“జూలై 25–31. ఎస్తేరు: “నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జూలై 25–31. ఎస్తేరు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జూలై 25–31
ఎస్తేరు
“నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో”
మీరు ఎస్తేరు చదివినప్పుడు, మీకు అనుకూలంగా మారిన ఆత్మ నుండి ప్రేరేపణను వెదకండి మరియు మీరు పొందే భావనలను నమోదు చేయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
ఎస్తేరు గ్రంథములో అనేక సంఘటనలు అదృష్టముగా లేక యాదృచ్ఛికంగా కనబడతాయి. ఒక అనాధయైన యూదా అమ్మాయి, తన జనులు వధింపబడకుండా రక్షించుటకు తగిన సమయంలో పర్షియా రాణిగా ఎలా మారిందో మరేవిధంగా మీరు వివరిస్తారు? రాజును హత్య చేయడానికి పన్నిన కుట్రను వినటానికి ఎస్తేరు బంధువైన మొర్దెకైకు కలిగిన అవకాశములేవి? ఇవి యాదృచ్ఛికములా లేక అవి దైవిక ప్రణాళికలో భాగామా? ఎల్డర్ రోనాల్డ్ ఎ. రాస్బాండ్ గమనించారు: “యాదృచ్ఛికంగా కనబడే ఒక అవకాశం, వాస్తవానికి పరలోకమందున్న తండ్రిచేత పర్యవేక్షించబడింది. … మన జీవితాల యొక్క చిన్న వివరాలలో ప్రభువు యొక్క ప్రభావమును మనం చూడవచ్చును” (“దైవిక రూపకల్పన చేత,” లియహోనా, నవం. 2017, 56). ఈ “చిన్న వివరాలలో” ప్రభువు యొక్క ప్రభావమును మనము ఎల్లప్పుడూ గుర్తించలేకపోవచ్చు. కానీ, ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చడానికి ఆయన హస్తములలో మనము సాధనములైనప్పుడు, ఆయన మన మార్గమును నడిపించి “ఈ సమయమును బట్టి” (ఎస్తేరు 4:14) మనల్ని సిద్ధపరచగలడని ఎస్తేరు అనుభవం నుండి మనం నేర్చుకుంటాము.
ఎస్తేరు గ్రంథములో సమీక్ష కొరకు బైబిలు నిఘంటువులో, ఎస్తేరు, గ్రంథము చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ఇతరులను దీవించుటకు ప్రభువు నన్ను ఒక సాధనముగా చేయగలడు.
సహోదరి యాన్నీ సి. పింగ్రీ బోధించారు: “దేవుని హస్తములలో ఒక సాధనముగా ఉండటం ఒక గొప్ప విశేషావకాశము మరియు పరిశుద్ధ బాధ్యత. మనము ఎక్కడ నివసించినప్పటికీ, మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మన వైవాహిక స్థితి లేక వయస్సు ఏదైనప్పటికీ, ఈ చివరి యుగములో ఆయన రాజ్యమును నిర్మించుటలో [మన] ప్రత్యేక భాగమును నెరవేర్చుటకు ప్రభువుకు మనలో ప్రతీ ఒక్కరు అవసరము” (“మీ కొరకు ప్రభువు చిత్తాన్ని తెలుసుకొనుట,” లియహోనా, నవం. 2005, 112).
ఎస్తేరు యొక్క కథను మీరు చదివినప్పుడు, ఈ వ్యాఖ్యానము ఆమెకు ఎలా అన్వయించబడుతుందో లోతుగా ఆలోచించండి. ప్రభువు యూదులను రక్షించడానికి ఆమెకు సాధ్యపరచిన విధానాల కొరకు చూడండి (ఉదాహరణకు, ఎస్తేరు 2:21–23; 3:10–14; 4:14–16 చూడండి). తరువాత ఇతరులను దీవించుటకు మిమ్మల్ని అనుమతించు విధానాలలో మీ జీవితాన్ని ఆయన ఎలా నడిపించాడో లోతుగా ధ్యానించండి. “ఈ సమయమును బట్టి” ఆయన మిమ్మల్ని నడిపించాడని మీరు భావించిన కొన్ని పరిస్థితులు లేక అనుబంధాలలో కొన్ని ఏవి? (ఎస్తేరు 4:14). మీరు గోత్రజనకుని దీవెనను కలిగియుంటే, మీరు చేయడానికి ప్రభువు కలిగియున్న కార్యము గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి దానిని చదవడానికి పరిగణించండి.
గర్వము, కోపము నాశనానికి దారితీయగలవు.
ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు, మొర్దెకై యొక్క విశ్వాసము అదేవిధంగా హామాను యొక్క గర్వము, కోపము గురించి మనము నేర్చుకుంటాము. ఎస్తేరు 3; 5:9–14 మీరు చదివినప్పుడు, హామాను యొక్క భావనలు, మాటలు మరియు క్రియలను గమనించుటను పరిగణించండి. అతడు, అతడి ప్రేరణలను గూర్చి అవి ఏమి తెలియజేస్తాయి? అతడు అనుభవించిన పర్యవసానములు ఏమిటి? (ఎస్తేరు 7 చూడండి). హామాను గురించి చదవడం మీ భావాలు, క్రియలను ఏది ప్రేరేపిస్తుందో నిర్ధారించుకొనుటకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఏవైనా మార్పులు చేయడానికి మీరు ప్రేరేపించబడ్డారా? సహాయము కొరకు పరలోక తండ్రిపై మీరు ఎలా ఆధారపడగలరు?
సామెతలు 16:32; ఆల్మా 5:28 కూడా చూడండి.
ఉపవాసము ప్రభువుపై నేను ఆధారపడడాన్ని నిరూపిస్తుంది.
ఎస్తేరు మరియు మిగిలిన యూదులు ఉపవాసముండటానికి దారితీసిన పరిస్థితులను గమనించండి (ఎస్తేరు 3:13; 4:1–3, 10–17 చూడండి). ఉపవాసము వారికి ఒక దీవెనగా ఎలా ఉన్నది? (ఎస్తేరు 5:2–3; 8:11–12). ఉపవాసముండమని ప్రభువు మనల్ని ఎందుకు అడుగుతున్నాడు? (Gospel Topics, “Fasting and Fast Offerings,” topics.ChurchofJesusChrist.org చూడండి). ఉపవాసము మీ జీవితంలో ఒక గొప్ప దీవెనగా చేయడానికి మీరు చేయగల దానిని పరిగణించండి.
యెషయా 58:6–12; మత్తయి 4:1–4; 17:14–21; “Fasting: Young Single Adult Ward, Amanda” (వీడియో), ChurchofJesusChrist.org కూడా చూడండి.
ఎస్తేరు 3:1–11; 4:10–17; 5:1–4
సరైన దానిని చేయడానికి తరచుగా గొప్ప ధైర్యము అవసరము.
మొర్దెకై మరియు ఎస్తేరు వారి నమ్మకాలను కాపాడుకున్నప్పుడు, వారు తమ జీవితాలను అపాయంలో పడవేసుకున్నారు. మన ఎంపికలు పరిణామాలను కలిగియుంటాయి, అవి తక్కువ తీవ్రంగా ఉండవచ్చు, కానీ సరైన దానిని చేయడానికి ధైర్యము అవసరము. సరైన దానిని చేయడానికి ధైర్యము కలిగియుండుట గురించి ఎస్తేరు 3:1–4; 4:10–17 నుండి మీరేమి నేర్చుకుంటారు? ధైర్యము చూపించిన తరువాత మొర్దెకై మరియు ఎస్తేరు అనుభవించిన పరిణామాలు ఎలా భిన్నంగా ఉన్నాయో గమనించండి (ఎస్తేరు 3:5–11; 5:1–4 చూడండి). ఒక వ్యక్తి మొర్దెకై మరియు ఎస్తేరు చేసిన ఎంపికలు చేయడానికి, అనగా పరిస్థితులను లక్ష్యపెట్టకుండా సరైన దానిని చేయడానికి దేవుని గురించి ఏమి తెలుసుకోవాల్సిన అవసరమున్నది?
సరైన దానిని చేయడం వల్ల కలిగే పరిణామాలను మీరు ఆలోచించిన తదుపరిసారి, మీ స్వంత పరిస్థితికి ఎస్తేరు 4:16 లో ఎస్తేరు యొక్క ధైర్యముగల మాటలను మీరు అన్వయించవచ్చు. ఉదాహరణకు, “నేను సరైన దానిని చేయడానికి ఎంపిక చేసినప్పుడు, నేను [స్నేహితులను కోల్పోతే], నేను [స్నేహితులను కోల్పోతాను]” అని మీకై మీరు ప్రశ్నించుకోవచ్చు.
థామస్ ఎస్. మాన్సన్, “మీరు ధైర్యమును కలిగియుందురు గాక,” లియహోనా, మే 2009, 123–27 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
ఎస్తేరు 1–10ఎస్తేరు కథ (“Queen Esther” in Old Testament Stories లేదా “For Such a Time as This,” ChurchofJesusChrist.org చూడండి) వీడియో సమీక్షించిన తరువాత, పాత్రలలో కొన్నిటి యొక్క సాధారణమైన తోలుబొమ్మలను చేయడం మీ కుటుంబం ఆనందించవచ్చు ప్రాథమిక కొరకు—రండి, నన్ను అనుసరించండి లో (ఈ వారము యొక్క ప్రోత్సాహకార్యక్రమ పేజీని చూడండి). తరువాత వారు కథను తిరిగి చెప్పడానికి వాటిని ఉపయోగించవచ్చు. మీరు “Dare to Do Right” (Children’s Songbook, 158) or “Do What Is Right” (Hymns, no. 237) వంటి ధైర్యంగా, యధార్ధంగా ఉండుట గురించి పాట కూడ మీరు పాడవచ్చు. పాటలో ఏ మాటలు మీకు ఎస్తేరును జ్ఞాపకం చేస్తాయి?
-
ఎస్తేరు 2:5–7.కష్ట కాలములలో కుటుంబ సభ్యులకు సహాయపడుట గురించి మొర్దెకై మాదిరి నుండి మనము ఏమి నేర్చుకోగలము? మన కుటుంబంలో మన సహాయం ఎవరికి అవసరము? వారికి సహాయపడటానికి ఒక ప్రణాళిక చేయండి.
-
ఎస్తేరు 4:15–17.వారు ఎదుర్కొనే పరిస్థితులలో సత్యము కొరకు నిలబడుటకు ధైర్యమును ఎలా వృద్ధి చేయాలో చర్చించడానికి ఎస్తేరు యొక్క ధైర్యము మీ కుటుంబాన్ని ప్రేరేపించగలదు. నేను “నశించిన నశించెదను” అనిన ఎస్తేరు ఉద్దేశ్యమేమిటి? మనకు ధైర్యము అవసరమైనప్పుడు ఆమె మాటలు మనకు ఎలా అన్వయిస్తాయి? “Courage” (ధైర్యము) (ChurchofJesusChrist.org) వీడియో కొన్ని మాదిరులనిస్తుంది.
-
ఎస్తేరు 9:26–32.ఎస్తేరు కథను జ్ఞాపకం చేసుకోవడానికి పూరీము యొక్క యూదా విందు ఏర్పాటు చేయబడింది. ఈ వారము భోజనం సమయంలో, ఎస్తేరు చేసినట్లుగా సరైన దాని కొరకు నిలబడుట ద్వారా ఇతరులను దీవించిన పూర్వీకులు కలిపి మీ కుటుంబ సభ్యుల కథలను పంచుకోవడానికి ఆలోచించండి.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.