“జనవరి 3–9. ఆదికాండము 1–2; మోషే 2–3; అబ్రాహాము 4–5: ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జనవరి 3–9. ఆదికాండము 1–2; మోషే 2–3; అబ్రాహాము 4–5,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జనవరి 3–9
ఆదికాండము 1–2; మోషే 2–3; అబ్రాహాము 4–5
”ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను”
సృష్టి గురించి మీరిదివరకు చదివినప్పటికీ, ఎల్లప్పుడూ లేఖనముల నుండి మరికొంత నేర్చుకోవచ్చు. క్రొత్తగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడేందుకు పరిశుద్ధాత్మ నుండి నడిపింపు కొరకు ప్రార్థించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అందమైనది, దివ్యమైనది అయినందున అది “నిరాకారముగాను, శూన్యముగాను,” “శూన్యముగా, నిర్మానుష్యముగా” ఉన్నప్పుడు భూమిని ఊహించుకోవడం కష్టము (ఆదికాండము 1:2; అబ్రాహాము 4:2). అస్తవ్యస్తముగా ఉన్నదాని నుండి దేవుడు దివ్యమైన దానిని తయారు చేయగలడనేది సృష్టి వృత్తాంతము మనకు బోధించే విషయాలలో ఒకటి. జీవితం అస్తవ్యస్తంగా అనిపించినప్పుడు దానిని జ్ఞాపకముంచుకోవడం సహాయపడుతుంది. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు సృష్టికర్తలు, మనతో వారి సృజనాత్మక కార్యము ముగియలేదు. మన జీవితాల్లోని అంధకార క్షణాల్లో వారు వెలుగు ప్రకాశింపజేయగలరు. జీవితపు అనిశ్చితుల మధ్య స్థిరత్వాన్ని కనుగొనడానికి వారు సహాయపడగలరు. వారు మూలకములను ఆజ్ఞాపించగలరు, వాటివలె మనము వారి మాటకు లోబడినట్లయితే, మనం ఉద్దేశించబడినట్లుగా వారు మనల్ని అందమైన సృష్టిగా మార్చగలరు. దేవుని స్వరూపమందు ఆయన పోలిక చొప్పున సృష్టించబడడానికి గల అర్థములో భాగమది (ఆదికాండము 1:26). ఆయన వలె మహోన్నతమైన, మహిమకరమైన, సిలెస్టియల్ జీవులుగా కాగల సామర్థ్యము మనకున్నది.
ఆదికాండమును సమీక్షించుటకు, లేఖన సూచికలో “ఆదికాండము“ చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ఆదికాండము 1:1–25; మోషే 2:1–25; అబ్రాహాము 4:1–25
పరలోక తండ్రి నిర్దేశములో యేసు క్రీస్తు భూమిని సృష్టించెను.
ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ఇలా చెప్పారు, “సృష్టి విధానము యొక్క వివరాలు ఏవైనప్పటికీ అది అకస్మాత్తుగా జరిగినది కాదు, అది తండ్రియైన దేవుని నిర్దేశములో యేసు క్రీస్తు చేత అమలుచేయబడింది ” (“ఎందుకు వివాహం, ఎందుకు కుటుంబం,” లియహోనా, మే 2015, 51). లోకం ఎలా సృష్టించబడిందో అనేదాని గురించి ఖచ్చితంగా మనకు ఎక్కువగా తెలియనప్పటికీ, దేవుడు ఆదికాండము 1:1–25; మోషే 2:1–25; మరియు అబ్రాహాము 4:1–25 లో బయల్పరచిన దాని నుండి సృష్టి గురించి మీరు నేర్చుకున్న దానిని ధ్యానించండి. ఒకే పోలిక గల దేనిని ఈ వత్తాంతాలలో మీరు గమనించారు? భిన్నమైన దేనిని మీరు గమనించారు? మీరు సృష్టి గురించి చదువుతున్నప్పుడు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి మీకు కలిగిన ఆలోచనలేవి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 101:32–34 కూడా చూడండి.
ఆదికాండము 1:27–28; 2:18–25; మోషే 3:18, 21–25; అబ్రాహాము 5:14–19
స్త్రీ పురుషుల మధ్య వివాహం దేవునిచేత నియమించబడింది.
“శాశ్వతమైన యాజకత్వపు శక్తిచేత కాలము మరియు నిత్యత్వమంతటి కొరకు ఆదాము, హవ్వలు వివాహంలో జతచేయబడ్డారు” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “Lessons from Eve,” Ensign, నవ. 1987, 87). ఈ సత్యమును తెలుసుకొనుట ఎందుకు ముఖ్యము? మీరు ఆదికాండము 1:27–28; 2:18–25; మోషే 3:18, 21–25; and అబ్రాహాము 5:14–19 చదువుతున్నప్పుడు దీనిని ధ్యానించండి. దేవుని ప్రణాళికలో వివాహం గురించి మరింతగా తెలుసుకోవాలని మీరు కోరినట్లయితే, క్రింద ఇవ్వబడిన వనరులను చదివి, ధ్యానించండి. మీ వివాహాన్ని మెరుగుపరచడానికి లేక భవిష్యత్తులో వివాహం కొరకు సిద్ధపడడానికి మీరు ఏమి చేయాలని ఈ వనరులు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి?
మత్తయి 19:4–6; 1 కొరింథీయులకు 11:11; లిండా కె. బర్టన్,“మనము కలిసి ఆరోహణమగుదుము,” లియహోనా, మే 2015, 29–32; “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org కూడా చూడండి.
ఆదికాండము 2:2–3; మోషే 3:2–3; అబ్రాహాము 5:2–3
దేవుడు సబ్బాతుదినమును ఆశీర్వదించి, పరిశుద్ధపరచెను.
దేవుడు సబ్బాతుదినమును పరిశుద్ధపరచి, మనము దానిని పరిశుద్ధంగా ఆచరించాలని అడుగుతున్నారు. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు, “సబ్బాతు దేవుని సమయము, ఆయనను ఆరాధించి, ఆయన ఘనమైన మరియు విలువైన వాగ్దానాలను పొందుటకు, జ్ఞాపకము చేసుకొనుటకు ప్రత్యేకముగా ప్రక్కన పెట్టబడిన ఒక పరిశుద్ధ సమయము” (“అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానములు,” లియహోనా, నవ. 2017, 92). మీరు సబ్బాతుదినమును గౌరవించుటకు ఎందుకు ఎన్నుకున్నారని ఎవరికైనా వివరించడానికి ఈ వ్యాఖ్యానాన్ని మరియు ఆదికాండము 2:2–3; మోషే 3:2–3; లేక అబ్రాహాము 5:2–3 ను మీరెలా ఉపయోగించగలరు? ఆయన దినమును పరిశుద్ధంగా ఆచరించినందుకు ప్రభువు మిమ్మల్ని ఎలా దీవించారు?
యెషయా 58:13–14; సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–13; ChurchofJesusChrist.org కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
ఆదికాండము 1:1–25; మోషే 2:1–25; అబ్రాహాము 4:1–25.సృష్టి గురించి నేర్చుకోవడాన్ని మీ కుటుంబం కొరకు ఆహ్లాదకరంగా మీరెట్లు చేయగలరు? సృష్టి వృత్తాంతములో ప్రతి దశలో చేయబడిన నక్షత్రాలు, చెట్లు లేక జంతువులు వంటివాటి కొరకు బయట వెదకడానికి మీరు మీ కుటుంబాన్ని తీసుకువెళ్ళవచ్చు. ప్రతి దశలో సృష్టించబడిన వాటి చిత్రాలను కూడా మీరు చూపవచ్చు మరియు అందరు కలిసి సృష్టి వృత్తాంతములలో ఒకదానిని చదివిన తర్వాత చిత్రాలను వరుస క్రమంలో పెట్టమని కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుల గురించి ఈ సృష్టి మనకేమి బోధిస్తుంది?
-
ఆదికాండము 1; మోషే 2; అబ్రాహాము 4.సృష్టి వృత్తాంతమును సమీపించుటకు ఒక విధానము, దేవుడు తాను చేసిన వాటిని చూచి “మంచిదని” ఆదికాండము 1 లేక మోషే 2 లో ఎన్నిసార్లు చెప్పెనో కనుగొనమని మీ కుటుంబ సభ్యులను ఆహ్వానించడం. మనతో కలిపి—దేవుని సృష్టిని మనమెలా ఆదరించాలనే దాని గురించి ఇది ఏమి సూచిస్తుంది? అబ్రాహాము 4 లో ఈ సంఘటనలు వ్రాయబడిన విధానం నుండి మనమేమి నేర్చుకుంటాము?
-
ఆదికాండము 1:26–27; మోషే 2:26–27; అబ్రాహాము 4:26–27.మనము దేవుని స్వరూపములో సృష్టించబడ్డామని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము? మన గురించి, ఇతరులు మరియు దేవుని గురించి మనము భావించే విధానాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?
మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే, మీరు కలిసి మోషే 2:27 చదివి, ఒక సులువైన ఆట ఆడవచ్చు: పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తును చిత్రించిన ఒక చిత్రాన్ని చూపండి మరియు ఒకరి తర్వాత ఒకరు పరలోక తండ్రి లేక యేసు యొక్క శరీరంలో ఒక భాగాన్ని చూపమని కుటుంబ సభ్యులను అడగండి. అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు వారి శరీరాల్లో అదే భాగాన్ని గుర్తించవచ్చు.
-
ఆదికాండము 1:28; మోషే 2:28; అబ్రాహాము 4:28.“అభివృద్ధిపొంది, విస్తరించి భూమిని నింపమని దేవుడు తన పిల్లలకు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పటికీ ఉపయోగములో ఉన్నది” (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org). ఈ సత్యము తెలియనివారికి లేక వేరుగా నమ్మేవారికి ఈ ఆజ్ఞ గురించి మన నమ్మకాలను ఎలా వివరించాలో కుటుంబ సభ్యులు అభినయించి చూపవచ్చు.
-
ఆదికాండము 1:28; మోషే 2:28; అబ్రాహాము 4:28.“భూమి మీద ప్రాకు ప్రతి జీవిని … ఏలుట” అనగా అర్థమేమిటి? (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:16–21 కూడా చూడండి). భూమి పట్ల శ్రద్ధ వహించడానికి మన బాధ్యతను మన కుటుంబం ఏవిధంగా నెరవేర్చగలదు?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.