2022 పాత నిబంధన
ఏప్రిల్ 18–24. నిర్గమకాండము 18–20: “యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము”


“ఏప్రిల్ 18–24. నిర్గమకాండము 18–20: “యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“ఏప్రిల్ 18–24. నిర్గమకాండము 18–20,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

పర్వతం

ఐగుప్తులో ఒక పర్వతమును సాంప్రదాయంకగా సీనాయి పర్వతం అని నమ్ముతారు.

ఏప్రిల్ 18–24

నిర్గమకాండము 18–20

“యెహోవా చెప్పినదంతయు మేము చేసెదము”

“[యేసు క్రీస్తు యొక్క] విశ్వాసులైన శిష్యులుగా, మీరు మీకు అనుకూలంగా, ఆయన ఆజ్ఞలతో ఏకరీతిగల వ్యక్తిగత ప్రేరేపణను మరియు బయల్పాటును పొందవచ్చును” (“Spiritual Capacity,” Liahona, Nov. 2019, 21) అని సహోదరి మిషెల్లి క్రైయిగ్ బోధించారు. నిర్గమకాండము 18–20 మీరు చదివినప్పుడు మీరు పొందే ప్రేరేపణను వ్రాసి, అమలు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణం అద్భుతములతో నిండియున్నది—అవి ప్రభువు యొక్క సాటిలేని శక్తి, ప్రేమ, మరియు దయ యొక్క కాదనలేని వ్యక్తీకరణలు. అయినప్పటికినీ, ఐగుప్తు నుండి వారిని విడిపించి, వారి శారీరక ఆకలి, దాహమును తీర్చడాన్ని మించి వారి కోసం భవిష్యత్తులో కలిగే దీవెనలను ప్రభువు కలిగియున్నాడు. ఆయన వారిని తన నిబంధన జనులుగా మారాలని, ఆయన “స్వకీయ సంపాద్యముగా,” “పరిశుద్ధమైన జనముగా” ఉండాలని కోరుకున్నాడు.(నిర్గమకాండము 19:5–6). ఈరోజు, ఈ నిబంధన యొక్క దీవెనలు కేవలము ఒక రాజ్యము లేక జనులను దాటి విస్తరించబడినవి. దేవుడు తన పిల్లలందరిని,“[ఆయన] మాటను శ్రద్ధగా విని, [ఆయన] నిబంధనను అనుసరించుటకు” (నిర్గమకాండము 19:5), ఆయన నిబంధన జనులుగా మారాలని కోరుతున్నాడు. ఏలయనగా “[ఆయనను], ప్రేమించి, [ఆయన] ఆజ్ఞలను గైకొనువారిని వెయ్యితరముల వరకు” ఆయన తన కనికరమును చూపును” ( నిర్గమకాండము 20:6).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

నిర్గమకాండము 18:13–26

ప్రభువు యొక్క కార్యమును చేయుటలో “భారమును మోయుటకు” నేను సహాయపడగలను.

మోషే తన మామ యిత్రో నుండి పొందిన సలహాను మీరు చదివినప్పుడు, 21 వచనములో వర్ణించబడిన (కొన్నిసార్లు “నమ్మకస్తులైన పురుషులుగా” అనువదించబడిన) “సత్యాసక్తి గల పురుషుల” వలే మీరు ఎలా ఉండగలరో ధ్యానించుము. మీ సంఘ నాయకుల యొక్క “భారమును మోయుటకు” మీరు ఎలా సహాయపడగలరు? (22 వచనము). ఉదాహరణకు, ఈ సలహా మీ పరిచర్య ప్రయత్నాలకు ఎలా సహాయపడుతుంది?

కొన్నిసార్లు, మీరు కూడ మోషే వలె ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తున్నరేమో కూడా మీరు ఆలోచించండి. యిత్రో సలహా మీకు ఎలా అన్వయిస్తుంది?

మోషైయ 4:27; Henry B. Eyring, “The Caregiver,” Liahona, Nov. 2012, 121–24 కూడ చూడుము.

ఒక స్త్రీతో కరచాలనము చేస్తున్న వ్యక్తి

ఇతరులకు పరిచర్య చేయుట ప్రభువు యొక్క కార్యములో మనము పాలుపంచుకోగల ఒక విధానము.

నిర్గమకాండము 19:3–6

ప్రభువు యొక్క నిబంధన జనులు ఆయనకు ఒక సంపద.

ప్రభువు యొక్క “స్వకీయ సంపాద్యముగా” ఉండుట అనగా మీకు అర్ధమేమిటో ఆలోచించుము (నిర్గమకాండము 19:5). అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ వాక్యభాగము యొక్క ఒక వివరణను ఇచ్చారు: “పాత నిబంధనలో, హెబ్రియ పదము, స్వకీయమైన నుండి అనువదించబడిన సెగుల్లా, అనగా అర్ధము ‘విలువైన ఆస్తి,’ లేక ‘సంపద.’ … {ప్రభువు యొక్క సేవకుల చేత ఆయన స్వకీయమైన జనులుగా గుర్తించబడుట మనకు అత్యున్నత క్రమమైన అభినందన” (“Children of the Covenant,” Ensign, May 1995, 34). మీ నిబంధనలను పాటించుట మిమ్మల్ని “స్వకీయమైన సంపాద్యముగా” చేస్తుందని తెలుసుకొనుట మీరు జీవించే విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది?

Gerrit W. Gong, “Covenant Belonging,” Liahona, Nov. 2019, 80–83 కూడా చూడుము.

నిర్గమకాండము 19:10–11, 17

పరిశుద్ధమైన అనుభవాలకు సిద్ధపాటు అవసరము.

వారు “దేవునిని ఎదుర్కొనుటకు”(నిర్గమకాండము 19:10–11, 17) ముందు ఇశ్రాయేలీయులు సిద్ధపడాల్సినవసరమున్నదని మరియు ఆయనతో ఒక నిబంధనను పాటించాల్సియున్నదని (నిర్గమకాండము 19:5 చూడుము) ప్రభువు మోషేతో చెప్పాడు. మీ జీవితంలో దేవాలయమునకు హాజరగుట లేక సంస్కారములో పాల్గొనుట వంటి పరిశుద్ధమైన అనుభవాల కోసం సిద్ధపడుటకు మీరేమి చేస్తారు? ఈ అనుభవాల కోసం ఎక్కువ సంపూర్ణంగా సిద్ధపడుటకు మీరు ఏమి చేయగలరు? సిద్ధపాటు అవసరమైన మిగిలిన ఆత్మీయ ప్రోత్సాహ కార్యక్రమాలను గూర్చి ఆలోచించుము, మరియు మీ సిద్ధపాటు మీకు కలిగే అనుభవాలను ఎలా ప్రభావితం చేస్తుందో ధ్యానించుము.

నిర్గమకాండము 20

దేవుడు దయామయుడు.

నిర్గమకాండము 20 మీరు చదివినప్పుడు, పది ఆజ్ఞలలో మీరు ఏవి పాటిస్తున్నారు మరియు ఏవి ఎక్కువ విశ్వసనీయంగా పాటిస్తున్నారని మీరు భావిస్తున్నారో గమనించుటకు ఆలోచించుము. మీరు పాటించడానికి ఒక ఆజ్ఞను ఎంపిక చేసుకొని, తరువాత లేఖనాలను చదవటం ద్వారా ఎక్కువ వివరంగా దానిని అధ్యయనము చేయవచ్చు (Guide to the Scriptures at scriptures.ChurchofJesusChrist.org) or conference messages (see the topics section of conference.ChurchofJesusChrist.org చూడుము). ఆ ఆజ్ఞను పాటించు వారికి కలిగే దీవెనలను మీ అధ్యయనంలో చేర్చుటకు ఆలోచించుము. ఈ దీవెనలు మీ కోసం దేవుని యొక్క కనికరమును మరియు ప్రేమను ఎలా చూపిస్తాయి?

Carole M. Stephens, “If Ye Love Me, Keep My Commandments,” Liahona, Nov. 2015, 118–20 కూడ చూడుము.

నిర్గమకాండము 20:1–7

ప్రభువును మీ జీవితంలో మొదటగా ఉంచుట ముఖ్యమైనది.

నిర్గమకాండము 20:1–7 చదువుట మీ జీవితంలో ప్రాధాన్యతలను గూర్చి ఆలోచించుటకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు—వాటిని మీరు ఒక జాబితాగా కూడ వ్రాయవచ్చు. దేవునికి ముందుగా ఉంచనట్లు మీరు శోధించబడగల కొన్ని “దేవుళ్లు” లేక “విగ్రహము[లు]” (నిర్గమకాండము 20:3–4) ఏవి? ప్రభువును మొదటగా ఉంచుట మీ జీవితంలోని ఇతర ముఖ్యమైన విషయాలతో మీకు ఎలా సహాయపడుతుంది? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై మీ దృష్టిని హెచ్చించుటకు మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారు?

Dallin H. Oaks, “No Other Gods,” Liahona, Nov. 2013, 72–75 కూడ చూడుము.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

నిర్గమకాండము 18:8–12దేవుని యొక్క విమోచనను గూర్చి మోషే యొక్క సాక్ష్యము యిత్రోపై ఏ ప్రభావాన్ని కలిగియున్నది? మన కుటుంబము కొరకు ప్రభువు చేసిన గొప్ప విషయాలేవి? మన అనుభవాలను మనము ఎవరితో పంచుకోవచ్చు? భవిష్యత్తు తరముల కోసము ఆ అనుభవాలను మనము ఎలా భద్రపరచవచ్చు?

నిర్గమకాండము 18:13–26.బిషప్పు, యువత నాయకులు, లేక ప్రాధమిక బోధకులు వంటి, మీ స్థానిక సంఘ నాయకుల సేవ గురించి ఆలోచించుటకు ఈ వచనాలు మీ కుటుంబాన్ని ప్రేరేపించవచ్చు. ఒక వ్యక్తి ఒంటరిగా మోయడానికి “మిక్కిలి భారముగా” (నిర్గమకాండము 18:18) కనిపించే వారు కలిగియున్న బాధ్యతలేవి? వారి భారములను పైకెత్తుటకు సహాయపడుటకు మనము ఏమి చేయగలము?

నిర్గమకాండము 20:3–17.ఒక కుటుంబముగా పది ఆజ్ఞలను చర్చించుటకు ఒక అర్ధవంతమైన విధానమును గూర్చి ఆలోచించుము. ఉదాహరణకు,నిర్గమకాండము 20:3–17 లోని ఆజ్ఞలను పది కాగితపు ముక్కలపై మీరు వ్రాయవచ్చు. కుటుంబ సబ్యులు వాటిని రెండు వర్గములుగా విభజించవచ్చు: (1)దేవునిని ఘనపరచుట (2) ఇతరులను ప్రేమించుట ( మత్తయి 22:36–40 కూడ చూడుము). ఈ వారము ఒక ఆజ్ఞ లేక రెండు ఎంపిక చేసి, కలిసి దానిని ఎక్కువ సవివరంగా చర్చించుటకు ఆలోచించుము. ఉదాహరణకు, ఈ ఆజ్ఞకు విధేయులగుట మన కుటుంబాన్ని ఎలా బలపరుస్తుంది? రక్షకుడు దానికి ఎలా విధేయుడయ్యెను?

నిర్గమకాండము 20:12.నిర్గమకాండము 20:12 సరిగా గ్రహించుటకు, “ఘనపరచు” మాట యొక్క నిర్వచనాలను మీ కుటుంబము వెదకిన యెడల అది సహాయపడవచ్చు. తరువాత కుటుంబ సభ్యులు మన తల్లిదండ్రులను ఘనపరచునట్లు మనము చేయగల విషయాలను వరసగా వ్రాయవచ్చు. తల్లిదండ్రులను ఘనపరచుట గురించి “Quickly I’ll Obey” (Children’s Songbook, 197), వంటి ఒక పాటను మీరు పాడవచ్చు, లేక మరియు పాటకు క్రొత పల్లవులను వ్రాయుటకు మీ జాబితాలో కొన్ని ఉపాయములను ఉపయోగించుము.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Keep the Commandments,” Children’s Songbook, 146–47.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీకు అనుకూలంగా ఉండే సమయాన్ని కనుగొనండి. మీరు లేఖనాలను అంతరాయం లేకుండా అధ్యయనం చేయగలిగినప్పుడు వాటినుండి నేర్చుకోవడం తరచు సులభమౌతుంది. మీకు అనుకూలంగా ఉండే సమయాన్ని కనుగొనండి, మరియు ప్రతి రోజు ఆ సమయంలో స్థిరంగా అధ్యయనం చేయడానికి మీ వంతు కృషి చేయండి.

మోషే రాతి పలకలను పట్టుకొనుట

సామ్ లాలర్ చేత, పది ఆజ్ఞలను మోషే పట్టుకొనుట యొక్క దృష్టాంతము