2022 పాత నిబంధన
మే 16–22. ద్వితీయోపదేశకాండము 6–8; 15; 18; 29–30; 34: “యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము”


“మే 16–22. ద్వితీయోపదేశకాండము 6–8; 15; 18; 29–30; 34: “యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“మే 16–22. ద్వితీయోపదేశకాండము 6–8; 15; 18; 29–30; 34;” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

కొండపై నిలువబడిన మోషే

నెబొ కొండపై మోషే యొక్క దృష్టాంతము, © Providence Collection/licensed from goodsalt.com

మే 16–22

ద్వితీయోపదేశకాండము 6–8; 15; 18; 29–30; 34

“యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము”

వారి పిల్లలకు ప్రభువు యొక్క మాటలను బోధించమని మోషే ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించాడు (ద్వితీయోపదేశకాండము 6:7 చూడండి). ఈ వారము ద్వితీయోపదేశకాండమును మీరు చదివినప్పుడు, మీరు నేర్చుకొన్న దానిని మీ కుటుంబ సభ్యులతో పంచుకొనే విధానాలను వెదకండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మండుచున్న పొద నుండి దేవుడు అతడితో మాట్లాడినప్పుడు, మోషే యొక్క భూలోక పరిచర్య ఒక కొండపై ప్రారంభమైంది (నిర్గమకాండము 3:1–10 చూడండి). 40 సంవత్సరాల తరువాత, దేవుడు నెబో కొండపై నుండి వాగ్దాన దేశము యొక్క సంగ్రహావలోకనమును ఇచ్చినప్పుడు, అది కొండపైన ముగించబడింది (ద్వితీయోపదేశకాండము 34:1–4 చూడండి). ఆ వాగ్దాన దేశమును ప్రవేశించుటకు ఇశ్రాయేలీయులను సిద్ధపరచుటలో మోషే తన జీవితాన్ని గడిపాడు, మరియు ఇశ్రాయేలీయులతో అతడి చివరి సూచనలు, జ్ఞాపికలు, ఉద్భోదలు, మరియు మనవులను ద్వితీయోపదేశకాండము నమోదు చేసింది. మోషే తన మాటలను చదువుట ద్వారా తన పరిచర్య యొక్క నిజమైన ఉద్దేశము జనులకు అవసరమైన సిద్ధపాటు అని, అది అరణ్యములో బ్రతికియుండుట, రాజ్యములు జయించుట, లేక ఒక సమాజమును నిర్మించుట కాదని స్పష్టము చేసెను. అది దేవుడిని ప్రేమించుట, ఆయనకు విధేయులగుట, మరియు ఆయనకు నమ్మకంగా నిలిచియుండుటను గూర్చినది. నిత్య జీవము యొక్క వాగ్దాన దేశములో ప్రవేశించడానికి బదులుగా మనందరికీ అవసరమైన సిద్ధపాటు అది. “పాలు తేనెలు ప్రవహించే దేశములో” నిర్గమకాండము 3:8 మోషే ఎన్నడూ కాలు పెట్టనప్పటికీ, అతడి విశ్వాసము, విశ్వసనీయత వలన, ఆయనను వెంబడించు వారందరి కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దాన దేశములో అతడు ప్రవేశించాడు.

ద్వితీయోపదేశకాండము సంక్షేప వివరణ కొరకు, బైబిలు నిఘంటువులో “ద్వితీయోపదేశకాండము” చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ద్వితీయోపదేశకాండము 6:4–7; 8:2–5, 11–17; 29:18–20; 30:6–10, 15–20

నేను నా పూర్ణ హృదయముతో ప్రేమించాలని ప్రభువు కోరుతున్నాడు.

అతడి చివరి బోధనలలో, ఇశ్రాయేలీయులకు మోషే జ్ఞాపకం చేసాడు, అరణ్యములో ఉన్నప్పుడు కూడా “ఈ నలుబది సంవత్సరాలు, నీ దేవుడైన ప్రభువు మీతో ఉన్నాడు; నీకేమియు తక్కువకాదు,” (ద్వితీయోపదేశకాండము 2:7). ఇప్పుడు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములో, “[వారు] కట్టని గొప్పవగు మంచిపురములను, [వారు] నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను” (ద్వితీయోపదేశకాండము 6:10–11) ప్రవేశిస్తున్నారు, వారు తమ హృదయాలను కఠినపరచుకొని, ప్రభువును మరచిపోతారని మోషే భయపడ్డాడు.

మోషే సలహాను మీరు చదివినప్పుడు మీ స్వంత హృదయపు పరిస్థితిని పరిశీలించండి. మీరు ఈ క్రింది వచనాలపై దృష్టిసారించి, మీ భావాలను వ్రాయడానికి కోరవచ్చు:

మీ హృదయమును కఠినపరచుకొనుట నుండి కాపాడి, మీ పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించుటకు మీరేమి చేయగలరు? ద్వితీయోపదేశకాండము 6:5–6 మరియు మత్తయి 22:35–40 మధ్య గల సంబంధమేమిటి? (లేవియకాండము 19:18 కూడా చూడండి).

Dieter F. Uchtdorf, “A Yearning for Home,” Liahona, Nov. 2017, 21–24 కూడా చూడండి.

ద్వితీయోపదేశకాండము 6:4–12, 20–25

“యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము”

వాగ్దాన దేశము ప్రవేశించే ఇశ్రాయేలీయుల తరములో ఎక్కువమంది ఐగుప్తులోని వ్యాధులను చూడలేదు లేక ఎర్ర సముద్రమును దాటలేదు. వారు దేవుని జనులుగా నిలిచి ఉండాల్సిన యెడల, వారు—మరియు భవిష్యత్తు తరములు—దేవుని యొక్క అద్భుతాలను, శాసనములను జ్ఞాపకముంచుకోవాల్సిన అవసరమున్నదని మోషే ఎరుగును.

ద్వితీయోపదేశకాండము 6:4–12, 20–25 లో దేవుడు మీకు చేసిన గొప్ప విషయాలను జ్ఞాపకముంచుకొనుటకు మీకు సహాయపడునట్లు మోషే ఇచ్చిన సలహా ఏమిటి? ప్రభువు యొక్క వాక్యము “నీ హృదయములో ఉండునట్లు” మీరేమి చేయడానికి ప్రేరేపించబడ్డారు? (6వ వచనము).

భవిష్యత్తు తరములకు మీ విశ్వాసమును మీరు ఎలా అందిస్తారు?

ద్వితీయోపదేశ కాండము 11:18–21; Gerrit W. Gong, “Always Remember Him,” Liahona, May 2016, 108–11; Bible Dictionary, “Frontlets or phylacteries” కూడా చూడండి.

ద్వితీయోపదేశ కాండము 15:1–15

అవసరతలో ఉన్న వారికి సహాయపడుటకు ఉదారమైన హస్తములు మరియు ప్రభువు చిత్తమును అనుసరించుటకు సమ్మతిగల హృదయాలు అవసరం.

ద్వితీయోపదేశ కాండము 15:1–15 నేడు అనుసరించని కొన్ని ప్రత్యేక ఆచరణలు కలిపి, అవసరతలో ఉన్న వారికి సహాయపడుట గురించి సలహా ఇచ్చును. కానీ పేదవారికి మనము ఎందుకు సహాయపడాలి మరియు వారికి సహాయపడుట గురించి మన వైఖరులు ప్రభువుకు ఎలా ముఖ్యమైనవో ఈ వచనాలు ఏమి బోధిస్తున్నాయో గమనించండి. ఇతరులకు సేవ చేయడం గురించి ఈ వచనాల నుండి మీరు ఏమి నేర్చుకోవాలని ప్రభువు మిమ్మల్ని కోరుతున్నాడు?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “The Second Great Commandment,” Liahona, Nov. 2019, 96–100 కూడా చూడండి.

ద్వితీయోపదేశ కాండము 18:15–19

యేసు క్రీస్తు ప్రవక్త, ఆయన మోషే వలె పెరిగి పెద్దవాడయ్యాడు.

పేతురు, నీఫై, మొరోనై, మరియు రక్షకుడు అందరూ ద్వితీయోపదేశ కాండము 18:15–19 ( లోని ప్రవచనంపై వ్యాఖ్యానించారు (అపొస్తులుల కార్యములు 3:20–23; 1 నీఫై 22:20–21; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:40; 3 నీఫై 20:23 చూడండి). ఈ వచనాల నుండి యేసు క్రీస్తు గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? రక్షకుడు మోషేను ఎలా “పోలియున్నాడు” ? (ద్వితీయోపదేశ కాండము 18:15).

మోకరించి ఒక వ్యక్తిని పట్టుకొనిన యేసు

యేసు క్రీస్తు మోషే మాదిరిగా ప్రవక్త.

ద్వితీయోపదేశ కాండము 34:5–8

మోషేకు ఏమి జరిగింది?

ద్వితీయోపదేశ కాండము 34:5–8 మోషే చనిపోయాడని చెప్పినప్పటికీ, కడవరి-దిన జ్ఞానము అతడు రూపాంతరము చెందాడని లేక మార్పు చెందాడని స్పష్టపరుచును ఆవిధంగా అతడు పునరుత్థానము చెందేంతవరకు బాధ లేక మరణమును అనుభవించడు (ఆల్మా 45:18–19; Bible Dictionary, “Moses”; Guide to the Scriptures, “Translated Beings,” scriptures.ChurchofJesusChrist.org) మోషే రూపాంతరం చెందుట ముఖ్యమైనది, ఎందుకనగా అతడు పేతురు, యాకోబు, యోహానులకు రూపాంతరం కొండపై యాజకత్వ తాళపు చెవులు ఇవ్వడానికి బదులుగా, అతడు భౌతిక శరీరాన్ని కలిగియుండాల్సిన అవసరమున్నది (మత్తయి 17:1–13 చూడండి).

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ద్వితీయోపదేశ కాండము 6:10–15.మీ కుటుంబము దీవించబడిన విధానాలను ఆలోచించుటకు ఈ వచనాలు మీ కుటుంబ సభ్యులను ప్రేరేపించవచ్చు. “యెహోవాను మరువకుండా జాగ్రత్తపడుము” అనే సలహాను మనము ఎలా అనుసరించగలము? (ద్వితీయోపదేశ కాండము 6:12). బహుశా దినచర్య పుస్తకంలో లేక కుటుంబ పరిశోధనలో, మీ దీవెనలను గూర్చి మీ భావనలు వ్రాయడానికి మీరు కోరవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 6:13, 16; 8:3.ఆయన జీవితంలో ముఖ్యమైన సమయంలో ఈ వచనాలు రక్షకునికి సహాయపడినవి; ఎలాగో చూడడానికి కలిసి మత్తయి 4:1–10 చదవండి. అవసరమైన సమయాలలో మనకు సహాయపడిన లేఖన భాగాలేవి?

ద్వితీయోపదేశ కాండము 7:6–9 .మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన వారిగా భావించుటకు సహాయపడుటకు ఏదైనా చేయండి, అది ఇష్టమైన ఒక వంటను వండటం వంటిది. తరువాత ద్వితీయోపదేశ కాండము 7:6–9 మీరు చదవవచ్చు మరియు “ప్రతిష్టిత జనముగా” ఉండుట అనగా అర్థమేమిటని మీరు భావిస్తున్నారో చర్చించండి (6వ వచనము).

ద్వితీయోపదేశ కాండము 29:12–13 .ద్వితీయోపదేశ కాండము 29:12–13 గురించి మాట్లాడుట వలన మీ కుటుంబ సభ్యులు పరలోక తండ్రితో చేసిన లేక చేయబోయే నిబంధనలను చర్చించుటకు అవకాశమిస్తుంది. దేవుని యొక్క జనులుగా ఉండటం అనగా ఏమిటి? మన నిబంధనలు ఎలా “[దేవునికి] … స్వజనముగా [మనల్ని] నియమిస్తాయి”? (13వ వచనము).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీ స్వంత ఆత్మీయ అంతరార్థములను వెదకండి. ఈ సంక్షేప వివరణ దృష్టిసారించాల్సిన వాక్యభాగాలను, సూత్రాలను సూచిస్తుంది, కానీ ఈ సూచనలు మీ అధ్యయనాన్ని పరిమితం చేయనివ్వకండి. మీరు అధ్యయనం చేసినప్పుడు, ఇక్కడ చెప్పబడని ఒక సూత్రము గురించి మీరు నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకోవాల్సిన దానికి ఆత్మ మిమ్మల్ని నడిపించనియ్యుము.

కొండపై నిలబడియున్న మోషే

ప్రభువు అతడికి సమస్త దేశమును చూపించెను, వాల్టర్ రేని చేత