“మార్చి 14–20. ఆదికాండము 42-50: ‘మేలు చేత కీడును జయించుము’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“మార్చి 14–20. ఆదికాండము 42-50,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
మార్చి 14–20
ఆదికాండము 42–50
“అది మేలుకే దేవుడు ఉద్దేశించెను”
లేఖనాలను చదువుట ఆత్మను ఆహ్వానించును. మీరు చదివినప్పుడు, మీరు చదువుచున్న దానికి నేరుగా సంబంధము ఉన్నట్లు అనిపించకపోయినా ఆయన ప్రేరేపణలను వినుము.
మీ మనోభావాలను నమోదు చేయండి
యోసేపు తన అన్నల చేత ఐగుప్తులోనికి అమ్మివేయబడినప్పటినుండి 22 సంవత్సరాలు. అతడు తప్పుగా నిందించబడి మరియు చెరసాలలో పెట్టబడుట కలిపి, అనేక శ్రమలు అనుభవించాడు. చివరకు అతడు మరలా తన అన్నలను చూచినప్పుడు, ఫరోకు రెండవ స్థానములో, యోసేపు ఐగుప్తు అంతటకి గవర్నరు. అతడు వారిపై సులువుగా ప్రతీకారం తీర్చుకోవచ్చు, మరియు వారు యోసేపుకు చేసిన దానిని ఆలోచించుట, గ్రహింపశక్యమైనదిగా కనబడవచ్చు. అయినప్పటికినీ యోసేపు తన అన్నలను క్షమించాడు. అంతే కాకుండా తన బాధలో దైవిక ఉద్దేశమును చూచుటకు వారికి అతడు సహాయపడ్డాడు. “అది మేలుకే దేవుడు ఉద్దేశించెను” (ఆదికాండము 50:20), అని అతడు వారికి చెప్పాడు, ఎందుకనగా అది “తన తండ్రి కుటుంబపు వారినందరిని” (ఆదికాండము 47:12) కరువునుండి రక్షించే స్థానములో అతడిని ఉంచింది.
అనేక విధాలుగా, యోసేపు యొక్క జీవితం యేసు క్రీస్తుకు సమాంతరంగా ఉన్నది. మన పాపములు ఆయనకు గొప్ప బాధను కలిగించినప్పటికినీ, కరువు కంటే చాలా ఘోరమైన విధి నుండి మనందరినీ విడిపిస్తూ, రక్షకుడు క్షమాపణను ఇస్తున్నాడు. మనము క్షమాపణ పొందవలసిన లేక దానిని ఇవ్వాల్సి వచ్చినప్పటికినీ—ఏదో ఒక సమయంలో మనమందరం రెండింటినీ చేయాలి—యోసేపు యొక్క మాదిరి, స్వస్థత మరియు సమన్వయము యొక్క నిజమైన ఆధారమైన, రక్షకుని వైపు మనల్ని సూచించును.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
“కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపివేసెను.”
యోసేపు గురించి మీరు చదివినప్పుడు, అతడి కధనం మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తః మిషను మధ్య ఏవైనా పోలికలను మీరు గమనించారా? అతడి కుటుంబములో యోసేపు యొక్క పాత్ర దేవుని యొక్క కుటుంబములో రక్షకుని పాత్రకు పోలికగా ఎలా ఉన్నదో మీరు ధ్యానించవచ్చు. యోసేపు యొక్క అనుభవాలు మరియు “గొప్ప విడుదల చేత [మనల్ని] కాపాడుటకు” పంపబడిన, రక్షకుని మిషను మధ్య మీరు చూసే సమాంతరాలు ఏవి?(ఆదికాండము 45:7).
క్షమాపణ స్వస్థతను తెచ్చును.
వారు అతడికి చేసిన భయంకరమైన విషయాల కొరకు యోసేపు తన అన్నలను క్షమించుట గురించి చదవటం, మీరు ప్రస్తుతం క్షమించడానికి ప్రయాసపడుతున్న ఎవరైనా ఒకరి గురించి ఆలోచించుటకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. లేదా క్షమాపణ యొక్క కష్టమైన పరీక్ష మీ భవిష్యత్తులో ఉండవచ్చు. ఎలాగైనా, యోసేపు ఎందుకు క్షమించగలిగాడో ఆలోచించడానికి ఇది సహాయపడవచ్చు. ఆదికాండము 45; 50:15–21 లో యోసేపు యొక్క స్వభావము మరియు లక్షణము గురించి మీరు కనుగొన్నఆధారములేవి? అతడి అనుభవాలు ఎక్కువ క్షమించేవానిగా ఉండుటకు అతడిని ఎలా ప్రభావితం చేసియుండవచ్చు? రక్షకుని సహాయముతో ఎక్కువ క్షమించే వారిగా మీరు ఎలా మారగలరో యోసేపు యొక్క మాదిరి ఏమి సూచిస్తుంది?
అతడి క్షమాపణ వలన యోసేపు యొక్క కుటుంబానికి కలిగిన దీవెనలు కూడా గమనించుము. క్షమాపణ నుండి మీరు చూసిన దీవెనలు ఏమిటి? మీకు అన్యాయము చేసిన వారిని సమీపించుటకు మీరు ప్రేరేపించబడినట్లు భావిస్తున్నారా?
ఆదికాండము 33:1–4; సిద్ధాంతములు మరియు నిబంధనలు 64:9–11 కూడ చూడుము; Larry J. Echo Hawk, “Even as Christ Forgives You, So Also Do Ye,” Liahona, May 2018, 15–16.
యాకోబు యొక్క దీవెనలలో ప్రతీకవాదం అర్ధమేమిటి?
యాకోబు తన సంతతికి ఇచ్చిన దీవెనలు స్పష్టమైన చిత్రాలను కలిగియున్నవి, కానీ కొందరు పాఠకులు వాటిని గ్రహించడానికి కష్టమైనవిగా కూడ కనుగొంటారు. కృతజ్ఞతపూర్వకంగా, పునఃస్థాపించబడిన సువార్త మనకు కొంత అదనపు జ్ఞానము ఇస్తుంది. ఆదికాండము 49:22–26 లోని దీవెనలు మీరు చదివినప్పుడు, క్రింది వచనాలు కూడ చదవండి, మరియు అవి ఏ అంతర్‌జ్ఞానములను ఇస్తాయో చూడండి: 1 నీఫై 15:12; 2 నీఫై 3:4–5; జేకబ్ 2:25; సిద్ధాంతములు మరియు నిబంధనలు 50:44
ఆదికాండము 49:8–12 లో యూదా యొక్క దీవెన గురించి మీరు చదివినప్పుడు, దావీదు రాజు మరియు యేసు క్రీస్తు యూదా వంశస్తులని జ్ఞాపకముంచుకొనుము. ఈ వచనాలలో ఏ మాటలు మరియు వాక్యభాగాలు రక్షకుని మీకు జ్ఞాపకము చేస్తాయి? యూదా యొక్క దీవెనను మీరు చదివినప్పుడు, ప్రకటన 5:5–6, 9; 1 నీఫై 15:14–15; సిద్ధాంతములు మరియు నిబంధనలు 45:59; 133:46–50 కూడ చదవడం సహాయపడవచ్చు.
Guide to the Scriptures (scriptures.ChurchofJesusChrist.org) లోమీరు యాకోబు కుమారులు మరియు వారి నుండి వచ్చిన ఇశ్రాయేలీయుల గోత్రముల గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే, ప్రతి ఒక్కదానికి ప్రవేశం ఉన్నది.
ఆదికాండము 50:24–25; జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 50:24–38 (బైబిలు అనుబంధములో)
“నా దేవుడైన ప్రభువు ఒక దీర్ఘదర్శిని పైకిలేపును.”
యోసేపు యొక్క కలలు (ఆదికాండము 37:5–11 చూడండి) మరియు ఇతరుల కలలకు అతడు భావము చెప్పుట ద్వారా, భవిష్యత్తులో రోజులు లేక సంవత్సరాలలో జరిగే విషయాలను ప్రభువు బయల్పరిచాడు (ఆదికాండము 40–41 చూడండి). కానీ రాబోయే శతాబ్దాలలో జరగబోయే దానిని కూడ ప్రభువు యోసేపుకు బయల్పరిచాడు. ప్రత్యేకంగా, అతడు మోషే మరియు జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక మిషన్లు గురించి నేర్చుకున్నాడు. ఆదికాండము 50:24–25 మరియు జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 50:24–38 (బైబిలు అనుబంధములో), లోని యోసేపు మాటలను మీరు చదివినప్పుడు, ఈ విషయాలను తెలుసుకొనుట యోసేపును మరియు ఇశ్రాయేలీయులను ఎలా దీవించియుండవచ్చో మీకై మీరు ప్రశ్నించుకొనండి. జోసెఫ్ స్మిత్ ద్వారా ఈ ప్రవచనమును పునఃస్థాపించుట ప్రభువుకు ఎందుకు ముఖ్యమైనదో ఆలోచించుము? (2 నీఫై 3 కూడ చూడండి).
ఆదికాండము 50: 27–28, 30–33, జోసెఫ్ స్మిత్ అనువాదములోని ప్రవచనాలను జోసెఫ్ స్మిత్ ఎలా నెరవేర్చాడు? (సిద్ధాంతములు మరియు నిబంధనలు 1:17–23; 20:7–12; 39:11; 135:3 చూడండి).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
ఆదికాండము 42–46.యోసేపు తన సోదరులతో తిరిగి కలుసుకొన్న కధనాన్ని నటించుట మీ కుటుంబము ఆనందించవచ్చు. (“యోసేపు మరియు కరువు,” పాత నిబంధన కధనాలు సహాయపడవచ్చు.) దానితో సరదా కలిగియుండుము—మీకు ఇష్టమైతే దుస్తులు, ప్రాపులు ఉపయోగించుము. పాత్రల భావావేశాలు మరియు దృష్టికోణాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని కుటుంబ సభ్యులను ప్రోత్సహించుము. యోసేపు తన అన్నల పట్ల కలిగియున్న భావనలపై మరియు అతడు వారిని క్షమించినప్పుడు వారు ఎలా భావించియుంటారన్న దానిపై ప్రత్యేకంగా మీరు దృష్టిసారించవచ్చు. ఇది క్షమాపణ మీ కుటుంబాన్ని ఎలా దీవించగలదో ఒక చర్చకు నడిపించవచ్చు.
అనేక సంవత్సరాల తరువాత యోసేపు తన అన్నలను కలుసుకొన్నప్పుడు, అతడు చివరిసారిగా చూచినప్పటి నుండి వారు మార్పు చెందారని వారు ఎలా నిరూపించారు? వారి అనుభవాల నుండి పశ్చాత్తాపము గురించి మనము ఏమి నేర్చుకోగలము?
-
ఆదికాండము 45:3–11; 50:19–21.ఐగుప్తులో అతడి అనుభవము కష్టమైనది అయినప్పటికినీ, “అది మేలుకే దేవుడు ఉద్దేశించెను” (ఆదికాండము 50:20) అని యోసేపు గుర్తించాడు. దేవుడు ఆశీర్వాదంగా మార్చిన శ్రమలు ఏవైనా మీ కుటుంబము అనుభవించిందా?
శ్రమ కాలములందు దేవుని యొక్క మంచితనమును గూర్చి ఒక కీర్తన (“పునాది ఎంత బలమైనది” [కీర్తనలు, సం. 85] వంటిది) ఈ చర్చను మెరుగుపరచవచ్చు. కీర్తన బోధిస్తున్న దానికి యోసేపు యొక్క అనుభవాలనుండి ఏ వివరాలు ఉదాహరణగా ఉన్నాయి?
-
ఆదికాండము 49:9–11, 24–25.యేసు క్రీస్తు యొక్క పాత్రలు మరియు మిషను గురించి ఈ వచనాలలో మనము కనుగొన్నవి ఏవి మనకు బోధిస్తాయి? (ఈ వచనాలలో వాక్యభాగాలను గ్రహించుటకు సహాయపడుటకు, “వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు” లో ఆదికాండము 49 గురించి చూడండి.)
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “పునాది ఎంత బలమైనది,” కీర్తనలు, సం. 85.