10) కొనసాగించుట.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 థెస్సలొనీకయులకు 1–2

క్రీస్తు యొక్క శిష్యులు నిజాయితీ మరియు ప్రేమతో ఇతరులకు సేవచేస్తారు.

1 థెస్సలొనీకయులకులో, పౌలు యొక్క మాటలు దేవుని పిల్లలకు సేవ చేయుటకు తనను తాను పూర్తిగా అప్పగించుకొన్న ఒకరి ఆలోచన మరియు ఆనందము రెండింటిని బయల్పరచును. ప్రత్యేకించి 1 థెస్సలొనీకయులకు యొక్క మొదటి రెండు అధ్యాయాలలో, ప్రభువు యొక్క శిష్యుని వైఖరులు మరియు క్రియలను వివరించు మాటలను, వాక్యభాగాలను మీరు కనుగొంటారు. ఉదాహరణకు, ప్రభువును సేవించుట గురించి 1 థెస్సలొనీకయులకు 1:5–8; 2:1–13 నుండి మీరేమి నేర్చుకుంటారు?

దేవునికి, ఆయన పిల్లలకు సేవ చేయడానికి మీకు గల అవకాశాల గురించి ఆలోచించండి. మీ సేవను మెరుగుపరచడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా దేనిని మీరు ఈ అధ్యాయాలలో కనుగొంటారు? మీరు కనుగొనే దానిపై ఆధారపడి మిమ్మల్ని మీరు, “నాకు తెలిసిన విషయాలకు నేను మాదిరిగా ఉన్నానా?” (1 థెస్సలొనీకయులకు 1:7 చూడండి) వంటి ప్రశ్నలు అడగడాన్ని పరిగణించండి.

1 థెస్సలొనీకయులకు 3:7–13; 4:1–12

“ప్రేమలో అభివృద్ధిపొంది వర్థిల్లునట్లు.”

థెస్సలొనీకయలోని పరిశుద్ధుల విశ్వాసమందు పౌలు సంతోషించాడు ( (1 థెస్సలొనీకయులకు 3:7–9 చూడండి). కానీ ఆ విశ్వాసంలో వారు “అంతకంతకు అభివృద్ధి నొందవలెనని” (1 థెస్సలొనీకయులకు 4:1) కూడా అతడు వారిని కోరాడు. మీరు 1 థెస్సలొనీకయులకు 3:7–13; 4:1–12 చదువుతున్నప్పుడు, మీరు ఆత్మీయంగా “మరియెక్కువగా అభివృద్ధినొందగల” విధానాల గురించి ఆలోచించండి (1 థెస్సలొనీకయులకు 4:10). ఉదాహరణకు, “పరిశుద్ధత” మరియు “శుద్ధి” వంటి మాటలను పౌలు ఉపయోగించాడని గమనించండి. ఈ మాటలకు అర్థాల గురించి పౌలు రచనల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు ఎక్కువ పరిశుద్ధంగా ఉండడానికి మరియు శుద్ధిచేయబడడానికి రక్షకుడు మీకు ఎలా సహాయపడగలరు?

లేఖనదీపిక, “పరిశుద్ధ,” “శుద్ధి,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి.

1 థెస్సలొనీకయులకు 4:16–18; 5:1–10; 2 థెస్సలొనీకయులకు 1:4–10

నేను విశ్వాసముగా మరియు జాగ్రత్తగా ఉన్న యెడల, రక్షకుని యొక్క రెండవ రాకడ కొరకు నేను సిద్ధపడియుంటాను.

1 థెస్సలొనీకయులకు 5:1–10 లో, యేసు భూమి మీదకు తిరిగి వచ్చినప్పటి సమయము గురించి బోధించడానికి అనేక రూపకములను పౌలు ఉపయోగించాడు. ఈ రూపకాలను మీరు అధ్యయనము చేసినప్పుడు, యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మీకు కలిగే మనోభావాలను వ్రాయడాన్ని పరిగణించండి.

  • “రాత్రి వేళ దొంగవలె”:

  • “గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు”:

  • మీరు కనుగొనే ఇతర రూపకాలు:

1 థెస్సలొనీకయులకు 4:16–18; 5:1–10; 2 థెస్సలొనీకయులకు 1:4–10 నుండి మీరు నేర్చుకొనే అదనపు సత్యములేవి? రక్షకుని రాకడ కోసం గమనించి, సిద్ధపడుటకు మీరేమి చేయుటకు ప్రేరేపించబడ్డారు?

డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “ప్రభువు రాకడకు సిద్ధపడుట,” లియహోనా, మే 2019, 81–84 కూడా చూడండి.

2 థెస్సలొనీకయులకు 2

రెండవ రాకడకు ముందు విశ్వాసభ్రష్టత్వము లేదా సత్యము నుండి తొలగిపోవుట జరుగునని ప్రవచించబడింది.

పెరుగుతున్న హింసల మధ్య, థెస్సలొనీకయ పరిశుద్ధులలో అనేకులు రక్షకుని యొక్క రెండవ రాకడ దగ్గరలో ఉన్నదని నమ్మారు. కానీ యేసు భూమి మీదకు తిరిగి రాకముందు విశ్వాసభ్రష్టత్వము—ఒక తిరుగుబాటు లేదా సత్యము నుండి “తొలగిపోవుట” ఉంటుందని పౌలు ఎరుగును (2 థెస్సలొనీకయులకు 2:1–4 చూడండి). క్రింది వాటిలో కొన్నిటిని ధ్యానించుట ద్వారా—గొప్ప విశ్వాసభ్రష్టత్వము గురించి మీ అవగాహనను —మరియు పునఃస్థాపన కొరకు మీ ప్రశంసను మీరు అధికం చేయవచ్చు:

  • విశ్వాసభ్రష్టత్వమును ముందుగా చెప్పిన లేఖనాలు: యెషయా 24:5; ఆమోసు 8:11–12; మత్తయి 24:4–14; 2 తిమోతి 4:3–4

  • పౌలు యొక్క కాలములో విశ్వాసభ్రష్టత్వము ముందే ప్రారంభమైనదని చూపు లేఖనాలు: అపొస్తలుల కార్యములు 20:28–30; గలతీయులకు 1:6–7; 1 తిమోతి 1:5–7

  • విశ్వాసభ్రష్టత్వము గురించి క్రైస్తవ సంస్కర్తల చేత పరిశీలనలు:

    మార్టిన్ లూథర్: “పరిశుద్ధ లేఖనాలకు అనుగుణంగా సంఘమును సంస్కరించుటను మించి నేనేమీ కోరలేదు. … క్రైస్తవత్వము దానిని పరిరక్షించు వారి ఉనికిలో లేదని మాత్రమే నేను చెప్తాను” (in E. G. Schweibert, Luther and His Times: The Reformation from a New Perspective [1950], 590).

    రోగర్ విలియమ్స్: “విశ్వాసభ్రష్టత్వము … సంఘములను క్రొత్తగా నిర్మించుటకు క్రీస్తు క్రొత్త అపొస్తలులను పంపేటంత వరకు ఆ విశ్వాసభ్రష్టత్వము నుండి కోలుకోలేనంతగా అక్కడున్న సమస్త సంఘములను పాడు చేసింది” (in Philip Schaff, The Creeds of Christendom [1877], 851).

2 నీఫై 28; సువార్త అంశములు, “విశ్వాసభ్రష్టత్వము,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 థెస్సలొనీకయులకు 3:9–13.పౌలు తన స్నేహితుల కొరకు కలిగియున్న భావాల గురించి మిమ్మల్ని ఆకట్టుకొనేది ఏమిటి? మనమెలా “ఒకని యెడల ఒకడు ప్రేమలో అభివృద్ధిపొంది వర్థిల్లగలము”? (12వ వచనము).

1 థెస్సలొనీకయులకు 4:13–18.పునరుత్థానము గురించి ఈ వచనాలలోని ఏ వాక్యభాగాలు మీకు ఓదార్పునిస్తాయి?

1 థెస్సలొనీకయులకు 5:14–25.1 థెస్సలొనీకయులకు 5:14–25లో పౌలు సలహాను మీరు పునర్వీక్షించినప్పుడు, మీ కుటుంబము దృష్టిసారించగల వాక్యభాగమును కనుగొనమని ప్రతి కుటుంబ సభ్యుని ఆహ్వానించండి. జ్ఞాపకచిహ్నంగా ఈ వాక్యభాగాలను మీ ఇంటిలో ప్రదర్శించడానికి సృజనాత్మక మార్గాలను కనుగొనండి. ఉదాహరణకు, అతడు లేదా ఆమె ఎంచుకొనిన వాక్యభాగాన్ని వివరించే లేదా బలపరిచే చిత్రాలను ప్రతి వ్యక్తి కనుగొనవచ్చు లేదా గీయవచ్చు.

2 థెస్సలొనీకయులకు 3:13.మనము ఎప్పుడైనా “మేలు చేయుటలో విసుగుచెందినట్లు”—బహుశా శిష్యత్వము యొక్క అభ్యర్థనలతో ముంచివేయబడినట్లు భావించామా? మనము ఈవిధంగా భావించినప్పుడు మనకు సహాయపడేదేమిటి? (గలతీయులకు 6:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33 చూడండి.) ఇది జరిగినప్పుడు మనము ఒకరినొకరం ఎలా బలపరచుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ప్రతీరోజు బయల్పాటును వెదకండి. “బయల్పాటు అనేది అంతా ఒకేసారి కాకుండా, ‘సూత్రము వెంబడి సూత్రము’గా (2 నీఫై 28:30) వస్తుంది. … [సువార్త అధ్యయనమును] మీరు సమయాన్ని వెచ్చించే దానిగా ఆలోచించకుండా, మీరు ఎల్లప్పుడు చేసే దానిగా ఆలోచించండి” (Teaching in the Savior’s Way, 12).

చిత్రం
మేఘములలో క్రీస్తు

పునరుత్థానము చెందిన క్రీస్తు, రాబర్ట్ టి. బారెట్ చేత

ముద్రించు