“ఫిబ్రవరి 7–13. ఆదికాండము 12–17; అబ్రాహాము 1–2: ‘నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“ఫిబ్రవరి 7–13. ఆదికాండము 12–17; అబ్రాహాము 1–2,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
ఫిబ్రవరి 7–13
ఆదికాండము 12–17; అబ్రాహాము 1–2
“నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు”
అబ్రాము, శారయి (తరువాత అబ్రాహాము, శారా అని పిలువబడిరి) మరియు వారి కుటుంబము గురించి మీరు చదువుతున్నప్పుడు, వారి మాదిరులు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తాయో ధ్యానించండి. ”నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు” (అబ్రాహాము 1:2) మీరు ఏమి చేయగలరనే దాని గురించి మనోభావాలను నమోదు చేయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
దేవుడు అతనితో చేసిన నిబంధన కారణంగా అబ్రాహాము “విశ్వాసులకు తండ్రి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:41) మరియు “దేవుని స్నేహితుడు“ (యాకోబు 2:23) అని పిలువబడ్డాడు. వేలమంది నేడు అతడిని తమ ప్రత్యక్ష పూర్వీకునిగా గౌరవిస్తారు మరియు ఇతరులు యేసు క్రీస్తు సువార్తకు పరివర్తన చెందడం ద్వారా ఆయన కుటుంబంలోకి దత్తత తీసుకోబడ్డారు. అయినను అబ్రాహాము శ్రమలు గల కుటుంబం నుండి వచ్చాడు—అతని తండ్రి దేవుని యొక్క నిజమైన ఆరాధనను విడిచిపెట్టి, అబ్రాహామును అబద్ధ దేవుళ్ళకు బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ, “నీతికి గొప్ప అనుచరునిగాయుండుటకు” (అబ్రాహాము 1:2) అబ్రాహాము కోరుకున్నాడు మరియు దేవుడు అతని కోరికను గౌరవించాడని అతని జీవిత చరిత్ర చూపుతుంది. ఒక వ్యక్తి యొక్క కుటుంబ చరిత్ర ఏదైనప్పటికీ, భవిష్యత్తు నిరీక్షణతో నింపబడగలదు అనడానికి అబ్రాహాము జీవితం ఒక సాక్ష్యంగా నిలుస్తుంది.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
నా విశ్వాసము మరియు నీతిగల కోరికల మూలంగా దేవుడు నన్ను దీవిస్తాడు.
మనలో అనేకమంది వలె, అబ్రాహాము దుష్ట వాతావరణంలో జీవించాడు, అయినప్పటికీ అతడు నీతిగా ఉండాలని కోరుకున్నాడు. నీతిగల కోరికలను కలిగియుండవలసిన ప్రాముఖ్యత గురించి అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ బోధించారు: “పాపము చేయాలనే ప్రతి కోరికను వదిలివేయడం ముఖ్యమే అయినప్పటికీ, నిత్యజీవితానికి అంతకుమించినది అవసరము. మన నిత్య గమ్యాన్ని సాధించడానికి, ఒక నిత్యజీవిగా కావడానికి అవసరమైన సద్గుణాలను మనం కోరుకుంటాము మరియు అందుకోసం పనిచేస్తాము. … ఇది చాలా కష్టమనిపించినట్లయితే—ఖచ్చితంగా ఇది మనలో ఎవరికీ సులువు కాదు—అప్పుడు అటువంటి సుగుణాల కొరకు కోరికతో మనం ఆరంభించాలి మరియు మన భావాలతో సహాయపడేందుకు మన ప్రియమైన పరలోక తండ్రిని ప్రార్థించాలి [మొరోనై 7:48]” (“కోరిక,” లియహోనా, మే 2011, 44–45 చూడండి). మీరు అబ్రాహాము 1:1–19 చదువుతున్నప్పుడు, అధ్యక్షులు ఓక్స్ బోధించిన దానిని ఈ వచనాలు ఎలా నిరూపిస్తాయో పరిగణించండి. ఇటువంటి ప్రశ్నలు సహాయపడవచ్చు:
-
అబ్రాహాము దేనిని కోరుకున్నాడు మరియు వెదికాడు? తన విశ్వాసాన్ని రుజువు చేయడానికి అతడు ఏమి చేసాడు?
-
మీ కోరికలు ఏవి? మీ కోరికలను శుద్ధిచేసుకోవడానికి మీరు చేయవలసినది ఏదైనా ఉన్నదని మీరు భావిస్తున్నారా?
-
అతని నీతియుక్తమైన కోరికల కారణంగా అబ్రాహాము ఎదుర్కొన్న సవాళ్ళేవి? దేవుడు అతనికి ఎలా సహాయపడ్డాడు?
-
నీతిని కోరని కుటుంబ సభ్యులు గలవారి కొరకు ఈ వచనాలు ఏ సందేశాన్ని కలిగియున్నాయి?
మత్తయి 7:7 కూడా చూడండి.
అబ్రాహాము నిబంధనలో ఎవరు చేర్చబడ్డారు?
ప్రభువు అబ్రాహాముతో తన నిబంధన చేసినప్పుడు, ఈ నిబంధన అబ్రాహాము సంతతి లేక “సంతానము” తో కొనసాగుతుందని మరియు ”ఈ సువార్తను అంగీకరించు వారందరు … నీ సంతానముగా యెంచబడుదురు” (అబ్రాహాము 2:10–11) అని ఆయన వాగ్దానమిచ్చారు . దీని అర్థము, వారు అబ్రాహాము యొక్క నిజమైన వారసులైనా లేక యేసు క్రీస్తు సువార్తకు పరివర్తన చెంది బాప్తీస్మము ద్వారా ఆయన కుటుంబంలోకి దత్తత తీసుకోబడినా అబ్రాహాము నిబంధన యొక్క వాగ్దానాలు నేడు సంఘ సభ్యులకు అన్వయిస్తాయి (గలతీయులకు 3:26–29; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:30–32 చూడండి). అబ్రాహాము సంతానముగా లెక్కించబడేందుకు, ఒకరు సువార్త యొక్క చట్టములు, విధులకు తప్పక లోబడాలి.
ఆదికాండము 12:1–3; 13:15–16; 15:1–6; 17:1–8, 15–22; అబ్రాహాము 2:8–11
అబ్రాహాము నిబంధన నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తుంది.
సంఘ సభ్యులందరు అబ్రాహాము నిబంధనలో చేర్చబడినందున, ఈ నిబంధన మీ జీవితంలో ఎందుకు అర్థవంతమైనదని ధ్యానించడానికి మీరు కొంత సమయం కేటాయించాలని కోరవచ్చు. క్రింది ప్రశ్నల గురించి మీ ఆలోచనలను నమోదు చేయండి:
అబ్రాహాము 2:8–11లో కనుగొనబడు వాగ్దానాలు నన్ను, నా కుటుంబాన్ని ఏవిధంగా దీవిస్తాయి? (ఆదికాండము 12:1–3; 13:15–16 కూడా చూడండి).
ఆదికాండము 15:1–6; 17:1–8, 15–22 నుండి అబ్రాహాము నిబంధన గురించి నేనేమి నేర్చుకుంటాను?
“భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును” అను వాగ్దానమును నెరవేర్చడంలో సహాయపడేందుకు ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు నేను భావిస్తున్నాను? అబ్రాహాము 2:11.
అబ్రాహాము మరియు శారాలకు వాగ్దానమివ్వబడిన భూలోక దీవెనలు, అనగా వాగ్దాన దేశమును స్వాస్థ్యముగా పొందడం, గొప్ప సంతతికి తల్లిదండ్రులవడం, నిత్య సాదృశ్యాలను కలిగియుండడం వంటి వాటిని మీరు పరిగణించవచ్చు. వీటిలో సిలెస్టియల్ రాజ్యములో స్వాస్థ్యము (సిద్ధాంతము మరియు నిబంధనలు 132:29) మరియు నిత్య సంతతితోపాటు నిత్య వివాహము (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4; 132:20–24, 28–32) ఉన్నాయి. “దేవాలయంలో” అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు సంతానముగా “మనము మన అత్యున్నత దీవెనలు పొందుతాము” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు (“The Gathering of Scattered Israel,” Liahona, నవ. 2006, 80).
ఈ వనరులో “జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: నిబంధన“ చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
ఆదికాండము 13:5–12.అతని కుటుంబములో సమాధానము సృష్టించడానికి అబ్రాహాము ఏమి చేసాడు? మీ కుటుంబంలో తలెత్తగల వివాదాలను ఎలా పరిష్కరించాలని నటించి చూపుట ద్వారా అబ్రాహాము వలె సమాధానకర్త కావడాన్ని బహుశా మీ కుటుంబ సభ్యులు సాధన చేయవచ్చు.
-
ఆదికాండము 13:16; 15:2–6; 17:15–19.అబ్రాహాము మరియు శారా పిల్లలు కలిగియుండనప్పటికీ వారి సంతతి మట్టి రేణువులవలెను, ఆకాశ నక్షత్రములవలెను లేక సముద్ర తీరమందలి యిసుక రేణువులవలెను ఉండునని (ఆదికాండము 22:17)—ఈ వచనాలలో ప్రభువు యొక్క వాగ్దానాన్ని గ్రహించడానికి మీ కుటుంబ సభ్యులకు మీరెలా సహాయపడగలరు? బహుశా మీరు కుటుంబ సభ్యులకు ఒక యిసుక డబ్బా చూపవచ్చు, నక్షత్రాలు చూడవచ్చు లేక ఈ సారాంశంతో పాటు ఉన్న చిత్రాన్ని ఉపయోగించవచ్చు. అవి అసాధ్యమనిపించినప్పటికీ, దేవుని వాగ్దానాలను మనమెలా నమ్మగలము?
-
ఆదికాండము 14:18–20.ఆల్మా 13:13–19 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1–4 నుండి మెల్కీసెదెకు గురించి మనమేమి నేర్చుకుంటాము? మెల్కీసెదెకు పరిచర్య గురించి మనల్ని ప్రేరేపించేది ఏది?
-
ఆదికాండము 16.హాగరు గురించి చదువుట, మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రభువు మనకెలా సహాయపడతారని చర్చించడానికి ఒక అవకాశం కాగలదు. “ఇష్మాయేలు” అనగా “దేవుడు వింటాడు” అని అర్థమని మీరు చెప్పవచ్చు. మనకు అన్యాయం జరిగిందని మనం భావించినప్పుడు ప్రభువు విని, మనకు సహాయపడ్డారని మనమెప్పుడు భావించాము? (ఆదికాండము 16:11).
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.