“ఏప్రిల్ 25–మే 1. నిర్గమకాండము 24; 31–34: “నా సన్నిధి నీకు తోడుగా వచ్చును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“ఏప్రిల్ 25–మే 1. నిర్గమకాండము 24; 31–34,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
ఏప్రిల్ 25–మే 1
నిర్గమకాండము 24; 31–34
“నా సన్నిధి నీకు తోడుగా వచ్చును”
లేఖనములో ప్రతి అర్థవంతమైన సూత్రము ఈ సంక్షేప వర్ణనలో గుర్తించబడదు. మీకు అవసరమైన సత్యములపై దృష్టిసారించుటలో మీకు సహాయపడుటకు ఆత్మను ఆలకించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
వారికి ఆయన ధర్మశాస్త్రమును వెల్లడిపరచిన తరువాత ఇశ్రాయేలీయులు దేవునికి యధార్థముగా ఉంటారని ఆశించడానికి కారణమున్నది (నిర్గమకాండము 20–23 చూడండి). వారు గతంలో సణిగి, సందేహించినప్పటికీ, సీనాయి పర్వతం అడుగున మోషే ధర్మశాస్త్రమును చదివినప్పుడు, వారు ఈ నిబంధనను చేసారు: “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము” (నిర్గమకాండము 24:7). తరువాత దేవుడు మోషేను కొండపైకి పిలిచి, “నేను వారిలో నివసించునట్లు” (నిర్గమకాండము 25:8; 25–30 అధ్యాయములు చూడండి) ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని అతడితో చెప్పాడు.
కానీ మోషే పర్వతంపై ఉండి, వారి మధ్య దేవుని యొక్క సన్నిధిని ఇశ్రాయేలీయులు ఎలా కలిగి ఉండగలరో నేర్చుకొనుచుండగా, దానికి బదులుగా పర్వతం క్రింద ఇశ్రాయేలీయులు వారు పూజించుటకు ఒక బంగారు విగ్రహాన్ని చేస్తున్నారు. “వేరొక దేవుడు ఉండకూడదు,” అని అప్పుడే వారు వాగ్దానము చేసారు, అయినప్పటికీ వారు దేవుని ఆజ్ఞలనుండి “త్వరగా తొలగిపోయిరి” (నిర్గమకాండము 20:3; 32:8; నిర్గమకాండము 24:3 కూడా చూడండి). అది విస్మయం కలిగించే మలుపు, కానీ కొన్నిసార్లు విశ్వాసము మరియు నిబద్ధత అనేవి అసహనము భయము లేదా అనుమానంతో జయించబడవచ్చని అనుభవము నుండి మనకు తెలుసు. మన జీవితాలలో ప్రభువు యొక్క సన్నిధిని మనము వెదకినప్పుడు, ప్రభువు ప్రాచీన ఇశ్రాయేలును వదిలి వేయలేదని, ఆయన మనల్ని విడువడని తెలుసుకొనుట ప్రోత్సాహము కలిగిస్తుంది—ఏలయనగా ఆయన “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగలవాడు” (నిర్గమకాండము 34:6).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
నా నిబంధనలు దేవుని ధర్మశాస్త్రముకు విధేయత చూపుటకు నా సమ్మతిని చూపును.
దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగుటకు ఇశ్రాయేలీయులు నిబంధన చేయుట గురించి నిర్గమకాండము 24:3–8 లో మీరు చదివినప్పుడు, మీ ఆలోచనలు దేవునితో మీరు చేసిన నిబంధనల వైపు మరలవచ్చు. ఇశ్రాయేలు యొక్క నిబంధన నేడు దేవునికి అవసరమైన దానినుండి భిన్నమైన ఆచారాలను కలిగియున్నది, కానీ ఈ ఆచారాలలో చిహ్నపూర్వకంగా ఉన్న నిత్య సత్యాలను పరిశీలిస్తే, కొన్ని పోలికలను మీరు గమనించవచ్చు.
ఉదాహరణకు, 4, 5, మరియు 8 వచనములు ఒక బలిపీఠము, జంతు బలులు మరియు రక్తమును ప్రస్తావించును. ఈ విషయాలు వేటిని సూచిస్తాయి, మరియు అవి మీ నిబంధనలకు ఎలా సంబంధిస్తాయి? “యెహోవా చెప్పినవన్నియు” చేయడానికి మీ నిబంధనలు మీకు ఎలా సహాయపడతాయి? (7 వచనము).
మోషే 5:4–9; Becky Craven, “Careful versus Casual,” లియహోనా మే 2019, 9–11 కూడా చూడండి.
పాపము అనగా దేవుని నుండి దూరంగా తొలగిపోవుట, కానీ ఆయన యొద్దకు తిరిగి రావడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసారు.
వారి నిబంధనలు ఉల్లంఘించుట ద్వారా ఇశ్రాయేలీయులు ఎంత త్వరగా “చెడిపోయారో”(నిర్గమకాండము 32:7) లోతుగా ఆలోచించుట ద్వారా, మనము అటువంటి తప్పులను నివారించవచ్చును. మీరు నిర్గమకాండము 32:1–8 చదివినప్పుడు, ఆ సమయంలో ఇశ్రాయేలీయుల స్థానములో మీరున్నట్లు ఊహించడానికి ప్రయత్నించండి—మీరు అరణ్యములో ఉన్నారు, మోషే వెళ్లి 40 రోజులు అయ్యింది, అతడు ఎప్పుడు వస్తాడో లేక రాడో మీకు తెలియదు, మరియు భవిష్యత్తులో వాగ్దాన దేశముపై కనానీయులతో ఒక యుద్ధమున్నది (నిర్గమకాండము 23:22–31 కూడా చూడండి). ఇశ్రాయేలీయులు ఒక బంగారు విగ్రహమును ఎందుకు కోరుకున్నారని మీరనుకుంటున్నారు? ఇశ్రాయేలీయుల పాపము ఎందుకంత తీవ్రమైనది? రక్షకుని కంటె వేరొకరిని లేక వేరొకదానియందు మీ నమ్మకముంచుటకు మీరు శోధించబడే విధానాలను ధ్యానించడానికి ఈ వచనాలు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీ జీవితంలో దేవుడిని పూర్తిగా మొదటి స్థానంలో ఉంచునట్లు చేయడానికి మీరు ప్రేరేపించబడినది ఏదైనా ఉన్నదా? నిర్గమకాండము 33:11–17 లో ప్రభువు మోషే యొక్క మనవి గురించి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి?
ఇశ్రాయేలీయుల పాపము తీవ్రమై ఉండగా, దేవుని యొక్క కనికరము మరియు క్షమాపణ సందేశాన్ని కూడా ఈ కథనము కలిగియున్నది. నిర్గమకాండము 34:1–10 రక్షకుని గురించి మీకేమి బోధిస్తుంది? ఇశ్రాయేలీయుల తరఫును మోషే క్రియలు యేసు క్రీస్తు సమస్త జనులకు చేసిన దానిని మీకు ఎలా జ్ఞాపకం చేస్తున్నాయి? (నిర్గమకాండము 32:30–32; మోషైయ 14:4–8; 15:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3–5 చూడండి).
జోసెఫ్ స్మిత్ అనువాదము, నిర్గమకాండము 34:1–2 (బైబిలు అనుబంధములో)
మోషే చేసిన రెండు జతల రాతి పలకల మధ్య తేడా ఏమిటి?
పర్వతంపై నుండి మోషే క్రిందకు వచ్చినప్పుడు, అతడు రాతి పలకలపై వ్రాయబడిన ధర్మశాస్త్రమును తెచ్చాడు. ఇశ్రాయేలీయులు వారి నిబంధనను ఉల్లంఘించారని తెలుసుకున్న తరువాత, మోషే పలకలు విరగగొట్టాడు (నిర్గమకాండము 31:18; 32:19). తరువాత, దేవుడు మోషేను మరొక రాతి పలకలను చేసి, పర్వతం పైకి తిరిగి తీసుకొనిరమ్మని ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 34:1–4 చూడండి). జోసెఫ్ స్మిత్ అనువాదము, నిర్గమకాండము 34:1–2 (బైబిలు అనుబంధములో) మొదటి రాతి పలకల జత దేవుని విధుల “పరిశుద్ధ క్రమము,” లేక మెల్కీసెదకు యాజకత్వము యొక్క విధులను కలిగియున్నది. రెండవ జత “శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలుగల ధర్మశాస్త్రము,” కలిగియున్నది. ఇది “లఘు యాజకత్వము,” చేత నిర్వహించబడే చిన్న ధర్మశాస్త్రము, అది ఇశ్రాయేలీయులను ఉన్నతమైన ధర్మశాస్త్రము మరియు ఉన్నతమైన యాజకత్వము కొరకు సిద్ధపరచుటకు ఉద్దేశించబడింది, ఆవిధంగా వారు ఎక్కువ సంపూర్ణంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలరు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:17–27 చూడండి).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
నిర్గమకాండము 31:12–13, 16–17.ఈ వచనాలను చదివిన తరువాత, బహుశా మీ కుటుంబము ఆదివారము మన ప్రవర్తన గురించి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ప్రశ్న గురించి చర్చించవచ్చు: “ఆయన కొరకు మీ ప్రేమను చూపడానికి ప్రభువుకు మీరు ఏ సూచనను ఇస్తారు?” (“The Sabbath Is a Delight,” Liahona, May 2015, 130). విశ్రాంతి దినమున ప్రభువు కొరకు మీ ప్రేమను మీరు ఎలా చూపిస్తారో జ్ఞాపకం చేయడానికి మీ గృహం చుట్టూ ఉంచడానికి కొన్ని సూచనలను మీ కుటుంబము చేయవచ్చు. (“Sabbath Day—At Home” [ChurchofJesusChrist.org] వీడియో సేకరణను కూడా చూడండి.)
-
నిర్గమకాండము 32:1–8.ఇశ్రాయేలీయులు దేవుని నుండి ఎలా దూరమయ్యారో చర్చించుటలో మీ కుటుంబానికి సహాయపడుటకు, నేలపై ఒక త్రోవను ఏర్పరచుటను పరిగణించండి (లేదా మీ ఇంటి సమీపంలో ఒక దానిని కనుగొనండి). త్రోవపై నడుస్తుండగా, “[యెహోవా] నియమించిన త్రోవనుండి” తొలగిపోవుటకు మనము అనుభవించే శోధనల గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుకోవచ్చు. త్రోవలో మనము ఎలా నిలిచియుండగలము? మనము తప్పిపోయిన యెడల, మనము దానికి తిరిగి ఎలా వెళ్ళగలము? రక్షకుడు మనకు ఎలా సహాయగలడు?
-
నిర్గమకాండము 32:26.ఇశ్రాయేలీయులు ఒక విగ్రహాన్ని పూజిస్తున్నట్లు కనబడిన తరువాత, మోషే “యెహోవా పక్షమును ఎవరున్నారు?” అని అడిగాడు. మనము ప్రభువు పక్షమున ఉన్నామని ఎలా చూపగలము?
-
నిర్గమకాండము 33:14–15.మోషేకు దేవుడు వాగ్దానము చేసిన దానిని వారు అనుభవించినప్పుడు అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు: “నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను.”
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.