2022 పాత నిబంధన
ఫిబ్రవరి 14–20. ఆదికాండము 18–23: “యెహావాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?”


ఫిబ్రవరి 14–20. ఆదికాండము 18–23: ‘యెహావాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఫిబ్రవరి 14–20. ఆదికాండము 18–23,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

బాలుడైన ఇస్సాకును ఎత్తుకున్న శారా

శారా మరియు ఇస్సాకు, స్కాట్ స్నో చేత

ఫిబ్రవరి 14–20

ఆదికాండము 18–23

“యెహావాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా?”

ఆదికాండము 18–23 చదివి ధ్యానించి, మీ మనోభావాలను నమోదు చేయండి. ఈ అధ్యాయాలను చదవడంలో మీకు సహాయపడేందుకు మీరు ఈ సారాంశంలోని ఉపాయాలను ఉపయోగించవచ్చు మరియు ప్రత్యేకించి ప్రభువు మీ కొరకు లేఖనములలో కలిగియున్న ఇతర సందేశాల కొరకు వెదకడానికి కూడా మీరు ప్రేరేపించబడవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

(మన) దేవుడైన ప్రభువు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని (మనము) గైకొందుమో లేదోనని” (అబ్రాహాము 3:25) పరీక్షించబడుటకు మనము భూమిపై ఉన్నామని—దర్శనములో అబ్రాహాము నేర్చుకున్న సత్యానికి సాక్ష్యమే బాధాకరమైన మరియు ఉన్నతమైన సంఘటనలతో నిండిన అబ్రాహాము జీవితము. అబ్రాహాము తననుతాను విశ్వాసునిగా నిరూపించుకుంటాడా? వారి ముసలితనంలో కూడా అతడు మరియు శారా సంతానము లేకయుండగా, అధిక సంతతిని పొందెదవను దేవుని వాగ్దానములో అతడు విశ్వాసమును కొనసాగిస్తాడా? ఒకసారి ఇస్సాకు జన్మించిన తర్వాత, అనుకోని దానిని—ఆ నిబంధనను నెరవేర్చడానికి దేవుడు వాగ్దానం చేసిన అదే కుమారుడిని త్యాగం చేయమనే ఆజ్ఞను అబ్రాహాము విశ్వాసము సహించగలదా? అబ్రాహాము విశ్వాసియని నిరూపించుకున్నాడు. అబ్రాహాము దేవుడిని నమ్మాడు మరియు దేవుడు అబ్రాహామును నమ్మాడు. ఆదికాండము 18–23 లో మనం అబ్రాహాము మరియు ఇతరుల జీవితాల నుండి వృత్తాంతాలను కనుగొంటాము, అవి దుష్టత్వము నుండి పారిపోయి మరలా ఎన్నడూ వెనుదిరగకుండా ఉండేందుకు మరియు త్యాగము అవసరమైనప్పటికీ దేవుడిని నమ్మడానికి, దేవుడి వాగ్దానాలను నమ్మడానికి మన సామర్థ్యము గురించి ఆలోచించడానికి మనల్ని ప్రేరేపించగలవు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆదికాండము 18:9–14; 21:1–7

ప్రభువు తన యుక్తకాలమందు తన వాగ్దానాలను నెరవేర్చును.

ప్రభువు విశ్వాసులకు మహిమకరమైన వాగ్దానాలు చేసారు, కానీ కొన్నిసార్లు మన జీవితాల్లోని పరిస్థితులు ఆ వాగ్దానాలు నెరవేరడం సాధ్యమేనా అని మనం ఆశ్చర్యపడేలా చేస్తాయి. కొన్నిసార్లు అబ్రాహాము మరియు శారా ఆవిధంగా భావించియుండవచ్చు. వారి అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ఆదికాండము 17:4, 15–22 లో ప్రభువు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని పునర్వీక్షిస్తూ మీ అధ్యయనాన్ని ప్రారంభించడం సహాయకరంగా ఉండవచ్చు. అబ్రాహాము మరియు శారా ఎలా స్పందించారు? (జోసెఫ్ స్మిత్ అనువాదము, ఆదికాండము 17:23 [ఆదికాండము 17:17, పదబంధము ]; ఆదికాండము 18:9–12 కూడా చూడండి). ఆయన వాగ్దానాలందు అధిక విశ్వాసము కలిగియుండేందుకు వారికి సహాయపడడానికి ప్రభువు ఎలా స్పందించారు? (ఆదికాండము 18:14 చూడండి).

మీ విశ్వాసాన్ని వృద్ధిచేసేలా ఈ వచనాలలో దేనిని మీరు కనుగొంటారు? ప్రభువు మీకు చేసిన వాగ్దానాలను ఆయన విధానంలో యుక్తకాలమందు నెరవేరుస్తారని మీ జీవితంలో లేక మరెవరి జీవితంలోనైనా—ఏ ఇతర అనుభవాలు—మీ విశ్వాసాన్ని బలపరిచాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 88:68 కూడా చూడండి.

ఆదికాండము 19:12–29

దుష్టత్వము నుండి పారిపొమ్మని ప్రభువు మనల్ని ఆజ్ఞాపించును.

మీరు లోతు మరియు అతని కుటుంబము గురించి చదువుతున్నప్పుడు, దుష్టత్వము నుండి పారిపోవుట గురించి మీరు ఏ పాఠాలను నేర్చుకుంటారు? ఉదాహరణకు, నాశనమును తప్పించుకొనుటకు లోతు మరియు అతని కుటుంబానికి సహాయపడేందుకు దేవదూతలు ఏమి చెప్పారు మరియు చేసారు అనేదాని గురించి మిమ్మల్ని ఏది ప్రభావితం చేస్తుంది? (ఆదికాండము 19:12–17 చూడండి). లోకములోని చెడు ప్రభావాల నుండి పారిపోవడానికి లేక రక్షింపబడడానికి మీకు, మీ కుటుంబానికి ప్రభువు ఎలా సహాయం చేస్తారు?

సొదొమ మరియు గొమొఱ్ఱాల పాపముల గురించి మరింత తెలుసుకోవడానికి యెహెజ్కేలు 16:49–50 మరియు యూదా 1:7–8 చూడండి.

జోసెఫ్ స్మిత్ అనువాదం, ఆదికాండము 19:9–15 (బైబిలు పీఠికలో) కూడా చూడండి.

సొదొమ మరియు గొమొఱ్ఱాల నుండి లోతు, అతని కుటుంబము పారిపోవుట గురించి వివరణ

సొదొమ మరియు గొమొఱ్ఱాల నుండి పారిపోవుట, జూలియస్ ష్నార్ వాన్ కారోల్స్‌ఫెల్డ్ చేత

ఆదికాండము 19:26

లోతు భార్య ఏమి తప్పు చేసింది?

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ బోధించారు:

“స్పష్టంగా లోతు భార్య చేసిన తప్పు ఏమనగా, ఆమె వెనుకకు మాత్రమే చూడలేదు; తన మనస్సులో ఆమె వెనుకకు వెళ్ళాలని కోరుకుంది. ఆమె పట్టణ సరిహద్దులను దాటకముందే, సొదొమ మరియు గొమొఱ్ఱాలు ఆమెకు అందించిన వాటిని ఆమె కోల్పోతున్నట్లు భావించిందని కనబడుతున్నది. … ఆమెకు విశ్వాసం లేదు. ఆమెకు ఇదివరకు ఉన్నదాని కంటే మంచిదానిని ఇవ్వగల ప్రభువు సామర్థ్యాన్ని ఆమె సందేహించింది. …

“ప్రతి తరము యొక్క (జనులు) అందరికి, నేను చెప్తున్నాను, ‘లోతు భార్యను జ్ఞాపకముంచుకోండి’ [లూకా 17:32]. విశ్వాసము అనేది భవిష్యత్తు కొరకైనది. విశ్వాసము గతముపై నిర్మించబడుతుంది, కానీ అక్కడే ఉండిపోవాలని కోరుకోదు. మనలో ప్రతి ఒక్కరి కొరకు దేవుడు గొప్ప విషయాలను కలిగియున్నాడని మరియు క్రీస్తు నిజముగా ‘రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చునని’ విశ్వాసము నమ్ముతుంది (హెబ్రీయులకు 9:11)” (“The Best Is Yet to Be,” Ensign, జన. 2010, 24, 27).

ఆదికాండము 22:1–19

ఇస్సాకును బలిచ్చుటకు అబ్రాహాము సమ్మతి దేవుడు మరియు ఆయన కుమారుడిని పోలియున్నది.

ఇస్సాకును బలి ఇమ్మని దేవుడు అబ్రాహామును కోరడానికి గల కారణాలన్నీ మనకు తెలియవు; కానీ అది దేవునియందు అతని విశ్వాసానికి పరీక్షయని మనకు తెలుసు (ఆదికాండము 22:12–19 చూడండి). మీరు ఆదికాండము 22:1–19 చదువుతున్నప్పుడు, అబ్రాహాము అనుభవం నుండి మీరేమి నేర్చుకుంటారు?

తన కుమారుడిని బలివ్వడానికి అబ్రాహాము సమ్మతి “దేవుడు మరియు ఆయన అద్వితీయ కుమారుడిని పోలియున్నది” (జేకబ్ 4:5). అబ్రాహాము పరీక్ష మరియు మన కొరకు తండ్రియైన దేవుడు తన కుమారుడిని బలిగా అర్పించడం మధ్య గల పోలికలను మీరు ధ్యానిస్తున్నప్పుడు, మీ పరలోక తండ్రి గురించి మీరేమి భావిస్తారు?

ఇస్సాకు మరియు రక్షకుని మధ్య కూడా పోలికలున్నాయి. ఈ పోలికల కొరకు చూస్తూ ఆదికాండము 22:1–19 మరలా చదవడాన్ని పరిగణించండి.

“Akedah (The Binding)” (video), ChurchofJesusChrist.org కూడా చూడండి.

family study icon

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఆదికాండము 18:14.ప్రభువుకు అసాధ్యమైనది ఏదియు లేదని మీకు నేర్పిన వృత్తాంతాలేవైనా లేఖనముల నుండి, మీ కుటుంబ చరిత్ర నుండి లేక మీ జీవితం నుండి మీరు పంచుకోగలరా?

ఆదికాండము 18:16–33.ఈ వచనాల నుండి అబ్రాహాము స్వభావం గురించి మనమేమి నేర్చుకుంటాము? ఆయన మాదిరిని మనం ఎలా అనుసరించగలము? (ఆల్మా 10:22–23 కూడా చూడండి.)

ఆదికాండము 19:15–17.దుష్ట పరిస్థితుల నుండి వారు పారిపోవలసి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు సిద్ధపడేందుకు ఈ వచనాలు సహాయపడగలవు. ఈ పరిస్థితులలో కొన్ని ఏమైయుండవచ్చు? ఉదాహరణకు, సముచితముకాని మాధ్యమము లేక పనిలేని మాటలాడాలనే శోధన గురించి మీరు చర్చించవచ్చు. అటువంటి పరిస్థితుల నుండి మనమెలా పారిపోగలము?

ఆదికాండము 21:9–20.శారా మరియు అబ్రాహాము వారిని వెళ్ళగొట్టిన తర్వాత, దేవుడు హాగరు మరియు ఇష్మాయేలును ఆదరించిన విధానము గురించి మీ కుటుంబాన్ని ఏది ప్రభావితం చేస్తుంది?

ఆదికాండము 22:1–14.ఇస్సాకును బలివ్వమని దేవుడు అబ్రాహామును ఆజ్ఞాపించిన కథ మరియు రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగము మధ్య సంబంధమును చూడడానికి మీ కుటుంబానికి మీరెట్లు సహాయపడగలరు? ఈ సంఘటనల మధ్య వారు చూసిన పోలికల గురించి కుటుంబ సభ్యులు చర్చిస్తుండగా, మీరు అబ్రాహాము మరియు ఇస్సాకు, శిలువవేయబడుట యొక్క చిత్రాలను (పాత నిబంధన కథలు లో “అబ్రాహాము మరియు ఇస్సాకు” చూడండి) చూపవచ్చు. రక్షకుని త్యాగము గురించి మీరు ఒక పాటను లేక కీర్తనను కూడా పాడవచ్చు మరియు రక్షకుని త్యాగమును వర్ణించే వాక్యభాగాల కొరకు చూడవచ్చు.

ఒక కుటుంబముగా మనము ఏమి త్యాగం చేయాలని అడుగబడ్డాము? ఈ త్యాగాలు మనల్ని ఏవిధంగా దేవునికి దగ్గర చేస్తాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

ఆత్మను వినండి. మీరు చదువుతున్న దానితో వాటికి సంబంధం లేకపోయినప్పటికీ, మీరు చదువుతున్నప్పుడు మీ ఆలోచనలు మరియు భావనలపట్ల ఆసక్తి చూపండి. ఆ మనోభావాలు మీరు తెలుసుకోవాలని దేవుడు కోరుకునే విషయాలు కావచ్చు.

నడుచుచున్న అబ్రాహాము మరియు ఇస్సాకు

అబ్రాహాము మరియు ఇస్సాకు యొక్క వివరణ, జెఫ్ వార్డ్ చేత