2022 పాత నిబంధన
మార్చి 28–ఏప్రిల్ 3. నిర్గమకాండము 7–3: “మీరు దాస్యగృహమైన ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి”


“మార్చి 28–ఏప్రిల్ 3. నిర్గమకాండము 7–3: “మీరు దాస్యగృహమైన ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి”

“మార్చి 28–ఏప్రిల్ 3. మొరోనై 7–13,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

మోషే, అహరోను, మరియు ఫరో

ఫరో కోర్టులో మోషే మరియు అహరోను యొక్క దృష్టాంతము రాబర్ట్ టి. బారెట్

మార్చి 28–ఏప్రిల్ 3

నిర్గమకాండము 7–13

“మీరు దాస్యగృహమైన ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి”

నిర్గమకాండము 7–13 మీరు చదివినప్పుడు, మీకు కలిగిన భావనలను వ్రాయుము. దీనిని మీరు క్రమంగా చేసినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను గుర్తించుటకు మీ సామర్ధ్యము ఎదుగుతుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

వ్యాధి తరువాత వ్యాధి ఐగుప్తును బాధించింది, కానీ ఫరో ఇశ్రాయేలీయులను విడిపించుటకు ఇంకా తిరస్కరించాడు. అయినప్పటికినీ దేవుడు తన శక్తిని రుజువు చేయడం కొనసాగించి “నేను యెహోవానని” మరియు “సమస్త భూమిలో నావంటివారెవరును లేరని తెలిసికొనవలెనని” (నిర్గమకాండము 7:5; 9:14) అంగీకరించుటకు ఫరోకు అవకాశములు ఇచ్చుట కొనసాగించెను. మరోవైపు, మోషే మరియు ఇశ్రాయేలీయులు వారి తరఫున దేవుని శక్తి యొక్క ఈ ప్రత్యక్షతలను విస్మయముతో చూసారు. ఈ ఎడతెగని సూచనలు నిశ్చయముగా దేవునియందు వారి విశ్వాసమును నిర్ధారించాయి మరియు దేవుని యొక్క ప్రవక్తను అనుసరించుటకు వారి సమ్మతిని బలపరిచాయి. తరువాత, తొమ్మిది భయంకరమైన వ్యాధులు ఇశ్రాయేలీయులను విడిపించుటకు విఫలమయ్యాక, అది పదవ వ్యాధి—ఫరో యొక్క జ్యేష్ఠ పుత్రునిది కలిపి జ్యేష్ఠ పుత్రుని మరణము—చివరకు దాస్యమును ముగించింది. ఇది సరిపోయినట్లుగా కనబడుచున్నది ఎందుకనగా ప్రతీ ఆత్మీయ దాస్యము యొక్క సందర్భములో, అక్కడ తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గమున్నది. గతములో మనము ఏదీ ప్రయత్నించినప్పటికినీ, ఇశ్రాయేలీయులతో ఉన్నట్లే అది మనతో ఉన్నది. అది జ్యేష్ఠ పుత్రుడైన యేసు క్రీస్తు యొక్క త్యాగము మాత్రమే—మచ్చలేని గొఱ్ఱెపిల్ల రక్తము—మనల్ని రక్షించును.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

నిర్గమకాండము 7–11

నా హృదయమును మృదువుగా చేయుటకు నేను ఎంచుకోవచ్చు.

మీ సంకల్పము ఫరో వలే దేవుని చిత్తానికి ఎప్పటికి చాలా వ్యతిరేకం కాదని ఆశిద్దాము. ఇంకను, అవి ఉండాల్సినంత మృదువుగా లేని సమయాలు మనకుంటాయి, కనుక నిర్గమకాండము 7–10లో వ్రాయబడిన ఫరో చర్యల నుండి నేర్చుకోవాల్సినది ఏదైనా ఉన్నది. ఈ అధ్యాయాలలోని వ్యాధులను గూర్చి మీరు చదివినప్పుడు, ఫరో యొక్క స్పందనలను గూర్చి మీకు ముఖ్యమైనవి ఏవి? మీలో హృదయ కాఠిన్యత పట్ల ఇలాంటి ధోరణులను మీరు చూసారా? ఒక మృదువైన హృదయమును కలిగియుండుట అనగా అర్ధమేమిటో ఈ అధ్యాయముల నుండి మీరు ధ్యానించవచ్చు.

నిర్గమకాండము 7:3, 13; 9:12; 10:1, 20, 27; 11:10 యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదము ఫరో యొక్క హృదయమును కఠినపరచలేదని —ఫరో తన స్వంత హృదయాన్ని కఠినపరచుకున్నాడని స్పష్టపరుస్తుందని గమనించండి.

మృదువైన హృదయమును అభివృద్ధి చేయటం గురించి లేఖనాలను అనుసరించుట నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? 1 నీఫై 2:16; మోషైయ 3:19; ఆల్మా 24:7–8; 62:41; ఈథర్ 12:27.

Michael T. Ringwood, “An Easiness and Willingness to Believe,” Liahona, Nov. 2009, 100–102 కూడ చూడుము.

నిర్గమకాండము 12:1–42

పస్కాపండుగ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తానికి ప్రతీక.

నిర్గమకాండము 11:4–5లో వివరించబడిన, పదవ వ్యాధి నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గము, పస్కా అని పిలవబడే వైదిక క్రియ నిర్గమకాండము 12లో ప్రభువు మోషేకు ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించడం. ఐగుప్తులో దాస్యము నుండి ఇశ్రాయేలీయులను ప్రభువు విడిపించినట్లుగా, ఆయన మనల్ని కూడ పాపము యొక్క దాస్యము నుండి విడిపించగలడని పస్కా చిహ్నముల ద్వారా బోధించును. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమును గూర్చి మీకు గుర్తు చేసే పస్కా యొక్క సూచనలు మరియు చిహ్నములలో మీరు ఏమి కనుగొన్నారు? ఆయన ప్రాయశ్చిత్తము యొక్క దీవెనలను ఎలా పొందాలో ఈ చిహ్నములు మరియు సూచనలు మీకేమి సూచిస్తాయి? ఉదహరణకు, ద్వారబంధములపై గొఱ్ఱెపిల్ల రక్తమును ఉంచుట దేనిని సూచిస్తుంది? 7 వచనము “మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని” యుండుట అనగా మీకు ఏ అర్ధమును కలిగియున్నది? 11 వచనము

సిద్ధాంతము మరియు నిబంధనలు 89:21 కూడా చూడండి.

జనులు సంస్కారమును తీసుకొనుట

సంస్కారము మన విమోచకుడైన, యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుటకు మనకు సహాయపడును.

నిర్గమకాండము 12:14–17, 24–27; 13:1–16

యేసు క్రీస్తు ద్వారా నా విమోచనను జ్ఞాపకము చేసుకొనుటకుసంస్కారము నాకు సహాయపడుతుంది.

వారి దాస్యము పాత జ్ఞాపకమైనప్పటికినీ, ఆయన ఎల్లప్పుడు వారిని విడిపించాడని ఇశ్రాయేలీయులు జ్ఞాపకముంచుకోవాలని రక్షకుడు కోరాడు. అందువలనే ప్రతీ సంవత్సరం పస్కా విందును ఆచరించమని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 12:14–17, 24–27; 13:1–16 లో సూచనలు మీరు చదివినప్పుడు, మీకు దేవుని యొక్క దీవెనలను జ్ఞాపకముంచుకోవడానికి మీరు ఏమి చేస్తున్నారో ఆలోచించుము. ఆ జ్ఞాపకమును “మీ తరతరములకు” ఎలా మీరు భద్రపరచగలరు? (నిర్గమకాండము 12:14, 26–27 చూడుము).

పస్కా విందు మరియు సంస్కారము యొక్క ఉద్దేశ్యముల మధ్య మీరు చూసే పోలికలు ఏవి? పస్కాను గురించి చదువుట సంస్కారమును గూర్చి ఎలా జ్ఞాపకము చేస్తుంది మరియు ఆ విధికి ఎక్కువ అర్ధమును తెస్తుంది? యేసు క్రీస్తును “ఎల్లప్పుడు జ్ఞాపకము” ఉంచుకొనుటకు మీరు చేయగల దానిని ఆలోచించుము (మొరోనై 4:3; 5:2; లూకా 22:7–8, 19–20 కూడ చూడుము).

ప్రభువు మీరు జ్ఞాపకముంచుకోవాలని కోరిన ఇతర విషయాలను కూడ మీరు ధ్యానించవచ్చు, ఉదాహరణకు, హీలమన్ 5:6–12; మొరోనై 10:3; సిద్ధాంతములు మరియు నిబంధనలు 3:3–5, 10; 18:10; 52:40 చూడుము.

యోహాను 6:54 కూడ చూడుము; “Always Remember Him” (video), ChurchofJesusChrist.org; “The Sacrament of the Lord’s Supper,” in Teachings of Presidents of the Church: Howard W. Hunter (2015), 197–206.

family study icon

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

నిర్గమకాండము 7–12.బహుశా ఆయన శక్తి యొక్క సూచనలుగా ఐగుప్తీయులకు ప్రభువు పంపిన వ్యాధులను గూర్చి చదివిన తరువాత, నేడు ఆయన శక్తిని ప్రభువు రుజువు చేయు విధానాలను మీ కుటుంబము పంచుకోవచ్చు.

నిర్గమకాండము 8:2832; 9:27–28, 34–35.ఈ వచనాలు మన మాటను నిలబెట్టుకొనుట యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చర్చను ప్రారంభించుటకు ఉపయోగించబడవచ్చు. ఇతరులు చేస్తామని అంగీకరించిన దానిని చేయుట వారు చూసినప్పటి అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

నిర్గమకాండము 12:1–42నిర్గమకాండము 12:1–42 కలసి చదివిన తరువాత, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును జ్ఞాపకముంచుకొనుటకు మీరు చేయగల విషయాలను కాగితపు ముక్కలపై వ్రాయవచ్చు. ద్వారబంధపు కమ్ములపై ఉన్న గొఱ్రె పిల్ల రక్తము రక్షకుని సూచించును కనుక, ఈ కాగితాలను మీ గృహములో ద్వారము చుట్టూ ఉంచవచ్చు. పులియని రొట్టె (క్రాకర్స్ లేక పలుచని రొట్టె) లేక చేదు ఆకు కూరలు (కొత్తిమీర లేక గుర్రపు ముల్లంగి) వంటివి పస్కా నుండి కొన్ని ఆహారములను కూడా మీరు తినవచ్చు మరియు దేవుడు తన జనులను ఎలా విడిపించాడో జ్ఞాపకముంచుకొనుటకు మనకు ఎలా సహాయపడుతుందో చర్చించుము. ఉదాహరణకు, పులియని రొట్టె వారు దాస్యము నుండి పారిపోవుటకు ముందు వారి రొట్టె పొంగడానికి సమయము లేదని వారికి జ్ఞాపకము చేస్తుంది. చేదు ఆకుకూరలు దాస్యము యొక్క చేదును వారికి జ్ఞాపకము చేస్తుంది.

నిర్గమకాండము 12:14, 24–27.బహుశా మీ తరువాత సంస్కార సమావేశము ముందు ఒక కుటుంబముగా ఈ వచనాలు మీరు పునర్వీక్షించవచ్చు. ఈ వచనాలు సంస్కారమునకు ఎలా సంబంధము కలిగియున్నాయి? సంస్కారమును మన కోసం రక్షకుడు చేసిన దాని యొక్క “జ్ఞాపకార్ధముగా” మనము మరింత సంపూర్ణంగా ఎలా చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “In Memory of the Crucified,” Hymns, no. 190.

మన బోధనను మెరుగుపరచుట

పాఠముల వస్తువును పంచుకోండి. మీరు చదువుతున్న లేఖనాలలో సూత్రములను గ్రహించుటకు వారికి సహాయపడునట్లు వస్తువులను కనుగొనుటకు కుటుంబ సభ్యులను ఆహ్వానించుము. ఉదాహరణకు, మృదువైన హృదయము మరియు కఠినమైన హృదయమును కలిగియుండుట మధ్య తేడాను కుటుంబ సభ్యులు చర్చించుటకు మృదువైన, గట్టి వస్తువులు సహాయపడతాయి.

పస్కా భోజనముతో హెబ్రియ కుటుంబము

బ్రయాన్ కాల్ చేత పస్కా భోజనము యొక్క దృష్టాంతము