2022 పాత నిబంధన
జనవరి 10–16. ఆదికాండము 3–4; మోషే 4–5: ఆదాము, హవ్వల పతనము


“జనవరి 10–16. ఆదికాండము 3–4; మోషే 4–5: ఆదాము, హవ్వల పతనము,”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జనవరి 10–16. ఆదికాండము 3–4; మోషే 4–5,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

కలిసి నడుచుచున్న ఆదాము, హవ్వలు

ఆదాము మరియు హవ్వ, డగ్లస్ ఎమ్. ఫ్రైయర్ చేత

జనవరి 10–16

ఆదికాండము 3–4; మోషే 4–5

ఆదాము, హవ్వల పతనము

మీరు ఆదికాండము 3–4 మరియు మోషే 4–5 చదువుతున్నప్పుడు, ప్రభువు మీకు ఏమి బోధించడానికి ప్రయత్నిస్తున్నారనేదానిని పరిగణించండి. ఈ సత్యాలను, మీ ఆత్మీయ మనోభావాలను నమోదు చేసి, వారమంతా వాటిపై దృష్టిసారించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మొదట, ఆదాము హవ్వల పతనము యొక్క వృత్తాంతము విషాదభరితంగా అనిపించవచ్చు. ఆదాము, హవ్వలు అందమైన ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఎల్లప్పుడూ బాధ, వేదన, మరణము ఉన్న లోకంలోకి వారు పంపివేయబడ్డారు (ఆదికాండము 3:16–19 చూడండి). వారు తమ పరలోక తండ్రి నుండి వేరుచేయబడ్డారు. కానీ మోషే గ్రంథములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన సత్యాల కారణంగా, ఆదాము హవ్వల వృత్తాంతము నిజానికి నిరీక్షణతో కూడినదని—ఆయన పిల్లల కొరకు దేవుని ప్రణాళికలో ఆవశ్యకమైన భాగమని మనకు తెలుసు.

ఏదేను వనము అందమైనది. కానీ ఆదాము, హవ్వలకు అందమైన పరిసరాలకు మించినది అవసరము. వారికి అవసరమైనది—మనందరికి అవసరమైనది—ఎదగడానికి ఒక అవకాశము. ఏదేను వనమును విడిచిపెట్టడం అనేది దేవుని వద్దకు తిరిగివెళ్ళి, క్రమంగా ఆయన వలె కావడానికి అవసరమైన మొదటి అడుగు. దానర్థము వ్యతిరేకతను ఎదుర్కోవడం, తప్పులు చేయడం, పశ్చాత్తాపపడుటను మరియు రక్షకుడిని నమ్ముటను నేర్చుకోవడం, ఆయన ప్రాయశ్చిత్తము వృద్ధిని మరియు “మన విమోచనానందమును” (మోషే 5:11) సాధ్యం చేస్తుంది. కాబట్టి మీరు ఆదాము, హవ్వల పతనము గురించి చదివినప్పుడు, కనిపించే విషాదంపై కాకుండా సాధ్యతలపై—ఆదాము, హవ్వలు కోల్పోయిన పరదైసుపై కాకుండా వారి ఎంపిక వలన మనము పొందే మహిమపై దృష్టి పెట్టండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆదికాండము 3:1–7; మోషే 4; 5:4–12

ఆయన పిల్లలను విమోచించడానికి దేవుని ప్రణాళికలో పతనము ఒక ఆవశ్యకమైన భాగము.

ఆదాము, హవ్వల పతనము భౌతిక మరియు ఆత్మీయ మరణాన్ని లోకంలోకి తెచ్చింది. అది దుర్దశ, బాధ మరియు పాపములను కూడా తెచ్చింది. పతనము గురించి విచారించడానికి ఇవన్నీ కారణాలుగా కనిపిస్తాయి. కానీ “తండ్రి యొక్క అద్వితీయ కుమారుని త్యాగము” (మోషే 5:7) ద్వారా ఆయన పిల్లలను విమోచించడానికి, ఉన్నతస్థానంలో ఉంచడానికి పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో పతనము ఒక భాగము. మీరు ఆదికాండము 3:1–7; మోషే 4; 5:4–12 చదువుతున్నప్పుడు, పతనము మరియు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము దానిని ఎలా జయిస్తుందని మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడేలా ఏ సత్యాలను మీరు కనుగొంటారు? ఇటువంటి ప్రశ్నలు సహాయపడవచ్చు:

  • పతనము ఆదాము, హవ్వలను ఎలా ప్రభావితం చేసింది? అది నన్ను ఎలా ప్రభావితం చేస్తుంది?

  • ఆదాము, హవ్వలు ఎందుకు బలులను అర్పించారు? ఆ బలులు వేటికి చిహ్నంగా ఉన్నాయి? ఈ వచనాలలో దేవదూత మాటల నుండి నేను ఏమి నేర్చుకోగలను?

  • వారి పతనము తర్వాత ఆదాము, హవ్వలు ఎందుకు “సంతోషంగా”ఉన్నారు? యేసు క్రీస్తు ద్వారా నన్ను విమోచించడానికి దేవుని ప్రణాళిక గురించి ఈ వృత్తాంతము నుండి నేను ఏమి నేర్చుకుంటాను?

మోర్మన్ గ్రంథము మరియు ఇతర కడవరి-దిన బయల్పాటుల కారణంగా పతనముపై మనము ప్రత్యేక దృష్టిని కలిగియున్నాము. ఉదాహరణకు, 2 నీఫై 2:15–27 లో లీహై ప్రవక్త తన కుటుంబానికి ఆదాము, హవ్వల గురించి ఏమి బోధించాడో ఆలోచించండి. లీహై బోధనలు ఏవిధంగా ఏదేను వనములో జరిగిన దానిని స్పష్టం చేసి, అది ఎందుకు ముఖ్యమైనదో మనం గ్రహించేలా చేస్తాయి?

1 కొరింథీయులకు 15:20–22; మోషైయ 3:19; ఆల్మా 12:21–37; సిద్ధాంతము మరియు నిబంధనలు 29:39–43; విశ్వాస ప్రమాణములు 1:3; డాల్లిన్ హెచ్. ఓక్స్, “గొప్ప ప్రణాళిక,” లియహోనా, మే 2020, 93–96; డాల్లిన్ హెచ్. ఓక్స్, “అన్ని విషయాలలో వ్యతిరేకత,” లియహోనా, మే 2016, 114–17; జెఫ్రీ ఆర్. హాలెండ్, “న్యాయము, ప్రేమ, కనికరము కలిసేచోటు,” లియహోనా, మే 2015, 104–6 కూడా చూడండి.

ఫలమును పట్టుకొనిన హవ్వ

Leaving Eden (ఏదేనును విడిచిపెట్టుట), ఆన్నీ హెన్రీ నాడెర్ చేత

ఆదికాండము 3:16; మోషే 4:22

ఆదాము, హవ్వను “ఏలును” అనగా అర్థమేమిటి?

ఈ లేఖన భాగానికి అర్థము ఒక భర్త తన భార్యపట్ల నిర్దయగా వ్యవహరించడం న్యాయమేనని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుతున్నది. మనకాలంలో, ఒక భర్త నీతియందు ఇంటిలో అధ్యక్షత్వము వహించినప్పటికీ, అతడు తన భార్యను సమాన భాగస్వామిగా చూడాలని ప్రభువు యొక్క ప్రవక్తలు బోధించారు (“కుటుంబము: ప్రపంచానికి ఒక ప్రకటన” [ChurchofJesusChrist.org] చూడండి). ఎల్లర్ డేల్ జి. రెన్లండ్ మరియు సహోదరి రూత్ లిబ్బెర్ట్ రెన్లండ్ ఇలా వివరించారు, నీతిమంతుడైన ఒక భర్త పరిచర్య చేయాలని చూస్తాడు; తన తప్పులను ఒప్పుకొని, క్షమాపణ కోరతాడు; మెచ్చకోవడానికి వేగంగా ఉంటాడు; కుటుంబ సభ్యుల ప్రాధాన్యతల గురించి ఆలోచిస్తాడు; తన కుటుంబానికి ‘జీవితపు అవసరాలను, రక్షణను’ అందించడానికి గల బాధ్యత యొక్క గొప్ప బరువును అతడు మోస్తాడు; తన భార్యను అత్యంత మర్యాదతో, గౌరవంతో ఆదరిస్తాడు. … అతడు తన కుటుంబాన్ని దీవిస్తాడు” (The Melchizedek Priesthood: Understanding the Doctrine, Living the Principles [2018], 23).

మోషే 5:4–9, 16–26

సమ్మతి మరియు విధేయత గల హృదయంతో నేను అర్పించినప్పుడు, దేవుడు నా బలులను అంగీకరిస్తాడు.

జంతు బలులు, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగమునకు చిహ్నమని ఆదాము, హవ్వలు నేర్చుకున్నారు మరియు వారు దానిని “వారి కుమారులు, కుమార్తెలకు తెలియజేసారు” (మోషే 5:12). మీరు మోషే 5:4–9, 16–26 చదువుతున్నప్పుడు, ఈ బలుల పట్ల వారి కుమారులలో ఇద్దరైన కయీను మరియు హేబేలుల విరుద్ధమైన వైఖరులను పరిగణించండి. ప్రభువు హేబేలు బలిని అంగీకరించి, కయీను దానిని ఎందుకు అంగీకరించలేదు?

ప్రభువు మిమ్మల్ని ఏ రకమైన బలులిమ్మని అడుగుతున్నారు? ఈ బలుల గురించి మీ ఆలోచనా విధానాన్ని మార్చేలా మోషే 5:4–9, 16–26 లో ఏదైనా ఉన్నదా?

కీర్తనలు 4:5; 2 కొరింథీయులకు 9:7; ఓంనై 1:26; 3 నీఫై 9:19–20; మొరోనై 7:6–11; సిద్ధాంతము మరియు నిబంధనలు 97:8; జెఫ్రీ ఆర్. హాలెండ్, “ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల,” లియహోనా, మే 2019, 44–46 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఆదికాండము 3; మోషే 4.ఆదాము, హవ్వల పతనము గురించి బాగా అర్థం చేసుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు మీరేమి చేయగలరు? (పాత నిబంధన కథలు లో) “ఆదాము మరియు హవ్వ” నుండి చిత్రాలను మీరు నకలు చేసి, వాటిని కత్తిరించుకోవచ్చు. తర్వాత మీరు ఆదాము, హవ్వల అనుభవాలను చర్చిస్తున్నప్పుడు, ఆ చిత్రాలను వరుసక్రమంలో పెట్టడానికి కలిసి పనిచేయవచ్చు.

మోషే 4:1–4.ఈ వచనాల నుండి దేవుడు, యేసు క్రీస్తు మరియు సాతాను గురించి మనం ఏమి నేర్చుకుంటాము? సాతాను దానిని నాశనం చేయాలని కోరుకునేంతగా దేవుని ప్రణాళికకు కర్తృత్వము ఎందుకు ముఖ్యమైనది?

మోషే 5:5–9.రక్షకుని గురించి ఆలోచించడానికి వారికి సహాయపడేందుకు ఏమి చేయమని దేవుడు ఆదాము, హవ్వలను ఆజ్ఞాపించాడు? రక్షకుని గురించి ఆలోచించడానికి మనకు సహాయపడేందుకు దేవుడు మనకేమి ఇచ్చాడు?

మోషే 5:16–34.మన “సహోదరునికి కావలివాడగుట” అనగా అర్థమేమిటి? ఒక కుటుంబంగా మనము ఏవిధంగా ఒకరిపట్ల ఒకరం బాగా శ్రద్ధచూపగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, అదనపు అంతరార్థములను పొందడానికి పాదవివరణలు, లేఖన సూచిక, మరియు ఇతర అధ్యయన సహాయాలను ఉపయోగించండి.

ఆదాము, హవ్వలను దర్శించుచున్న దేవదూత

పోలిక, వాల్టర్ రానె చేత