2023 క్రొత్త నిబంధన
సెప్టెంబరు 4–10. 1 కొరింథీయులకు 14–16: “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు”


“సెప్టెంబరు 4-10. 1 కొరింథీయులకు 14–16: ‘దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“సెప్టెంబరు 4-10. 1 కొరింథీయులకు 14-16,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
దేవాలయపు బాప్తిస్మపు తొట్టె

సెప్టెంబరు 4-10

1 కొరింథీయులకు 14–16

“దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు”

మీరు 1 కొరింథీయులకు 14–16 చదువుతున్నప్పుడు, మీ మనోభావాలను నమోదు చేయండి. ఆత్మ మీకు బోధించిన దాని గురించి ప్రార్థించి, ఒకవేళ మీరు మరింత నేర్చుకోవలసిందిగా ఆయన కోరుతున్నారేమో పరలోక తండ్రిని అడగండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

కొరింథులో సంఘము మరియు దాని యొక్క సిద్ధాంతము చాలా క్రొత్తవి కాబట్టి, కొరింథీయులైన పరిశుద్ధులు గందరగోళాన్ని ఎదుర్కోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు పౌలు వారికి సువార్త యొక్క ప్రాథమిక సత్యాన్ని బోధించాడు: “క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను … సమాధి చేయబడెను, మూడవదినమున లేపబడెను” (1 కొరింథీయులకు 15:3–4). కానీ అంతలోనే కొంతమంది సభ్యులు “మృతుల పునరుత్థానము లేదని” బోధించడం మొదలుపెట్టారు” (1 కొరింథీయులకు 15:12). వారికి బోధించబడిన సత్యాలను “గట్టిగా పట్టుకొనియుండవలెనని” పౌలు వారిని అర్థించాడు (1 కొరింథీయులకు 15:2). సువార్త సత్యాల గురించి విరద్ధమైన అభిప్రాయాలను మనం ఎదుర్కొన్నప్పుడు, “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు” అని జ్ఞాపకము చేసుకొనుట మంచిది (1 కొరింథీయులకు 14:33). ప్రభువు నియమించిన సేవకుల మాటలను ఆలకించి, వారు పదే పదే బోధించే సాధారణమైన సత్యాలను అంటిపెట్టుకొని ఉండడం మనం శాంతిని కనుగొని, “విశ్వాసమందు నిలకడగా ఉండుటకు” మనకు సహాయపడగలదు (1 కొరింథీయులకు 16:13).

చిత్రం
వ్యక్తగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 కొరింథీయులకు 14

ప్రవచన వరాన్ని నేను అపేక్షించగలను.

ప్రవచన వరము అనగానేమి? భవిష్యత్తును అంచనా వేయగల సామర్థ్యం ఇదేనా? ఇది కేవలం ప్రవక్తల కోసమేనా? లేదా ఈ బహుమతిని ఎవరైనా పొందగలరా?

మీరు 1 కొరింథీయులకు 14:3, 31, 39–40 చదివినప్పుడు ఈ ప్రశ్నలను ధ్యానించండి. ప్రకటన 19:10 మరియు లేఖనదీపికలో “ప్రవచించు, భవిష్యత్తు చెప్పు” (scriptures.ChurchofJesusChrist.org) కూడా మీరు చదువవచ్చు. మీరు నేర్చుకున్న దానిపై ఆధారపడి, “ప్రవచన వరమును” మీరు ఎలా నిర్వచిస్తారు? “ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి” అని పౌలు కొరింథీయులను ఆహ్వానించినప్పుడు అతని ఉద్దేశ్యము ఏమైయుండవచ్చును? (1 కొరింథీయులకు 14:39). ఈ ఆహ్వానాన్ని మీరేవిధంగా స్వీకరించగలరు?

యోవేలు 2:28-29; ఆల్మా 17:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:23-28 కూడా చూడండి.

1 కొరింథీయులకు 14:34–35

ఈ వచనాలలో స్త్రీల గురించిన వ్యాఖ్యానము నేడు ఏవిధంగా అన్వయించబడుతుంది?

పౌలు కాలంలో, సంఘ సమావేశాలతో కలిపి సమాజంలో స్త్రీలు పాల్గొనే దాని గురించి భిన్నమైన అపేక్షలున్నాయి. 1 కొరింథీయులకు 14:34–35 లో పౌలు కాలంలోని బోధనలు ఏవైనప్పటికీ, దానర్థము నేడు సంఘములో స్త్రీలు మాట్లాడరాదని, నాయకత్వం వహించరాదని అర్థం చేసుకోకూడదు (జోసెఫ్ స్మిత్ అనువాదము, 1 కొరింథీయులకు 14:34 [1 కొరింథీయులకు 14:34, పాదవివరణ  లో]). నేడు సంఘములోని స్త్రీలకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “మీ బలము, మీ పరివర్తన, మీ దృఢవిశ్వాసం, నడిపించడానికి మీ సామర్థ్యం, మీ జ్ఞానము మరియు మీ స్వరములు మాకు అవసరము. పవిత్రమైన నిబంధనలు చేసి, వాటిని పాటించే స్త్రీలు, దేవుని శక్తి మరియు అధికారంతో మాట్లాడగలిగే స్త్రీలు లేకుండా దేవుని రాజ్యము పూర్తవదు మరియు పూర్తి కాలేదు!” (“A Plea to My Sisters,” Liahona, Nov. 2015, 96).

1 కొరింథీయులకు 15:1–34, 53–58

యేసు క్రీస్తు మరణంపై విజయం సాధించారు.

యేసు క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ మతానికి చాలా ప్రాథమికమైనది, అది లేకుండా క్రైస్తవ మతం లేదు అని చెప్పవచ్చు— పౌలు చెప్పిన మాటలను ఉపయోగించి చెప్పాలంటే, “మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే”(1 కొరింథీయులకు 15:14). అయినప్పటికీ కొరింథీయులైన కొంతమంది పరిశుద్ధులు “మృతుల పునరుత్థానము లేదని” బోధించుచున్నారు (1 కొరింథీయులకు 15:12) మీరు 1 కొరింథీయులకు 15 లో పౌలు స్పందన చదివినప్పుడు, మీరు పునరుత్థానమును నమ్మనట్లైతే మీ జీవితం ఎలా భిన్నంగా ఉండేదో ఆలోచించండి (2 నీఫై 9:6–19; ఆల్మా 40:19–23; సిద్ధాంతము మరియు నిబంధనలు 93:33–34 చూడండి). మీ ఉద్దేశ్యములో “క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే” అను వాక్యభాగానికి అర్థమేమిటి? (17వ వచనము).

పునరుత్థానము నిజమైనది అనడానికి సాక్ష్యంగా పౌలు మృతుల కొరకు బాప్తిస్మమును సూచించాడని గమనించడం కూడా యోగ్యమైనది (1 కొరింథీయులకు 15:29 చూడండి). పునరుత్థానము యొక్క సిద్ధాంతములో మీ విశ్వాసాన్ని దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము ఎలా బలపరిచాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 138:11-37 కూడా చూడండి.

1 కొరింథీయులకు 15:35–54

పునరుత్థానము చెందిన శరీరాలు మర్త్య శరీరాలకంటే భిన్నంగా ఉంటాయి.

పునరుత్థానం చేయబడిన శరీరం ఎలా ఉంటుందోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 1 కొరింథీయులకు 15:35 ప్రకారం, కొరింథీయులలో కొందరు ఇదే విషయాన్ని ఆలోచించారు. పౌలు సమాధానాన్ని 36–54 వచనాలలో చదవండి మరియు మర్త్య శరీరాలకు, పునరుత్థానము చేయబడిన శరీరాలకు మధ్య తేడాలను వివరించే పదాలు మరియు వాక్యభాగాలను గమనించండి. మీరలా చేసినప్పుడు, సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–112 తో 40–42 వచనాలను మీరు పోల్చవచ్చు. ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన ఈ బయల్పాటు మీ గ్రహింపుకు ఏమి జోడిస్తుంది? (జోసెఫ్ స్మిత్ అనువాదము, 1 కొరింథీయులకు 15:40 [1 కొరింథీయులకు 15:40, పాదవివరణ  లో] కూడా చూడండి). ఈ సత్యాలు మీకు ఎందుకు విలువైనవి?

లూకా 24:39; ఆల్మా 11:43-45; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:14-33 కూడా చూడండి.

చిత్రం
సూర్యోదయం

“సూర్యుని మహిమ వేరు” (1 కొరింథీయులకు 15:41).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 కొరింథీయులకు 15:29.నేడు మనం సంఘములో చేయు విధముగా, ప్రాచీన పరిశుద్ధులు మృతుల కొరకు బాప్తిస్మములో పాల్గొన్నారని 29వ వచనము నుండి మనం నేర్చుకుంటాము. మన పూర్వీకుల కొరకు మనం ఎందుకు బాప్తిస్మము పొందుతున్నామనే దాని గురించి ఇతరులకు మనం ఎలా వివరిస్తాము? దేవాలయ విధులు అవసరమైన మరణించిన మన పూర్వీకులకు వాటిని అందిచడానికి ఒక కుటుంబంగా మనం ఏమి చేస్తున్నాము?

1 కొరింథీయులు 15:35-54.పునరుత్థానం చేయబడిన శరీరాల నుండి మర్త్య శరీరాలు ఎలా భిన్నంగా ఉన్నాయో వివరించడానికి పౌలు ఉపయోగించిన కొన్ని పదాలను మీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి మీరు ఏ వస్తువులు లేదా చిత్రాలను చూపించగలరు? ఉదాహరణకు, క్షయమైన మరియు అక్షయమైన వాటి మధ్య వ్యత్యాసాన్ని ప్రదర్శించడానికి (52-54 వచనాలు చూడండి) తుప్పు పట్టిన లోహాన్ని మరియు తుప్పు పట్టని లోహాన్ని మీరు చూపించవచ్చు. లేదా బలహీనమైనదానికి, శక్తివంతమైన దానికి మధ్య మీరు వ్యత్యాసం చూపవచ్చు (43వ వచనము చూడండి).

1 కొరింథీయులు 15:55-57.మరణించిన వ్యక్తి మీ కుటుంబానికి తెలిసియుంటే ఈ వచనాల గురించి చర్చించడం ప్రత్యేకంగా అర్థవంతంగా ఉండగలదు. యేసు క్రీస్తు “మరణపు ముల్లు”ను ఎలా తీసివేస్తారో కుటుంబ సభ్యులు సాక్ష్యమివ్వగలరు (56వ వచనము).

1 కొరింథీయులకు 16:13.మీ కుటుంబ సభ్యులకు ఈ వచనాలతో సంబంధాన్ని చూపుటలో సహాయపడడానికి, మీరు భూమిపై ఒక వృత్తాన్ని గీయవచ్చు మరియు అతడు లేదా ఆమె కళ్ళు మూసుకొని దాని లోపల “నిలకడగా ఉండాలని” ఒక కుటుంబ సభ్యునికి సూచించవచ్చు. అప్పుడు మిగిలినవారు అతడిని లేదా ఆమెను ఆ వృత్తంలో నుండి త్రోయడానికి లేదా లాగడానికి ప్రయత్నించవచ్చు. వృత్తంలో ఉన్న వ్యక్తి, అతని లేదా ఆమె కళ్ళు తెరిచియున్నప్పుడు మరియు “గమనించ” గలిగినప్పుడు ఏమి తేడా ఉంటుంది? చెడు ఎంపికలు చేయడానికి మనం శోధించబడినప్పుడు, “బలంగా నిలువడానికి” మనమేమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

నమూనాల కోసం చూడండి. ప్రభువు తన కార్యాన్ని ఎలా చేస్తారో చూపించే నమూనాలను లేఖనాల్లో మనం కనుగొంటాము. ఏ విధంగా ఒకరికొకరు ఆత్మీయాభివృద్ధిని కలుగజేసుకోవాలో అర్థము చేసుకొనుటలో మనకు సహాయపడుటకు ఏ నమూనాలను 1 కొరింథీయులకు 14 లో మీరు కనుగొంటారు?

చిత్రం
తోట సమాధి వద్ద మరియకు కనిపించిన క్రీస్తు

నీవెందుకు రోదిస్తున్నావు, © సైమన్ డ్యూయీ 2021. Altus Fine Art/www.altusfineart.com నుండి అనుమతితో ఉపయోగించబడినది.

ముద్రించు