2022 పాత నిబంధన
ఏప్రిల్ 11–17. ఈస్టరు: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును”


“ఏప్రిల్ 11–17. ఈస్టరు: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును,’” వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022

“ఏప్రిల్ 11–17. ఈస్టరు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
తలుపు వద్ద నుండి దొర్లించబడిన రాయితో సమాధి

మేరీనా క్రియుచెంకో చేత ఖాళీ సమాధి దృష్టాంతము

ఏప్రిల్ 11–17

ఈస్టరు

“మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగి వేయును”

ఈ వారము రక్షకుని ప్రాయశ్చిత్తము గురించి మీరు చదివి, ధ్యానించినప్పుడు, ఆయన త్యాగము గురించి మీ ఆలోచనలు, భావనలు మీ దినచర్య పుస్తకంలో లేక ఈ సంక్షిప్తములో ఇవ్వబడిన ఖాళీలో వ్రాయడానికి ఆలోచించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు యొక్క జీవితం “సమస్త మానవ చరిత్రకు ప్రధానమైనది” (“జీవముగల క్రీస్తు: పన్నెండుమంది అపొస్తులుల సాక్ష్యము,” ChurchofJesusChrist.org). దాని అర్ధమేమిటి? కొంతవరకు, నిశ్చయముగా దాని అర్ధము ఎప్పటికీ జీవించిన లేక జీవించబోయే ప్రతీ మానవుని యొక్క నిత్య గమ్యమును రక్షకుని జీవితం ప్రభావితం చేస్తుంది. యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు మిషను, చరిత్ర అంతటా దేవుని యొక్క సమస్త జనులందరిని కలుపుతూ, ఈస్టరు ఆదివారమున ఆయన పునరుత్థానమందు ముగిస్తుంది: క్రీస్తుకు ముందు పుట్టిన వారు విశ్వాసముతో ఆయన కొరకు ఆతృతగా ఎదురుచూసారు (యాకోబు 4:4 చూడండి), మరియు తరువాత జన్మించిన వారు విశ్వాసముతో ఆయన చేసిన దానిని జ్ఞాపకముంచుకున్నారు. పాత నిబంధన వృత్తాంతములు మరియు ప్రవచనాలను మనము చదివినప్పుడు, మనము యేసు క్రీస్తు యొక్క పేరు ఎప్పుడూ చూడము, కానీ మెస్సీయా మరియు విమోచకుని యందు ప్రాచీన విశ్వాసుల యొక్క విశ్వాసము మరియు ఆపేక్ష నిరూపించబడుట మనము చూస్తాము. కనుక ఆయనను జ్ఞాపకముంచుకొనుటకు ఆహ్వానించబడినవారమైన మనము ఆయన కొరకు ఎదురు చూచిన వారితో సంబంధమును అనుభవించగలము. నిజముగా యేసు క్రీస్తు “మన అందరి దోషమును” (యెషయా 53:6 భరించాడు; ఇటాలిక్స్ చేర్చబడినవి), మరియు “క్రీస్తునందు అందరు బ్రదికింపబడును” (1 కొరింథీయులకు 15:22; ఇటాలిక్స్ చేర్చబడినవి).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము గురించి పాత నిబంధన సాక్ష్యమిచ్చును.

పాత నిబంధనలో అనేక లేఖన భాగాలు రక్షకుని పరిచర్య మరియు ప్రాయశ్చిత్త త్యాగము గురించి సూచిస్తాయి. దిగువ పట్టిక ఈ భాగాలలో కొన్నింటిని జాబితా చేస్తుంది. మీరు ఈ వచనాలు చదివినప్పుడు, రక్షకుని గురించి మీకు కలిగే భావనలు ఏమిటి?

పాత నిబంధన

క్రొత్త నిబంధన

పాత నిబంధన

జెకర్యా 9:9

క్రొత్త నిబంధన

మత్తయి 21:1–11

పాత నిబంధన

జెకర్యా 11:12–13

క్రొత్త నిబంధన

మత్తయి 26:14–16

పాత నిబంధన

యెషయా 53:4

క్రొత్త నిబంధన

మత్తయి 8:16–17; 26:36–39

పాత నిబంధన

యెషయా 53:7

క్రొత్త నిబంధన

మార్కు 14:60-61

పాత నిబంధన

కీర్తనలు 22:16

క్రొత్త నిబంధన

యోహాను 19:17–18; 20:25–27

పాత నిబంధన

కీర్తనలు 22:18

క్రొత్త నిబంధన

మత్తయి 27:35

పాత నిబంధన

కీర్తనలు 69:21

క్రొత్త నిబంధన

మత్తయి 27:34, 48

పాత నిబంధన

కీర్తనలు 118:22

క్రొత్త నిబంధన

మత్తయి 21:42

పాత నిబంధన

యెషయా 53:9, 12

క్రొత్త నిబంధన

మత్తయి 27:57–60; మార్కు 15:27–28

పాత నిబంధన

యెషయా 25:8

క్రొత్త నిబంధన

మత్తయి 16:1–6; లూకా 24:6

పాత నిబంధన

దానియేలు 12:2

క్రొత్త నిబంధన

మత్తయి 27:52–53

రక్షకుని గూర్చి ప్రవచనాలు మరియు బోధనలు మోర్మన్ గ్రంధములో ఇంకా ఎక్కువ పుష్కలంగా, స్పష్టంగా ఉన్నాయి. ఇటువంటి లేఖన భాగముల చేత మీ విశ్వాసము ఎలా బలపరచబడిందో ఆలోచించండి: 1 నీఫై 11:31–33; 2 నీఫై 25:13; మోషైయ 3:2–11.

రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా శాంతిని మరియు సంతోషమును నేను కనుగొనగలను.

సమయమంతటా, ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా, యేసుక్రీస్తు తన వద్దకు వచ్చిన వారందరికి, శాంతిని, సంతోషమును ఇస్తున్నాడు (మోషే 5:9–12 చూడండి). ఆయన ఇవ్వబోయే శాంతిని, సంతోషమును గూర్చి సాక్ష్యమిచ్చే క్రింది లేఖనాలను అధ్యయనం చేయడానికి ఆలోచించుము, మరియు మీరు చేసినప్పుడు, ఆయన తెచ్చే శాంతిని, సంతోషమును మీరు ఎలా పొందగలరో ఆలోచించుము: కీర్తనలు 16:8–11; 30:2–5; యెషయా 12; 25:8–9; 40:28–31; John 14:27; 16:33; ఆల్మా 26:11–22.

డాల్లిన్ హెచ్. ఓక్స్, “Strengthened by the Atonement of Jesus Christ,” Liahona, Nov. 2015, 61–64; Sharon Eubank, “Christ: The Light That Shines in Darkness,” Liahona, May 2019, 73–76; “I Stand All Amazed,” Hymns, no. 193.

చిత్రం
సిలువపైన క్రీస్తు

జె. కార్క్ రిచర్డ్స్ చేత గ్రే డే గొల్గతా,

ప్రాయశ్చిత్తము ద్వారా, పాపము, మరణం, శ్రమలు మరియు బలహీనతలను అధిగమించడానికి నాకు సహాయపడే శక్తి యేసు క్రీస్తుకు ఉన్నది.

లేఖనములంతటా, ప్రవక్తలు పాపము, మరణము నుండి మనల్ని విడిపించుటకు మరియు మనకు సహాయపడుటకు, మన శ్రమలు మరియు బలహీనతలను అధిగమించుటకు యేసు క్రీస్తు యొక్క శక్తిని గూర్చి సాక్ష్యమిచ్చారు. క్రీస్తు మీ జీవితంలో ఏ ప్రత్యేకతను చేసాడు? ఆయన మీకు ఎందుకు ముఖ్యమైనవాడు? మీరు ఈ వచనాలు చదివినప్పుడు ఈ ప్రశ్నలను ధ్యానించుము, మరియు రక్షకుని గూర్చి మీ ఆలోచనలు, భావనలు వ్రాయండి.

See also Walter F. González, “The Savior’s Touch,” Liahona, Nov. 2019, 90–92.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

నిర్గమకాండము 12:1–28.మీరు ఈస్టరు జరుపుకున్నప్పుడు, ఇంతకుముందు ఈ నెలలో పస్కా గురించి మీరు నేర్చుకొన్న దానిని మీ కుటుంబము సమీక్షించవచ్చు. పస్కా పండుగ సమయంలోనే రక్షకుని త్యాగము సంభవించుట ఎందుకు ప్రాముఖ్యమైనది?

రక్షకుని యొక్క జీవితంలో చివరి వారమందు జరిగిన దాని యొక్క సంక్షిప్తము కొరకు, “Holy Week” at ComeuntoChrist.org/2016/easter/easter-week చూడండి. రక్షకుని చివరి వారములో సంఘటనలను గూర్చి లేఖనాల కొరకు, “The Last Week: Atonement and Resurrection” in Harmony of the Gospels (in the Bible appendix) చూడండి.

యెషయా 53.యెషయా 53 లో యేసు క్రీస్తు గురించి ప్రవచనాలను చదువుట రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తమును కుటుంబ సభ్యులు గ్రహించుటకు సహయపడవచ్చు. ఏ వచనాలు లేక వాక్యభాగాలు మీ కుటుంబము ప్రత్యేకంగా శక్తివంతమైనవిగా కనుగొన్నారు? రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మీ వ్యక్తిగత సాక్ష్యములను పంచుకొనులాగున ఒక కుటుంబ సాక్ష్య సమావేశమును కలిగియుండుటకు ఆలోచించుము.

“క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులు.”సువార్త గ్రంధాలయ యాప్ మరియు ChurchofJesusChrist.orgSpecial Witnesses of Christ,” అని పిలవబడిన వీడియోల సంగ్రహము కలిగియున్నది, దానిలో ప్రధమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కోరములో ప్రతీ సభ్యుడు యేసు క్రీస్తును గూర్చి తన సాక్ష్యమును పంచుకున్నారు. బహుశా మీ కుటుంబము ఈ వీడియోలలో కొన్నిటిని చూసి, ఆయన ఏర్పరచబడిన సేవకులనుండి యేసు క్రీస్తును గూర్చి మీరు నేర్చుకొన్న దాని గురించి మాట్లాడవచ్చు. ఒక కుటుంబముగా, క్రీస్తును గూర్చి మీ సాక్ష్యమును మీరు పంచుకోగల విధానములను గూర్చి మాట్లాడుము. ఉదాహరణకు, ఈ ఈస్టరు ఆదివారము సంఘము వద్ద మీతోపాటు ఆరాధించుటకు ఎవరైనా ఒకరిని మీరు ఆహ్వానించవచ్చు.

కీర్తనలు మరియు పాటలు.సంగీతము రక్షకుని జ్ఞాపకముంచుకొనుటకు మరియు ఆత్మను మన గృహాలలోనికి ఆహ్వానించుటకు శక్తివంతమైన విధానము. ఈస్టరు లేక యేసు క్రీస్తు గురించి కీర్తనలు లేక పాటలను కుటుంబ సభ్యులు కలిసి పంచుకోవచ్చు మరియు పాడవచ్చు, అవి “Christ the Lord Is Risen Today” (Hymns, no. 200) or “Did Jesus Really Live Again?” (పిల్లల పాటల పుస్తకము, 64). మిగిలిన కీర్తనలు లేక పిల్లల పాటలు కనుగొనుటకు, topical index of Hymns and Children’s Songbook. లో చూడండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Did Jesus Really Live Again?పిల్లల పాటల పుస్తకము, 64.

మన బోధనను మెరుగుపరచుట

యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుట “ [మీ గృహములో], క్రీస్తు వంటి బోధకునిగా, బహుశా మీరు చేయగల అత్యంత ముఖ్యమైన విషయము … మీ పూర్ణ హృదయముతో సువార్తను జీవించుము. … పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కొరకు అర్హులగుటకు ఇది ముఖ్యమైన విధానము. మీరు పరిపూర్ణముగా ఉండనసరం లేదు, మీరు పడిపోయినప్పుడు రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా క్షమాపణను వెదకుతూ—శ్రద్ధగా ప్రయత్నించండి” (Teaching in the Savior’s Way, 13).

చిత్రం
సమాధి యొక్క విరిగిన రాతి తలుపు మీద క్రీస్తు నిలబడెను

యోంగ్సుంగ్ కిమ్ చేత, ఈ ఉద్దేశము కొరకు నేను వచ్చాను

ముద్రించు