2022 పాత నిబంధన
మనస్సులో ఉంచుకోవాల్సిన ఆలోచనలు: పాత నిబంధన పఠనము


మనస్సులో ఉంచుకోవాల్సిన ఆలోచనలు: పాత నిబంధన పఠనము రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

మనస్సులో ఉంచుకోవాల్సిన ఆలోచనలు: పాత నిబంధన పఠనము రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

ఆలోచనల చిహ్నము

మనస్సులో ఉంచుకోవాల్సిన ఆలోచనలు

పాత నిబంధన పఠనము

వ్యక్తిగత అర్థమును కనుగొనుము

ఈ సంవత్సరము పాత నిబంధనను అధ్యయనం చేయడానికి మీ అవకాశమును మీరు ఆలోచించినప్పుడు, మీరు ఎలా భావిస్తున్నారు? ఆతృతగా? అస్థిరంగా? భయపడ్డారా? ఆ భావావేశములు అన్నీ గ్రహింపదగినవి. పాత నిబంధన ప్రపంచంలోని ప్రాచీన రచనలలో ఒకటి, మరియు ఇది ఉత్తేజకరమైనదిగా మరియు భయపెట్టేదిగా రెండు విధాలుగా చేయగలదు. ఈ రచనలు పురాతన సంస్కృతి నుండి వచ్చాయి, అవి అన్యమైనవిగా మరియు కొన్నిసార్లు వింతగా లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు. అయినప్పటికినీ ఈ రచనలలో పరిచయమైనవిగా కనబడే అనుభవాలను మనము చూస్తాము, మరియు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క దైవత్వమును గూర్చి సాక్ష్యమిచ్చే సువార్త ఇతివృత్తాలను మనము గుర్తిస్తాము.

అయినప్పటికినీ, అబ్రహాము, శారా, హన్నా, మరియు దానియేలు జీవించిన జీవితాలు, కొన్ని విధాలుగా మనకంటే చాలా భిన్నమైనవి. కానీ వారు కూడ మనందరి వలే, కుటుంబ ఆనందమును, కుటుంబ అసమ్మతి, విశ్వాసము మరియ అస్థిరమైన క్షణాలు, విజయాలు మరియు అపజయాలుగల సమయాలను—అనుభవించారు. మరి ముఖ్యముగా, వారు విశ్వాసమును సాధన చేసారు, పశ్చాత్తాపపడ్డారు, నిబంధనలు చేసారు, ఆత్మీయంగా అనుభవాలు కలిగియున్నారు, మరియు దేవునికి లోబడుటకు వారి ప్రయత్నాలందు ఎన్నడూ పట్టువిడువలేదు.

ఈ సంవత్సరము పాత నిబంధనలో వ్యక్తిగత అర్థమును మీరు, మీ కుటుంబమును కనుగొనగలరా అని మీరు ఆశ్చర్యపడిన యెడల, లీహై మరియు శరయ కుటుంబము అలా చేసారని మనస్సులో ఉంచుకొనుము. నీఫై సహోదరులకు ప్రోత్సాహము లేక దిద్దుబాటు లేక దృష్టికోణము అవసరమైనప్పుడు యెషయా నుండి మోషే మరియు బోధనలను గూర్చి కధనాలను అతడు పంచుకొన్నాడు. “నా ఆత్మ లేఖనములందు ఆనందించును” (2 నీఫై 4:15) నీఫై చెప్పినప్పుడు, ఇప్పుడు పాత నిబంధనలో భాగమైన లేఖనాలను గూర్చి అతడు మాట్లాడుతున్నాడు.

రక్షకునిని వెదకుము

పాత నిబంధన అధ్యయనం చేయడం ద్వారా మీరు, మీ కుటుంబము యేసు క్రీస్తుకు దగ్గరగా రాగలరా అని మీరు ఆశ్చర్యపడిన యెడల, ఆవిధంగా చేయమని రక్షకుడు తానే మనల్ని ఆహ్వానిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనుము. యూదుల యొక్క నాయకులతో ఆయన చెప్పినప్పుడు, “లేఖనములు … నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” (యోహాను 5:39), మనము పాత నిబంధన అని పిలిచిన రచనలను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చదివిన దానిలో రక్షకుని కనుగొనుటకు, మీరు ఓపికగా ధ్యానించి మరియు ఆత్మీయ నడిపింపును వెదకాల్సిన అవసరముండవచ్చు. కొన్నిసార్లు ఆయనకు అన్వయములు యెషయా ప్రకటనలో ఉన్నట్లుగా చాలా నేరుగా కనబడుచున్నవి, “ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. … సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును” (యెషయా 9:6). మరొక స్థలములలో, రక్షకుడు మరింతగా సూక్ష్మంగా, చిహ్నములు మరియు సారూప్యతలను సూచించాడు—ఉదాహరణకు, జంతువుల బలుల యొక్క వివరణలు (లేవియకాండము 1:3–4 చూడండి) లేక యోసేపు తన అన్నలను క్షమించి, వారిని కరవునుండి రక్షించే వృత్తాంతము ద్వారా.

మీరు పాత నిబంధనను అధ్యయనం చేసినప్పుడు, రక్షకునియందు గొప్ప విశ్వాసమును మీరు వెదకిన యెడల, మీరు దానిని కనుగొంటారు. బహుశా ఈ సంవత్సరము ఇది మీ అధ్యయనము యొక్క లక్ష్యము కావచ్చు. యేసు క్రీస్తుకు మిమ్మల్ని దగ్గరగా తెచ్చే లేఖన భాగాలు, కధనాలు, మరియు ప్రవచనాలను కనుగొనుటకు మరియు దృష్టిసారించుటకు ఆత్మ మిమ్మల్ని నడిపించినట్లు ప్రార్ధించుము.

ప్రాచీన ప్రవక్త వ్రాయుట

జుడితా ఎ. మెహర్ పాత నిబంధన ప్రవక్త

దైవికంగా భద్రపరచబడింది

పాత నిబంధన మానవజాతి యొక్క సమగ్రమైన మరియు ఖచ్చితమైన చరిత్రను సమర్పిస్తుందని ఆశించవద్దు. అసలు రచయితలు మరియు సంగ్రహకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది అది కాదు. వారి విస్తారమైన ఆలోచన ఏమనగా దేవుని గురించి—ఆయన బిడ్డల కొరకు ఆయన ప్రణాళికను గూర్చి, ఆయన నిబంధన జనులకు దాని అర్థమేమిటి, మరియు మన నిబంధనల ప్రకారం జీవించనప్పుడు విమోచనను ఎలా కనుగొనాలని బోధించుట. కొన్నిసార్లు వారు గొప్ప ప్రవక్తల జీవితాలనుండి వృత్తాంతములను కలిపి—వాటిని వారు గ్రహించినట్లుగా చారిత్రక సంఘటనలను సంబంధింప చేయడం ద్వారా దానిని చేసారు. యెహోషువా, న్యాయాధిపతులు, 1 మరియు 1 రాజులు గ్రంధముల వలె, ఆదికాండము దీనికి మాదిరి. మిగిలిన పాత నిబంధన రచయతలు చారిత్రత్మకంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోలేదు. బదులుగా, వారు కవిత్వము మరియు సాహిత్యం వంటి కళాకృతుల ద్వారా బోధించారు. కీర్తనలు మరియు సామోతలు ఈ కోవకు సరిపోతాయి. తరువాత యెషయా నుండి మలాకీ వరకు, ప్రవక్తల యొక్క ప్రశస్తమైన మాటలున్నాయి, వారు ప్రాచీన ఇశ్రాయేలుతో దేవుని వాక్యమును మాట్లాడారు—మరియు, బైబిలు యొక్క అద్భుతము ద్వారా, నేటికి మనతో ఇంకా మాట్లాడుతున్నారు.

ఈ ప్రవక్తలు, కవులు, మరియు సంగ్రహకులలో అందరికి వేల సంవత్సరాల తరువాత ప్రపంచమంతా జనుల చేత వారి మాటలు చదవబడతాయని తెలుసా? మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఇదే జరిగిందని మనము ఆశ్చర్యపడతాము. రాజ్యములు లేచాయి, పడిపోయాయి, పట్టణాలు జయించబడ్డాయి, రాజులు జీవించారు మరియు మరణించారు; కానీ పాత నిబంధన వారందరినీ, తరము నుండి తరానికి, లేఖకుడి నుండి లేఖకుడికి, అనువాదం నుండి అనువాదానికి అధిగమించింది. కొన్ని విషయాలు కోల్పోబడవచ్చు లేక మార్చబడవచ్చు అయినప్పటికినీ ఎదోవిధంగా అత్యధికం అద్భుతంగా కాపాడబడింది.1

ఈ సంవత్సరం మీరు పాత నిబంధన చదివినప్పుడు మీరు మనస్సులో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి. దేవుడు మిమ్మల్ని, మీరు అనుభవిస్తున్న దానిని ఎరుగును గనుక ఆయన ఈ ప్రాచీన రచనలను భద్రపరిచాడు. ఈ మాటలలో మీ కోసం ఒక ఆత్మీయ సందేశమును సిద్ధపరిచియుండవచ్చు, అది మిమ్మల్ని ఆయనకు దగ్గరగా తెచ్చి, ఆయన ప్రణాళిక మరియు ఆయన ప్రియమైన కుమారునియందు మీ విశ్వాసమును పెంచుతుంది. బహుశా ఆయన మీకు తెలిసిన వారిని దీవించునట్లు ఒక లేఖన భాగము లేక ఒక అంతర్‌జ్ఞానమునకు మిమ్మల్ని నడిపించవచ్చు—ఒక స్నేహితుడు, ఒక కుటుంబ సభ్యుడు, లేక ఒక సహ పరిశుద్ధునితో మీరు పంచుకోగల ఒక సందేశము. అనేక అవకాశాలు ఉన్నాయి. ఇది ఆలోచించడానికి ఉత్సాహకరమైనది కాదా?

పాత నిబంధనలో గ్రంధాలు

పాత నిబంధన యొక్క చాలా క్రైస్తవ అనువాదాలలో, పుస్తకాలు మొదట ఒక సేకరణలో సంకలనం చేయబడినప్పుడు అవి ఎలా అమర్చబడి ఉన్నాయో దానికి భిన్నంగా నిర్వహించబడతాయి. కనుక హీబ్రూ బైబిలు గ్రంధాలను మూడు వర్గాలుగా వర్గీకరిస్తుంది—ధర్మశాస్త్రము, ప్రవక్తలు, మరియు రచనలు—అనేక క్రైస్తవ బైబిలు గ్రంధాలను నాలుగు వర్గాలుగా అమర్చాయి: ధర్మశాస్త్రము (ఆదికాండము–ద్వితీయోపదేశకాండము), చరిత్ర (యెహోషువ–ఏస్తేరు), కవిత్వ గ్రంధాలు (యోబు–ప్రసంగి), మరియు ప్రవక్తలు (యెషయా–మలాకీ).

ఈ వర్గాలు ఎందుకు ముఖ్యమైనవి? ఎందుకనగా మీరు అధ్యయనం చేసే గ్రంధము ఏ రకమైనదో తెలుసుకొనుట దానిని ఎలా అధ్యయనం చేయాలో గ్రహించడానికి మీకు సహాయపడగలదు.

“ధర్మశాస్త్రము,” లేక పాత నిబంధనలో మొదటి ఐదు గ్రంధాలను మీరు చదవటం ప్రారంభించినప్పుడు, మీ మనస్సులో ఉంచుకోవాల్సినది ఇక్కడున్నది. ఈ గ్రంధాలు, మోషేకు ఆపాదించబడినవి, బహుశా కాలక్రమేణా అనేకమంది లేఖకులు మరియు సంగ్రహకుల చేతుల గుండా దాటియుండవచ్చు. ఇంకను, మోషే గ్రంధాలు దేవుని వాక్యము చేత ప్రేరేపించబడినవి, అవి—ఏదైనా దేవుని కార్యము మర్త్యుల చేత పంపబడినప్పుడు కూడ—మానవ లోపాలకు లోబడియున్నది (మోష 1:41; విశ్వాస ప్రమాణములు 1:8 చూడండి). అతడు సంగ్రహించుటకు సహాయపడిన పరిశుద్ధ మోర్మన్ గ్రంధ నివేదికను సూచిస్తూ, మొరోనై యొక్క మాటలు, ఇక్కడ సహాయకరంగా ఉంటాయి: “ఇప్పుడు, లోపములున్న యెడల అవి మనుష్యుల యొక్క పొరపాటులైయున్నవి; అందువల్ల, దేవుని యొక్క క్రియలను ఖండించకుడి” (మోర్మన్ గ్రంధము శీర్షిక పేజి). మరొక మాటలలో, లేఖన గ్రంధము దేవుని వాక్యముగా ఉండుటకు బదులుగా మానవ తప్పిదము నుండి విముక్తి పొందవలసిన అవసరము లేదు.

వివరణ

  1. అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ చెప్పారు: “ఈరోజు మనము బైబిలును అనుకోకుండా లేక యాదృచ్ఛికంగా కలిగిలేము. నీతిమంతులైన వ్యక్తులు వారు చూచిన పరిశుద్ధమైన విషయాలను మరియు వారి వినిన, మాట్లాడిన ప్రేరేపించబడిన మాటలను రెండిటిని వ్రాయడానికి ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు. మిగిలిన అంకితభావంగల వ్యక్తులు ఈ నివేదికలను కాపాడుటకు, భద్రపరచుటకు ప్రేరేపించబడ్డారు” (“The Miracle of the Holy Bible,” Liahona, May 2007, 80).