2022 పాత నిబంధన
జూన్ 27–జూలై 3. 1 రాజులు 17–19: “యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి”


“జూన్ 27–జూలై 3. 1 రాజులు 17–19: ‘యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జూన్ 27–జూలై 3. 1 రాజులు 17–19,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

మండుచున్న బలిపీఠము ప్రక్కన నిల్చున్న ఏలీయా

బయలు యాజకులతో వాదించుచున్న ఏలీయా, జెర్రీ హార్ట్‌సన్ చేత

జూన్ 27–జూలై 3

1 రాజులు 17–19

“యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి”

మీరు లేఖనములను చదువుతున్నప్పుడు, మీరు విశ్వాసాన్ని సాధన చేస్తున్నారు, అది ఆత్మ యొక్క “నిమ్మళముగా మాట్లాడు స్వరమును” (1 రాజులు 19:12) వినుటకు మీ హృదయాన్ని, మనస్సును సిద్ధపరుస్తుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఇశ్రాయేలీయులు కలవరమందుండిరి. దావీదు, సొలొమోనుల పాలనలో సాధించబడిన ఐక్యత మరియు వృద్ధి ఎప్పుడో గతించిపోయింది మరియు ప్రభువుతో జనము యొక్క నిబంధన సంబంధము అనేకమందికి ఒక సుదూర జ్ఞాపకమైనది. ఇశ్రాయేలు రాజ్యము విభజించబడింది, పది గోత్రములు ఇశ్రాయేలుకు ఉత్తరము వైపునున్న రాజ్యమును, రెండు గోత్రములు యూదాకు దక్షిణము వైపునున్న రాజ్యమును నిర్మించాయి. ప్రభువుతో తమ నిబంధనలను మీరి, అదేవిధంగా చేయడానికి ఇతరులను ప్రభావితం చేసిన రాజుల చేత నడిపించబడి, రెండు రాజ్యములు ఆత్మీయంగా నిలకడగా లేవు (1 రాజులు 11–16). కానీ, ప్రత్యేకించి ఉత్తరము వైపునున్న రాజ్యములో విశ్వాసభ్రష్టత్వము అధికముగానున్నది, అక్కడ అహాబు రాజు అబద్ధ దేవత బయలును ఆరాధించమని ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు.

ఈ పరిస్థితులలో ప్రవచించడానికి ఏలీయా ప్రవక్త పిలువబడ్డాడు. దుష్ట వాతావరణంలో కూడా నీతిమంతుల మధ్య ప్రభువుపై వ్యక్తిగత విశ్వాసం వర్థిల్లగలదని అతని పరిచర్య వృత్తాంతము స్పష్టం చేస్తుంది. పరలోకము నుండి అగ్ని క్రిందకు రావడం వంటి మనోహరమైన బహిరంగ అద్భుతాలతో కొన్నిసార్లు అటువంటి విశ్వాసానికి ప్రభువు స్పందిస్తారు. కానీ, విశ్వాసురాలైన విధవరాలు మరియు ఆమె కుమారుడి వ్యక్తిగత అవసరాలను తీర్చడం వంటి నిమ్మళమైన, వ్యక్తిగత అద్భుతాలను కూడా ఆయన చేస్తారు. చాలా తరచుగా ఆయన అద్భుతాలు ఎంత వ్యక్తిగతంగా ఉంటాయనగా—ఉదాహరణకు, “మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు స్వరము” (1 రాజులు 19:12) ద్వారా ఆయనను, ఆయన చిత్తాన్ని ప్రభువు బయల్పరచినప్పుడు అవి మీకు మాత్రమే తెలుస్తాయి.

ఏలీయా గురించి అధిక సమాచారము కొరకు, బైబిలు నిఘంటువులో “ఏలీయా” చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 రాజులు 17:1–16

త్యాగము చేయమని ఇవ్వబడు ఆహ్వానము నా విశ్వాసాన్ని సాధన చేయడానికి గల ఒక అవకాశము.

ఆకలితోనున్న ఆమె కుమారుడు మరియు ఆమె తినడానికి ముందు అతనికి ఆహారము, నీరు ఇవ్వమని సారెపతులోని విధవరాలిని ఏలీయా ప్రవక్త ఎందుకు అడిగాడో గ్రహించడం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. కానీ, ఏలీయా అభ్యర్థన ఈ చిన్న కుటుంబానికి ఒక దీవెనగా కూడా చూడబడవచ్చు. వారికి ప్రభువు యొక్క దీవెనలు అవసరము మరియు బలమైన విశ్వాసము యొక్క దీవెనతో పాటు—త్యాగము తరచు దీవెనలను తెస్తుంది.

మీరు ఈ కథను చదువుతున్నప్పుడు, ఈ విశేషమైన విధవరాలి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆమె గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? త్యాగము చేయడానికి గల అవకాశాలతో పాటు—మీ విశ్వాసాన్ని సాధన చేయడానికి మీకు గల అవకాశాలను పరిగణించండి. మీరు మరింతగా ఈ విధవరాలి వలె ఎట్లు కాగలరు?

మత్తయి 6:25–33; లూకా 4:24–26 కూడా చూడండి.

1 రాజులు 18

“యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి”

“నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” (నిర్గమకాండము 20:3) అని ప్రభువు ఆజ్ఞాపించినప్పటికీ, బయలును ఆరాధించుటకు వారికి మంచి కారణాలున్నాయని ఇశ్రాయేలీయులు భావించియుండవచ్చు. తుఫానులు మరియు వర్షము యొక్క దేవుడని బయలు ప్రఖ్యాతి చెందాడు మరియు మూడు సంవత్సరాల కరువు తర్వాత, వారికి తుఫాను బాగా అవసరమైంది. బయలు ఆరాధన సామాజికంగా అంగీకరించబడింది మరియు రాజు, రాణిల చేత ఆమోదించబడింది. మీరు 1 రాజులు 18 చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఉన్న పరిస్థితులతో పోల్చదగినట్లుగా మీ జీవితంలో ఉన్న ఏవైనా పరిస్థితులను పరిగణించండి. ప్రత్యామ్నాయాలు సముచితంగా మరియు నిర్బంధించుచున్నట్లు అనిపించినందున, ప్రభువును అనుసరించడం గురించి మీరు సందేహిస్తున్నట్లు మీకెప్పుడైనా అనిపించిందా? (1 రాజులు 18:21 చూడండి). ఈ అధ్యాయములో కనుగొనబడు సంఘటనలలో, తన గురించి మరియు బయలు గురించి జనులకు ఏమి బోధించడానికి ప్రభువు ప్రయత్నిస్తున్నారని మీరనుకుంటున్నారు? ఏ అనుభవాలు మీకు ఇటువంటి సత్యాలను బోధించాయి?

ప్రభువుపై అతని విశ్వాసాన్ని చూపేలా ఈ అధ్యాయములో ఏలీయా చెప్పిన మరియు చేసిన సంగతులను గమనించడం ఆసక్తికరంగా ఉండవచ్చు. విశ్వాసం గురించి ఏలీయా నుండి మీరేమి నేర్చుకుంటారు?

యెహోషువ 24:15; 2 నీఫై 2:26–28 కూడా చూడండి.

బండపై నిల్చున్న ఏలీయా

1 రాజులు 19:11–12 యొక్క చిహ్నరూపక వర్ణన. The Prophet (ప్రవక్త), © Robert Booth Charles/Bridgeman Images

1 రాజులు 19:1–18

ప్రభువు తరచు నిమ్మళమైన, సరళమైన విధానాలలో మాట్లాడతారు.

కర్మెలు పర్వతంపై తన యాజకులకు జరిగిన దాని గురించి యెజెబెలు రాణి వినినప్పుడు, ఆమె పరివర్తన చెందలేదు—ఆమె ఆగ్రహపడింది. తన ప్రాణము గురించి భయపడుతూ, ఏలీయా అరణ్యములోనికి పారిపోయి, గుహలో తలదాచుకున్నాడు. అక్కడ ఒంటరితనము మరియు నిరాశతో శ్రమపడుతూ అతడు ప్రభువుతో ఒక అనుభవాన్ని కలిగియున్నాడు, అది కర్మెలు పర్వతంపై జరిగిన దానికంటే చాలా భిన్నమైనది. మీకు అవసరమైన సమయాల్లో ప్రభువు మీతో ఎలా సంభాషిస్తారనే దాని గురించి 1 రాజులు 19:1–18లో ఏలీయా అనుభవము మీకేమి బోధిస్తుంది? మీ జీవితంలో ఆయన స్వరమును మీరు అనుభవించిన సమయాలను ధ్యానించండి. మరింత తరచుగా ఆయన నడిపింపును పొందడానికి మీరేమి చేయాలి?

ప్రభువు మనతో ఎలా సంభాషిస్తారో వివరించడానికి క్రింది వచనాలలో ఉపయోగించబడిన పదాలు మరియు వాక్యభాగాలను ధ్యానించండి: హీలమన్ 5:30; 3 నీఫై 11:3–7; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22–23; 8:2–3; 9:8–9; 11:12–14; 36:2.

కీర్తనలు 46:10; 1 నీఫై 17:45; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆయనను వినుము,” లియహోనా, మే 2020, 88–92 కూడా చూడండి.

1 రాజులు 19:19–21

ప్రభువును సేవించడానికి ఇహలోక చింతలను మించిన ప్రాధాన్యత కావాలి.

ఏలీయా 12 కాడెద్దులను కలిగియున్నాడనే వాస్తవము బహుశా అతడొక ధనవంతుడని సూచిస్తుంది. 1 రాజులు 19:19–21లో నమోదు చేయబడిన అతని పనుల గురించి మిమ్మల్ని ఆకట్టుకున్నదేది? ఏలీయా మాదిరిని మీరు ఎలా అనుసరించగలరు?

మత్తయి 4:18–22 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

1 రాజులు 17:1–16.1 రాజులు 17:1–16లోని వృత్తాంతమును ఊహించుకోవడానికి ఈ సారాంశంలోని చిత్రము మీ కుటుంబానికి సహాయపడగలదు. వచనాలను చదివి, ఈ వనరులను చూసిన తర్వాత, విధవరాలు కలిగియున్న ప్రేరణాత్మక లక్షణాలను ప్రతి కుటుంబ సభ్యుడు జాబితా చేయవచ్చు. మన విశ్వాసాన్ని నిరూపించడానికి ఏమి చేయమని ప్రభువు మనల్ని అడుగుతున్నారు?

1 రాజులు 18.1 రాజులు 18లోని కథను నేర్చుకోవడానికి (పాత నిబంధన కథలు లో) “ఏలీయా మరియు బయలు యాజకులు” మీ కుటుంబానికి సహాయపడగలదు. ప్రభువు పట్ల పూర్తి నిబద్ధత కలిగియుండకుండా మనల్ని నిరోధిస్తున్న విషయాలేవైనా ఉన్నాయా? ఆయనను ఎంచుకోవడానికి మన సమ్మతిని మనమెలా చూపగలము? (21వ వచనము చూడండి).

1 రాజులు 19:11–12.“మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు స్వరమును” వినడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి మీ కుటుంబానికి ఏది సహాయపడుతుంది? మృదువైన స్వరంతో మీరందరు కలిసి 1 రాజులు 19:11–12 చదవవచ్చు. మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు స్వరమును వినకుండా మనల్ని నిరోధించడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడో వివరించడానికి మీరు కొన్ని మనసు మళ్ళించు స్వరాలను జతచేయవచ్చు. ఆత్మ యొక్క ప్రేరేపణల పట్ల సున్నితంగా ఉండేందుకు వారేమి చేస్తారో కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీ మనోభావాలను నమోదు చేయండి. ఆత్మ మీతో మాట్లాడుతున్నట్లు మీరు గ్రహించినప్పుడు, అతడు మీకు చెప్తున్నాడని మీరు భావించిన దానిని వ్రాయడం గురించి ఆలోచించండి. ఈ మనోభావాలను పదాలలో కూర్చాలనే ఆలోచన వాటిని ధ్యానించి, భద్రపరచుకోవడానికి మీకు సహాయపడగలదు.

స్త్రీ మరియు బిడ్డ

సారెపతు యొక్క విధవరాలు, రోస్ డాటక్ డాల్ చేత