2022 పాత నిబంధన
జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఆలోచనలు: ఇశ్రాయేలు సంతతి


“జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఆలోచనలు: ఇశ్రాయేలు సంతతి,” వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఆలోచనలు: ఇశ్రాయేలు సంతతి,” వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
ఆలోచనల చిహ్నము

జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఆలోచనలు

ఇశ్రాయేలు సంతతి

తూర్పు కనాను అరణ్యములో, యాకోబు తన కవల సహోదరుడైన, ఏశావును ఎదుర్కొవడానికి భయంగా ఎదురుచూసాడు. యాకోబు ఏశావును చివరిసారిగా చూసింది, దాదాపు 20 సంవత్సరాల క్రితం, ఏశావు అతడిని చంపుతానని బెదరించాడు. దేవుని నుండి ఒక దీవెనను వెదకుతూ, యాకోబు అరణ్యములో పెనుగులాడుతూ రాత్రంతా గడిపాడు. యాకోబు యొక్క విశ్వాసము, పట్టుదల, మరియు తీర్మానము ఫలితంగా, దేవుడు అతడి ప్రార్ధనలకు జవాబిచ్చాడు. ఆ రాత్రి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది, ఆ పేరుకు అర్థము “అతడు దేవునితో పోరాడి గెలిచెను” (ఆదికాండము 32:28, footnote b; ఆదికాండము 32:24–32).1 కూడా చూడండి

చిత్రం
యబ్బోకు నది

యబ్బోకు నదికి దగ్గర, యాకోబు ఇశ్రాయేలు పేరును పొందాడు.

బైబిలులో ఇశ్రాయేలు పేరు కనబడుట ఇదే మొదటిసారి, మరియు గ్రంథము, చరిత్ర అంతటా స్థిరంగా ఉంచబడిన పేరు అది. త్వరలో ఆ పేరు ఒకరికంటే ఎక్కువమందికి సూచించబడింది. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు, మరియు వారి వంశస్థులు సమిష్టిగా “ఇశ్రాయేలు సంతతి,” “ఇశ్రాయేలు గోత్రములు,” “ఇశ్రాయేలు సంతానము,” లేక “ఇశ్రాయేలీయులు” అని పిలవబడ్డారు.

చరిత్ర అంతటా, ఇశ్రాయేలు సంతానము, వారు ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది గోత్రములలో ఒకరి నుండి రావటం చాలా ముఖ్యమైనదిగా భావించారు. వారి వంశము వారి నిబంధన గుర్తింపులో ముఖ్యమైన భాగము. అపొస్తులుడైన పౌలు తాను “బెన్యామీను గోత్రము” (రోమా 11:1) వాడనని ప్రకటించాడు. లీహై తన కుమారులను ఇత్తడి పలకలను తీసుకొని రావడానికి యెరూషలేముకు పంపినప్పుడు, దానికి ఒక కారణము ఆ పలకలు “అతడి పితరుల యొక్క వంశావళిని” కలిగియున్నవి (1 నీఫై 5:14; 1 నీఫై 3:3 కూడా చూడండి). లీహై తాను యోసేపు వంశస్తుడని, మరియు ఇశ్రాయేలు సంతానమునకు వారి సంబంధమును గూర్చి అతడి సంతానము యొక్క జ్ఞానము రాబోయే సంవత్సరాలలో వారికి ముఖ్యమైనదని రుజువైందని కనుగొన్నాడు (ఆల్మా 26:36; 3 నీఫై 20:25 చూడుము).

నేటి సంఘములో, మీరు ఇశ్రాయేలు గురించి “ఇశ్రాయేలును సేకరించుట” వంటి వ్యక్తీకరణలను వినవచ్చు. మనము “ఇశ్రాయేలు యొక్క విమోచకుడు,” “ఇశ్రాయేలు నిరీక్షణ” మరియు “ఇశ్రాయేలు యొక్క ఎల్డర్లు” గురించి మనము పాడతాము.2 ఈ సందర్భాలలో, మనము ప్రాచీన ఇశ్రాయేలు రాజ్యము లేక ఇజ్రాయేల్ అని పిలవబడిన ఆధునిక రాజ్యము గురించి మాత్రమే మాట్లడటం లేక పాడటం లేదు. బదులుగా, మనము యేసు క్రీస్తు యొక్క సంఘములోనికి ప్రపంచ రాజ్యముల నుండి సేకరించబడిన వారిని సూచిస్తున్నాము. దేవునితో పోరాడి గెలిచిన వారు, ఆయన దీవెనలను మనఃపూర్వకంగా వెదికేవారు, మరియు బాప్తీస్మము ద్వారా ఆయన నిబంధన జనులుగా మారిన జనులను మనము సూచిస్తున్నాము.

మీ గోత్రజనకుని దీవెన ఇశ్రాయేలు సంతానము యొక్క గోత్రములలో ఒక దానికి మీ సంబంధమును ప్రకటించును. అది కుటుంబ చరిత్రలో ఆసక్తికరమైన భాగముకంటె అధికమైనది. ఇశ్రాయేలు సంతానములో భాగముగా ఉండుట అనగా మీరు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో ఒక నిబంధన అనుబంధమును కలిగియుండుట అని అర్థము దాని అర్థము, మీరు, అబ్రహాము వలె దేవుని పిల్లలకు “దీవెనగా ఉండుట” (ఆదికాండము 12:2; అబ్రహాము 2:9–11) అని అర్థము. దాని అర్థము, పేతురు యొక్క మాటలలో, “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సోత్తయిన ప్రజలునై యున్నారు”(1 పేతురు 2:9). దాని అర్థము ఆయనతో మీ నిబంధనలను మీరు గౌరవించినప్పుడు, మీరు “దేవునితో పోరాడి గెలిచిన” ఒకరు.

వివరణలు

  1. ఇశ్రాయేలు పేరుకు “దేవుడు పరిపాలించును” లేక “దేవుడు పోరాడును లేక పోరాడి గెలుచును” కలిపి మిగిలిన సాధ్యమైన అర్థములున్నాయి.

  2. కీర్తనలు, సం. 6, 259, మరియు 319.

చిత్రం
యాకోబు యొక్క కుటుంబ వృక్షము

బ్రెంట్ అవెన్స్ చేత యాకోబు యొక్క కుటుంబ వృక్షము

ముద్రించు