“మార్చి 21–27. నిర్గమకాండము 1–6: ‘నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన (2021)
“మార్చి 21–27. నిర్గమకాండము 1-6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
మార్చి 21–27
నిర్గమకాండము 1–6
“నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను”
ఒక ప్రార్ధనతో మీ అధ్యయనమును ప్రారంభించుము, మరియు నిర్గమకాండము 1–6 లో మీ జీవితానికి మరియు దేవుని యొక్క రాజ్యములో మీ సేవకు సంబంధించిన సందేశాలను కనుగొనడానికి సహాయము కొరకు అడుగుము.
మీ మనోభావాలను నమోదు చేయండి
ఐగుప్తులో నివసించడానికి ఆహ్వానము యాకోబు యొక్క కుటుంబాన్ని రక్షించింది. వందల సంవత్సరాల తరువాత, వారి వారసులు “యోసేపును ఎరుగని” క్రొత్త ఫరో చేత బానిసలుగా మరియు భయభ్రాంతులుగా చేయబడ్డారు (నిర్గమకాండము 1:8). దేవుడు తన నిబంధన జనులైన వారికి ఇది జరగడాన్ని ఎందుకు అనుమతించాడో ఆశ్చర్యపడుట ఇశ్రాయేలీయులకు సహజమైనది. ఆయన వారితో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకముంచుకొన్నాడా? వారు ఇంకా ఆయన జనులేనా? వారు ఎంత బాధపడుతున్నాడో ఆయన చూసాడా?
అదే ప్రశ్నలను మిమ్మల్ని మీరు అడిగినట్లుగా భావించినప్పుడు సమయాలుండవచ్చు. మీరు ఆశ్చర్యపడవచ్చు, నేను అనుభవిస్తున్నది దేవునికి తెలుసా? సహాయము కొరకు నా మనవులను ఆయన వింటున్నాడా? నిర్గమకాండములో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల విడుదల వృత్తాంతము అటువంటి ప్రశ్నలకు జవాబులనిచ్చును: దేవుడు తన జనులను మరచిపోలేదు. ఆయన మనతో తన నిబంధనలను జ్ఞాపకము చేసుకున్నాడు మరియు ఆయన తన స్వకాలములో, విధానములో వాటిని నెరవేరుస్తాడు (సిద్ధాంతములు మరియు నిబంధనలు 88:68 చూడండి). “నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించెదను” అని ఆయన ప్రకటించాడు. “[మీ] బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే” (నిర్గమకాండము 6:6–7).
నిర్గమకాండము యొక్క పుస్తకం అవలోకనము కొరకు, “నిర్గమకాండము, యొక్క గ్రంధము” in the Bible Dictionary.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
యేసు క్రీస్తు నా విమోచకుడు.
నిర్గమకాండము పుస్తకంలో ప్రధాన నేపథ్యములలో ఒకటి, దేవుడు తన ప్రజలను హింస నుండి స్వేచ్ఛగా చేయుటకు శక్తిని కలిగియున్నాడు. నిర్గమకాండము 1 లో వివరించబడినట్లుగా ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వము పాపము, మరణము వలన మనమందరం ఎదుర్కొనే బానిసత్వమునకు ఒక చిహ్నముగా చూడబడవచ్చు (2 నీఫై 2:26–27; 9:10; ఆల్మా 36:28 చూడండి). ఇశ్రాయేలీయుల విమోచకుడైన, మోషే, యేసు క్రీస్తు యొక్క ప్రతినిధిగా, లేక ఒక చిహ్నముగా చూడబడవచ్చు (ద్వితీయోపదేశకాండము 18:18–19; 1 నీఫై 22:20–21 చూడండి). ఈ పోలికలు మనస్సులో ఉంచుకొని నిర్గమకాండము 1–2 చదువుము. ఉదాహరణకు, మోషే మరియు యేసు చిన్నబిడ్డలుగా మరణము నుండి కాపాడబడ్డారు (నిర్గమకాండము 1:22–2:10; మత్తయి 2:13–16 చూడండి) మరియు ఇరువురు వారి పరిచర్య ప్రారంభించకముందు అరణ్యములో సమయాన్ని గడిపారని మీరు గమనించవచ్చు (నిర్గమకాండము 2:15–22; మత్తయి 4:1–2 చూడండి). ఆత్మీయ చెరను గూర్చి? రక్షకుని విమోచనను గూర్చి నిర్గమకాండము నుండి మీరు నేర్చుకొన్నఇతర అంతర్‌జ్ఞానములేవి?
See also D. Todd Christofferson, “Redemption,” Liahona, May 2013, 109–12.
ఆయన కార్యమును చేయడానికి ఆయన పిలిచిన వారికి దేవుడు శక్తిని ఇస్తాడు.
ఈరోజు మోషే ఒక గొప్ప ప్రవక్త మరియు నాయకునిగా మనము ఎరుగుదుము. కానీ ప్రభువు మొదట అతడిని పిలిచినప్పుడు మోషే తనను తాను ఆవిధంగా చూడలేదు. “నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడను? మోషే ఆశ్చర్యపడ్డాడు.” (నిర్గమకాండము 3:11). అయినప్పటికినీ, మోషే నిజముగా ఎవరు—అతడు ఎవరిలాగా మారగలడో ప్రభువు ఎరుగును. (నిర్గమకాండము 3–4 మీరు చదివినప్పుడు, ప్రభువు మోషేకు అభయమిచ్చి, అతడి సందేహాలకు జవాబిచ్చాడు. మీరు తగినట్లుగా భావించనప్పుడు మిమ్మల్ని ప్రేరేపించునట్లు ఈ అధ్యాయములనుండి మీరు కనుగొన్నది ఏమిటి? ఆయన చిత్తమును చేయడానికి తన సేవకులను హెచ్చించబడిన శక్తితో ప్రభువు ఎలా దీవిస్తాడు? (మోషే 1:1–10, 24–39; 6:31–39, 47 చూడండి). మీరు లేక ఇతరుల ద్వారా ఆయన కార్యమును దేవుడు చేయుట మీరు ఎప్పుడు చూసియున్నారు?
మోషే యొక్క జీవితము మరియ పరిచర్య గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి “మోషే” Bible Dictionary లేక Guide to the Scriptures చూడండి.
ప్రభువు యొక్క ఉద్దేశ్యములు ఆయన స్వంత కాలములో నెరవేర్చబడతాయి.
దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, మోషే ఫరో ముందుకు ధైర్యముగా వెళ్లి, ఇశ్రాయేలీయులను విడుదల చేయమని అతడితో చెప్పినప్పటికిని, ఫరో తిరస్కరించాడు. వాస్తవానికి, అతడు ఇశ్రాయేలీయుల జీవితాలను కష్టమైనవిగా చేసాడు. మోషే దేవుడు అతడికి చెప్పినట్లుగా చేసినప్పుడు కూడ విషయాలు ఎందుకు పనిచేయాలేదో మోషే మరియు ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపడియుండవచ్చు (నిర్గమకాండము 5:22–23 చూడండి).
మీరు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు కానీ మీరు ఊహించిన విజయాన్ని చూడలేదని ఎప్పుడైనా భావించారా? మోషే పట్టుదలగా ఉండుటకు సహాయపడుటకు ప్రభువు చెప్పిన దానిని వెదకుతూ, నిర్గమకాండము 6:1–8 పునర్వీక్షించుము. ఆయన చిత్తమును చేయుటలో మీరు పట్టుదలగా ఉండుటకు ప్రభువు మీకు ఎలా సహాయపడ్డాడు?
యెహోవా ఎవరు?
యెహోవా యేసు క్రీస్తు యొక్క పేర్లలో ఒకటి మరియు మర్త్యత్వమునకు ముందు రక్షకుని సూచించును. అబ్రహాము, ఇస్సాకు, మరియు యాకోబులు ప్రభువును ఈ పేరుతో ఎరుగుదురని జోసెఫ్ స్మిత్ అనువాదము స్పష్టపరచును (నిర్గమకాండము 6:3, footnote c). సాధారణంగా, పాత నిబంధనలో “ప్రభువు” అనే వాక్యము కనపడినప్పుడు, అది యెహోవాను సూచించును. నిర్గమకాండము 3:13–15 లో, “నేను” కూడ యెహోవాను సూచించును (సిద్ధాంతములు మరియు నిబంధనలు 38:1; 39:1 కూడ చూడండి).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
నిర్గమకాండము 1–2.ఇశ్రాయేలీయుల కోసం విమోచకుడిని పెంచే దేవుని ప్రణాళికలో చాలా మంది స్త్రీలు కీలక పాత్ర పోషించారు. ఒక కుటుంబముగా, మీరు షిప్రా, పూయా అను మంత్రసానుల గురించి (నిర్గమకాండము 1:15–20); మోషే యొక్క తల్లి, జోషెబెదు, మరియు అతడి అక్క మిర్యాము (నిర్గమకాండము 2:2–9; సంఖ్యాకాండము 26:59); ఫరో కుమార్తై (నిర్గమకాండము 2:5–6, 10); మరియు మోషే భార్య సిప్పోరా (నిర్గమకాండము 2:16–21) గురించి మీరు చదవవచ్చు. ఈ స్త్రీలు దేవుని యొక్క ప్రణాళికకు ఎలా సహాయపడ్డారు? వారి అనుభవాలు యేసు క్రీస్తు యొక్క మిషనును గూర్చి మనకు ఎలా జ్ఞాపకం చేస్తాయి? మీరు ఆడ బంధువులు మరియు పూర్వీకుల చిత్రములను కూడ సేకరించి వారి గురించి కధనాలను పంచుకోవచ్చు. నీతిగల స్త్రీల చేత మనము ఎలా దీవించబడ్డాము? అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సందేశము “A Plea to My Sisters” (Liahona, Nov. 2015, 95–98) మీ చర్చకు చేర్చవచ్చు.
-
నిర్గమకాండము 3:1–6.మోషే మండుచున్న పొదను సమీపించినప్పుడు, భక్తిగల గౌరవానికి సూచనగా అతడి చెప్పులను తీసివేయమని ప్రభువు అతడికి చెప్పాడు. పరిశుద్ధమైన స్థలములకు భక్తిగల గౌరవాన్ని మనము ఎలా చూపగలము? ఉదాహరణకు, ప్రభువు యొక్క ఆత్మ నివసించగల పరిశుద్ధ స్థలముగా మన గృహమును చేయడానికి మనము ఏమి చేయగలము? మిగిలిన పరిశుద్ధ స్థలములోమనము ఎక్కువ గౌరవమును ఎలా చూపగలము?
-
నిర్గమకాండము 4:1–9.ప్రభువు మోషేను పంపినట్లుగా ఇశ్రాయేలీయులకు చూపుటకు సూచనలుగా మూడు అద్భుతాలను చేయుటకు ఆయన మోషేకు అధికారమిచ్చాడు. యేసు క్రీస్తు గురించి ఈ సూచనలు మనకేమి బోధిస్తాయి?
-
నిర్గమకాండము 5:2.ప్రభువును “తెలుసుకొనుట” మనకు ఏ అర్ధాన్ని కలిగియున్నది? మనము ఆయనను ఎలా తెలుసుకోగలము? (ఉదాహరణకు, ఆల్మా 22:15–18 చూడండి). ఆయనతో మన అనుబంధము ఆయనకు విధేయులగుటకు మన కోరికను ఎలా ప్రభావితం చేస్తుంది? (యోహాను 17:3; మోషైయ 5:13 కూడ చూడండి).
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “Reverence Is Love,” Children’s Songbook, 31.