2023 క్రొత్త నిబంధన
ఆగష్టు 14-20. రోమా 7–16: “మేలు చేత కీడును జయించుము”


“ఆగష్టు 14-20. రోమా 7–16: ‘మేలు చేత కీడును జయించుము,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఆగష్టు 14-20. రోమీయులకు 7-16,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుంటుంబాల కొరకు: 2023

చిత్రం
ప్రాచీన రోమా యొక్క శిథిలాలు

ఆగష్టు 14-20

రోమీయులకు 7–16

“మేలు చేత కీడును జయించుము”

రోమీయులకు 7–16 లోని కొన్ని సువార్త సూత్రములు మాత్రమే ఈ సారాంశములో చేర్చబడవచ్చు, కావున ఇక్కడ చెప్పబడిన దానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు. మీరు అధ్యయనము చేసినప్పుడు మీరు పొందే ప్రేరేపణ పట్ల శ్రద్ధ చూపండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

రోమీయులకు తన పత్రికను అతడు ప్రారంభించినప్పుడు, పౌలు రోమాలోని సంఘ సభ్యులను “పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన” వారు, “దేవుని ప్రియులు” అని పిలుచుట ద్వారా పలకరించెను. వారి “విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండెను” (రోమీయులకు 1:7–8) అని అతడు వ్యాఖ్యానించెను. పౌలు తన పత్రికలో తప్పుడు ఆలోచనలు మరియు లోపభూయిష్టమైన ప్రవర్తనలు సరిదిద్దుటకు ఎక్కువ సమయాన్ని గడిపినప్పటికీ, క్రొత్తగా మార్పు చెందిన ఈ క్రైస్తవులు నిజముగా పరిశుద్ధులని, వారు దేవునికి ప్రియమైనవారని వారికి అభయమివ్వాలని కూడా అతడు కోరినట్లు కనబడుతున్నది. దేవుని ప్రేమను భావించుటకు కష్టపడే మనందరిని మరియు పరిశుద్ధుడగుట అందుబాటులో లేదని అనుకొనేవారిని అతని సున్నితమైన సలహా దీవిస్తుంది. వినయపూర్వక సానుభూతితో, పౌలు కొన్నిసార్లు తాను “దౌర్భాగ్యుడిగా” భావించినట్లు అంగీకరించాడు (రోమీయులకు 7:24), కానీ యేసు క్రీస్తు యొక్క సువార్త పాపమును జయించే శక్తిని అతనికి ఇచ్చింది (జోసెఫ్ స్మిత్ అనువాదము, రోమీయులకు 7:22–27 [బైబిలు అనుబంధములో] చూడండి). ఆ శక్తితో, రక్షకుని విమోచన శక్తితో మనము “కీడును”— ప్రపంచములో ఉన్న చెడు మరియు మనలో ఉన్న చెడు రెండింటిని— “మేలు చేత జయించగలము” (రోమీయులకు 12:21).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత అధ్యయనము కొరకు ఉపాయములు

రోమీయులకు 7–8

ఆత్మను అనుసరించు వారు “క్రీస్తు తోడి వారసులు” కాగలరు.

బాప్తిస్మపు విధి ద్వారా “నూతన జీవము” (రోమీయులకు 6:4) లోనికి ప్రవేశించిన తరువాత కూడా, బహుశా మీరు రోమీయులకు 7 లో పౌలు వర్ణించిన—ప్రకృతి సంబంధియైన మనుష్యుడు మరియు నీతిగల మీ కోరికల మధ్య “పోరాటము” (రోమీయులకు 7:23)— అంతర్ పోరాటములో కొంత అనుభవించియుంటారు. కానీ రోమీయులకు 8:23–25 లో నిరీక్షణను గూర్చి కూడా పౌలు మాట్లాడాడు. 8వ అధ్యాయము లో ఈ నిరీక్షణ కొరకు మీరు కనుగొన్న కారణములేవి? “దేవుని ఆత్మ మీలో నివసించుట” (రోమీయులకు 8:9) నుండి వచ్చు దీవెనల కొరకు కూడా మీరు వెదకవచ్చు. మీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మరింత సంపూర్ణంగా మీరు ఎలా వెదకగలరు?

రోమీయులకు 8:16–39

నిత్య మహిమ యొక్క బహుమానము భూమి మీద నా శ్రమల కంటే ఎంతో గొప్పది.

పౌలు ఈ పత్రికను వ్రాసిన కేవలము కొన్ని సంవత్సరాల తరువాత, రోమాలోని పరిశుద్ధులు భయంకరమైన హింసలను అనుభవించారు. హింస కలిగినప్పుడు ఈ పరిశుద్ధులకు సహాయపడునట్లు రోమీయులకు 8:16–39 లో మీరేమి కనుగొంటారు? ఈ మాటలు మీకు మరియు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న శ్రమలకు ఎలా అన్వయించబడవచ్చు?

ఈ వచనముల మధ్య మరియు సహోదరి లిండా ఎస్. రీవ్స్ యొక్క ఈ సలహా మధ్య సంబంధముల కొరకు చూడండి: “మనకు అనేక శ్రమలు ఎందుకున్నాయో నాకు తెలియదు, కానీ నా వ్యక్తిగత భావన ఏమిటంటే, బహుమానము చాలా గొప్పది, చాలా నిత్యమైనది, శాశ్వతమైనది, చాలా సంతోషకరమైనది మరియు ఆ బహుమానమిచ్చు దినములో, మనము కనికరముగల, ప్రేమగల మన తండ్రితో, ‘అవసరమైనది అంతా ఇదేనా?’ అని చెప్పాలని భావిస్తాము. మన పరలోక తండ్రి మరియు మన రక్షకుడు మన కొరకు కలిగియున్న ప్రేమ యొక్క లోతును మనము ప్రతీరోజు జ్ఞాపకముంచుకొని, గుర్తించిన యెడల, వారి ప్రేమతో శాశ్వతంగా చుట్టబడియుండి, వారి సమక్షములో తిరిగి ఉండుటకు మనము ఏదైనా చేయడానికి సుముఖంగా ఉంటామని నేను నమ్ముతున్నాను. చివరికి, మన తండ్రి మరియు రక్షకునితో దేవుని రాజ్యములో నిత్యజీవానికి మరియు ఉన్నత స్థితికి అర్హత కలిగించేవి ఇక్కడ మనము అనుభవించిన ఆ శ్రమలే అయితే … ఏది ముఖ్యము? (“Worthy of Our Promised Blessings,” Liahona, Nov. 2015, 11). మీ కొరకు దేవుని యొక్క ప్రేమను “ప్రతీరోజు జ్ఞాపకముంచుకొని, గుర్తించుటకు” మీరు ఏమి చేస్తారో నిర్ణయించండి.

రోమీయులకు 8:29–30; 9–11

“ముందుగా నిర్ణయించెను,” “పిలిచెను,” మరియు “ముందుగా ఎరిగెను” అనగా పౌలు ఉద్దేశమేమిటి?

ఈ జీవితానికి ముందు, దేవుడు తన పిల్లలలో కొంతమందిని ఇశ్రాయేలు అనగా తన నిబంధన జనులలో భాగమవ్వడానికి ఎంచుకున్నారని బోధించడానికి “ముందుగా నిర్ణయించెను,” “పిలిచెను,” మరియు “ముందుగా ఎరిగెను” అనే పదాలను పౌలు ఉపయోగించాడు. దీని అర్థము, వారు ప్రపంచంలోని జనులందరిని దీవించగలుగునట్లు ప్రత్యేక దీవెనలు మరియు బాధ్యతలు పొందుతారు (లేఖన దీపిక, “ఎన్నిక,” scriptures.ChurchofJesusChrist.org చూడండి). అయినప్పటికీ, దేవుని పిల్లలు అందరూ ఆయన నిబంధన జనులు కాగలరని మరియు యేసు క్రీస్తు యందు విశ్వాసము, ఆయన ఆజ్ఞలకు విధేయత ద్వారా మనమందరము నిత్యజీవము పొందుతామని రోమీయులకు 9–11 లో పౌలు నొక్కిచెప్పాడు.

ఎఫెసీయులకు 1:3–4; 1 పేతురు 1:2; ఆల్మా 13:1–5; సువార్త అంశములు, “పూర్వనియామకము,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

రోమీయులకు 12–16

యేసు క్రీస్తు యొక్క నిజమైన పరిశుద్ధునిగా మరియు అనుచరునిగా మారుటకు పౌలు నన్ను ఆహ్వానించాడు.

రోమీయులకులో చివరి ఐదు అధ్యాయాలు పరిశుద్ధులుగా ఎలా జీవించాలనే దాని గురించి అనేక ప్రత్యేక సూచనలను కలిగియున్నాయి. ఈ సూచనలను చదివేందుకు గల ఒక విధానము, పదేపదే చెప్పబడిన అంశాల కొరకు చూడడం. పౌలు సలహాను మీరు ఎలా సంక్షిప్తపరుస్తారు?

ఈ సలహా అంతా ఒకేసారి మీరు అన్వయించలేకపోవచ్చు, కానీ ఈ రోజు పనిచేయుటకు మీరు ప్రారంభించునట్లు ఒకటి లేదా రెండు సూత్రాలను మీరు కనుగొనడానికి ఆత్మ మీకు సహాయపడగలడు. ప్రార్థనయందు మీ పరలోక తండ్రితో మీ కోరికలను పంచుకోండి మరియు ఆయన సహాయము కొరకు అడగండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

రోమీయులకు 8:31–39.మన గురించి పరలోక తండ్రి మరియు యేసు ఎలా భావిస్తారనే దానిగురించి రోమీయులకు 8:31–39లో మనమేమి కనుగొంటాము? దేవుని ప్రేమను మనమెప్పుడు భావించాము?

38–39 వచనాలను వివరించడానికి, మనల్ని దేవుని ప్రేమను విడదీయలేనట్లు ఉన్నటువంటి మాదిరులను కుటుంబ సభ్యులు కనుగొనవచ్చు.

చిత్రం
నాట్యము చేస్తున్న తండ్రీకూతుళ్ళు

“సువార్త యొక్క సంగీతము [ఒక] సంతోషకరమైన ఆత్మీయ భావన” అని ఎల్డర్ విల్ఫర్డ్ డబ్ల్యు. ఆండర్సెన్ బోధించారు.

రోమీయులకు 9:31–32.Elder Wilford W. Andersen’s message “The Music of the Gospel” (Liahona, May 2015, 54–56; see also the video on ChurchofJesusChrist.org) ధర్మశాస్త్రము, క్రియలు మరియు విశ్వాసము గురించి పౌలు బోధించిన దానిని వివరించడానికి సహాయపడగలదు. ఆయన ప్రసంగమును చర్చించిన తర్వాత, సంగీతముతో మరియు సంగీతము లేకుండా నాట్యము చేయడానికి మీ కుటుంబము ప్రయత్నించవచ్చు. సువార్త యొక్క ఆనందాన్ని అనుభవించడానికి విశ్వాసము మనకెలా సహాయపడగలదు?

రోమీయులకు 10:17.దేవుని వాక్యానికి మూలాధారాలతో (లేఖనాలు, వ్యక్తిగత బయల్పాటు మరియు సర్వసభ్య సమావేశము వంటివి) నీళ్ళున్న అనేక గ్లాసులకు పేర్లు పెట్టండి. “విశ్వాసము” అని పేరుపెట్టిన పాత్రలోనికి ప్రతి గ్లాసును మీరు వంపుతున్నప్పుడు, దేవుని వాక్యము మన విశ్వాసాన్ని ఎలా పెంచగలదో చర్చించండి.

రోమీయులకు 12.మనల్ని “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా సమర్పించుకొనుట” అనగా అర్థమేమిటి? (verse 1).

రోమీయులకు 14:13–21.వ్యక్తిగత ప్రాధాన్యతలను గూర్చి విమర్శించుట మరియు వాదించుట గురించి పౌలు యొక్క సలహాను అధ్యయనము చేయుట నుండి మీ కుటుంబము ప్రయోజనము పొందవచ్చు. బహుశా, కుటుంబ సభ్యులతో కలిపి ఇతరుల ఎంపికలు మీ ఎంపికల నుండి భిన్నంగా ఉన్నప్పుడు స్పందించుటకు సరైన విధానాలను మీరు చర్చించవచ్చు. మనమెలా “సమాధానమును కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించగలము”? (19వ వచనము).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

పిల్లలను తమ సృజనాత్మకత వ్యక్తపరచనివ్వండి. “సువార్త సూత్రానికి సంబంధించిన దానిని సృష్టించడానికి మీరు పిల్లలను ఆహ్వానించినప్పుడు, ఆ సూత్రమును బాగా గ్రహించడానికి మీరు వారికి సహాయపడండి. … నిర్మించడానికి, బొమ్మ గీయడానికి, రంగులు వేయడానికి, వ్రాయడానికి మరియు సృష్టించడానికి వారిని అనుమతించండి” (Teaching in the Savior’s Way, 25).

చిత్రం
చేతులు చాపియున్న క్రీస్తు

Abide with Me [నాతో నివసించుము], డెల్ పార్సన్ చేత

ముద్రించు