2022 పాత నిబంధన
మే 30–జూన్ 5 న్యాయాధిపతులు 2–4; 6–8; 13–16: “యెహోవా రక్షకునిగా నియమించెను”


“మే 30– జూన్ 5. న్యాయాధిపతులు 2–4; 6–8; 13–16: “యెహోవా రక్షకునిగా నియమించెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“మే 30– జూన్ 5. న్యాయాధిపతులు 2–4; 6–8; 13–16,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
సైన్యములతో దెబోరా

ఇశ్రాయేలు సైన్యములను దెబోరా నడిపించే దృష్టాంతము © Lifeway Collection/licensed from goodsalt.com

మే 30–జూన్ 5

న్యాయాధిపతులు 2–4; 6–8; 13–16

“యెహోవా రక్షకునిగా నియమించెను”

లేఖనాలు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. న్యాయాధిపతులలో మీరు చదివిన కథలు ఆయనకు దగ్గర కావడానికి మీకు ఎలా సహాయపడ్డాయో ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఒక తప్పు చేసి, దాని గురించి బాధపడటం, తరువాత పశ్చాత్తాపపడి, మన విధానాలను మార్చుకోవడానికి తీర్మానించుకోవడం ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. కాని కొన్ని సందర్భాలలో మన పూర్వపు తీర్మానాన్ని మరచిపోతాము మరియు మనము శోధనను ఎదుర్కొన్నప్పుడు, మనం మరలా తప్పు చేస్తున్నట్లు కనుగొనవచ్చు. న్యాయాధిపతులు గ్రంథములో వివరించబడిన ఇశ్రాయేలీయుల అనుభవాల యొక్క ఈ విచారకరమైన నమూనా విలక్షణమైనది. ఎవరినైతే వారు దేశము నుండి తరిమివేయాలో—ఆ కనానీయుల నమ్మకాలు మరియు పూజించే ఆచారాల చేత ప్రభావితం చేయబడి—ఇశ్రాయేలీయులు ప్రభువుతో పూజించుట నుండి మరలిపోయారు. ఫలితంగా, వారు ఆయన భద్రతను కోల్పోయారు మరియు దాస్యములో పడిపోయారు. అయినప్పటికీ, ఇది జరిగిన ప్రతీసారి, ప్రభువు వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశమిచ్చాడు మరియు ఒక రక్షకుని, “న్యాయాధిపతులు” అని పిలవబడిన ఒక సైన్యానికి నాయకుడిని ఏర్పరిచాడు. న్యాయాధిపతుల గ్రంథములోని న్యాయాధిపతులందరూ నీతిమంతులు కాదు, కానీ వారిలో కొందరు ఇశ్రాయేలీయులను విమోచించుటలో, ప్రభువుతో వారి నిబంధన అనుబంధమునకు వారిని పునఃస్థాపిస్తూ గొప్ప విశ్వాసమును సాధన చేసారు. యేసు క్రీస్తు నుండి దూరంగా మనల్ని నడిపించేది ఏదైనప్పటికీ, ఆయన ఇశ్రాయేలు యొక్క విమోచకుడని, మనల్ని విడిపించుటకు ఎల్లప్పుడు సమ్మతిస్తున్నాడని, ఆయన వద్దకు తిరిగి స్వాగతమిస్తున్నాడని ఈ కథలు మనకు జ్ఞాపకం చేస్తాయి.

న్యాయాధిపతుల గ్రంథము సమీక్ష కొరకు, బైబిలు నిఘంటువులో “న్యాయాధిపతుల గ్రంథము” చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

న్యాయాధిపతులు 2:1–19; 4:1–16

నేను తప్పిపోయినప్పుడు ప్రభువు విమోచన ఇస్తున్నాడు.

న్యాయాధిపతుల గ్రంథము మనకు ఒక హెచ్చరికగా సహాయపడుతుంది మన జీవితాలలో ప్రభువు యొక్క శక్తిని మనం అంగీకరించిన తరువాత కూడా తప్పిపోవడం ఎల్లప్పుడు సాధ్యమే. తప్పిపోయిన వారికి ఈ గ్రంథము ప్రోత్సాహమును కూడా అందిస్తుంది, ఏలయనగా ప్రభువు తిరిగి వచ్చే మార్గమును అందిస్తాడు. ఉదాహరణకు, న్యాయాధిపతులు 2:1–19 మీరు చదివినప్పుడు, ప్రభువు నుండి దూరంగా ఇశ్రాయేలీయులను నడిపించిన క్రియల కొరకు మరియు ప్రభువు వారిని ఎలా విడిపించాడో చూడండి. ఈ వచనాలు ప్రభువు గురించి మీకేమి బోధిస్తాయి? ఆయనకు మరింత ఏకరీతిగా నమ్మకంగా ఉండటానికి మీరు ఏమి చేయగలరు?

న్యాయాధిపతులు అంతటా తిరుగుబాటు, విచారము మరియు విమోచన యొక్క మాదిరి పునరావృతం అగుటను మీరు కనుగొంటారు (ప్రత్యేకంగా 3 అధ్యాయాలు, 4, 6, మరియు13 చూడండి). న్యాయాధిపతుల గ్రంథమును మీరు చదివినప్పుడు, ఇశ్రాయేలీయులను విమోచించుటకు న్యాయాధిపతులు చేసిన దానిని, మీకు విమోచన అవసరమైనప్పుడు రక్షకుడు మీకు ఎలా సహాయపడ్డాడో లోతుగా ధ్యానించండి.

ఇశ్రాయేలీయులను విమోచించుటకు సహాయపడిన వ్యక్తికి ఒక ముఖ్యమైన మాదిరి దెబోరా. న్యాయాధిపతులు 4:1–16 లో ఆమె గురించి చదవండి, మరియు ఆమె చుట్టూ ఉన్న జనులపై ఆమెకు గల ప్రభావమును గమనించండి. దెబోరా యొక్క ఏ క్రియలు ఆమె ప్రభువునందు విశ్వాసమును కలిగియున్నదని మీకు చూపుతాయి? 14వ వచనము లో ఆమె ప్రశ్న చేత దెబోరా ఉద్దేశ్యమేమిటని మీరు భావిస్తున్నారు: “యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా?”

ఆల్మా 7:13; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:87–88 కూడా చూడండి.

న్యాయాధిపతులు 2:13

బయలు మరియు అష్తారోతు ఎవరు?

బయలు కనానీయుల తుఫాను దేవుడు, మరియు అష్తారోతు కనానీయుల సంతానోత్పత్తి దేవత. ఈ రెండు దేవుళ్లను పూజించుట దేశము, కనానీయుల సంతానోత్పత్తికి ఎంత ముఖ్యమైనదో సూచించును. వీరిని, ఇతర అబద్ధపు దేవుళ్లను జనులు పూజించిన విధానాలు—కొన్నిసార్లు లైంగిక దుర్నీతి, పిల్లల్ని బలి ఇచ్చుట కలిపి—ప్రత్యేకంగా ప్రభువుకు కోపం తెప్పించేవి.

న్యాయాధిపతులు 6–8

ఆయన మార్గములందు నేను విశ్వసించినప్పుడు ప్రభువు అద్భుతాలను చేయగలడు.

మన జీవితాలలో ప్రభువు యొక్క అద్భుతాలను పొందడానికి, ఆయన మార్గములు అసాధారణమైనవిగా కనబడినప్పుడు కూడా మనము ఆయన మార్గములందు తప్పక విశ్వసించాలి. న్యాయాధిపతులు 6–10 లో కనుగొనబడిన గిద్యోను వృత్తాంతము దీనికి మంచి మాదిరి. గిద్యోను సైన్యము మిద్యానీయులను ఓడించినప్పుడు ప్రభువు ఒక అద్భుతాన్ని ఎలా చేసాడు? ప్రభువు మీకు ఏమి బోధించడానికి ప్రయత్నిస్తున్నాడని మీరు భావిస్తున్నారు? అసాధారణమైనదిగా కనబడే విధానాలలో ప్రభువు తన కార్యమును చేయడం మీరు ఎలా చూసియున్నారు?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు,” ఎన్‌సైన్, మే 1988, 33–35 కూడా చూడండి.

న్యాయాధిపతులు

దేవునితో నా నిబంధనలకు విశ్వాసంగా ఉండటం ద్వారా బలము వస్తుంది.

నాజీరులకు ప్రత్యేకంగా అన్వయించబడిన వాటిని కలిపి, దేవునితో తన నిబంధనలను ఉల్లంఘించాడు కనుక సమ్సోను తన శారీరక బలమును మరియు ఆత్మీయ బలమును కోల్పోయాడు (నాజీరులను గూర్చి సంఖ్యాకాండము 6:1–6; న్యాయాధిపతులు 13:7 చూడండి. న్యాయాధిపతులు 13–16 లో సమ్సోను కథను మీరు చదివినప్పుడు, మీరు చేసిన ప్రతీ నిబంధనను ధ్యానించండి. మీరు ఆ నిబంధనలను పాటించుట వలన బలముతో మీరు ఎలా దీవించబడ్డారు? దేవునితో మీ నిబంధనలకు యధార్ధముగా నిలిచియుండుటకు మిమ్మల్ని ప్రేరేపించినట్లు సమ్సోను కధనమునుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

చిత్రం
స్తంభములను నెట్టివేయుచున్న సమ్సోను

స్తంభములను పడద్రోయుచున్న సమ్సోను , జేమ్స్ టిస్సాట్ మరియు ఇతరుల చేత

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

న్యాయాధిపతులు 2:10.యెహోషువ మరణించిన తరువాత, ఇశ్రాయేలీయుల తరువాత తరము “ప్రభువును ఎరుగరు.” ప్రభువును వారు ఎలా ఎరుగుదురు మరియు వారి కొరకు “ఆయన చేసిన కార్యములను” గూర్చి మీ కుటుంబముతో మాట్లాడండి. ఈ జ్ఞానము భవిష్యత్తు తరముల కొరకు దాచబడిందని మీరు ఎలా నిశ్చయపరచగలరు?

న్యాయాధిపతులు 3:7–10.న్యాయాధిపతుల గ్రంథము అంతటా తరచుగా సంభవించే నమూనాను ఈ వచనాలు సంక్షిప్తపరుస్తాయి. మీ కుటుంబ సభ్యులు ఈ వచనాలను చదివినప్పుడు, ప్రభువునుండి తొలగిపోవడానికి ఇశ్రాయేలు చేసిన దానిని మరియు వారిని విడిపించడానికి ప్రభువు చేసిన దానిని వారు గుర్తించగలరు. ప్రభువును మరచిపోవడానికి మనల్ని ఏది నడిపిస్తుంది? ఆయన మనల్ని ఎలా విడిపిస్తారు? ఆయనకు మరింత ఏకరీతిగల విశ్వాసపాత్రంగా మనం ఎలా ఉండగలము?

న్యాయాధిపతులు 6:13–16, 25–30.అతడి క్రియలు ప్రసిద్ధి కానప్పుడు కూడా గిద్యోను ప్రభువుకు విధేయుడగుటలో గొప్ప ధైర్యమును చూపించాడు. ఇతరులు అంగీకరించనిది దేనిని ప్రభువు మనల్ని చేయమని అడిగాడు? 13–16 వచనాలలో గిద్యోనుకు ప్రభువు మాటలు సరైన దానిని చేయడానికి మనల్ని ఎలా ప్రేరేపిస్తాయి?

న్యాయాధిపతులు 7.ఈ అధ్యాయములో వివరించబడిన గిద్యోను సైన్యము యొక్క అనుభవము నుండి మీ కుటుంబము నేర్చుకొనడానికి సహాయపడుటకు మీరు ఒక పాత్రను నటించుట లేక ఇతర సృజనాత్యక కార్యాచరణను మీరు ఉపయోగించగలరా? (ఉదాహరణకు, 2 మరియు 15 వచనాలు చూడండి) ఈ అధ్యాయములోని ప్రభువు యొక్క మాటలను మన జీవితాలలో ఎలా అన్వయించుకోగలము?

న్యాయాధిపతులు 13:5.మన నిబంధనలు మనకు బలమిచ్చినట్లుగా, ప్రభువుతో సమ్సోను నిబంధనలు అతడికి బలాన్నిచ్చాయి. కొన్ని శారీర వ్యాయామాలను చేయడానికి మీ కుటుంబం మరియు ఆ వ్యాయామాలు మనం బలంగా చేయడానికి ఎలా సహాయపడగలవో చర్చించుటను ఆనందించవచ్చు. ఆత్మీయంగా బలముగా మారడానికి మనకు సహాయపడటానికి మనం ఏమి చేయగలము? కొన్ని ఉపాయముల కొరకు, కుటుంబ సభ్యులు మోషైయ 18:8–10; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చదవవచ్చు. మన నిబంధనలను పాటించుట మనకు ఆత్మీయ బలాన్ని ఎలా ఇస్తుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీరు నేర్చుకునే దానిపై పనిచేయండి. మీరు అధ్యయనం చేసినప్పుడు, మీరు నేర్చుకొన్న దానిని ఎలా అన్వయించుకోగలరో మీకై మీరు ప్రశ్నించుకోండి మరియు దానిని చేయడానికి ఒడంబడిక చేయండి. ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి.

చిత్రం
గిద్యోను మరియు సైన్యము

గిద్యోను యొక్క సైన్యము, డానియేల్ ఎ. లూయీస్ చేత

ముద్రించు