“మే 23–29. యెహోషువ 1–8; 23–24: ‘నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
“మే 23–29. యెహోషువ 1–8; 23–24,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
మే 23–29
యెహోషువ 1–8; 23–24
“నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము”
యెహోషువ గ్రంథమును మీరు అధ్యయనం చేసినప్పుడు, ఇశ్రాయేలీయుల గురించి మీరు నేర్చుకొన్న విషయాలు యేసు క్రీస్తునందు మీ విశ్వాసమును ఎలా వృద్ధి చేస్తాయో ఆలోచించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
దానికి కొన్ని తరాలు పట్టింది, కానీ ప్రభువు యొక్క వాగ్దానము నెరవేరబోతున్నది: ఇశ్రాయేలీయుల సంతతి వాగ్దాన దేశమును వారసత్వముగా పొందబోతున్నారు. కానీ వారి మార్గములో ఆటంకంగా యొర్దాను నది, యెరికో గోడలు మరియు ప్రభువును తిరస్కరించిన బలమైన, చెడ్డ జనులు ఉన్నారు (1 నీఫై 17:35 చూడండి). అదనంగా, వారి ప్రియమైన నాయకుడు మోషే ఇక లేడు. పరిస్థితి కొందరు ఇశ్రాయేలీయులను బలహీనంగా భావించునట్లు, భయపడేట్లు చేసియుండవచ్చు, కానీ ప్రభువు ఇట్లనెను, “నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము.” వారు ఈవిధంగా ఎందుకు భావిస్తున్నారు? వారి స్వంత బలము వలన కాదు—లేక మోషే లేక యెహోషువ వలన కాదు—ఎందుకనగా “నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును” (యెహోషువ 1:9). దాటడానికి మన స్వంత నదులను మరియు పడగొట్టడానికి గోడలను కలిగియున్నప్పుడు, మన జీవితాలలో అద్భుతమైన విషయాలు జరగగలవు, ఎందుకనగా “ప్రభువు [మన] మధ్య అద్భుతకార్యములను చేయును” (యెహోషువ 3:5).
యెహోషువ గ్రంథము యొక్క సమీక్ష కొరకు, బైబిలు నిఘంటువులో యెహోషువ, గ్రంథము చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
నేను ఆయనకు విశ్వాసంగా ఉన్న యెడల దేవుడు నాతో ఉండును.
మోషేకు బదులుగా ఉంచబడుటకు పిలవబడుట యెహోషువాకు ఎలా ఉండియుండవచ్చో ఊహించండి. అతడిని ప్రోత్సహించడానికి యెహోషువ లో ప్రభువు చెప్పిన దానిని గమనించండి. మీరు ఎదుర్కొనే కష్టమైన సవాళ్ళ గురించి ఆలోచించండి; ఈ వచనాలలో ఉన్నది ఏది మీకు ధైర్యమునిస్తుంది?
యెహోషువ పేరు (హెబ్రీ భాషలో యెహోషువ లేదా యెషువ) అనగా “యెహోవా రక్షించును” అని అర్థమని గమనించుట ఆసక్తికరంగా ఉండవచ్చు. మరియు యేసు పేరు యెషువా నుండి వచ్చును. యెహోషువ గురించి మీరు చదివినప్పుడు, ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశములోనికి నడిపించుటకు అతడి మిషను రక్షకుని మిషనును గూర్చి మీకు ఎలా జ్ఞాపకం చేస్తుంది.
యాన్ ఎమ్. డిబ్ “నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము” లియహోనా, మే 2010, 114–16 కూడా చూడండి.
విశ్వాసము మరియు క్రియలు రెండును రక్షణ కొరకు అవసరమైనవి.
ప్రాచీన క్రైస్తవులు రాహాబును విశ్వాసము మరియు క్రియలు రెండిటికి ఒక మాదిరిగా చూసారు (హెబ్రీయులకు 11:31; యాకోబు 2:25 చూడండి). యెహోషువ 2 మీరు చదివినప్పుడు, తనను, తన కుటుంబాన్ని మరియు ఇశ్రాయేలీయ గూఢచారులను రక్షించుటలో రాహాబు యొక్క విశ్వాసము మరియు క్రియల పాత్రను పరిగణించండి. క్రీస్తునందు మీ విశ్వాసము మరియు మీ క్రియలు మిమ్మల్ని, ఇతరులను ఎలా ప్రభావితం చేయగలదని ఇది మీకేమి బోధిస్తుంది?
రాహాబు రాజైన దావీదు మరియు యేసు క్రీస్తు యొక్క పూర్వీకురాలని తెలుసుకొనుట మీకు ఆసక్తి కలిగించవచ్చు (మత్తయి 1:5 చూడండి). దీని నుండి మనము నేర్చుకోగల సాధ్యమైన పాఠములేవి?
నేను యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియున్నయెడల దేవుని యొక్క “అద్భుతములను” నేను అనుభవించగలను.
“యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరు తెలిసికోవాలని” (యెహోషువ 4:24) ప్రభువు కోరుచున్నాడు. మీరు యెహోషువ 3–4 చదివినప్పుడు, ప్రభువు యొక్క హస్తము బలమైనదని మీరు ఎలా తెలుసుకున్నారో ధ్యానించండి. మీ జీవితంలో ప్రభువు “అద్భుతములను” ఎలా చేసాడు? (యెహోషువ 3:5 ఆ అద్భుతకార్యములను మీరు ఎక్కువ తరచుగా ఎలా అనుభవించారు—లేదా గుర్తించారు? (ఉదాహరణకు, యెహోషువ 3:17 చూడండి).
వారు యొర్దాను నదిని దాటకముందు వారికై వారు శుద్ధి చేయబడుట ఎందుకు అవసరమని మీరు అనుకుంటున్నారు? “యాజకుల అరకాళ్లు … నీళ్లను ముట్టగానే” నది వేరు చేయబడిన వాస్తవములో మీరు కనుగొన్న ప్రాముఖ్యమైనదేమిటి? (యెహోషువ 3:13, 15
యొర్దాను నదిలో జరిగిన ఇతర ముఖ్యమైన సంఘటనలు కొరకు, 2 రాజులు 2:6–15; 5:1–14; and మార్కు 1:9–11 చూడండి. ఈ లేఖనాలను మీరు ధ్యానించినప్పుడు, ఈ సంఘటనల మధ్య మీరు ఏ సంబంధములను చూస్తారు?
జెరాల్డ్ కాస్సి, “ఇది ఇంకా మీకు ఆశ్చర్యకరముగా ఉన్నదా?” లియహోనా, మే 2015, 98–100; “Exercise Faith in Christ” (వీడియో), ChurchofJesusChrist.org కూడా చూడండి.
విధేయత దేవుని యొక్క శక్తిని నా జీవితంలోకి తెస్తుంది.
ఈ అధ్యాయములు యెరికో మరియు ఆయ్ దేశాలపై జరిగిన యుద్ధాలతో వ్యవహరిస్తాయి. మీరు వాటిని చదివినప్పుడు, మీ స్వంత జీవితంలో శోధనతో మీరు ఎలా పోరాడతారో పరిగణించండి (ఉదాహరణకు, యెహోషువ 7:10–13 చూడండి). దేవుడు మీకు ఎలా సహాయపడతాడు మరియు ఆయన శక్తిని చేరుకోవడానికి మీరు ఏమి చేయాలనే దాని గురించి మీరేమి నేర్చుకున్నారు? ఉదాహరణకు, యెరికో తీసుకొనుటకు ప్రభువు యొక్క సూచనలను గూర్చి మిమ్మల్ని ఆకట్టుకునేదేమిటి? (యెహోషువ 6:1–5 చూడండి). బహుశా యెహోషువ 7 లో వివరణ మీ జీవితంలో “శాపగ్రస్తమైన వస్తువు” ఏదైన ఉన్న యెడల మీరు తీసేయాల్సిన అవసరమున్నదని తీర్మానించుటకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు (యెహోషువ 7:13).
“మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను.”
పన్నెండు మంది గోత్రముల మధ్య వాగ్దాన దేశమును విభజించిన తరువాత (యెహోషువ 13–21 చూడండి) యెహోషువ వారికి చివరి బోధనలు ఇచ్చాడు. యెహోషువ 23–24 లో ఈ బోధనలు మీరు చదివినప్పుడు, మీరు కనుగొనే హెచ్చరికలు, సలహా మరియు వాగ్దానము చేయబడిన దీవెనల జాబితను చేయవచ్చు. ఇశ్రాయేలీయులు అనుభవించిన సమస్తమును పరిగణించి, తన జీవితం ముగింపులో వారికి ఈ విషయాలను చెప్పడానికి ఎందుకు కోరాడని మీరనుకుంటున్నారు? “యెహోవాను హత్తుకొని యుండుటకు” మిమ్మల్ని ప్రేరేపించునట్లు మీరు కనుగొన్నదేమిటి? (యెహోషువ 23:8).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
యెహోషువ 1:8.ఈ వచనము మన లేఖన అధ్యయనమును వ్యక్తిగతంగా, ఒక కుటుంబంగా మనం ఎలా చేరుకోవాలో ఈ లేఖనము ఏమి సూచిస్తుంది? లేఖనాలు ఏవిధంగా మన “మార్గమును ఫలవంతంగా” చేసి మరియు మనకు “మంచి విజయాన్ని” తెచ్చాయి?
-
యెహోషువ 4:3, 6–9యొర్దాను నది నుండి రాళ్లతో ఏమి చేయాలో ఇశ్రాయేలీయులను ప్రభువు కోరిన దానిని చదివిన తరువాత, ప్రభువు మీ కోసం చేసిన గొప్ప విషయాలను గూర్చి మీ కుటుంబము మాట్లాడవచ్చు. తరువాత ప్రతీ కుటుంబ సభ్యునికి ఒక రాయిని ఇచ్చి, దానిపై ప్రభువు వారి కోసం చేసినది ఏదైనా వ్రాయమని లేక గీయమని వారిని అడగండి.
-
యెహోషువ 6:2–5.యెరికోను జయించుటకు బదులుగా ఇశ్రాయేలీయులకు ప్రభువు ఇచ్చిన సూచనలను నటించుట మీ కుటుంబానికి వినోదంగా ఉండవచ్చు. ఈ కథ నుండి మనము ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుచున్నాడు?
-
యెహోషువ 24:15ఈ వచనము చదివిన తరువాత, అది కష్టమైనప్పుడు కూడా ప్రభువుకు సేవ చేయుటకు వారు ఎంపిక చేసిన అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. ఒక పరిస్థితి వచ్చేంతవరకు నిర్ణయించుటకు వేచియుండుటకు బదులుగా “నేడే” ఆయనను సేవించుటకు ఎంపిక చేయుట ఎందుకు ముఖ్యమైనది? “ప్రభువును సేవించుటకు” మనము ప్రయాసపడినప్పుడు, మన “ఇంటి” సభ్యులకు ఎలా సహకరించగలము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.