ఫిబ్రవరి 28–మార్చి 6 ఆదికాండము 28–33: “నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“ఫిబ్రవరి 28–మార్చి 6 ఆదికాండము 28–33,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
ఫిబ్రవరి 28–మార్చి 6
ఆదికాండము 28–33
“నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు”
ఆదికాండము 28–33 మీరు చదివినప్పుడు, యాకోబు మరియు అతడి కుటుంబము యొక్క మాదిరులనుండి మీరు నేర్చుకున్న దానిని ధ్యానించుము. మీరు పొందే భావనలు ఏవైనా వ్రాయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
ఆదికాండము 28 అధ్యాయములు మరియు 32 ప్రవక్త యాకోబుకు కలిగిన ఆత్మీయ అనుభావాలలో రెండిటిని గూర్చి చెప్పును. రెండూ అరణ్యములో జరిగాయి కానీ చాలా భిన్న పరిస్థితులలో జరిగాయి. మొదటి అనుభవములో, యాకోబు ఒక భార్యను వెదకుటకు తన మాతృదేశానికి ప్రయాణిస్తున్నాడు, మార్గము వెంబడి రాళ్ల తలగడపై రాత్రిని గడిపాడు. అటువంటి నిర్జన ప్రదేశములో ప్రభువును కనుగొంటానని అతడు ఊహించయుండకపోవచ్చు, కానీ దేవుడు యాకోబుకు జీవితమును-మార్చే కలలో తనను తాను బయల్పరచుకున్నాడు, మరియు యాకోబు ఇలా ప్రకటించాడు, “నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు” (ఆదికాండము 28:16). సంవత్సరాల తరువాత, యాకోబు మరలా తాను అరణ్యములో ఉండుటను కనుగొన్నాడు. ఈసారి, అతడు కోపముతో ఉన్న తన సహోదరుడు, ఏశావుతో సాధ్యమైన మరణాంతకరమైన పునఃకలయకను ఎదుర్కొంటూ, కనానుకు తన మార్గముపై తిరిగి వెళ్లుతున్నాడు. కానీ అతడికి ఒక దీవెన అవసరమైనప్పుడు, తాను ప్రభువును, అరణ్యములో కూడ వెదకగలనని యాకోబు ఎరుగును ఆదికాండము 32
దేవుని నుండి ఒక దీవెనను వెదకుచూ మీ స్వంత అరణ్యములో మిమ్మల్ని మీరు కనుగొనవచ్చు. యాకోబుకు ఉన్నట్లుగా, మీ అరణ్యము ఒక కష్టమైన కుటుంబ అనుబంధము కావచ్చు. మీరు దేవునికు దూరముగా భావించవచ్చు లేక మీకు ఒక ఆశీర్వాదము అవసరము కావచ్చు. కొన్నిసార్లు ఆశీర్వాదము ఊహించనిరీతిలో రావచ్చు; మిగిలిన సమయాలలో అది ఒక పెనుగులాట తరువాత రావచ్చు. మీకు ఏది అవసరమైనప్పటికినీ, మీ అరణ్యములో కూడ “యెహోవా ఈ స్థలమందున్నాడు” అని మీరు కనుగొంటారు.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
దేవాలయములో అబ్రహాము యొక్క దీవెనలు నేను వాగ్దానము చేయబడ్డాను.
ఒక భార్యను కనుగొనడానికి హారానుకు తన మార్గములో, యాకోబు భూమి మీద నుండి పరలోకమునకు ఒక నిచ్చెన వేయబడుట , దానిపైగా దేవుడు నిలబడియుండుట అతడు కలగన్నాడు. కలలో, దేవుడు అబ్రహాము మరియు ఇస్సాకులతో చేసిన అవే నిబంధనలను యాకోబుతో క్రొత్తగా చేసాడు (ఆదికాండము 28:10–17 చూడుము; ఆదికాండము12:2–3; 26:1–4 కూడ చూడుము). అధ్యక్షులు మారియన్ జి. రామ్ని నిచ్చెన దేనిని సూచిస్తుందో ఈ ఆలోచనను పంచుకున్నారు: “బేతేలులో ప్రభువుతో యాకోబు చేసిన నిబంధనలు నిచ్చెన మెట్లు అని, ఆ వాగ్దానమివ్వబడిన దీవెనలు—పరలోకములో ప్రవేశించుటకు మరియు ప్రభువుతో అనుబంధమును హక్కుగా చేసే దీవెనలు పొందడానికి బదులుగా అతడు తానే ఎక్కాలని గ్రహించాడు. … యాకోబుకు బేతేలు ఉన్నట్లుగా దేవాలయములు మనందరికి ఉన్నాయి ” (“Temples—The Gates to Heaven,” Ensign, Mar. 1971, 16).
ఆదికాండము 28:10–22లో మిగిలిన ఏ మాటలు మరియు వాక్యభాగములు యాకోబు యొక్క అనుభవము మరియు దేవాలయ దీవెనల మధ్య సంబంధమును మీకు సూచిస్తాయి? మీరు ఈ వచనాలు చదివినప్పుడు, మీరు చేసిన నిబంధనలను గూర్చి ఆలోచించుము; మీకు కలిగే భావనలేవి?
ఆదికాండము 29:1–18ను మీరు చదివినప్పుడు, రాహేలుతో యాకోబు యొక్క వివాహము బేతేలులో యాకోబుతో దేవుడు క్రొత్తగా చేసిన నిబంధనకు ఎలా ముఖ్యమైనదో ధ్యానించుము (“house of God”; ఆదికాండము 28:10–19 చూడుము). ఆదికాండము 29–33 లో యాకోబు జీవితమును గూర్చి చదువుట మీరు కొనసాగించినప్పుడు ఆ అనుభవాన్ని మనస్సులో ఉంచుకొనుము. ప్రభువు యొక్క మందిరము మిమ్మల్ని దేవునికి దగ్గరగా ఏవిధంగా తెచ్చింది?
Yoon Hwan Choi, “Don’t Look Around, Look Up!” కూడ చూడుము. Liahona, May 2017, 90–92.
నా శ్రమలందు ప్రభువు నన్ను జ్ఞాపకముంచుకొనును.
రాహేలు మరియు లేయా మనకంటే భిన్నమైన సాంస్కృతి మరియు కాలములో జీవించినప్పటికినీ, వారికి కలిగిన భావనలలో కొన్నిటిని మనమందరం గ్రహించగలము. ఆదికాండము 29:31–35 and 30:1–24 మీరు చదివినప్పుడు, రాహేలు మరియు లేయాకు దేవుని యొక్క కృపను వర్ణించే మాటలు మరియు వాక్యభాగాల కొరకు వెదకుము. దేవుడు ఎలా “[మీ] శ్రమను చూచియున్నాడు” మరియు మిమ్మల్ని “జ్ఞాపకము చేసుకున్నాడో” (ఆదికాండము 29:32; 30:22) ధ్యానించుము.
దేవుడు మనల్ని ఆలకించినప్పటికిని, ఆయన జ్ఞానమందు మనము అడిగిన దానిని ఖచ్చితంగా మనకు ఎల్లప్పుడు ఇవ్వడని జ్ఞాపకముంచుకొనుట కూడ ముఖ్యమైనది. పరలోక తండ్రి మనకు జవాబిచ్చే వేర్వేరు విధానాలను గూర్చి నేర్చుకొనుటకు బ్రూక్ పి. హేల్స్ యొక్క సందేశమును చదవడానికి ఆలోచించుము “Answers to Prayer” (Liahona, May 2019, 11–14).
ఈ వృత్తాంతము యొక్క సాంస్కృతిక నేపథ్యము గురించి మరింతగా తెలుసుకోవడానికి పాత నిబంధన విద్యార్ధి చేతిపుస్తకము: ఆదికాండము–2 సమూయేలు (2003), 86–88 చూడుము.
మన కుటుంబాలలో అసమ్మతిని జయించుటకు రక్షకుడు మనకు సహాయపడగలడు.
యాకోబు కనానుకు తిరిగి వెళ్లినప్పుడు, ఏశావు తనను ఎలా స్వీకరిస్తాడోనని “మిక్కిలి భయపడి, తొందరపడెను” (ఆదికాండము 32:7). ఆదికాండము 32–33లో యాకోబు ఏశావును ఎదుర్కొనుటను మరియు దానికి నడిపించిన అతడి మనోభావనలను మీరు చదివినప్పుడు, మీ స్వంత కుటుంబ అనుబంధములను—బహుశా స్వస్థత అవసరమైన ఒకటి మీరు ధ్యానించవచ్చు. ఈ వృత్తాంతము వేరొకరిని సమీపించుటకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఇటువంటి ప్రశ్నలు మీ పఠనమును నడిపించుటకు సహాయపడవచ్చు:
-
ఏశావును కలుసుకోవడానికి యాకోబు ఎలా సిద్ధపడ్డాడు?
-
ఆదికాండము 32:9–12లో యాకోబు యొక్క ప్రార్ధన గురించి మీరు ప్రత్యేకంగా గుర్తించినదేమిటి?
-
ఏశావు యొక్క మాదిరి నుండి క్షమాపణ గురించి మీరేమి నేర్చుకున్నారు?
-
కుటుంబ అనుబంధాలను బాగు చేయడానికి రక్షకుడు మనకు ఎలా సహాయపడగలడు?
లూకా 15:11–32; Jeffrey R. Holland, “The Ministry of Reconciliation,” Liahona, Nov. 2018, 77–79 కూడ చూడుము.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
ఆదికాండము 28–33.ఈ అధ్యాయములనుండి సంఘటనలు గ్రహించుటకు పిల్లలకు సహాయపడుటకు పాత నిబంధన వృత్తాంతములులో “యాకోబు మరియు అతడి కుటుంబము” ఉపయోగించుము. కుటుంబ సభ్యులు ప్రతీ చిత్రము వద్ద ఆగి, బోధించబడిన దానిని గుర్తించుము, అవి వివాహము, నిబంధనలు, పని, మరియు క్షమాపణ యొక్క ప్రాముఖ్యత వంటివి.
-
ఆదికాండము 28:10–22.ఒక నిచ్చెన వలె మన నిబంధనలు ఎలా ఉన్నాయో మాట్లాడుటకు ఒక నిచ్చెన (లేక ఒక చిత్రము) మీరు ఉపయోగించవచ్చు. మనము చేసిన నిబంధనలు ఏవి, మరియు అవి మనల్ని దేవునికి దగ్గరగా ఎలా చేస్తాయి? ఆదికాండము 28:10–22లో వివరించబడిన యాకోబు కలను బొమ్మ వేయుటను కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు.
“Nearer, My God, to Thee” (Hymns, no. 100) కీర్తన యాకోబు యొక్క కల చేత ప్రేరేపించబడింది. మీ కుటుంబము ఈ పాట పాడవచ్చు మరియు ప్రతి పల్లవి ఏమి బోధిస్తుందో చర్చించవచ్చు.
-
ఆదికాండము 32:24–32.పెనుగులాటను ఇష్టపడే కుటుంబ సభ్యులను మీరు కలిగియుండవచ్చు. ప్రభువు నుండి దీవెనలు కోరుటను వర్ణించుటకు “పెనుగులాట” ఒక మంచి విధానముగా ఎందుకున్నది? “దేవుని యెదుట … పెనుగులాట” అనగా అర్ధమేమిటో ఈనస్ 1:1–5; ఆల్మా 8:9–10 ఏమి సూచిస్తాయి?
-
ఆదికాండము 33:1–12.అనేక సంవత్సరాల తరువాత కఠినమైన భావాలు కలిగిన యాకోబు మరియు ఏశావు తిరిగి కలుసుకున్నారు. యాకోబు మరియు ఏశావు ఈ రోజు మనతో మాట్లాడిన యెడల, మన కుటుంబాలలో వివాదము ఉన్నప్పుడు, మనకు సహాయపడుటకు వాళ్లు ఏమి చెప్పవచ్చు?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “Dearest Children, God Is Near You,” Hymns, no. 96.