2022 పాత నిబంధన
జూన్ 13–19. 1 సమూయేలు 8–10; 13; 15–18: “యుద్ధము యెహోవాదే”


“జూన్ 13–19. 1 సమూయేలు 8–10; 13; 15–18: ‘యుద్ధము యెహోవాదే,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జూన్ 13–19. 1 సమూయేలు 8–10; 13; 15–18,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

వడిసెలతో యువకుడైన దావీదు

దావీదు మరియు గొల్యాతు, స్టీవ్ నెదర్‌కాట్ చేత

జూన్ 13–19

1 సమూయేలు 8–10; 13; 15–18

“యుద్ధము యెహోవాదే”

ఈ అధ్యాయాలలో ముఖ్యమైన సూత్రాలలో కొన్నిటిని గుర్తించడానికి ఈ సారాంశములోని సూచనలు మీకు సహాయపడగలవు. మీరు అధ్యయనము చేసినప్పుడు ఇతర సూత్రములను మీరు కనుగొనవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఇశ్రాయేలు గోత్రములు వాగ్దాన దేశములో స్థిరపడినప్పటి నుండి, ఫిలిష్తీయులు వారి భద్రతకు కొనసాగుతున్న ముప్పుగా ఉన్నారు. గతములో అనేకసార్లు ప్రభువు ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి కాపాడెను. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పెద్దలు ఇలా కోరారు, “మాకు రాజు కావలెను … మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించును” (1 సమూయేలు 8:19–20). ప్రభువు కనికరించి, సౌలును రాజుగా అభిషేకించాడు. అయినప్పటికీ, భయంకరుడును మహాకాయుడైన గొల్యాతు ఇశ్రాయేలు సైన్యముకు తన సవాలు విసిరినప్పుడు, అతడి మిగిలిన సైన్యమువలె—సౌలు “బహు భీతుడయ్యెను” (1 సమూయేలు 17:11). ఆ రోజు, ఇశ్రాయేలును కాపాడినది సౌలు రాజు కాదు కానీ దీనమనస్సుగల దావీదు అనే గొఱ్ఱెల కాపరి, అతడు ఏ ఆయుధాన్ని ధరించలేదు కానీ ప్రభువుయందు అబేధ్యమైన విశ్వాసమును ధరించియున్నాడు. ఈ యుద్ధము ఇశ్రాయేలు మరియు పోరాడుటకు ఆత్మీయ యుద్ధములను కలిగియున్న ఎవరికైనా “యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించు వాడని ” మరియు “యుద్ధము యెహోవాదే” (1 సమూయేలు 17:47) అని రుజువు చేసింది.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 సమూయేలు 8

యేసు క్రీస్తు నా రాజు.

1 సమూయేలు 8 మీరు చదివినప్పుడు, ఆయన కంటె ఒక రాజు కావాలనే ఇశ్రాయేలీయుల కోరిక గురించి ప్రభువు ఎలా భావించాడో గమనించండి. “[మిమ్మల్ని] ఏలుటకు” ప్రభువును ఎంపిక చేయుట అనగా అర్థమేమిటి?(1 సమూయేలు 8:7 ప్రభువును అనుసరించుటకు బదులుగా లోకము యొక్క అవినీతి ధోరణులను అనుసరించుటకు మీరు శోధింపబడిన విధానములను కూడా మీరు పరిగణించవచ్చు. యేసు క్రీస్తు మీ నిత్య రాజుగా ఉండుటకు మీరు కోరుతున్నారని మీరు ఎలా చూపగలరు?

న్యాయాధిపతులు 8:22–23; మోషైయ 29:1–36; నీల్ ఎల్. ఆండర్సన్, “లోకమును జయించుట,” లియహోనా, మే 2017, 58–62 కూడా చూడండి.

1 సమూయేలు 9:15–17; 10:1–12; 16:1–13

ఆయన రాజ్యములో సేవ చేయడానికి ప్రవచనము ద్వారా దేవుడు జనులను పిలుస్తాడు.

ప్రవచనము మరియు బయల్పాటు ద్వారా రాజులుగా ఉండటానికి దేవుడు సౌలును మరియు దావీదును ఎన్నుకున్నాడు (1 సమూయేలు 9:15–17; 10:1–12; 16:1–13 చూడండి). నేడు ఆయన సంఘములో సేవ చేయడానికి పురుషులు, స్త్రీలను ఆయన ఈవిధంగానే పిలుస్తున్నాడు. “ప్రవచనము ద్వారా, దేవుని చేత పిలవబడుట” అనగా అర్థమేమిటని ఈ వృత్తాంతములనుండి మీరేమి నేర్చుకున్నారు? (విశ్వాస ప్రమాణములు 1:5). ప్రభువు నియమించిన సేవకుల చేత పిలవబడుట, నియమించబడుట నుండి వచ్చే దీవెనలేవి?

సౌలును అభిషేకిస్తున్న సమూయేలు

సౌలును అభిషేకిస్తున్న సమూయేలు యొక్క దృష్టాంతము © Lifeway Collection/licensed from goodsalt.com

1 సమూయేలు 13:5–14; 15

“బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుట శ్రేష్ఠము.”

సౌలు శారీరకంగా ఎత్తైనవాడు అయినప్పటికీ, అతడు రాజైనప్పుడు “[తన] స్వంత దృష్టిలో అల్పుడిగా” (1 సమూయేలు 15:17) అతడు భావించాడు. అయినప్పటికీ, అతడు విజయముతో దీవించబడినప్పుడు, అతడు ప్రభువును తక్కువగాను, తనను తాను ఎక్కువగా నమ్మసాగాడు. 1 సమూయేలు 13:5–14; 15 లో దీని గురించి ఏ రుజువును మీరు చూసారు? అప్పుడు మీరు సౌలుతో ఉన్న యెడల, అతడి “తిరుగుబాటు” మరియు “మూర్ఖత” జయించుటకు అతడికి సహాయపడునట్లు మీరు అతడితో ఏమి చెప్పియుందురు?(1 సమూయేలు 15:23).

2 నీఫై 9:28–29; హీలమన్ 12:4–5; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:39–40; థామస్ ఎస్. మాన్సన్, “నీ పాదముల యొక్క త్రోవను ధ్యానించుము ,” లియహోనా, నవం. 2014, 86–88.

1 సమూయేలు 16:7

“యెహోవా హృదయమును లక్ష్యపెట్టును”

జనులు ఇతరుల “బాహ్యరూపమును” విమర్శించే కొన్ని విధానములేవి? ప్రభువు చేసినట్లుగా “హృదయమును,” చూచుట అనగా అర్థమేమిటి?(1 సమూయేలు 16:7). మీరు ఇతరులను—మిమ్మల్ని మీరు చూసుకునే విధానముకు ఈ సూత్రమును ఎలా అన్వయించుకోగలరో పరిగణించండి. ఆవిధంగా చేయుట ఇతరులతో మీ పరస్పర చర్యలు లేదా అనుబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

1 సమూయేలు 17

ప్రభువు యొక్క సహాయముతో, నేను ఏ సవాలైన జయించగలను.

మీరు 1 సమూయేలు 17 చదివినప్పుడు, ఈ అధ్యాయములో జనుల యొక్క వివిధ మాటలను ధ్యానించండి. వారి మాటలు వారి గురించి ఏమి తెలియజేస్తాయి? దావీదు యొక్క మాటలు ప్రభువునందు అతడి ధైర్యమును, విశ్వాసమును ఎలా చూపుతాయి?

మీరు అనుభవిస్తున్న వ్యక్తిగత యుద్ధాలను ధ్యానించండి. ప్రభువు మీకు సహాయపడగలడనే మీ విశ్వాసమును బలపరచునట్లు 1 సమూయేలు 17 లో మీరు కనుగొన్నదేమిటి?

గార్డన్ బి. హింక్లీ, “మన జీవితాలలో గొల్యాతులను జయించుట,” ఎన్‌సైన్, మే 1983, 46, 51–52 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 సమూయేలు 9:15–21; 16:7.ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉక్‌డార్ప్ నుండి క్రింది మాటలతో పాటు ఈ వచనాలను చదువుట ప్రభువు సౌలు మరియు దావీదును ఎందుకు ఎంపిక చేసాడనే దాని గురించి ఒక చర్చను ప్రేరేపించవచ్చు: “మన మర్త్య నేత్రముల గుండా మనల్ని మనం చూసినప్పుడు మాత్రమే, మనం తగినంతగా చూడకపోవచ్చు. కాని మన పరలోక తండ్రి మనము నిజముగా ఎవరము మరియు ఎవరము కాగలమో చూచును” (“అది ఆశ్చర్యకరముగా పనిచేస్తుంది!లియహోనా, నవం. 2015, 23). బహుశా కుటుంబ సభ్యులు ఒకరినొకరి హృదయాలలో వారు చూచే మంచి లక్షణాలు ఏవో వంతులవారీగా మాట్లాడవచ్చు (1 సమూయేలు 16:7 చూడండి).

1 సమూయేలు 10:6–12.ఆయన సౌలును దీవించినట్లు ఒక పని లేక పిలుపును నెరవేర్చుటకు ఆత్మీయ శక్తితో దేవుడు ఎవరినైనా దీవించినట్లు మనము ఎప్పుడైనా చూసామా? “దేవుడు [మనకు] క్రొత్త మనస్సు అనుగ్రహించినప్పుడు” లేక ఆయన సేవలో “దేవుని ఆత్మ [మనపై] వచ్చినప్పుడు” (9–10 వచనములు) మనము పంచుకొనే అనుభవాలేవి?

1 సమూయేలు 17:20–54.దావీదు మరియు గొల్యాతు యొక్క కథను కలిసి చదవడాన్ని (పాత నిబంధన కథలు లో “దావీదు మరియు గొల్యాతు” సహాయపడగలవు) లేదా “ప్రభువు నన్ను కాపాడును” (ChurchofJesusChrist.org) వీడియోను చూడటం మీ కుటుంబము ఆనందించవచ్చు. మనకు “గొల్యాతు” వంటిదిగా భావించేవి మనము ఎదుర్కొనే సవాళ్ళ గురించి ఒక చర్చకు ఇది నడిపించవచ్చు. మీరు ఈ సవాళ్ళలో కొన్నింటిని లక్ష్యంగా వ్రాయవచ్చు లేదా గొల్యాతు యొక్క బొమ్మను గీయవచ్చు మరియు ఒకరి తరువాత ఒకరు దానివైపు (కాగితపు ఉండలు) వంటి వస్తువులను విసరవచ్చు.

గొల్యాతు కలిగియున్న కవచము మరియు ఆయుధములు గురించి చదవడం ఆసక్తికరంగా కూడా ఉండవచ్చు (4–7 వచనాలు చూడండి). దావీదు కలిగియున్నదేమిటి? (38–40, 45–47 వచనాలు చూడండి). మన గొల్యాతులను ఓడించడానికి మనకు సహాయపడటానికి ప్రభువు అందించిన దేమిటి?

1 సమూయేలు 18:1–4.దావీదు మరియు యోనాతాను ఒకరినొకరు మంచి స్నేహితులుగా ఎలా ఉన్నారు? మంచి స్నేహితులు మనల్ని ఎలా దీవించారు? మన కుటుంబ సభ్యులతో కలిపి—మంచి స్నేహితులుగా ఉండటానికి మనము ఏమి చేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

తరచుగా మీ సాక్ష్యమును పంచుకొనండి. “ఆత్మీయ సత్యమును గూర్చి మీ సాధారణమైన, నిజాయితీగల సాక్ష్యము [మీ కుటుంబము]పై శక్తివంతమైన ప్రభావాన్ని కలిగియుండగలదు. నేరుగా, హృదయపూర్వకంగా ఉన్నప్పుడు ఒక సాక్ష్యము అత్యంత శక్తివంతమైనది. అది వాగ్ధాటి గలది లేక సుదీర్ఘమైనది కానవసరం లేదు” (Teaching in the Savior’s Way, 11).

దావీదు

దావీదు యొక్క దృష్టాంతము, డిల్లీన్ మార్ష్ చేత