“జనవరి 24–30. మోషే 7: ‘ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను,’”; రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జనవరి 24–30. మోషే 7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జనవరి 24–30
మోషే 7
“ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను”
మీరు మోషే 7 చదివి ధ్యానించుచున్నప్పుడు, మీ ఆత్మీయ మనోభావాలను నమోదు చేయండి. దీనిని చేయడం ద్వారా మీరు ప్రభువు నుండి వచ్చే నడిపింపుకు విలువిస్తారని మరియు ఇంకా ఎక్కువగా ఆయన నడిపింపును పొందాలని కోరుతున్నారని చూపుతారు.
మీ మనోభావాలను నమోదు చేయండి
చరిత్ర అంతటా, హనోకు మరియు అతని జనులు సాధించిన దానిని సాధించాలని జనులు ప్రయత్నించారు: పేదరికము లేక హింస లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. దేవుని జనులుగా మనము ఈ కోరికను పంచుకుంటాము. దానిని మనం సీయోనును నిర్మించడం అని పిలుస్తాము, అందులో పేదవారి పట్ల శ్రద్ధ చూపడానికి అదనంగా శాంతిని పెంచడం, నిబంధనలు చేయడం, నీతియందు కలిసి నివసించడం, ఒకరితో ఒకరు మరియు “సీయోనుకు రాజు” మోషే 7:53 అయిన యేసు క్రీస్తుతో ఏకమవ్వడం వంటివి ఉన్నాయి. సీయోనును స్థాపించు కార్యము మన కాలంలో కొనసాగుతున్నందున, హనోకు మరియు అతని జనులు దానిని ఎలా చేసారు? అని అడగడం సహాయకరంగా ఉంటుంది. వారి చుట్టూ దుష్టత్వమున్నప్పటికీ వారు ఏవిధంగా “ఏక హృదయము, ఏక మనస్సు” గలవారైరి? (మోషే 7:18) సీయోను గురించి మోషే 7 మనకిచ్చే అనేక వివరాలలో కడవరి-దిన పరిశుద్ధుల కొరకు ఇది ప్రత్యేకంగా విలువైనది కావచ్చు: సీయోను అనునది ఒక పట్టణము మాత్రమే కాదు—అది హృదయము మరియు ఆత్మ యొక్క స్థితి. ప్రభువు బోధించినట్లుగా, సీయోను అనగా “హృదయశుద్ధి గలవారు”(సిద్ధాంతము మరియు నిబంధనలు 97:21). కాబట్టి సీయోనును నిర్మించుటకు సరైన మార్గము దానిని మన హృదయాలలో, ఇళ్ళలో ప్రారంభించడం కావచ్చు.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
హనోకు యొక్క ప్రయత్నాలు మన జీవితాల్లో సీయోనును నిర్మించడానికి ఒక నమూనాగా ఉన్నాయి.
దేవుని అనుచరులు విజయవంతంగా సీయోనును ఎలా నిర్మించారని మోషే 7 లో నమోదు చేయబడినందున, మనము అలాగే చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది నేడు మనకు సూచనలిచ్చి, ప్రేరేపించగలదు. మోషే 7:16–21, 27, 53, 62–69 నుండి సీయోను గురించి మీరు నేర్చుకొనే దానిని నమోదు చేయడానికి ఇటువంటి పట్టికనొకదానిని ఉపయోగించడాన్ని పరిగణించండి.
వచనము |
సీయోను గురించి మీరేమి నేర్చుకుంటారు? |
సీయోనును నిర్మించడానికి మీ ప్రయత్నాల గురించి ఇది ఏమి సూచిస్తుంది? |
---|---|---|
వచనము | సీయోను గురించి మీరేమి నేర్చుకుంటారు? సీయోను యొక్క జనులు ”ఏక హృదయము, ఏక మనస్సు” గలవారు. | సీయోనును నిర్మించడానికి మీ ప్రయత్నాల గురించి ఇది ఏమి సూచిస్తుంది? మనము కుటుంబాలుగా, సంఘముగా ఏకము కావలెను. |
వచనము | సీయోను గురించి మీరేమి నేర్చుకుంటారు? ”కొంతకాలమైన తరువాత (సీయోను) పరలోకమునకు కొనిపోబడెను.” | సీయోనును నిర్మించడానికి మీ ప్రయత్నాల గురించి ఇది ఏమి సూచిస్తుంది? సీయోనును నిర్మించడమనేది ఒక క్రమమైన ప్రక్రియ. |
వచనము | సీయోను గురించి మీరేమి నేర్చుకుంటారు? | సీయోనును నిర్మించడానికి మీ ప్రయత్నాల గురించి ఇది ఏమి సూచిస్తుంది? |
వచనము | సీయోను గురించి మీరేమి నేర్చుకుంటారు? | సీయోనును నిర్మించడానికి మీ ప్రయత్నాల గురించి ఇది ఏమి సూచిస్తుంది? |
దేవుని జనులు “ఏక హృదయము, ఏక మనస్సు” గలవారగుటకు ప్రయత్నించవలెను.
ప్రభువు సీయోను అని పిలిచిన జనుల యొక్క ముఖ్యమైన స్వభావాలను మోషే 7:18–19 జాబితా చేస్తుంది. సీయోనును నిర్మించడానికి ఈ స్వభావాలు ఎందుకు అవసరమని మీరనుకుంటున్నారు? ఈ అధ్యాయములో వివరించబడినట్లుగా, సీయోను ప్రపంచంలోని ఇతర ఐక్య సమూహాలు లేక సంస్థల నుండి ఏవిధంగా భిన్నంగా ఉంది? మీరు ఈ ప్రశ్నను ధ్యానించుచున్నప్పుడు, 53వ వచనంలో “నేను మెస్సీయాను, సీయోనుకు రాజును” అని చెప్పిన యేసు క్రీస్తు మాటల గురించి మీరు ఆలోచించవచ్చు. యేసు క్రీస్తును మన రాజుగా కలిగియుండడమనగా అర్థమేమిటి? సీయోను యొక్క స్వభావాలను వృద్ధిచేయడానికి ఆయన మనకెలా సహాయపడతారు?
ఫిలిప్పీయులకు 2:1–5; 4 నీఫై 1:15–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 97:21; 105:5 కూడా చూడండి.
హనోకు పట్టణానికి ఏమి జరిగింది?
“కొనిపోబడెను” (మోషే 7:21, 23), “పైకెత్తబడెను” (మోషే 7:24), “కొనిపోబడిరి” (మోషే 7:27), “వెళ్ళిపోయెను” (మోషే 7:69) అను వాక్యభాగాలు సీయోను మరియు హనోకు యొక్క జనులు రూపాంతరీకరించబడి, పరలోకమునకు కొనిపోబడుటను సూచిస్తున్నాయి. రూపాంతరీకరించబడిన జనులు మర్త్యులుగా “బాధ లేక మరణమును వారు అనుభవించకుండునట్లు మార్పుచెందిరి” (లేఖన సూచిక, రూపాంతరీకరించబడిన వ్యక్తులు, సీయాను,” scriptures.ChurchofJesusChrist.org; 3 నీఫై 28:4–9, 15–18, 39–40 కూడా చూడండి).
దేవుడు తన పిల్లల కొరకు దుఃఖించును.
కొద్దిమంది మనకు ఏమి జరిగినా మానసికంగా ప్రభావితం చేయబడని భిన్నమైన వ్యక్తిగా దేవుడిని చూస్తారు. కానీ హనోకు ఒక దర్శనములో దేవుడు తన పిల్లల కొరకు దుఃఖించుటను చూసాడు. మీరు మోషే 7:28–40 చదువుతున్నప్పుడు, దేవుడు దుఃఖించుటకు గల కారణాల కొరకు చూడండి. మోషే 7:41–69 లో వివరించబడిన హనోకు దర్శనము యొక్క శేషభాగములో, దేవుడు “కరుణను, దయను నిరంతరము కలిగియున్నాడు” అనుటకు ఏ సాక్ష్యాన్ని మీరు కనుగొంటారు? (మోషే 7:30; ఉదారహణల కొరకు వచనాలు 43, 47, మరియు 62 చూడండి.)
అంత్యదినములలో దేవుడు తాను ఎన్నుకొనిన వారిని పోగుచేయును.
62వ వచనము అంత్యదినముల సంఘటనలను వివరిస్తుంది. ఇటువంటి వాక్యభాగముల అర్థమును పరిగణించండి: “పరలోకమునుండి నీతిని నేను క్రిందకు పంపుదును,” “భూమినుండి సత్యమును నేను పంపుదును,” “నీతియు, సత్యమును వరదవలె భూమిని ముంచివేయునట్లు చేయుదును.” కడవరి దినములలో దేవుని కార్యము గురించి ఈ వాక్యభాగములు మీకేమి బోధిస్తాయి?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
మోషే 7:18–19.“ఏక హృదయులు” అనగా అర్థమేమిటో ఊహించడానికి కుటుంబ సభ్యులకు సహాయపడేందుకు మీరు ఒక కాగితపు హృదయాన్ని తయారుచేసి, ప్రతి కుటుంబ సభ్యునికి ఒకటి వచ్చేలా దానిని ప్రహేళిక ముక్కలుగా కత్తిరించవచ్చు. కుటుంబ సభ్యులు వారి ముక్కలపై వారి పేర్లు వ్రాసి, ఒకరితోఒకరు కలిసి పనిచేసి ఆ హృదయాన్ని ఒక్కటిగా పేర్చవచ్చు. ప్రహేళికను పూర్తిచేస్తున్నప్పుడు, ప్రతి కుటుంబ సభ్యునిలో మీరు ప్రేమించే విషయాల గురించి మీరు మాట్లాడవచ్చు.
-
మోషే 7:28–31, 35.ఈ వచనాల నుండి దేవుని గురించి మనం ఏమి నేర్చుకుంటాము?
-
మోషే 7:32.దేవుడు ఎందుకు మనకు కర్తృత్వాన్నిచ్చారు? దేవుని ఆజ్ఞలు మన కర్తృత్వాన్ని పరిమితం చేస్తాయని భావించేవారికి మనం ఏమి చెప్పవచ్చు? 2 నీఫై 2:25–27 చదవడం ఈ చర్చకు మరింత జోడించవచ్చు.
-
మోషే 7:59–67.మీ కుటుంబము మోషే 7:59–67 చదివినప్పుడు, అంత్యదినముల గురించి ప్రభువు హనోకుకు చెప్పే విషయాలను గుర్తించుటకు లేక గమనించుటకు ప్రయత్నించండి—ఉదాహరణకు, “దేవుడు (తాను) ఎన్నుకొనిన వారిని పోగుచేయును” (62వ వచనము) మరియు “దుష్టుల మధ్య గొప్ప శ్రమలు”(66వ వచనము) ఉండును. అంత్యదినములలో దుష్టత్వమున్నప్పటికీ మనమెలా విశ్వాసాన్ని, నిరీక్షణను కలిగియుండగలము? ఈ చర్చలో భాగంగా, ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ చెప్పిన ఈ మాటలు చదవడాన్ని పరిగణించండి: “సహోదర సహోదరీలారా, సానుకూల దృక్పథముతో ఉండుము. అవును, మనము అపాయకరమైన కాలములలో జీవిస్తున్నాము, కానీ నిబంధన బాటపై నిలిచియున్నప్పుడు మనము భయపడనవసరము లేదు. మీరు ఆవిధంగా చేసినప్పుడు, మనము జీవించు సమయములచేత లేక మనకు సంభవించు కష్టముల చేత మీరు ఇబ్బందిపడరని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. పరిశుద్ధ స్థలములలో నిలిచియుండాలని, కదలకయుండాలని ఎన్నుకొనుటకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క వాగ్దానములందు, ఆయన జీవిస్తున్నారని, ఆయన మనపై కావలికాయుచున్నారని, మనకొరకు శ్రద్ధ తీసుకొనుచున్నారని మరియు మన ప్రక్కన నిలిచియున్నారని నమ్ముటకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను.” (“కలవరపడకుము,” లియహోనా, నవ. 2018, 21).
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట : “Love at Home,” Hymns, no. 294.