2022 పాత నిబంధన
డిసెంబరు 27–జనవరి 2. మోషే 1; అబ్రాహాము 3: “ ఇదియే నా కార్యమును మహిమయైయున్నది”


“డిసెంబరు 27–జనవరి 2. మోషే 1; అబ్రాహాము 3: ‘ఇదియే నా కార్యమును మహిమయైయున్నది,ట’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“డిసెంబరు 27–జనవరి 2. మోషే 1; అబ్రాహాము 3,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
అంతరిక్షములో నక్షత్రాల చిత్రము

డిసెంబరు 27–జనవరి 2

మోషే 1; అబ్రాహాము 3

“ఇదియే నా కార్యమును మహిమయైయున్నది”

మోషే మరియు అబ్రాహాముతో దేవుడు చెప్పినదానిని మీరు చదువుతున్నప్పుడు, ఆయన మీకు ఏమి చెప్పగలడో ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను“ (ఆదికాండము 1:1) అనే పదాలతో బైబిలు ప్రారంభమవుతుంది. కానీ ఈ “ప్రారంభానికి” ముందు అక్కడ ఏమున్నది? ఎందుకు దేవుడు వీటన్నిటిని సృష్టించాడు? ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు ఈ ప్రశ్నలపై స్పష్టతనిచ్చారు.

ఉదాహరణకు, “లోకము పుట్టక మునుపు” (అబ్రాహాము 3:22–28చూడండి) ఆత్మలుగా మన ఉనికి గురించి అబ్రాహాము చూసిన దర్శనమును ఆయన మనకు వివరించెను. మోషే గ్రంథము అని పిలువబడిన ఆదికాండము యొక్క మొదటి ఆరు అధ్యాయాల ప్రేరేపిత అనువాదము లేక పునర్వీక్షణను కూడా ప్రభువు మనకు ఇచ్చారు—అది “ఆదియందు” అనేదానితో ప్రారంభం కాదు. బదులుగా అది మోషే కలిగియున్న ఒక అనుభవంతో మొదలవుతుంది, అది బాగా పరిచయమున్న సృష్టి వృత్తాంతము కొరకు కొంత సమాచారాన్ని అందిస్తుంది. సంయుక్తంగా ఈ కడవరి-దిన లేఖనాలు మనం పాత నిబంధన అధ్యయనాన్ని మొదలుపెట్టడానికి సరియైనవి, ఎందుకనగా అవి మనం చదివే దాని చుట్టూ ఉన్న సమాచారాన్ని అందించి, కొన్ని ప్రధానమైన ప్రశ్నలకు జవాబిస్తాయి: దేవుడు ఎవరు? మనం ఎవరము? దేవుని కార్యము ఏమిటి మరియు దానిలో మన స్థానము ఏమిటి? ఆదికాండము యొక్క తొలి అధ్యాయాలను మోషే మనవికి ప్రభువు యొక్క జవాబుగా చూడవచ్చు: “ఓ దేవా! నీ సేవకుని యెడల కరుణచూపి, ఈ భూమిని గూర్చి, దాని నివాసులను గూర్చి, అదేవిధముగా పరలోకములను గూర్చి నాకు చెప్పుము” (మోషే 1:36).

చిత్రం
Learn More image
చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మోషే 1

దేవుని బిడ్డగా నేను దైవిక గమ్యాన్ని కలిగియున్నాను.

అధ్యక్షులు డిటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్ ఇలా బోధించారు, “ఈ జీవితంలో మనం అనుభవించే గందరగోళంలో అధికము కేవలం మనము ఎవరమో గ్రహించనందున వస్తుంది” (“The Reflection in the Water” [Church Educational System fireside for young adults, Nov.1, 2009], ChurchofJesusChrist.org). పరలోక తండ్రికి ఇది తెలుసు మరియు సాతానుకు కూడా తెలుసు. మోషేకు దేవుని మొదటి సందేశంలో “నీవు నా కుమారుడవు” మరియు “నీవు నా అద్వితీయ కుమారుని పోలియున్నావు” (మోషే 1:4, 6) అనే సత్యాలు ఉన్నాయి. దానికి విరుద్ధంగా, సాతాను మోషేను కేవలం “మనుష్య కుమారుడు” (మోషే 1:12) అని సంబోధించాడు. సాతాను కోరుకున్నట్లుగా మిమ్మల్ని మీరు “మనుష్య కుమారుడు (లేక కుమార్తె)” గా అనుకున్నట్లయితే, మీ జీవితం మరియు నిర్ణయాలు ఏ విధంగా భిన్నంగా ఉంటాయి? మీరు దేవుని బిడ్డయని తెలుసుకోవడం మరియు గుర్తుంచుకోవడం మీ జీవితాన్ని ఎలా దీవిస్తుంది?

మోషే 1లోని ఏ వచనాలు లేక వాక్యభాగాలు మీ దైవిక విలువ గురించి మీకు జ్ఞానాన్నిస్తాయి?

చిత్రం
నక్షత్రాల మధ్య యేసు క్రీస్తు

క్రీస్తు మరియు సృష్టి, రాబర్ట్ టి. బార్రెట్ చేత

మోషే 1:12–26

సాతాను ప్రభావాన్ని నేను నిరోధించగలను.

మోషే 1 స్పష్టంగా చూపినట్లుగా, శక్తివంతమైన ఆత్మీయ అనుభవాలు మనల్ని శోధన నుండి మినహాయించవు. వాస్తవానికి, ఆ అనుభవాలను లేక వాటి నుండి మనం నేర్చుకున్న దానిని మనం సందేహించేలా మనల్ని శోధించడం సాతాను కుయుక్తులలో ఒకటి. 12–26 వచనాలలో సాతానుకు మోషే ఇచ్చిన జవాబు గురించి మీరు చదివినప్పుడు, మీరు పొందిన సాక్ష్యానికి యధార్థంగా నిలిచేందుకు మీకు సహాయపడేలా మీరు ఏమి నేర్చుకుంటారు? సాతాను యొక్క ఇతర శోధనలను నిరోధించడానికి మీకు ఏది సహాయపడుతుంది? (ఉదాహరణకు, 15 మరియు 18 వచనాలు చూడండి).

మీరు నేర్చుకున్న దానిపై ఆధారపడి, శోధనను నిరోధించడానికి మీరొక ప్రణాళికను తయారు చేయవచ్చు. ఉదాహరణకు, “నేను శోధించబడినప్పుడు, నేను చేస్తాను” అనే వ్యాఖ్యానాన్ని మీరు పూర్తిచేయవచ్చు.

మత్తయి 4:1–11; హీలమన్ 5:12; గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “నన్ను మోసగించకు,” లియహోనా, నవ. 2019, 93–96; ChurchofJesusChrist.org కూడా చూడండి.

మోషే 1:27–39; అబ్రాహాము 3

నిత్యజీవము పొందడానికి నాకు సహాయపడడమే దేవుని కార్యము మరియు మహిమయైయున్నది.

దేవుని సృష్టి గురించి దర్శనమును చూసిన తర్వాత, మోషే ప్రభువుకు ఒక మనవి చేసాడు: “నాకు చెప్పుము … ఇవన్నియు ఎందుకు ఈవిధముగానున్నవి” (మోషే 1:30). మోషే 1:31–39 లో ప్రభువు జవాబు గురించి మిమ్మల్ని ప్రభావితం చేసేది ఏమిటి?

అబ్రాహాము కూడా దర్శన అనుభవాన్ని కలిగియున్నాడు, అది అబ్రాహాము 3 లో నమోదు చేయబడింది. మోషే మనవికి జవాబివ్వడంలో సహాయపడేలా 22–26 వచనాలలో మీరేమి కనుగొంటారు?

వారి దర్శనాలలో మోషే మరియు అబ్రాహాము నేర్చుకున్న ఇతర సత్యాలను జాబితా చేయడాన్ని పరిగణించండి: దేవుని గురించి, వారి గురించి మరియు దేవుని సృష్టి యొక్క ఉద్దేశాల గురించిన సత్యాలు. మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు చూసే విధానాన్ని ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి?

డిటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, “మీరు ఆయనకు ముఖ్యము,” లియహోనా, నవ. 2011, 19–22; topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

అబ్రాహాము 3:22–23

అబ్రాహాము కాకుండా ఇంకెవరైనా “(వారు) పుట్టకముందే ఎన్నుకోబడ్డారా”?

“పూర్వ మర్త్య ఆత్మీయ లోకంలో, వారి మర్త్య జీవితాల్లో ప్రత్యేక నియమితకార్యాలను నెరవేర్చాలని దేవుడు నిర్దిష్ట ఆత్మలను నియమించాడు. దీనినే పూర్వనియామకము అంటారు. … పూర్వనియామక సిద్ధాంతము కేవలము రక్షకునికి, ఆయన ప్రవక్తలకే కాకుండా సంఘము యొక్క సభ్యులందరికీ వర్తిస్తుంది” (Gospel Topics, “Foreordination,” topics.ChurchofJesusChrist.org).

మోషే మరియు అబ్రాహాము గ్రంథాలు మనకెలా లభించాయి?

బైబిలు యొక్క జోసెఫ్ స్మిత్ ప్రేరేపిత అనువాదము యొక్క మొదటి భాగమే మోషే గ్రంథము. ఐగుప్తీయుల పురాతన పత్రాలపై పనిచేస్తున్నప్పుడు జోసెఫ్ స్మిత్‌కు అబ్రాహాము గ్రంథము బయల్పరబడింది. నేడు అమూల్యమైన ముత్యములో కనుగొనబడు ఈ గ్రంథాలు మోషే, అబ్రాహాము మరియు పాత నిబంధనలో కనుగొనబడని ఇతర ప్రవక్తల గురించి అధిక సమాచారాన్ని అందిస్తాయు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మోషే 1:4, 30–39.“(దేవుని) హస్తకృత్యములలో“ కొన్నింటిని చూడడాన్ని మీ కుటుంబము ఇష్టపడుతుందా? (4వ వచనము). ఈ వచనాలను మీరు ఉద్యానవనంలో లేక రాత్రి నక్షత్రాల క్రింద చదువవచ్చు. దేవుడు లోకాన్ని ఎందుకు సృష్టించాడు మరియు మనం ఆయన ”కార్యము మరియు (ఆయన) మహిమ” (39వ వచనము) లో ఎలా పాల్గొంటాము అనేదాని గురించి అప్పుడు మీరు మాట్లాడవచ్చు.

మోషే 1:18.దేవుడు మరియు సాతాను ”మధ్య తీర్పుతీర్చడానికి” ఒకరికొకరు సహాయపడేలా ఏ సలహాను మనం పంచుకోగలము? (మొరోనై 7:12–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 50:23–24 కూడా చూడండి.)

అబ్రాహాము 2:24–26.వారు సూచనలను పాటించగలరని నిరూపించడానికి వారిని అనుమతించేలా ఒక కాగితపు విమానాన్ని తయారు చేయడం లేదా ఒక తయారీవిధానాన్ని అనుసరించడం వంటి ఆహ్లాదకరమైన సవాలుతో కూడిన పనిని మీరు కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు. ఈ వచనాలలో వివరించినట్లుగా ఈ ప్రోత్సాహ కార్యక్రమము ఏవిధంగా మన మర్త్యజీవితపు ఉద్దేశాన్ని పోలియున్నది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

సువార్త సత్యముల కొరకు వెదకండి. లేఖనములలో కొన్నిసార్లు సువార్త సత్యాలు సూటిగా చెప్పబడతాయి; కొన్నిసార్లు అవి ఒక ఉదాహరణ లేక కథ ద్వారా స్పష్టం చేయబడతాయి. “ఈ వచనములలో బోధించబడిన నిత్య సత్యములేవి?” అని మీకై మీరు ప్రశ్నించుకోండి.

చిత్రం
సాతానును వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తున్న మోషే

మోషే సాతానును జయించును, జోసెఫ్ బ్రిక్కి చేత

ముద్రించు