2022 పాత నిబంధన
జనవరి 31–ఫిబ్రవరి 6. ఆదికాండము 6–11; మోషే 8: ”నోవహు యెహోవా దృష్టియందు కృప పొందెను”


“జనవరి 31–ఫిబ్రవరి 6. ఆదికాండము 6–11; మోషే 8: ’నోవహు యెహోవా దృష్టియందు కృప పొందెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జనవరి 31–ఫిబ్రవరి 6. ఆదికాండము 6–11; మోషే 8,“ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
నోవహు, అతని కుటుంబము, జంతువులు, ఓడ, మరియు ఇంద్రధనుస్సు

నోవహు ఓడను విడిచిపెట్టుట యొక్క వివరణ, శామ్ లాలర్ చేత

జనవరి 31–ఫిబ్రవరి 6

ఆదికాండము 6–11; మోషే 8

”నోవహు యెహోవా దృష్టియందు కృప పొందెను”

లేఖనములలోని వృత్తాంతాలు తరచు మనకు అనేక ఆత్మీయ పాఠాలను బోధిస్తాయి. గొప్ప వరద మరియు బాబేలు గోపురము గురించి మీరు చదువుతున్నప్పుడు, ఈ వృత్తాంతాలు మీకెలా అన్వయిస్తాయనే దాని గురించి ప్రేరేపణను వెదకండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

నోవహు మరియు వరదల వృత్తాంతము చేత బైబిలు పాఠకుల యొక్క తరతరాలు ప్రేరేపించబడ్డాయి. కానీ కడవరి దినములలో జీవించే మనము దానిపట్ల శ్రద్ధ వహించడానికి ప్రత్యేక కారణముంది. ఆయన రెండవ రాకడ కొరకు మనమెలా కనిపెట్టుకొని ఉండాలని యేసు క్రీస్తు బోధించినప్పుడు, ఆయన ఇలా అన్నారు, “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును ఆలాగే ఉండును” (జోసెఫ్ స్మిత్—మత్తయి 1:41). అదనముగా, నోవహు కాలమును వివరించే “చెడిపోయియుండెను“ మరియు “బలాత్కారముతో నిండియుండెను” వంటి వాక్యభాగాలు సులువుగా మనకాలాన్ని వర్ణిస్తున్నాయి (ఆదికాండము 6:12–13; మోషే 8:28). దేవుని పిల్లల మధ్య గందరగోళము మరియు విభజనల చేత కలిగిన గర్వమును వర్ణిస్తున్న బాబేలు గోపురము యొక్క వృత్తాంతము కూడా మనకాలానికి అన్వయించదగినది.

చరిత్ర అంతటా దుష్టత్వము దానికదే పునరావృతమవుతుందని చూపుట వలన మాత్రమే ఈ ప్రాచీన వృత్తాంతాలు విలువైనవి కాదు. అంతకంటే ముఖ్యంగా, దానిని ఎలా ఎదుర్కోవాలో అవి మనకు బోధిస్తాయి. అతని చుట్టూ దుష్టత్వమున్నప్పటికీ, నోవహు “యెహోవా దృష్టియందు కృప పొందెను.” (మోషే 8:27) జెరెడ్ మరియు అతని సహోదరుని కుటుంబాలు ప్రభువు తట్టు తిరిగి, బాబేలులోని దుష్టత్వము నుండి దూరంగా నడిపించబడ్డాయి (ఈథర్ 1:33–43 చూడండి). చెడిపోయి, బలాత్కారముతో నిండియున్న మనకాలంలో మనల్ని, మన కుటుంబాలను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలని మనము ఆశ్చర్యపడినట్లయితే, ఈ అధ్యాయాలలో ఉన్న సుపరిచిత కథలు మనకు బోధించడానికి ఎంతో కలిగియున్నాయి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆదికాండము 6; మోషే 8

ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించడంలో ఆత్మీయ రక్షణ ఉంది.

పునఃస్థాపించబడిన సువార్త కొరకు కృతజ్ఞతలు, పాత నిబంధనలో కనుగొనబడే దానికంటే ఎక్కువగా నోవహు గురించి మనకు తెలుసు. మోషే 8 లో కనుగొనబడు ఆదికాండము 6 యొక్క జోసెఫ్ స్మిత్ ప్రేరేపిత అనువాదము నోవహును దేవుని యొక్క గొప్ప ప్రవక్తలలో ఒకరిగా బయల్పరుస్తుంది. యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అతడు నియమించబడి, పంపబడ్డాడు, అతడు దేవునితో నడిచాడు, మాట్లాడాడు మరియు వరద తర్వాత భూమిపై దేవుని పిల్లలను పునఃస్థాపించడానికి అతడు ఎన్నుకోబడ్డాడు. నోవహు అనుభవముల నుండి ప్రవక్తల గురించి మీరేమి నేర్చుకుంటారు?

నోవహు కాలము గురించి మీరు చదువుతున్నప్పుడు, మనకాలానికి పోలికలను మీరు గమనించవచ్చు. ఉదాహరణకు:

నేటి ప్రపంచంలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచగల యేసు క్రీస్తు సువార్త గురించి నేడు ప్రవక్తలు ఏమి బోధిస్తున్నారు? నోవహు అనుభవాలను మీరు చదువుతున్నప్పుడు, నేడు ప్రభువు యొక్క ప్రవక్తలను అనుసరించడానికి ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది?

మోషైయ 13:33; సిద్ధాంతము మరియు నిబంధనలు 21:4–7 కూడా చూడండి.

ఆదికాండము 9:8–17.

ఆనవాళ్ళు లేక చిహ్నములు ప్రభువుతో మన నిబంధనలను జ్ఞాపకముంచుకోవడానికి మనకు సహాయపడతాయి.

సువార్త నిబంధనలు ఒక గురుతు, చిహ్నము లేక “ఆనవాలు” (ఆదికాండము 9:12) చేత సూచించబడగలవు. ఉదాహరణకు, సంస్కారపు రొట్టె మరియు నీరు లేక బాప్తీస్మపు జలములు మీ నిబంధనలకు సంబంధించిన పరిశుద్ధ సత్యాలను ఏవిధంగా గుర్తుచేస్తాయో ఆలోచించండి. ఆదికాండము 9:8–17 ప్రకారము, ఇంద్రధనుస్సు మీకు దేనిని గుర్తుచేస్తుంది? ఆయనను మరియు మీరు చేసిన నిబంధనలను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొమ్మని ప్రభువు మిమ్మల్ని ఎందుకు కోరుతున్నారు?

గెరిట్ డబ్ల్యు. గాంగ్, “ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకముంచుకొనుము,” లియహోనా, మే 2016, 108–11 కూడా చూడండి.

ఆదికాండము 11:1–9

పరలోకమును చేరుటకు గల ఏకైక మార్గము యేసు క్రీస్తును అనుసరించుట.

ప్రాచీన బాబేలు లేక బబులోను చాలాకాలంగా దుష్టత్వము మరియు ప్రాపంచిక దృక్పథం కొరకు చిహ్నముగా ఉపయోగించబడుతున్నది (ప్రకటన 18:1–10; సిద్ధాంతము మరియు నిబంధనలు 133:14 చూడండి). మీరు ఆదికాండము 11:1–9 చదువుతున్నప్పుడు, ప్రవక్త మోర్మన్ చేత అందించబడిన అంతరార్థములను ధ్యానించండి, “వారు పరలోకమునకు వెళ్ళగలుగునట్లు తగినంత ఎత్తుగా ఒక గోపురము కట్టుటకు జనుల హృదయాలలోనికి దానిని పెట్టినది” సాతానుయని అతడు వ్రాసాడు (హీలమన్ 6:28; 26–27 వచనాలు కూడా చూడండి). బాబేలు గోపురము యొక్క వృత్తాంతము మీ కొరకు కలిగియున్న హెచ్చరికలేవి?

కీర్తనలు 127:1 కూడా చూడండి.

చిత్రం
బాబేలు గోపురము

బాబేలు గోపురము యొక్క వివరణ, డేవిడ్ గ్రీన్ చేత

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఆదికాండము 6–8.ప్రవక్తను అనుసరించుట ఆత్మీయంగా మనల్ని సురక్షితంగా ఎలా ఉంచగలదో మీ కుటుంబానికి బోధించడానికి మీరు నోవహు ఓడ యొక్క కథను ఎలా ఉపయోగించగలరు? (పాత నిబంధన కథలు లో “నోవహు మరియు అతని కుటుంబము,” చూడండి ). కాగితంతో లేక బ్లాకులతో ఒక సాధారణ బొమ్మ పడవ చేయడానికి మీ కుటుంబం కలిసి పనిచేయవచ్చు. మీరు ఆదికాండము 6–7 చదువుతున్నప్పుడు, పడవ అందించే రక్షణను ప్రవక్తను అనుసరించడంలో మనం కనుగొనే రక్షణతో మీరు పోల్చవచ్చు. ఇటీవల ప్రవక్త ఇచ్చిన సందేశాన్ని చర్చించి, ఆయన సలహాను మీ పడవపై వ్రాయాలని మీరు కోరవచ్చు.

ఇంకా నోవహు కుటుంబాన్ని రక్షించిన ఓడతో పోల్చగల వేటిని దేవుడు మనకిచ్చాడు? ఎన్నో జవాబులు ఉన్నప్పటికీ, ఈ వనరులు కొన్ని జవాబులను సూచిస్తాయి: 2 నీఫై 9:7–13; సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5–6; మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సందేశము “మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట” (లియహోనా, నవ. 2018, 113–14).

మోషే 8:17.ప్రభువు యొక్క ఆత్మ మనతో “ప్రయాసపడుటకు” అనగా అర్థమేమిటి? (1 నీఫై 7:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 1:33 చూడండి). ఆత్మ మనతో ప్రయాసపడుటను మనమెప్పుడు అనుభవించాము?

ఆదికాండము 9:8–17.ఇంద్రధనుస్సు ఏమి సూచిస్తున్నదని మీరు మాట్లాడుతుండగా, చిన్నపిల్లలు దానిని చిత్రించడాన్ని లేక రంగులు వేయడాన్ని ఆనందించవచ్చు. మన నిబంధనలు గుర్తుంచుకోవడానికి మనకు సహాయపడే విషయాలను కూడా మీరు చర్చించవచ్చు, సంస్కారము వంటివి, యేసు క్రీస్తును అనుసరించాలనే మన బాప్తీస్మపు నిబంధనను గుర్తుచేసుకోవడానికి అది మనకు సహాయపడుతుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75–79 చూడండి).

ఆదికాండము 11:1–9.మీ కుటుంబము ఆదికాండము 1 చదువుతూ బాబేలు గోపురం గురించి నేర్చుకుంటున్నప్పుడు, ఈథర్ 1:33–43 చదవడం సహాయకరంగా ఉండవచ్చు. లోకంలో దుష్టత్వమున్నప్పటికీ మన కుటుంబం ఆత్మీయ రక్షణను కనుగొనేలా సహాయపడగల దేనిని మనం జెరెడ్ మరియు అతని సహోదరుని కుటుంబాల నుండి నేర్చుకుంటాము? వారు కూడా ఇటువంటి సవాలును ఎదుర్కొన్నందున, నోవహు మరియు అతని కుటుంబము నుండి మనము ఏ అదనపు పాఠాలను నేర్చుకుంటాము? (మోషే 8:13, 16–30 చూడండి).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీ అంతరార్థములను పంచుకోండి. మీరు లేఖనముల నుండి నేర్చుకొనిన దానిని పంచుకున్నప్పుడు, మీరు ఇతరులను దీవించడమే కాకుండా మీ గ్రహింపును కూడా అధికం చేసుకుంటారు. మీ కుటుంబము, స్నేహితులు లేక వార్డు సభ్యులతో లేఖనముల నుండి దేనిని పంచుకోవడానికి ప్రేరేపించబడినట్లు మీరు భావించారు?

చిత్రం
నోవహు ఓడ

నోవహు ఓడ యొక్క వర్ణన, ఆడమ్ లింట్ డే చేత

ముద్రించు