“జూలై 11–17. 2 రాజులు 17–25: ‘అతడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునందు నమ్మకముంచెను’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జూలై 11–17. 2 రాజులు 17–25,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జూలై 11–17
2 రాజులు 17–25
“అతడు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునందు నమ్మకముంచెను”
ధర్మశాస్త్ర గ్రంథము నుండి మాటలను యోషియా విన్నప్పుడు, అతడు విశ్వాసముతో స్పందించాడు. 2 రాజులు 17–25 లో మీరు చదివిన దానికి విశ్వాసముతో ఎలా స్పందించగలరు?
మీ మనోభావాలను నమోదు చేయండి
ప్రవక్తయైన ఎలీషా యొక్క ఆకట్టుకునే పరిచర్య ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము యొక్క ఆత్మీయత క్షీణించసాగింది. దుష్టులైన రాజులు విగ్రహారాధనను, యుద్ధము మరియు విశ్వాసభ్రష్టత్వమును ప్రోత్సహించారు. చివరకు అష్షూరు సామ్రాజ్యము ఇశ్రాయేలు పది గోత్రములను జయించి, చెదరగొట్టెను.
ఇది ఇలా ఉండగా, యూదా యొక్క దక్షిణ రాజ్యము యొక్క పరిస్థితి ఏమీ బాగోలేదు; అక్కడ విగ్రహారాధన విస్తృతంగా వ్యాప్తి చెందింది. కానీ ఈ సమస్త ఆత్మీయ క్షీణత మధ్యలో, లేఖన వృత్తాంతములు ఇద్దరు నీతిమంతులైన రాజుల గురించి చెప్పును, వారు ఒకసారి వారి జనులను ప్రభువువైపు త్రిప్పారు. వారిలో ఒకరు హిజ్కియా. అతడి పాలనలో అష్షూరీయులు, అప్పుడే ఉత్తరమున విజయము సాధించి, దక్షిణములో అధిక భాగమును జయించారు. హిజ్కియా మరియు అతడి జనులు ప్రభువునందు విశ్వాసమును చూపారు, ఆయన ఒక అద్భుతమైన విధానములో యెరూషలేమును విడిపించాడు. తరువాత, మరొక విశ్వాసభ్రష్టత్వ కాలము తరువాత యోషియా పరిపాలించసాగాడు. ధర్మశాస్త్ర గ్రంథమును తిరిగి కనుగొనుట వలన ప్రేరేపించబడి, యోషియా తన అనేక జనుల యొక్క మత జీవితాన్ని పునరుద్ధరించిన సంస్కరణలను తీసుకువచ్చాడు.
యూదా చరిత్ర యొక్క చీకటి సంవత్సరాలలో ఈ రెండు ప్రకాశవంతమైన బిందువుల నుండి మనం ఏమి నేర్చుకుంటాము? మిగిలిన విషయాల నడుమ, మీ జీవితంలో విశ్వాసము మరియు దేవుని వాక్యము యొక్క శక్తిని మీరు ధ్యానించవచ్చు. ఇశ్రాయేలు మరియు యూదా వలె మనమందరం మంచి, చెడు ఎంపికలు చేస్తాము. మన జీవితాలలో ఆ సంస్కరణలు అవసరమని మనం గ్రహించినప్పుడు, బహుశా హిజ్కియా మరియు యోషియా మాదిరులు “మన దేవుడైన యెహోవాను నమ్ముకొనుటకు” (2 రాజులు 18:22) మనల్ని ప్రేరేపించగలవు.
2 దినవృత్తాంతములు 29–35; “జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు” “‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును” భాగము కూడా చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
కష్ట కాలములందు నేను ప్రభువుకు యధార్థముగా నిలిచియుంటాను.
మన విశ్వాసమును సవాలు చేసే సమయాలను మనలో అనేకులము అనుభవించాము. అష్షూరు సైన్యము యూదాపై దండయాత్ర చేసి, అనేక పట్టణాలను నాశనము చేసి, యెరూషలేమును సమీపించినప్పుడు హిజ్కియా మరియు తన జనులకు అటువంటి సమయాలలో ఒకటి వచ్చింది. 2 రాజులు 18–19 మీరు చదివినప్పుడు, ఆ సమయమందు యెరూషలేములో మీరు నివసిస్తున్నట్లు ఊహించండి. ఉదాహరణకు, 2 రాజులు 18:28–37 మరియు 19:10–13 లో వ్రాయబడినట్లుగా అష్షూరీయుల యొక్క వేదింపులను వినుటను మీరు ఎలా భావించియుంటారు? స్పందనగా హిజ్కియా చేసిన దాని నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? (2 రాజులు 19:1–7, 14–19 చూడండి). ప్రభువు హిజ్కియాను ఎలా బలపరిచాడు? (2 రాజులు 19:35–37 చూడండి). కష్టకాలములందు ఆయన మిమ్మల్ని ఎలా బలపరిచాడో ధ్యానించండి.
2 రాజులు 18:5–7 లో హిజ్కియా యొక్క వివరణ కూడా మీరు ధ్యానించవచ్చు. సవాళ్ళు వచ్చినప్పుడు హిజ్కియా విశ్వాసంగా ఎందుకు ఉండగలిగాడో ఈ వచనాలు ఏమి సూచిస్తున్నాయి? అతడి మాదిరిని మీరు ఎలా అనుసరించగలరు?
3 నీఫై 3–4; డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “క్రీస్తు యొక్క విశ్వాసంలో దృఢముగా, స్థిరముగా నిలుచుట,” లియహోనా, నవం. 2018, 30–33 కూడా చూడండి.
అన్ని విషయములు ప్రభువు హస్తములలో ఉన్నాయి.
అష్షూరు రాజైన సన్హెరీబు, అతడి సైన్యము యెరూషలేమును జయించగలదని నమ్మడానికి మంచి కారణమున్నది. ఇశ్రాయేలుతో కలిపి అష్షూరు అనేక రాజ్యములను ఓడించింది —వాటిలో యెరూషలేము ఎందుకు ప్రత్యేకమైనది? (2 రాజులు 17; 18:33–34; 19:11–13 చూడండి). అయితే సన్హెరీబు కోసం ప్రభువు ఒక సందేశాన్ని కలిగియున్నాడు, అది యెషయా ప్రవక్త ద్వారా ఇవ్వబడి, 2 రాజులు 19:20–34 లో వ్రాయబడింది. ఈ సందేశమును మీరు ఎలా సంక్షిప్తపరచగలరు? ప్రభువు మరియు ఆయన ప్రణాళికయందు మీరు విశ్వాసమును కలిగియుండునట్లు మీకు సహాయపడినట్లు ఈ వచనములలో మీరు కనుగొన్న సత్యములేవి?
హీలమన్ 12:4-23; సిద్ధాంతము మరియు నిబంధనలు 101:16 కూడా చూడండి.
లేఖనాలు ప్రభువువైపు నా హృదయమును మరల్చగలవు.
మీకు ఆత్మీయంగా ఏదైనా కొదువుగా ఉన్నట్లు ఎప్పుడైనా భావించారా? దేవునితో మీ అనుబంధము ఎక్కువ బలమైనదిగా మీరు భావించియుండవచ్చు. ఆయన యొద్దకు తిరిగి రావడానికి మీకు సహాయపడినదేమిటి? మనష్షే రాజు ఏలుబడిలో యూదా రాజ్యము ప్రభువు నుండి ఏవిధంగా పడిపోయింది (2 రాజులు 21 చూడండి) మరియు వారు ఆయన వైపుకు తిరిగి తమనుతాము నిబద్ధులుగా చేసుకొనుటకు యోషియా రాజు వారికి ఏవిధంగా సహాయము చేసాడో మీరు చదివినప్పుడు ఈ ప్రశ్నలను గూర్చి ధ్యానించండి. (2 రాజులు 22–23 చూడండి). యోషియా మరియు అతడి జనులను ప్రేరేపించినదేమిటి? “ [మీ] పూర్ణ హృదయముతోను, [మీ] పూర్ణ ఆత్మతోను … యెహోవా మార్గములందు నడుచుటకు” (2 రాజులు 23:3) మీ ఒడంబడికను క్రొత్తదిగా చేయడానికి ఈ వృత్తాంతము మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.
ఈ అధ్యాయములను మీరు చదివినప్పుడు, సంఘ అధ్యక్షుల బోధనలు: స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ([2006], 59–68) లో, 6వ అధ్యాయము చదవడానికి కూడా పరిగణించండి, దానిలో అధ్యక్షులు కింబల్ యోషియా రాజు యొక్క వృత్తాంతము “లేఖనములన్నిటిలో శ్రేష్ఠమైన కథలలో ఒకటి” (62పేజీ) అని సూచించారు. అధ్యక్షులు కింబల్ ఆవిధంగా ఎందుకు భావించియుండవచ్చు? అధ్యక్షులు కింబల్ యొక్క మాటలు, ప్రత్యేకంగా యోషియా రాజు గురించి ఆయన వ్యాఖ్యానాలలో మీరు కనుగొన్నది ఏది 2 రాజులు 22–23 మీ జీవితానికి అన్వయించడానికి మీకు సహాయపడుతుంది ?
ఆల్మా 31:5; తకాషి వాడ, “క్రీస్తు వాక్యములను విందారగించుట,” లియహోనా, మే 2019, 38–40; “Josiah and the Book of the Law” (video), ChurchofJesusChrist.org కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
2 రాజులు 19:14–19.మనము కష్టమైన సమస్యలు లేక ప్రశ్నలను కలిగియున్నప్పుడు మనకు సహాయపడునట్లు హిజ్కియా యొక్క మాదిరి నుండి మనము ఏమి నేర్చుకోగలము? సహాయము కొరకు మన ప్రార్థనలకు ప్రభువు ఎలా జవాబిచ్చెను? అది ప్రభువు వైపు తిరగమని వారికి గుర్తు చేయునట్లు బహుశా ప్రతీ కుటుంబ సభ్యుడు ఇంట్లో ప్రదర్శించడానికి ఏదైనా చేయవచ్చు.
-
2 రాజులు 22:3–7.2 రాజులు 22:3–7లో వివరించబడిన పనివారు దేవాలయమును తిరిగి కట్టడానికి ఉపయోగించబడిన ద్రవ్యముతో “వారు నమ్మకంగా వ్యవహరించినందున” నమ్మబడ్డారు (7వ వచనము) . ఈ వచనాలు చదివిన తరువాత, కుటుంబ సభ్యులకు అప్పగించబడిన విషయాలను పేర్కొమని మీరు అడగవచ్చు. ఈ వచనములలోని పనివారివలే మనము నమ్మకస్థునిగా ఎలా ఉండగలము?
-
2 రాజులు 22:8–11, 19; 23:1–3.దేవుని వాక్యమునకు యోషియా మరియు అతడి జనులు ఎలా స్పందించారనే దాని గురించి మిమ్మల్ని ఆకట్టుకున్నదేమిటి? లేఖనములలో దేవుని యొక్క మాటలకు మనము ఎలా స్పందించాలి? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తును అనుసరించడానికి వారి కోరికను హెచ్చించునట్లు మీ కుటుంబ సభ్యులు లేఖన వాక్యభాగాలు లేక కథలను పంచుకోవచ్చు.
-
2 రాజులు 23:25.ఈ వచనములో యోషియా వివరణ గురించి మనకు ఏది ప్రత్యేకంగా కనిపిస్తుంది? ఈ వారము వారు తమ పూర్ణ హృదయముతో ప్రభువువైపు తిరగడానికి చేయగల విషయాలను కాగితపు హృదయాకారాలపై మీ కుటుంబము గీయవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.