2022 పాత నిబంధన
ఏప్రిల్ 4–10. నిర్గమకాండము 14–17: “యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి”


“ఏప్రిల్ 4–10. నిర్గమకాండము 14–17: ‘యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఏప్రిల్ 4–10. నిర్గమకాండము 14-17,” వచ్చి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
ఎఱ్ఱ సముద్రం

ఎఱ్ఱ సముద్రం

ఏప్రిల్ 4–10

నిర్గమకాండము 14–17

“యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి”

తన అనుభవాలను “జ్ఞాపకార్థముగా ఒక గ్రంథములో వ్రాసి జాషువాకు వినిపించుము” అని ప్రభువు మోషేని ఆదేశించెను(నిర్గమకాండము 17:14). ఇదేవిధంగా, మీ ఆత్మీయ అనుభవాలను నమోదు చేయుట మీకు మరియు మీ ప్రియమైవారికి ప్రభువు మంచితనము జ్ఞాపకము చేసుకొనుటకు దోహదపడుతుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఇశ్రాయేలీయులు చిక్కుకున్నారు. ఒక వైపు ఎఱ్ఱ సముద్రం ఉంది, మరోవైపు ఫరో సైన్యం ముందుకు వస్తోంది. ఐగుప్తు నుంచి వారు తప్పించుకోవడం, స్వల్పకాలికంగా ఉండబోవునట్లుగా అనిపించింది. అయితే తరతరాలకు వారు గుర్తుంచుకోవాలని దేవుడు కోరిన విధంగా ఆయన ఇశ్రాయేలీయులకు ఒక సందేశాన్ని ఇచ్చెను: “భయపడకుడి. … ప్రభువు మీ పక్షమున యుద్ధము చేయును” (నిర్గమకాండము 14:13–14).

ఆ సమయం నుండి, దేవుని ప్రజలకు విశ్వాసం మరియు ధైర్యం అవసరమైనప్పుడు, సహాయం కొరకు వారు తరచూ ఇశ్రాయేలీయుల ఈ అద్భుత విడుదల వృత్తాంతముపై ఆధారపడ్డారు. నీఫై తన సోదరులకు స్ఫూర్తి కలిగించడానికి, అతడు ఇలా చెప్పెను “మనము మోషే వలె బలముగా నుందము; ఏలయనగా, అతడు నిజముగా ఎఱ్ఱ సముద్రపు నీళ్ళతో మాట్లాడెను మరియు అవి ఇటు-అటు విడి-పోయెను, మరియు మన పితరులు దాని గుండా, చెర నుండి బయటకు ఆరిన నేలన వచ్చిరి” (1 నీఫై 4:2). లింహై రాజు చెరలో ఉన్న తన జనులు ‘‘[వారి] తలలు పైకెత్తి మరియు ఆనందించవలెను’’ అని కోరుకున్నప్పుడు అతడు ఇదే కథను వారికి గుర్తు చేసాడు (మోషైయ 7:19). దేవుని శక్తి గురించి ఆల్మా తన కుమారుడికి చెప్పాలని అనుకున్నప్పుడు, ఆయన కూడా ఈ కథను పేర్కొన్నాడు (ఆల్మా 36:28ని చూడండి). మనకు విడుదల అవసరమైనప్పుడు—మనకు ఇంకొంచెం విశ్వాసం అవసరమైనప్పుడు, మనకు “యెహోవా కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూచుట” అవసరం అయినప్పుడు—ఎలా “ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెనో” అని మనం జ్ఞాపకముచేసుకోవచ్చు (నిర్గమకాండము 14:13, 30).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

నిర్గమకాండము 14

దేవునికి నన్ను విడుదల చేసే శక్తి ఉంది.

మీరు నిర్గమకాండము 14:1–10 చదివినప్పుడు, ఫరో సైన్యం వారికి దగ్గరగా రావడాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఏమని అనుకుని ఉంటారే ఊహించండి. మీరు ఎదుర్కొనుచున్న కష్టమైన సవాలును జయించడానికి ఒక అద్భుతకార్యం అవసరం అని బహుశా మీరు బావించవచ్చు. మీ జీవితంలో దేవుని విడుదలను వెదకుటకు సహాయపడగల వాటి గురించి నిర్గమకాండము 14:13–31 వచనములలో మీరు ఏమి నేర్చుకుంటారు? దేవుడు ప్రతికూలత నుండి విడుదల చేసే మార్గాల గురించి మీరు ఏమి నేర్చుకున్నారు? మీ జీవితంలో ఆయన అందించే శక్తిని మీరు ఎలా చూసారో ఆలోచించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3 కూడా చూడండి.

నిర్గమకాండము 15:22–27

ప్రభువు చేదుగా ఉండే విషయాలను తియ్యగా మార్చగలడు.

ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశము వైపుకు ప్రయాణించడం గురించి నిర్గమకాండము 15:22–27 లో చదివినప్పుడు, మీ జీవితంలో మారా జలాల వలే ‘చేదు’ గా కనిపించిన సంఘటనల గురించి ఆలోచించండి. మీరు ఈ వచనాలను ధ్యానించేటప్పుడు క్రింది ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోండి: ప్రభువు మీ జీవితంలోని చేదు విషయాలను ఎలా తియ్యగా మార్చగలడు? మీ జీవితంలో ఈ అనుభవాలకు ఎటువంటి విలువ ఉంది? మనం ప్రభువు స్వరాన్ని ఆలకించినప్పుడు ప్రభువు మనల్ని ఏ విధంగా దీవించును అనే దాని గురించి 26, 27 వచనాలు ఏమి చెబుతున్నాయి?

నిర్గమకాండము 15:23–27; 16:1–15; 17:1–7

కష్ట సమయాల్లో సైతం నేను ప్రభువును విశ్వసించగలను.

దేవుడు వారికి ప్రతి ఒక్కటీ చేసినప్పటికీ సణగడం లేదా పరిస్థితులు క్లిష్టంగా మారిననప్పుడు ఫిర్యాదు చేయడం వంటివి చేయడం వల్ల ఇశ్రాయేలీయులను విమర్శించడం చాలా ఉత్తేజాన్ని కలిగించవచ్చు. అయితే మీరు నిర్గమకాండము 15:23–27; 16:1–15; 17:1–7 చదివేటప్పుడు, ఇదే విషయాన్ని మీరు ఎప్పుడైనా చేసారో లేదో ఆలోచించండి. తక్కువగా సణుగుట మరియు ప్రభువుని మరింత పూర్తిగా విశ్వసించేందుకు మీకు సాయపడగల ఇశ్రాయేలీయుల అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? ఉదాహరణకు, ఇబ్బందులకు ఇశ్రాయేలీయులు ప్రతిస్పందించిన రీతికి మరియు మోషే ప్రతిస్పందించిన రీతిలో మీరు గమనించిన తేడాలు ఏమిటి? ఈ వచనాలు మీకు దేవుని గురించి ఏమి బోధిస్తున్నాయి?

1 నీఫై 2:11–12; ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
మహిళ మన్నాను సేకరించడం

దేవుని నుండి పంపబడిన మన్నా ఇశ్రాయేలీయులను శారీరకముగా పోషించెను; మనకు కూడా అనుదిన ఆత్మీయ పోషణ అవసరం. లియోపోల్డ్ బ్రక్నర్ ద్వారా ఫ్రెస్కో

నిర్గమకాండము 16

నేను అనుదిన ఆత్మీయ పోషణను వెదకాలి.

నిర్గమకాండము 16లో కనిపించే మన్నా అనే అద్భుతకార్యము నుంచి మనం అనేక ఆత్మీయు పాఠాలు నేర్చుకోవచ్చు. మన్నాని ఎలా సేకరించాలి, ఉపయోగించాలి మరియు సంరక్షించాలనే దానిపై ఇశ్రాయేలీయులకు ఇవ్వబడ్డ వివరణాత్మక సూచనలను గమనించండి (నిర్గమకాండము 16:16, 19, 22–26 చూడండి). మీరు అనుదిన ఆత్మీయ పోషణను వెదకినప్పుడు మీకు వర్తించే ఈ సూచనల నుండి మీరు ఏమి కనుగొంటారు?

యోహాను 6:31–35, 48–58 కూడా చూడండి.

నిర్గమకాండము 17:1–7

యేసు క్రీస్తు నా ఆత్మీయ రాయి మరియు జీవ జలమైయున్నాడు.

మీరు నిర్గమకాండము 17:1–7 చదివేటప్పుడు రక్షకుడి గురించి చదవండి. యేసు క్రీస్తు మీకు ఒక రాయిగా ఎలా ఉన్నాడు? (కీర్తనలు 62:6–7; హీలమన్ 5:12). ఆయన జలముగా ఎలా ఉన్నాడు? (యోహాను 4:10–14; 1 కొరింథీయులకు 10:1–4; 1 నీఫై 11:25 చూడండి).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

నిర్గమకాండము 14:13–22.మోషే ఎఱ్ఱ సముద్రాన్ని విభజించినట్లుగా మీ కుటుంబ సభ్యులు పాత్ర లేదా స్నానపు తొట్టెలో నీటిని ‘‘విభజించడానికి’’ ప్రయత్నించవచ్చు. దేవుని శక్తి లేకుండా ఎఱ్ఱ సముద్రము విభజింపబడలేదు అని అర్థం చేసుకోవడానికి వారికి సాయపడండి. మన జీవితాల్లో మరియు మన పూర్వీకుల జీవితాల్లో దేవుని శక్తిని మనం ఏవిధంగా చూసాము?

నిర్గమకాండము 15:1–21దేవుని మహిమ వల్ల ఎఱ్ఱ సముద్రం దాటిన తరువాత, ఇశ్రాయేలీయులు దేవునికి స్తుతులు చెల్లిస్తూ నిర్గమకాండము 15:1–21లో ఉన్న మోషే కీర్తనగా పిలువబడే కీర్తనను పాడారు. కుటుంబముగా, ఇశ్రాయేలీయుల మరియు ఇతర అర్ధవంతమైన పదబంధాల కొరకు దేవుడు ఏమి చేసాడనే దాని గురించిన రుజువుగా నిలిచే పదబంధాల కోసం ఈ కీర్తనలను శోధించండి. మీ కొరకు దేవుడు ఏమి చేసియుండెనో మీ కుటుంబానికి గుర్తు చేయడానికి మీరు ఒక కీర్తనని పాడవచ్చు.

నిర్గమకాండము 16:1–5; 17:1–7.నిర్గమకాండము 16:1–5 మరియు 17:1–7 చదవడం ద్వారా జీవాహారముగా, జీవజలముగా మరియు మన రాయిగా రక్షకుని గురించి ఒక చర్చకు దారితీయగలదు. యేసు క్రీస్తు మన కొరకు ఏమి చేశాడనేదాన్ని ఈ కథలు మనకు ఎలా గుర్తు చేస్తాయి? మీ చర్చలో భాగంగా మీరు యోహాను 4:10–14; 6:29–35, 48–51; హీలమన్; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 కూడా చదవచ్చు.

నిర్గమకాండము 17:8-16.అహరోను మరియు హుర్‌లు మోషే చేతులు పట్టుకునే కథకు మీరు నటించవచ్చు మరియు దేవుడు మనలను నడిపించమని పిలిచిన వారిని మనం ఎలా నిలబెట్టుకుంటాము అనే దానికి ఇది ఎలా ప్రతీకగా ఉంటుందో చర్చించండి. మోషేలకు విరుద్ధంగా ఇశ్రాయేలీయులు సణగడం గురించి అహరోను మరియు హుర్‌లు యొక్క వైరుధ్య ఉదాహరణలు కూడా చూడవచ్చు (అధ్యాయాలు 15–17 అంతటా వివరించబడింది). మన నాయకులకు సాయపడటానికి మరియు వారిని నిలుపుకోవడానికి మనకు సాయపడగల కొన్ని మార్గాలు ఏవి? మనం చేసేటప్పుడు మనకు మరియు మన సంఘపాలకులకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడ్డ పాట: “ఇజ్రాయెల్ యొక్క విమోచకుడు,” స్తోత్రాలు, నెంబరు. 6.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీ స్వంత ఆత్మీయ అంతర్‌జ్ఞానములను వెతకండి. మీ వ్యక్తిగత మరియు కుటుంబ అధ్యయనములో, ఈ అధ్యయనాల్లో చెప్పబడిన లేఖన భాగములకు మిమ్మల్ని పరిమితం చేసుకోవద్దు. ప్రభువు మీ కొరకు కలిగియున్న సందేశాలు ఇక్కడ పునరుద్ఘాటించబడనివి బహుశా ఈ అధ్యాయాల్లో ఉండవచ్చు. ప్రార్థనాపూర్వకముగా ప్రేరేపణ కొరకు అపేక్షించండి.

చిత్రం
మోషే ఎఱ్ఱ సముద్రమును విడగొట్టుట

మోషే ఎఱ్ఱ సముద్రమును విడగొట్టుచున్న దృష్టాంతము, రాబర్ట్ టి. బార్నెట్ చేత

ముద్రించు