“మే 2–8. నిర్గమకాండము 35–40; లేవీయకాండము 1; 16; 19: ‘యెహోవా పరిశుద్ధుడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“మే 2–8. నిర్గమకాండము 35–40; లేవీయకాండము 1; 16; 19,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
మే 2–8
నిర్గమకాండము 35–40; లేవీయకాండము 1; 16; 19
“యెహోవా పరిశుద్ధుడు”
మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు, మీరు మరింతగా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తువలె కాగల విధానాల గురించి మీరు పొందే ఆత్మీయ మనోభావాలపట్ల శ్రద్ధ వహించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
ఐగుప్తును విడిచివెళ్ళడం—ముఖ్యమైనది మరియు అద్భుతమైనది అయినప్పటికీ—ఇశ్రాయేలీయుల కొరకు దేవుని ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చలేదు. వాగ్దానదేశంలో భవిష్యత్తు వృద్ధి కూడా వారి కొరకు దేవుని అంతిమ లక్ష్యం కాదు. ఇవి దేవుడు తన జనుల కొరకు నిజంగా కోరుకున్న దానివైపు పురోగతిని చూపుతున్నాయి: “మీరు పరిశుద్ధులైయుండవలెను: మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను” (లేవీయకాండము 19:2). తరతరాల నుండి చెర తప్ప వారికింకేమి తెలియనప్పుడు, తన జనులను పరిశుద్ధులుగా చేయాలని దేవుడు ఏవిధముగా కోరెను? యెహోవా పరిశుద్ధునికి ఒక ప్రదేశము—అరణ్యములో ఒక గుడారమును తయారు చేయమని ఆయన వారిని ఆజ్ఞాపించెను. వారి క్రియలను నడిపించడానికి మరియు చివరికి వారి హృదయాలను మార్చడానికి ఆయన వారికి నిబంధనలను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చెను. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వారి ప్రయత్నాల్లో వారు ఆశించిన దానిని అందుకోలేకపోయినప్పుడు, వారి పాపాల కొరకు ప్రాయశ్చిత్తానికి చిహ్నంగా జంతు బలులను చేయమని ఆయన వారిని ఆజ్ఞాపించెను. ఇదంతా వారి మనస్సులు, వారి హృదయాలు మరియు వారి జీవితాలను రక్షకుడు మరియు ఆయన అందించే విమోచన వైపు కేంద్రీకరించడానికి ఉద్దేశించబడింది. ఇశ్రాయేలీయుల కొరకు మరియు మనకొరకు ఆయనే పరిశుద్ధతకు నిజమైన మార్గము. మనమందరము కొంతకాలము పాపపు చెరలో గడిపాము మరియు పాపాన్ని వదిలివేసి, “నేను మిమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు శక్తిని కలిగియున్నాను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:7) అని వాగ్దానం చేసిన యేసు క్రీస్తును అనుసరించడానికి పశ్చాత్తాపపడమని మనమందరము ఆహ్వానించబడ్డాము.
లేవీయకాండమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “లేవీయకాండము” చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
నిర్గమకాండము 35–40; లేవీయకాండము 19
ఆయన వలె పరిశుద్ధంగా మారాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.
ఒక గుడారమును ఎలా నిర్మించాలని ప్రభువు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఉపదేశాలను నిర్గమకాండము 25–31 నమోదు చేస్తుంది, అక్కడ పరిశుద్ధ జనులు కావడానికి పరిశుద్ధ విధులు వారికి సహాయపడతాయి. ఈ ఉపదేశాలను పాటించడానికి ఇశ్రాయేలీయుల ప్రయత్నాలను నిర్గమకాండము 35–40 వివరిస్తుంది. మీరు 35–40 అధ్యాయాలు చదువుతున్నప్పుడు, గుడారములో పెట్టమని ప్రభువు తన జనులను అడిగిన వాటి కొరకు చూడండి మరియు ఆ వస్తువులు వేటిని సూచించవచ్చో, పరిశుద్ధత యందు ఎదగడం గురించి అవి మీకు ఏమి సూచిస్తాయో ధ్యానించండి. ప్రత్యేకించి ఈ వస్తువులు మీ ఆలోచనలను రక్షకుని వైపు ఎలా త్రిప్పుతాయో పరిగణించండి. ఇటువంటి ఒక పట్టిక మీకు సహాయపడవచ్చు:
ఏ వస్తువును మీరు కనుగొన్నారు? |
ఇది దేనిని సూచించగలదు? |
---|---|
ఏ వస్తువును మీరు కనుగొన్నారు? నిబంధన మందసము (నిర్గమకాండము 37:1–9; 40:20–21) | ఇది దేనిని సూచించగలదు? దేవుని సన్నిధి; ఆయన నిబంధనలు మరియు ఆజ్ఞలు |
ఏ వస్తువును మీరు కనుగొన్నారు? ధూప వేదిక (నిర్గమకాండము 40:26–27; నిర్గమకాండము 30:1, 6–8 కూడా చూడండి) | ఇది దేనిని సూచించగలదు? ప్రార్థనలు ప్రభువుకు చేరుట |
ఏ వస్తువును మీరు కనుగొన్నారు? దీపవృక్షము లేక దీపస్తంభము (నిర్గమకాండము 37:17–24) | |
ఏ వస్తువును మీరు కనుగొన్నారు? బలిపీఠము (నిర్గమకాండము 38:1–7; నిర్గమకాండము 27:1; 29:10–14 కూడా చూడండి) | |
ఏ వస్తువును మీరు కనుగొన్నారు? నీటి గంగాళము (నిర్గమకాండము 30:17–21) | |
మీరు దేవాలయ విధులలో పాల్గొనియున్నట్లయితే, అక్కడ మీ అనుభవాన్ని మీకు గుర్తుచేసేలా నిర్గమకాండము 35–40 నుండి గుడారము గురించి మీరేమి నేర్చుకుంటారు (“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: గుడారము మరియు త్యాగము” కూడా చూడండి). పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వలె మరింత పరిశుద్ధంగా కావడానికి దేవాలయ నిబంధనలు మీకెలా సహాయపడతాయో ధ్యానించండి.
నిజమే, పరిశుద్ధ స్థలాల్లో ఉండడం మాత్రమే మనల్ని పరిశుద్ధంగా చేయదు. పరిశుద్ధతలో వృద్ధి చెందుటకు సహాయపడేందుకు ప్రభువు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రము మరియు ఆజ్ఞలను లేవీయకాండము 19 వివరిస్తుంది. మీరు మరింత పరిశుద్ధులగుటలో సహాయపడగలిగేలా ఈ ఆజ్ఞలలో మీరేమి కనుగొంటారు? ఈ సూత్రాలను మరింత సంపూర్ణంగా జీవించడానికి ఏమి చేయాలని మీరు మనస్సులో ముద్రవేయబడ్డారు?
సమ్మతిగల హృదయముతో నా అర్పణలను అర్పించమని ప్రభువు నన్ను అడుగును.
ఐగుప్తును విడిచివెళ్ళిన తరువాతి సంవత్సరంలో, యెహోవాతో ఇశ్రాయేలీయుల సంబంధము పరస్పర విరుద్ధంగా ఉందని వివరించవచ్చు. అయినప్పటికీ, మీరు నిర్గమకాండము 35:4–36:7 చదువుతున్నప్పుడు, గుడారమును నిర్మించమనే ఆజ్ఞకు ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారో గమనించండి. ప్రభువును బాగుగా సేవించడానికి మీకు సహాయపడగలిగేలా ఇశ్రాయేలీయుల నుండి మీరేమి నేర్చుకుంటారు?
అధ్యక్షురాలు బోన్నీ ఎల్. ఆస్కార్‌సన్ బోధించారు: “అతడు లేక ఆమె ఎంతగా అవసరమో ప్రతీ సభ్యుడు తెలుసుకోవాలి. సహాయము చేయుటకు ప్రతి వ్యక్తి ఏదైనా ముఖ్యమైనది కలిగియున్నారు మరియు ఈ ముఖ్యమైన కార్యము ముందుకు సాగుటకు సహాయపడే ప్రత్యేకమైన ప్రతిభలు మరియు సామర్థ్యములను కలిగియున్నారు” (“కార్యములో యువతులు,” లియహోనా, మే 2018, 37). మీరు నిర్గమకాండము 36:1–4 చదువుతున్నప్పుడు, ప్రభువు మీలో “ఉంచిన” దానిని ధ్యానించండి. ఆయన మీకు ఏమి ఇచ్చారో పరలోక తండ్రిని అడగడాన్ని పరిగణించండి, ఆలాగున మీరు ఆయన పనిలో పాల్గొనగలరు.
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా నేను క్షమించబడగలను.
లేవీయకాండములో అధికభాగము మనకు వింతగా కనిపించవచ్చు—జంతు బలులు, రక్తము మరియు నీటిని కలుపుకొనియున్న ఆచారకర్మలు, జీవితంలోని అతిచిన్న వివరములను పరిపాలించే ధర్మశాస్త్రములు. కానీ ఈ ఆచారకర్మలు మరియు ధర్మశాస్త్రములు బాగా తెలిసినటువంటి—పశ్చాత్తాపము, పరిశుద్ధత, రక్షకుని ప్రాయశ్చిత్తము వంటి సూత్రాలను బోధించడానికి ఉద్దేశించబడినవి. మీరు లేవీయకాండము 1:1–9; 16 చదువుతున్నప్పుడు, ఈ సూత్రాలను కనుగొనడానికి ఇటువంటి ప్రశ్నలను పరిగణించండి: యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము గురించి ఈ బలుల నుండి నేనేమి నేర్చుకోగలను? ఈ బలులను అర్పిస్తున్న వారి వలె నేనెట్లున్నాను? ఈ వనరులో “జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: గుడారము మరియు త్యాగము” సమీక్షించడాన్ని మీరు పరిగణించవచ్చు (scriptures.ChurchofJesusChrist.org).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
నిర్గమకాండము 36:1–7.నిర్గమకాండము 36:1–7లో, గుడారమును నిర్మించమనే ఆజ్ఞకు ఇశ్రాయేలీయులు స్పందించిన తీరు నుండి మనమేమి నేర్చుకుంటాము? ఆయన పనిలో పాల్గొనడానికి ప్రభువు మనల్ని ఆహ్వానించిన విధానాల గురించి ఒక కుటుంబంగా మీరు ఆలోచించవచ్చు. ఇశ్రాయేలీయుల మాదిరిని మనము ఎలా అనుసరించగలము?
-
నిర్గమకాండము 40.మీరు కలిసి నిర్గమకాండము 40 చదువుతున్నప్పుడు, “ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా” వంటి వాక్యభాగమును వారు వినిన ప్రతిసారీ వారి చేతులు పైకెత్తమని కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు. ప్రభువుకు లోబడియుండడం గురించి ఈ అధ్యాయము నుండి మనమేమి నేర్చుకుంటాము?
-
నిర్గమకాండము 40:1–34.నిర్గమకాండము 40లో గుడారమును సమకూర్చడం గురించి మీరు చదువుతున్నప్పుడు, ఈ సారంశంతో పాటు ఇవ్వబడిన చిత్రపటాన్ని ఉపయోగించి గుడారము యొక్క వివిధ భాగాలను గుర్తించడానికి మీరు కలిసి పనిచేయవచ్చు.
-
లేవీయకాండము 19.కుటుంబ సభ్యులలో ప్రతిఒక్కరు “పరిశుద్ధులైయుండడానికి” (లేవీయకాండము 19:2) వారికి సహాయపడుతుందని వారు భావించిన ఒక వచనమును ఈ అధ్యాయము నుండి కనుగొనవచ్చు మరియు దానిని కుటుంబముతో పంచుకోవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.