2022 పాత నిబంధన
జూన్ 6–12. రూతు; 1 సమూయేలు 1–3: “నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది”


“జూన్ 6–12. రూతు; 1 సమూయేలు 1–3: ‘నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జూన్ 6–12. రూతు; 1 సమూయేలు 1–3,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
రూతు మరియు నయోమి

నీవు ఎక్కడికి వెళితే, సాండీ ఫ్రెక్‌లిటన్ గాగన్ చేత

జూన్ 6–12

రూతు; 1 సమూయేలు 1–3

“నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది”

ఈ వారము రూతు, నయోమి, హన్నా మరియు ఇతరుల జీవితాలను మీరు అధ్యయనం చేసినప్పుడు, ఆత్మకు దగ్గరగా మీరు ఆలకించండి మరియు మీరు పొందే భావనలు ఏవైనా నమోదు చేయండి. మీరు ఏమి చేయటానికి ప్రేరేపించబడ్డారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

కొన్నిసార్లు మన జీవితాలు ఆది నుండి అంతము వరకు ఒక స్పష్టమైన బాటను అనుసరించాలని మనము ఊహిస్తాము. రెండు బిందువుల మధ్య అతి తక్కువ దూరం సరళ రేఖే కదా. అయినప్పటికీ, తరచుగా జీవితం ఆలస్యాలు మరియు ప్రక్క త్రోవలను కలిగియున్నది అది మనల్ని ఊహించని దిశలలోనికి తీసుకొనివెళ్తుంది. మన జీవితాలు మనం అనుకున్నదానికంటే చాలా భిన్నంగా ఉన్నాయని మనం కనుగొనవచ్చు.

రూతు మరియు హన్నా నిశ్చయంగా దీనిని గ్రహించారు. రూతు ఇశ్రాయేలీయురాలు కాదు, కానీ ఆమె ఒకరిని వివాహం చేసుకుంది మరియు ఆమె భర్త చనిపోయినప్పుడు, ఆమెకు చేయాల్సిన ఒక ఎంపిక ఉన్నది. ఆమె కుటుంబము మరియు ఆమె పాత, పరిచయమున్న జీవితానికి తిరిగి వెళ్ళలా లేదా ఆమె ఇశ్రాయేలీయ విశ్వాసాన్ని హత్తుకొని, తన అత్తగారితో క్రొత్త ఇంటికి వెళ్ళాలా? (రూతు 1:4–18 చూడండి). తన జీవితం కొరకు హన్నా యొక్క ప్రణాళిక పిల్లల్ని కనుట మరియు ఆవిధంగా చేయడానికి ఆమె అసమర్ధత ఆమెను “ఆత్మ యొక్క దుఃఖములో” విడిచిపెట్టింది (1 సమూయేలు1:1–10 చూడుము). మీరు రూతు హన్నా గురించి చదివినప్పుడు, ప్రభువుయందు నమ్మకముంచడానికి మరియు వారి ఊహించని మార్గాలలో ప్రయాణించుటకు వారు కలిగి ఉన్న విశ్వాసమును పరిగణించండి. తరువాత మీ స్వంత ప్రయాణము గురించి మీరు ఆలోచించవచ్చు. అది రూతు మరియు హన్నా—వేరొకరి నుండి భిన్నంగా కనబడవచ్చు. కానీ ఇక్కడ, మీ నిత్య గమ్యము మధ్య శ్రమలు మరియు ఆశ్యర్యముల అంతటా, మీరు హన్నాతోపాటు ఇలా చెప్పగలరు, “నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది” (1 సమూయేలు 2:1).

రూతు, 1 సమూయేలు, “రూతు” యొక్క గ్రంథాల సమీక్ష కొరకు, “సమూయేలు, గ్రంథములు” బైబిలు నిఘంటువు చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

రూతు

క్రీస్తు విషాదాన్ని విజయంగా మార్చగలడు.

రూతు భర్త చనిపోయినప్పుడు, ఆ విషాదము ఆమెకు పరిణామాలను కలిగియున్నది, అవి ఒక విధవరాలు నేడు ఎదుర్కొనే దానికంటే ఎక్కువ తీవ్రమైనవి. ఆ సమయమందు ఇశ్రాయేలీయుల సంప్రదాయంలో, భర్త లేదా కుమారులు లేని స్త్రీకి ఆస్తిలో హక్కులేదు మరియు ఆచరణాత్మకంగా ఒక జీవనం సంపాదించుటకు ఏ మార్గము లేదు. మీరు రూతు కథ చదివినప్పుడు, విషాదము గొప్ప దీవెనగా ప్రభువు ఎలా మార్చాడో గమనించండి. ఆమెకు సహాయపడునట్లు రూతు గురించి మీరు గమనించినదేమిటి? ఆమె తీరని పరిస్థితి నుండి రూతును విమోచించుటలో బోయజు యొక్క పాత్ర ఏమిటి? (రూతు 4:4–7 చూడండి). రూతు మరియు బోయజు రెండిటిలో మీరు చూసే క్రీస్తు వంటి లక్షణాలు ఏమిటి?

రూతు; 1 సమూయేలు 1

నా పరిస్థితిని లక్ష్యపెట్టకుండా దేవుడు నన్ను నడిపించి, నాకు సహాయపడతాడని నేను నమ్మగలను.

రూతు, నయోమి మరియు హన్నా వృత్తాంతాలలో మిమ్మల్ని మీరు చూడగలరా? బహుశా రూతు మరియు నయోమిల వలె మీరు గొప్ప బాధను అనుభవించయుండవచ్చు (రూతు 1:1–5 చూడండి). లేదా హన్నా వలె మీరు ఇంకా పొందని దీవెనల కొరకు ఆపేక్షించవచ్చు (1 సమూయేలు 1:1–10 చూడండి). ఈ విశ్వాసులైన స్త్రీల మాదిరుల నుండి మీరు నేర్చుకోగల సందేశాలు ఏమిటో లోతుగా ధ్యానించండి. రూతు మరియు హన్నా దేవునియందు విశ్వాసమును ఎలా చూపించారు? వారు పొందిన దీవెనలేవి? వారి మాదిరులను మీరు ఎలా అనుసరించగలరు? జీవితము కష్టమైనదిగా భావించినప్పుడు కూడా మీరు ప్రభువును ఎలా “విశ్వసించగలిగారో” (రూతు 2:12) ఆలోచించండి.

రీనా ఐ. అబుర్టొ, “Thru Cloud and Sunshine, Lord, Abide with Me! ” కూడా చూడండి. లియహోనా, నవ. 2019, 57-60.

చిత్రం
హన్నా మరియు సమూయేలు

ఈ బిడ్డ కోసం నేను ప్రార్థించాను, ఎల్స్‌పెత్ యంగ్ చేత

1 సమూయేలు 2:1–10

నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.

హన్నా బాలుడైన సమూయేలును దేవాలయమునకు తీసుకొని వెళ్ళిన తరువాత, ఆమె 1 సమూయేలు 2:1–10 లో వ్రాయబడిన, ప్రభువుకు స్తుతిగల అందమైన మాటలను ఆమె మాట్లాడింది. స్వల్ప కాలం క్రితం “ఆమె బహు దుఃఖాక్రాంతురాలై, … బహుగా ఏడ్చెను” (1 సమూయేలు 1:10) అని మీరు ఆలోచించినప్పుడు ఈ మాటలు ఇంకా ఎక్కువ కదిలిస్తాయి. మీరు ఈ వచనాలు చదివినప్పుడు, ప్రభువుకు స్తుతి, కృతజ్ఞతగల మీ భావాలను హెచ్చించునట్లు మీరు కనుగొన్న సందేశాలు ఏమిటి? బహుశా హన్నా పాట ప్రభువుకు మీ కృతజ్ఞతను వ్యక్తపరచుటకు సృజనాత్మక విధానమును కనుగొనడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు—ఒక పాట, ఒక బొమ్మ, ఒక సేవ చర్య లేదా ఆయన పట్ల మీ భావాలను తెలిపేది ఏదైనా కావచ్చు.

అవును, గంభీరమైన ప్రార్థనలు అన్నీ హన్నాకు కలిగిన విధానములో జవాబివ్వబడవు. మీరు ఆశించినట్లుగా మీ ప్రార్థనలు జవాబివ్వనప్పుడు విశ్వాసంగా నిలిచియుండుటకు మీకు సహాయపడినట్లు అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్ సందేశము “ఏ పరిస్థితులోనైనా కృతజ్ఞత కలిగియుండుట” లో మీరు కనుగొన్నదేమిటి?లియహోనా, మే 2014, 70–77).

1 సమూయేలు 3

నేను ప్రభువు యొక్క స్వరమును విని, విధేయుడిని కాగలను.

మనందరి వలే, సమూయేలు ప్రభువు యొక్క స్వరమును ఎలా గుర్తించాలో నేర్చుకోవాల్సియున్నది. మీరు సమూయేలు 3 చదివినప్పుడు, ప్రభువు యొక్క స్వరమును విని, విధేయులగుట గురించి ఈ బాలుని నుండి మీరు ఏమి నేర్చుకోగలరు? ఆయన స్వరమును వినుటతో మీకు కలిగిన అనుభవాలు ఏవి? ప్రభువు వారితో మాట్లాడినప్పుడు ఇతరులు గుర్తించుటకు సహాయపడుటకు, ఏలీ వలె మీరు కలిగియున్న అవకాశములు ఏవి? (1 సమూయేలు 3:7 చూడండి).

యోహాను 14:14–21; డేవిడ్ పి. హోమర్, “ఆయన స్వరమును వినుట,” లియహోనా, మే 2019, 41–43 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

రూతు 1:16–18; 2:5–8, 11–12.మీ కుటుంబము ఈ వచనాలలో దయ మరియు విధేయత యొక్క మాదిరుల కొరకు వెదకవచ్చు. మన కుటుంబముకు, ఇతరులకు దయను మరియు యేసు క్రీస్తుకు విధేయతను మనము ఎలా చూపగలము? (పాత నిబంధన కథలు లో) “రూతు మరియు నయోమి” అధ్యాయము రూతు మాదిరి నుండి మీ కుటుంబము నేర్చుకోవడానికి సహాయపడగలదు.

1 సమూయేలు1:15.“నేను … నా ఆత్మను యెహోవా సన్నిధిని క్రుమ్మరించుకొనుచున్నాను” అని ఆమె చెప్పినప్పుడు, హన్నా ఉద్దేశ్యమేమిటో దృశ్యీకరించుటకు కుటుంబ సభ్యులకు సహాయపడుటకు మీరు ఒక పాత్ర లోనుండి ఏదైనా కుమ్మరించవచ్చు. మన ప్రార్థనలు ఎలా ఉండాలో వివరించడానికి ఇది ఎందుకు మంచి మార్గం? మన వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్థనలను మనము ఎలా మెరుగుపరచుకోగలము?

1 సమూయేలు 2:1–10.ప్రభువును స్తుతించే హన్నా యొక్క కవిత్వము ప్రభువును స్తుతించుటకు మీరు ఉపయోగించే పాటలను గూర్చి ఆలోచించుటకు మిమ్మల్ని నడిపించవచ్చు. మీరు కొన్ని కలిసి పాడవచ్చు. యేసు క్రీస్తు కొరకు వారి భావాలను వ్యక్తపరచుటకు మరొక విధానాలను గూర్చి కూడా మీ కుటుంబ సభ్యులు ఆలోచించవచ్చు. ఉదాహరణకు, వారు ప్రభువును ఎందుకు ప్రేమిస్తున్నారో చూపు బొమ్మలను వేయవచ్చు.

1 సమూయేలు 3:1–11.“సమూయేలు మరియు ఏలీ” (ChurchofJesusChrist.org) వీడియోను మీ కుటుంబము చూడవచ్చు లేక ప్రభువు సమూయేలును పిలిచిన కథను నటించుట సరదాగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు ప్రభువు వారితో మాట్లాడిన సమయాలను గూర్చి, ఆయన మాటలను ఎలా ఆచరణలో ఉంచారో మాట్లాడవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

ఆత్మ మీ అధ్యయనమును నడిపించనియ్యుము. మీరు నేర్చుకోవాల్సిన విషయములకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించునట్లు ప్రార్థించుము. ఇది మీరు ఊహించని విషయమును చదువుట లేక మరొక విధంగా అధ్యయనము చేయుటకు నడిపించిన యెడల, ఆయన గుసగుసలకు సున్నితముగా ఉండుము.

చిత్రం
గుడారములో బాలుడై సమూయేలు

ప్రభువును వినుచున్న సమూయేలు యొక్క దృష్టాంతము, సామ్ లాలర్ చేత

ముద్రించు