2022 పాత నిబంధన
మార్చి 7–13. ఆదికాండము 37–41: “యెహోవా యోసేపునకు తోడైయుండెను”


“మార్చి 7–13. ఆదికాండము 37–41: “యెహోవా యోసేపునకు తోడైయుండెను”వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“మార్చి 7–13. ఆదికాండము 37–41,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చెరసాలలో ఐగుప్తుకు చెందిన యోసేపు

జెఫ్ వార్డ్ చేత చెరసాలలో ఐగుప్తుకు చెందిన యోసేపు యొక్క దృష్టాంతము

మార్చి 7–13.

ఆదికాండము 37–41

“యెహోవా యోసేపునకు తోడైయుండెను”

ఆదికాండము 37–41 మీరు చదివినప్పుడు, లేఖన భాగాలు మీ జీవితానికి ఎలా సంబంధిస్తాయో చూచుటకు పరిశుద్ధాత్మ మీకు సహాయపడునట్లు ప్రార్ధించుము. మీరు పొందిన అంతర్‌జ్ఞానములు ఏవైనా వ్రాసియుంచుము.

మీ మనోభావాలను నమోదు చేయండి

కొన్నిసార్లు మంచి జనులకు చెడు విషయాలు జరుగుతాయి. జీవితము ఆ పాఠమును స్పష్టంగా మనకు బోధిస్తుంది మరియు యాకోబు యొక్క కుమారుడైన యోసేపు జీవితము కూడ అలానే ఉన్నది. దేవుడు అతడి తండ్రులకు చేసిన నిబంధనకు అతడు వారసుడు, కానీ అతడు తన అన్నల చేత ద్వేషించబడి, బానిసత్వానికి అమ్మివేయబడ్డాడు. పోతీఫరు భార్య అతడికి దగ్గరగా వెళ్లినప్పుడు తన న్యాయబుద్ధిని రాజీపరచడానికి తిరస్కరించాడు, అందుచేత చెరసాలలోనికి త్రోయబడ్డాడు. అతడు ఎంత ఎక్కువ విశ్వాసంగా ఉంటే, అంత ఎక్కువ కష్టమును అతడు ఎదుర్కొన్నట్లుగా కనబడింది. కాని ఈ ప్రతీకూలత అంతా దేవుని యొక్క నిరాకరణకు సూచన కాదు. వాస్తవానికి, అన్నిటి గుండా, “యెహోవా యోసేపునకు తోడైయుండెను” (ఆదికాండము 39:3). యోసేపు యొక్క జీవితం ఈ ముఖ్యమైన సత్యము యొక్క ప్రత్యక్షతగా ఉన్నది: దేవుడు మనల్ని విడిచిపెట్టడు. “రక్షకుని అనుసరించుట మీ శ్రమలు అన్నిటిని తీసివేయదు,” అధ్యక్షలు డైటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్ బోధించారు. “అయినప్పటికినీ, అది మీకు, మీ పరలోక తండ్రి మీకు ఇవ్వాలని కోరుతున్న సహాయము మధ్య ఆటంకాలను తొలగిస్తుంది.” దేవుడు మీతో ఉన్నాడు” (“A Yearning for Home,” Liahona, Nov. 2017, 22).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆదికాండము 37:1–28; 39; 41:9–45

అతడి ప్రతికూలతలో “యెహోవా యోసేపునకు తోడైయుండెను.”

తరచుగా, అదృష్టము యోసేపును విడిచిపెట్టినట్లుగా కనబడింది, కానీ ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టలేదు. మీరు యోసేపు వృత్తాంతము చదివినప్పుడు, ఇటువంటి ప్రశ్నలను ధ్యానించుము: తన శ్రమ కాలములందు ప్రభువుకు దగ్గరగా ఉండటానికి యోసేపు ఏమి చేసాడు? ప్రభువు “అతనితో” ఎలా ఉన్నాడు?(ఆదికాండము 39:2–3, 21, 23).

మీ జీవితం గురించి మీరు అదే ప్రశ్నలు కూడ అడగవచ్చు. మీ శ్రమ కాలములందు ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టలేదని మీరు చూసిన నిదర్శనమేమిటి? కుటుంబ సభ్యులు మరియు భవిష్యత్ తరములతో మీ అనుభవాలను మీరు ఎలా పంచుకోగలరో ఆలోచించుము (1 నీఫై 5:14 చూడుము). భవిష్యత్తులో మీరు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు, విశ్వాసముగా నిలిచియుండుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి ఇప్పుడు మీరు చేయగలిగినది ఏమిటి?

యోహాను 14:18; రోమా 8:28; ఆల్మా 36:3; సిద్ధాంతములు మరియు నిబంధనలు 121:7–8 కూడ చూడండి; D. Todd Christofferson, “The Joy of the Saints,” Liahona, Nov. 2019, 15–18.

ఆదికాండము 37:5–11; 40; 41:1–38

నేను విశ్వాసంగా ఉన్న యెడల, ప్రభువు నన్ను నడిపించి, నన్ను ప్రేరేపిస్తాడు.

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు, “బయల్పాటులు ఉదాహరణకు, స్వప్నములు, దర్శనములు, పరలోక రాయబారులతో సంభాషణలు, మరియు ప్రేరేపణ కలిపి, రకరకాలుగా తెలియజేయబడతాయి,” (“The Spirit of Revelation,” Liahona, May 2011, 88). యోసేపు, ఫరో యొక్క భక్ష్యకారుడును, పానదాయకుడు మరియు ఫరోలకు సత్యములను బయల్పరచుటకు ప్రభువు కలలను ఉపయోగించాడు. ఈ కలలకు భావము ఎలా చెప్పాలో కూడ ప్రభువు యోసేపుకు బయల్పరిచాడు. ఆదికాండము 37:5–11; 40:5–8; 41:14–25, 37–38 నుండి ప్రభువు నుండి బయల్పాటును పొందుట మరియు గ్రహించుట గురించి మీరు నేర్చుకొన్నదేమిటి? ఉదాహరణకు, బయల్పాటు గ్రహించడానికి కష్టమైనదిగా కనబడినప్పుడు, యోసేపు మాదిరి నుండి మీరు ఏమి నేర్చుకోగలరు? (ఆదికాండము 40:8; 41:16 చూడండి).

చెరసాలలో యోసేపు కలలకు భావము చెప్పుట

ఫ్రాన్సిస్ జెరార్డ్ చేత భక్ష్యకారుడును, పానదాయకుని కలలకు యోసేపు భావము చెప్పుచున్నాడు

ప్రభువు తన చిత్తమును మీకు ఎలా బయల్పరుస్తున్నాడో ధ్యానించుము. ప్రభువు మీకిచ్చిన బయల్పాటును అమలు చేయడానికి మీరు ఏమి చేస్తున్నారు? మీరు ఆయన నుండి అదనపు నడిపింపును ఎలా వెదకుతున్నారు?

See also Russell M. Nelson, “Revelation for the Church, Revelation for Our Lives,” Liahona, May 2018, 93–96; Michelle Craig, “Spiritual Capacity,” Liahona, Nov. 2019, 19–21.

ఆదికాండము 38; 39:7–20

ప్రభువు యొక్క సహాయముతో, నేను శోధనను జయించగలను.

మీరు శోధించబడినప్పుడు, యోసేపు యొక్క మాదిరి మీకు ప్రోత్సాహమును మరియు బలమును ఇవ్వగలదు. ఆదికాండము 39లో అతడి అనుభవాన్ని మీరు చదివినప్పుడు, శోధనను ఎదిరించడానికి యోసేపు చేసిన విషయాలను గమనించండి. ఉదాహరణకు:

  • పోతీఫరు యొక్క భార్య లైంగిక ఆసక్తితో దగ్గర కావడాన్ని అతడు “తిరస్కరించాడు” (8 వచనము).

  • పాపము చేయుట దేవునికి, ఇతరులకు కోపం తెప్పిస్తుందని అతడు గుర్తించాడు (8–9 వచనాలు).

  • అది “దిన దినము” కొనసాగినప్పుడు కూడ అతడు “విన్నవాడుకాదు” (వచనము 10).

  • అతడు “తన వస్త్రమును విడిచి … తప్పించుకొని, బయటికి పారిపోయెను” (12 వచనము).

యోసేపు మాదిరిని మనస్సులో ఉంచుకొని, శోధనను తప్పించుకొనుటకు మరియు ఎదిరించుటకు ఒక ప్రణాళికను తయారు చేయుటకు ఆలోచించుము. ఉదాహరణకు, మీరు ఎదుర్కొనే శోధనను ఆలోచించి, తప్పించుకొనే పరిస్థతులను వ్రాసియుంచుము, మరియు శోధన కలిగినప్పుడు పరలోక తండ్రిపై ఆధారపడుటకు ఒక ప్రణాళికను చేయుము (2 నీపై 4:18, 27–33 చూడండి).

శోధన:

నివారించాల్సిన పరిస్థితులు:

ప్రతిస్పందించడానికి ప్రణాళిక చేయుము:

శోధనను ఎదుర్కొనప్పుడు యోసేపు యొక్క బలము యొక్క కధనం ముందు ఆదికాండము 38లో కనుగొనబడిన అతడి పెద్ద అన్నకు సంబంధించిన మరొక భిన్నమైన వృత్తాంతమున్నది. 37 అధ్యాయములు, 38, మరియు 39, మూడింటిని కలిసి ఆలోచించినప్పుడు, పవిత్రత గురించి మీకేమి బోధిస్తాయి?

1 కొరింథీయులకు 10:13; 1 నీఫై 15:23–24; 3 నీఫై 18:17–18 కూడ చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఆదికాండము 37యోసేపు అన్నలలో మీరు ఒకరైతే, అతడితో మీ అనుబంధమును బలపరచుట నుండి అసూయను ఆపడానికి మీరు ఏమి చేసియుండేవారు? ఒకరినొకరితో “క్షేమ సమాచారము అడుగుట” మనకు ఎలా సహాయపడియుండవచ్చు?(4 వచనము).

ఆదికాండము 39.“The Refiner’s Fire” మరియు “After the Storm” (ChurchofJesusChrist.org) వీడియోలు జనులు వారి శ్రమలందు ప్రభువు వైపు తిరుగుట ద్వారా బలమును కనుగొన్నవారి అనుభవాలకు సంబంధింపజేస్తాయి. వాటిలో ఒకటిని మీరు చూడవవచ్చు మరియు తన అనుభవాల గురించి అతడు ఒక వీడియో చేయాల్సి వచ్చిన యెడల యోసేపు ఏమి చెప్పియుండవచ్చో మాట్లాడుము. “I’m Trying to Be Like Jesus” (Children’s Songbook, 78–79) మీరు కలిసి పాడవచ్చు మరియు అతడు తన శ్రమలను ఎదుర్కొన్నప్పుడు యోసేపుతో పంచుకోగల సలహా కొరకు చూడుము.

ఆదికాండము 39:7–12.ఈ వచనాలు చదవటం మీ కుటుంబముతో పవిత్రత చట్టమును చర్చించుటకు ఒక అవకాశమును ఇవ్వగలదు. ఈ చర్చతో సహాయపడునట్లు కొన్ని వనరులు ఇక్కడున్నాయి: జేకబ్ 2:28; ఆల్మా 39:3–9; “Sexual Purity” (in For the Strength of Youth [2011], 35–37); “Sexual Intimacy Is Sacred and Beautiful” (in Help for Parents [2019], AddressingPornography.ChurchofJesusChrist.org).

ఆదికాండము 41:15–57.యోసేపు ద్వారా ఐగుప్తు యొక్క జనులను ప్రభువు ఎలా దీవించాడో ఈ వచనాలనుండి మనము ఏమి నేర్చుకున్నాము? భవిష్యత్త్ అత్యవసరాల కొరకు సిద్ధపడుటను గూర్చి మనము ఏమి నేర్చుకోగలము? ఒక కుటుంబముగా బాగా సిద్ధపడడానికి మీరు చేయగల దానిని చర్చించుము. సువార్త విషయాలను చూచుటకు, ఆలోచనల కొరకు “Emergency Preparedness,” topics.ChurchofJesusChrist.org చూడండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Jesus Is Our Loving Friend,” Children’s Songbook, 58.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

లేఖనాలను మీ జీవితానికి సరిపోల్చండి. మీరు చదివినప్పుడు, లేఖనాలలోని కథలు మరియు బోధనలు మీ జీవితానికి ఎలా అన్వయిస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, ప్రతికూలతను లక్ష్యపెట్టకుండా ప్రభువుకు విశ్వాసపాత్రంగా నిలిచియుండుటకు ఐగుప్తులోని యోసేపు యొక్క విశ్వసనీయత మిమ్మల్ని ఎలా ప్రేరేపించగలదు?

యోసేపు యొక్క అన్నలు అతడి నిలువుటంగీని తీసివేయుట

సామ్ లాలర్ చేత, యోసేపు యొక్క అన్నలు అతడి నిలువుటంగీని తీసివేయుట యొక్క దృష్టాంతము.