2022 పాత నిబంధన
ఫిబ్రవరి 21–27. ఆదికాండము 24–27: నిబంధన నూతనపరచబడెను


“ఫిబ్రవరి 21–27. ఆదికాండము 24–27: నిబంధన నూతనపరచబడెను,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఫిబ్రవరి 21–27. ఆదికాండము 24–27,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
రిబ్కా

రిబ్కా యొక్క వివరణ, డిల్లీన్ మార్ష్ చేత

ఫిబ్రవరి 21–27

ఆదికాండము 24–27

నిబంధన నూతనపరచబడెను

మీరు ఆదికాండము 24–27 చదువుతున్నప్పుడు, మీరు పొందే ఆత్మీయ అంతరార్థములపట్ల శ్రద్ధ వహించండి. మీరు కనుగొనే సూత్రాలు మీ జీవితంతో ఏ విధమైన సంబంధం కలిగియున్నాయో తెలుసుకోవడానికి ప్రార్థించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

అబ్రాహాముతో దేవుని నిబంధన, అబ్రాహాము మరియు అతని సంతతి ద్వారా “భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును” (అబ్రాహాము 2:11) అనే వాగ్దానాన్ని కలిగియుంది. అది ఒక తరములో నెరవేర్చబడగల వాగ్దానము కాదు: అనేక విధాలుగా బైబిలు, దేవుని వాగ్దానము యొక్క నిరంతర నెరవేర్పు వృత్తాంతము. ఇస్సాకు మరియు రిబ్కా కుటుంబముతో ఆ నిబంధనను నూతనపరచుట ద్వారా ఆయన ప్రారంభించెను. వారి అనుభవాల ద్వారా, నిబంధనలో భాగమవ్వడం గురించి మనం కొంత నేర్చుకుంటాము. వారి మాదిరులు మనకు దయను, సహనమును, దేవుడు వాగ్దానం చేసిన దీవెనలలో నమ్మకాన్ని బోధిస్తాయి. మనకు, మన పిల్లలకు, రాబోయే తరాల కొరకు దేవుని దీవెనలను భద్రపరచుకోవడానికి లోకపు ”వంటకము” (ఆదికాండము 25:30) ఏదైనా ఇచ్చివేయడం తగినదేనని మనం నేర్చుకుంటాము.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆదికాండము 24

వివాహము దేవుని నిత్య ప్రణాళికకు ఆవశ్యకమైనది.

నేడు అనేకమంది వివాహానికి అతి తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు లేక దానిని ఒక భారంగా భావిస్తున్నారు. అబ్రాహాము భిన్నమైన అభిప్రాయం కలిగియున్నాడు—అతనికి తన కొడుకు ఇస్సాకు వివాహం అత్యంత ముఖ్యమైనది. అది అతనికి ఎందుకంత ముఖ్యమని మీరనుకుంటున్నారు? మీరు ఆదికాండము 24 చదువుతున్నప్పుడు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో వివాహం యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచించండి. మీరు ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ సందేశాన్ని కూడా చదువవచ్చు “ఎందుకు వివాహం, ఎందుకు కుటుంబం” (లియహోనా, మే 2015, 50–53) మరియు “స్త్రీ పురుషుల వివాహంపై నిర్మించబడిన కుటుంబము దేవుని ప్రణాళిక వర్థిల్లడానికి ఉత్తమ వాతావరణాన్ని ఎందుకు కల్పిస్తుందో” (52వ పేజీ) ఆలోచించండి.

ఈ అధ్యాయములో ఇతర ముఖ్య సూత్రాలను పరిగణించడానికి క్రింది ప్రశ్నల వంటివి మీకు సహాయపడవచ్చు:

ఆదికాండము 24:1–14. ఇస్సాకు కొరకు భార్యను కనుగొనడానికి వారి ప్రయత్నాల్లో ప్రభువును చేర్చడానికి అబ్రాహాము మరియు అతని సేవకుడు ఏమి చేసారు?

ఆదికాండము 24:15–28, 55–60. మీరు అవలంబించాలనుకొనేలా ఏ లక్షణాలను రిబ్కాలో మీరు కనుగొంటారు?

ఏ ఇతర అంతరార్థములను మీరు కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4; “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org కూడా చూడండి.

ఆదికాండము 25:29–34

తక్షణ సంతృప్తినిచ్చేవి మరియు గొప్ప విలువైన విషయాల మధ్య నేను ఎంచుకోగలను.

అబ్రాహాము సంప్రదాయములో, ఒక కుటుంబంలో సాధారణంగా పెద్ద కొడుకు నాయకత్వ స్థానాన్ని, విశేషాధికారాన్ని పొందుతాడు, అది జ్యేష్టత్వము అని పిలువబడుతుంది. మిగతా కుటుంబము కొరకు శ్రద్ధచూపే గొప్ప బాధ్యతలతోపాటు ఈ కొడుకు తన తల్లిదండ్రుల నుండి గొప్ప స్వాస్థ్యము పొందాడు.

మీరు ఆదికాండము 25:29–34 చదువుతున్నప్పుడు, ఒక భోజనమునకు బదులుగా ఏశావు తన జ్యేష్టత్వమును వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడియుండవచ్చో ఆలోచించండి. ఈ వృత్తాంతంలో మీ కోసం మీరు ఏ పాఠాలు కనుగొన్నారు? ఉదాహరణకు, మీకు అత్యంత విలువైన దీవెనల నుండి మిమ్మల్ని దారిమళ్ళిస్తున్న “వంటకం“ ఏదైనా ఉందా? ఈ దీవెనలపై కేంద్రీకరించి, వాటిని అభినందించడానికి మీరేమి చేస్తున్నారు?

మత్తయి 6:19–33; 2 నీఫై 9:51 చూడండి.

ఆదికాండము 26:1–5

అబ్రాహాము నిబంధన ఇస్సాకు ద్వారా నూతనపరచబడింది.

దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన అనేక తరమునకు కొనసాగాలని ఉద్దేశించబడింది, కాబట్టి నిబంధనను పాటించే అబ్రాహాము మరియు శారాల వారసత్వం ఇస్సాకు, యాకోబు మరియు వారి సంతతిలో విశ్వాసులైన ఇతర స్త్రీ పురుషులకు అందించవలసిన అవసరముంది. మీరు ఆదికాండము 26:1–5 చదువుతున్నప్పుడు, దేవుడు చెప్పిన నిబంధన యొక్క దీవెనలలో కొన్నింటి కొరకు చూడండి. ఈ వచనాల నుండి దేవుని గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఆదికాండము 26:18–25, 32–33

యేసు క్రీస్తు జీవజలము యొక్క ఊట.

అనేక పాత నిబంధన కథలలో బావులు, ఊటలు మరియు ఇతర నీటి వనరులు ముఖ్యపాత్రలు పోషిస్తాయని మీరు గమనించవచ్చు. ఇది ఆశ్చర్యకరము కాదు, ఎందుకంటే ఈ కథలలో అధికము చాలా పొడి ప్రాంతాలలో జరిగాయి. మీరు ఆదికాండము 26లో ఇస్సాకు బావుల గురించి చదువుతున్నప్పుడు, లేఖనములలో నీరు దేనిని సూచిస్తున్నదో ధ్యానించండి. “జీవజలము” యొక్క ఆత్మీయ బావుల గురించి మీరు ఏ అంతరార్థములను కనుగొంటారు? (యోహాను 4:10–15 చూడండి). మీ జీవితంలో మీరు ఆత్మీయ బావులను ఎలా త్రవ్వుతున్నారు? మీ కొరకు రక్షకుడు ఏవిధంగా జీవజలముగా ఉన్నారు? ఫిలిష్తీయులు బావులను “పూడ్చివేసిరని” గమనించండి (ఆదికాండము 26:18). మీ జీవితంలో జీవజలము యొక్క మీ బావులను ఏదైనా పూడ్చివేస్తున్నదా?

చిత్రం
ప్రాచీన బావి

అబ్రాహాము మరియు ఇస్సాకు బావులు త్రవ్విన ప్రాచీన బెయేర్షెబాలో ఒక బావి.

ఆదికాండము 27

ఇస్సాకును మోసం చేయడానికి రిబ్కా మరియు యాకోబు తప్పు చేసారా?

యాకోబు కొరకు ఒక దీవెనను పొందడానికి రిబ్కా మరియు యాకోబు ఉపయోగించిన మార్గము వెనుక కారణాలు మనకు తెలియవు. ప్రస్తుతం మనము కలిగియున్న పాత నిబంధన అసంపూర్ణంగా ఉందని జ్ఞాపకముంచుకోవడం సహాయపడుతుంది (మోషే 1:23, 41). మనల్ని కలవరపెడుతున్న దానిని వివరించే సమాచారము అసలైన గ్రంథాలనుండి కోల్పోబడియుండవచ్చు. అయినప్పటికీ, ఇస్సాకు నుండి యాకోబు ఒక దీవెన పొందడమనేది దేవుని చిత్తమేమో మనమెరుగము, ఎందుకంటే యాకోబు ఏశావును ఏలునని రిబ్కా బయల్పాటు పొందింది (ఆదికాండము 25:23 చూడండి). ఏశావుకు బదులుగా యాకోబును దీవించానని ఇస్సాకు చెప్పిన తర్వాత, దేవుని చిత్తము నెరవేర్చబడిందని సూచిస్తూ— అతడు యాకోబు “దీవింపబడినవాడే” (ఆదికాండము 27:33) అని ధృవీకరించాడు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఆదికాండము 24:2–4, 32–48.ఇస్సాకు కొరకు భార్యను వెదకమని నమ్మకమైన ఒక సేవకుడిని అబ్రాహాము అడిగాడు మరియు తాను వెదికెదనని సేవకుడు అబ్రాహాముతో నిబంధన చేసాడు. తన నిబంధనను పాటించడంలో అబ్రాహాము సేవకుడు విశ్వసనీయతను ఎలా చూపాడు? అతని మాదిరిని మనమెలా అనుసరించగలము?

ఆదికాండము 24:15–28, 55–60.ఇస్సాకు కొరకు రిబ్కాను యోగ్యతగల నిత్య సహవాసిగా చేసిన సుగుణాల కొరకు మీ కుటుంబము ఈ వచనాలలో చూడవచ్చు. ఈ సుగుణాలలో నుండి వారు వృద్ధిచేసుకోవాలనుకొనే ఒకదానిని ఎంచుకోమని కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి.

ఆదికాండము 25:19–34; 27.ఏశావు జ్యేష్టత్వము మరియు దీవెన అతనికి బదులుగా యాకోబుకు ఎలా వచ్చిందనే కథలను పునర్వీక్షించడానికి, విడిగా కాగితపు ముక్కలపై “యాకోబు మరియు ఏశావు” (పాత నిబంధన కథలు లో) నుండి వాక్యాలను మీరు వ్రాయవచ్చు. ఆ వాక్యాలను మీ కుటుంబ సభ్యులంతా కలిసి సరైన క్రమములో అమర్చవచ్చు.

ఏశావు తన జ్యేష్టత్వమును అమ్మివేయడం గురించి మీరు చదువుతున్నప్పుడు, మీ కుటుంబానికి అత్యంత ముఖ్యమైనవి, అనగా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీ సంబంధాలు వంటివాటి గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. నిత్య విలువైనవిగా వారు పరిగణించే వాటిని సూచించే వస్తువులు లేక చిత్రాలను బహుశా కుటుంబ సభ్యులు కనుగొనవచ్చు. వారు ఆ వస్తువులను ఎందుకు ఎంచుకున్నారో వారిని వివరించనివ్వండి.

ఆదికాండము 26:3–5.అబ్రాహాము నిబంధనను గ్రహించడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, ఈ వచనాలలో వివరించబడిన వాగ్దానాలను కనుగొనమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. నేడు ఈ వాగ్దానాల గురించి తెలుసుకోవడం మనకు ఎందుకు ముఖ్యము? (ఈ వనరులో “జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: నిబంధన,” చూడండి).

ఆదికాండము 26:18–25, 32–33.బావులు ఎందుకు ముఖ్యమైనవి? యేసు క్రీస్తు ఏవిధంగా నీళ్ళ బావివలె ఉన్నారు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

ఒక లేఖనమును కంఠస్థం చేయండి. ఎల్డర్ రిచర్డ్ జి. స్కాట్ ఇలా బోధించారు, “కంఠస్థం చేసిన లేఖనం శాశ్వత మిత్రునిగా మారుతుంది, అది కాలక్రమేణా బలహీనపడదు” (“లేఖనం యొక్క శక్తి,” లియహోనా, నవ. 2011, 6).

చిత్రం
ఏశావు మరియు యాకోబు

Esau Sells His Birthright to Jacob (ఏశావు తన జ్యేష్ఠత్వమును యాకోబుకు అమ్మివేయును), గ్లెన్ ఎస్. హాప్కిన్‌సన్ చేత

ముద్రించు