2022 పాత నిబంధన
జూన్ 20–26. 2 సమూయేలు 5–7; 11–12; 1 రాజులు 3; 8; 11: “నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును”


“జూన్ 20–26. 2 సమూయేలు 5–7; 11–12; 1 రాజులు 3; 8; 11: “నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన (2022) (2021)

“జూన్ 20–26. 2 సమూయేలు 5–7; 11–12; 1 రాజులు 3; 8; 11, “నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
సింహాసనాసీనుడైయున్న దావీదు మహారాజు

సింహాసనాసీనుడైయున్న దావీదు మహారాజు, జెర్రీ మైల్స్ హర్స‌టన్ చేత

జూన్ 20–26

2 సమూయేలు 5–7; 11–12; 1 రాజులు 3; 8; 11

“నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును”

“దైవావేశము కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది” (2 తిమోతి 3:16).

మీ మనోభావాలను నమోదు చేయండి

దావీదు మహారాజు పరిపాలన అత్యధిక వాగ్దానముతో ప్రారంభమైయింది. గొల్యాతును ఓడించుటలో అతడి అనాలోచితమైన విశ్వాసము పౌరాణికమైనది. రాజుగా అతడు యెరూషలేమును తన రాజధానిగా చేసుకొని, ఇశ్రాయేలును ఏకం చేసాడు (2 సమూయేలు 5 చూడండి). రాజ్యము మునుపెన్నడూ అంత బలంగా లేదు. అయినప్పటికీ, దావీదు శోధనలోనికి పడిపోయి, తన ఆత్మీయ శక్తిని కోల్పోయాడు.

దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన అత్యధిక వాగ్దానముతో అదేవిధంగా ప్రారంభమైంది. అతడు దైవికంగా పొందిన జ్ఞానము మరియు వివేచన పౌరాణికమైనది. రాజుగా అతడు ఇశ్రాయేలీయుల సరిహద్దులను విస్తరించాడు మరియు ప్రభువుకు మిక్కిలి అద్భుతమైన దేవాలయమును నిర్మించాడు. ఆ రాజ్యము మునుపెన్నడూ అంత బలముగా లేదు. అయినప్పటికీ, సొలొమోను తన హృదయము ఇతర దేవతల వైపుకు త్రిప్పబడటానికి మూర్ఖంగా అనుమతించాడు.

ఈ దుర్దశగల కథల నుండి మనము ఏమి నేర్చుకోగలము? బహుశా ఒక పాఠమేమిటంటే, మన గత అనుభవాలను లక్ష్యపెట్టకుండా, ఈ రోజు మనము చేస్తున్న ఎంపికలపై మన ఆత్మీయ బలము ఆధారపడి ఉంటుంది. మన స్వంత బలము లేక ధైర్యము లేక జ్ఞానము మనల్ని రక్షించదని—ప్రభువే రక్షించగలడని ఈ కథల నుండి మనము నేర్చుకుంటాము. ఈ కథలు ఇశ్రాయేలీయుల—మరియు మన నిరీక్షణ దావీదు, సొలొమోను లేదా ఏ ఇతర మర్త్య రాజు కాదు, కానీ మరొక “దావీదు కుమారుడు”: యేసు క్రీస్తు (మత్తయి 1:1), నిత్య రాజు, మనము “[ఆయన] వైపు మరలా తిరిగిన” (1 రాజులు 8:33–34) యెడల “[ఆయన] తన జనుల యొక్క పాపములను క్షమించును.”

2 సమూయేలు మరియు 1 రాజులు గ్రంథముల సంక్షేప వివరణ కొరకు, బైబిలు నిఘంటువులో “సమూయేలు, గ్రంథములు” మరియు “రాజులు, గ్రంథములు” చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

2 సమూయేలు 5:17–25

ప్రభువు నాకు నడిపింపు ఇస్తాడు.

దావీదు ఒకసారి ఇశ్రాయేలును ఏకం చేయగలిగాక, (2 సమూయేలు 5:1–5), ఫిలిష్తీయుల నుండి అతడు తన ప్రజలను రక్షించాల్సి వచ్చింది. 2 సమూయేలు 5:17–25 మీరు చదివినప్పుడు, మీరు ఎదుర్కొనే సవాళ్లలో దావీదు మాదిరి మీకు ఎలా సహాయపడగలదో ఆలోచించండి (1 సమూయేలు 23:2, 10–11; 30:8; 2 సమూయేలు 2:1 కూడా చూడండి). మీ జీవితంలో ప్రభువు యొక్క నడిపింపును మీరు ఎలా వెదకుతున్నారు? మీరు పొందిన బయల్పాటును ఆచరణలో ఉంచడం ద్వారా మీరు ఎలా దీవించబడ్డారు?

1 దినవృత్తాంతములు 12; రిఛర్డ్ జి. స్కాట్, “ఏ విధంగా మీ వ్యక్తిగత జీవితమునకు బయల్పాటును, ప్రరేపణను పొందాలి,” లియహోనా, మే 2012, 45–47 కూడా చూడండి.

2 సమూయేలు 7

దావీదుకు ప్రభువు వాగ్దానమిచ్చిన “మందిరము ఏది”?

ప్రభువుకు ఒక మందిరము, అనగా ఒక దేవాలయమును నిర్మిస్తానని దావీదు చెప్పినప్పుడు, (2 సమూయేలు 7:1–3 చూడండి), వాస్తవానికి దావీదు కుమారుడు దానిని నిర్మిస్తాడని ప్రభువు జవాబిచ్చాడు (12–15 వచనాలు చూడండి; 1 దినవృత్తాంతములు 17:1–15 కూడా చూడండి). ప్రభువు దావీదుకు ఒక “నివాసము” నిర్మిస్తానని, అనగా ఒక వంశము మరియు అతని సింహాసనం శాశ్వతంగా ఉంటుందని కూడా ఆయన చెప్పాడు (2 సమూయేలు7:11, 16, 25–29; కీర్తనలు 89:3–4, 35–37 చూడండి). ఈ వాగ్దానము మన నిత్యతండ్రి, దావీదు యొక్క వారసుడైన యేసు క్రీస్తునందు నెరవేర్చబడింది (మత్తయి 1:1; లూకా 1:32–33; యోహాను 18:33–37 చూడండి).

2 సమూయేలు 11; 12:1–14

పాపముకు వ్యతిరేకంగా నేను ఎల్లప్పుడు జాగ్రత్తగా పడాలి.

గతములో ప్రభువు పట్ల దావీదు కలిగియున్న విశ్వసనీయత అతడు “రాజనగరి మిద్దెమీద నడుస్తూ“ మరియు “స్నానము చేయు ఒక స్త్రీని చూసినప్పుడు“ శోధనకు అతడిని మినహాయించలేదు (2 సమూయేలు 11:2). అతడి అనుభవాలనుండి మీరు నేర్చుకొన్న పాఠాలను పరిగణించండి. ఇటువంటి ప్రశ్నలు ఈ వృత్తాంతమును అధ్యయనము చేయడానికి మీకు సహాయపడవచ్చు.

  • దావీదు చేసిన ఏ ఎంపికలు అతడిని మిక్కిలి పాపకరమైన మార్గములో నడిపించాయి? బదులుగా అతడు ఏ నీతిగల ఎంపికలు చేసియుండవచ్చు?

  • మీ స్వంత జీవితంలో పాపకరమైన మార్గాలలో మిమ్మల్ని నడిపించడానికి అపవాది ఏవిధంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు? భద్రతకు తిరిగి రావడానికి ఇప్పుడు మీరు చేయగల ఎంపికలు ఏవి?

2 నీఫై 28:20–24; “To Look Upon” (వీడియో), ChurchofJesusChrist.org కూడా చూడండి.

1 రాజులు 3:1–15

మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడంలో వివేచనా వరము సహాయపడుతుంది.

“నేను నీకు దేని నిచ్చుట నీకిష్టము” (1 రాజులు 3:5), అని ప్రభువు మిమ్మల్ని అడిగిన యెడల, మీరు దేనిని అడుగుతారు? సొలొమోను యొక్క మనవి గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకున్నది? “మంచి చెడుల మధ్య వివేచించుటకు” “వివేకముగల హృదయము” (9వ వచనము) ఎందుకు విలువైన వరమో ధ్యానించండి. ఈ వరమును వెదకడానికి మీరేమి చేయగలరు?

2 దినవృత్తాంతములు 1; మొరోనై 7:12–19; డేవిడ్ ఏ. బెడ్నార్, “గ్రహించుటకు త్వరపడుము ,” ఎన్‌సైన్, డిసెం. 2006, 30–36 కూడా చూడండి.

1 రాజులు 8:12-61

దేవాలయము ప్రభువు యొక్క మందిరము.

వందల సంవత్సరాలపాటు, మోషే నిర్మించిన చిన్న గుడారము చేత దేవుని సన్నిధి సూచించబడింది. దావీదు దేవునికి ఎక్కువ శాశ్వతమైన నివాస స్థానము నిర్మించడానికి సహాయపడినప్పటికీ, బదులుగా దేవుడు దావీదు కుమారుడైన సొలొమోనును ప్రభువు యొక్క దేవాలయమును నిర్మించడానికి ఏర్పరచుకున్నాడు. దేవాలయము పూర్తి చేయబడిన తరువాత సొలొమోను ప్రార్థనను మరియు అతడు తన జనులతో మాట్లాడిన మాటలను మీరు చదివినప్పుడు, ప్రభువు ఆయన మందిరమును గూర్చి అతడు ఎలా భావించాడో గమనించండి. అతడి ప్రార్థనలో అడిగిన దీవెనల జాబితాను కూడా మీరు చేయవచ్చు. ఈ దీవెనలను గూర్చి మీరు గమనించినదేమిటి? మన కాలములో ప్రభువు యొక్క మందిరము చేత మీరు ఎలా దీవించబడ్డారు?

2 దినవృత్తాంతములు 6 కూడా చూడండి.

చిత్రం
బరాన్క్విల్లా కొలంబియా దేవాలయము

బరాన్క్విల్లా కొలంబియా దేవాలయము

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

2 సమూయేలు 5:19, 23.నడిపింపు మరియు మార్గసూచన కొరకు మనము ఎప్పుడు “యెహోవా వద్ద విచారించాము”? ఆయన మనకెలా జవాబిచ్చెను?

2 సమూయేలు 7:16.ప్రభువు దావీదుతో “నీ రాజ్యము నిత్యము స్థిరమగును” అని చెప్పినప్పుడు, ఆయన దావీదు కుటుంబ వంశావళిలో భవిష్యత్తు రాజుకు ఆయన సూచిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు: ఆయనే యేసు క్రీస్తు. యేసు క్రీస్తు మీ నిత్య రాజని మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారో చర్చిస్తుండగా, బహుశా మీ కుటుంబము ఇంటిలో తయారు చేసిన కిరీటాలను ఆనందించవచ్చు.

2 సమూయేలు 11.దావీదు విషాదకరమైన పాపాలను గూర్చి చదవడం అశ్లీల చిత్రములు, అపరిశుద్ధమైన ఆలోచనలు మరియు దుర్నీతిని చర్చించుటకు మంచి అవకాశముగా ఉండవచ్చు. మీ చర్చలో క్రింది వనరులు ఉపయోగకరంగా ఉండవచ్చు: October 2019 issue of the Liahona, the Church’s Addressing Pornography resources (ChurchofJesusChrist.org/addressing-pornography), and the videos “What Should I Do When I See Pornography?” and “Watch Your Step” (ChurchofJesusChrist.org). వారు అశ్లీల చిత్రాలను ఎదుర్కొన్నప్పుడు, వారు ఏమి చేస్తారో కుటుంబ సభ్యులు ఒక ప్రణాళిక చేయవచ్చు.

1 రాజులు 11:9–11.ప్రభువు నుండి మన హృదయాలను త్రిప్పగల కొన్ని “ఇతర దేవతలు” (10వ వచనము) ఏవి? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పై మన హృదయాలను ఎలా కేంద్రీకరించగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

మీ కుటుంబాన్ని దీవించే సూత్రాలపై దృష్టి పెట్టండి. దేవుని వాక్యమును మీరు ప్రార్థనాపూర్వకంగా అధ్యయనము చేసినప్పుడు, మీకై మీరు ఇలా ప్రశ్నించుకోండి, “ఇక్కడ ప్రత్యేకంగా నేను కనుగొన్నది ఏది నా కుటుంబానికి అర్థవంతమైనదిగా ఉంటుంది?” (Teaching in the Savior’s Way, 17 చూడండి).

చిత్రం
సొలొమోను దేవాలయము

సొలొమోను దేవాలయము యొక్క దృష్టాంతము, సామ్ లాలర్ చేత

ముద్రించు