2022 పాత నిబంధన
జూలై 4–10. 2 రాజులు 2–7: “ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు”


“జూలై 4–10. 2 రాజులు 2–7: ‘ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జూలై 4–10. 2 రాజులు 2–7” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

సేవకునికి అగ్ని రధములను చూపించుచున్న ఎలీషా

ఎలీషా తన సేవకునికి అగ్ని రధములను చూపించే దృష్టాంతము, © Review & Herald Publishing/licensed from goodsalt.com

జూలై 4–10

2 రాజులు 2–7

“ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు”

మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు, నిర్ధిష్టమైన వాక్యభాగాలను లేదా అంశాలను పరిశుద్ధాత్మ మీ దృష్టికి తేవచ్చు. ఆ లేఖన భాగాలు మీకు ఎందుకు అర్థవంతమైనవో వ్రాయడానికి పరిగణించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఒక ప్రవక్త యొక్క ప్రధాన పని రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి బోధించుట మరియు సాక్ష్యమిచ్చుట. అయినప్పటికీ, ప్రవక్త ఎలీషాను గూర్చి మన నివేదిక, అతడు బోధించుట లేక సాక్ష్యమిచ్చుటను కలిగియుండదు. ఒక బిడ్డను మరణము నుండి లేపుట, (2 రాజులు 4:18–37), స్వల్ప పరిమాణములో ఉన్న ఆహారమును ఒక సమూహమునకు ఆహారమిచ్చుట (2 రాజులు 4:42–44) మరియు ఒక కుష్టురోగిని స్వస్థపరచుట ( 2 రాజులు 5:1–14 చూడండి) మొదలైన వాటితో కలిపి ఎలీషా చేసిన అద్భుతాలను మన నివేదిక కలిగియున్నది. క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే ఎలీషా యొక్క మాటలను మనం కలిగిలేనప్పటికీ, ఎలీషా పరిచర్య అంతటా ప్రభువు యొక్క ప్రాణమును ఇచ్చే, పోషించే మరియు స్వస్థపరచే శక్తి యొక్క శక్తివంతమైన బయల్పాటులను మనం కలిగియున్నాము. మన జీవితాలలో అటువంటి ప్రత్యక్షతలు మనం గ్రహించే దానికంటే ఎక్కువ సమృద్ధిగా ఉన్నాయి. వాటిని చూడాలంటే, భయపడుతున్న తన యువ సేవకుని తరఫున “యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీడి కండ్లను తెరువుము” (2 రాజులు 6:17) అని ప్రార్థించినప్పుడు, ఎలీషా కోరిన అద్భుతమునే మనము కూడా వెదకవలసియున్నది.

2 రాజులు గురించి ఎక్కువ సమాచారము కొరకు, బైబిలు నిఘంటువులో, “రాజులు, గ్రంథాలు” చూడండి.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

2 రాజులు 2–6

దేవుడు నా జీవితంలో అద్భుతాలను చేయగలడు.

అద్భుతాలు మర్త్యత్వములోని కష్టాలను జయించడానికి మనకు సహాయపడగలవు—ఎలీషా కాలములో, బంజరు భూమికి స్వచ్ఛమైన నీళ్లు అవసరము మరియు కోల్పోయిన గొడ్డలిని తిరిగి పొందవలసిన అవసరం ఉన్నది (2 రాజులు 2:19–22; 6:4–7 చూడండి). కానీ అద్భుతాలు మన హృదయాలను ప్రభువువైపు త్రిప్పగలవు మరియు మనకు ఆత్మీయ బోధనలను కూడా బోధించగలవు. 2 రాజులు 2–6 మీరు చదివినప్పుడు, మీరు కనుగొనే అద్భుతాల జాబితాను చేయడానికి పరిగణించండి మరియు ప్రతీ దానినుండి మీరు నేర్చుకొన్న ఆత్మీయ పాఠములను ధ్యానించండి. ఈ అద్భుతాలు ప్రభువు మరియు మీ జీవితంలో ఆయన చేయగల దాని గురించి మీకేమి బోధిస్తాయి?

2 నీఫై 26:12–13; 27:23; మోర్మన్ 9:7–21; మొరోనై 7:35–37; డోనాల్డ్ ఎల్. హాల్‌స్టోర్మ్, “అద్భుతముల యొక్క కాలము ఆగిపోయినదా?” కూడా చూడండి. లియహోనా, నవం. 2017, 88–90.

2 రాజులు 4:8–17; 7:1–16

ఆయన ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రభువు వాక్యములు నెరవేర్చబడును.

2 రాజులు 4:8–17; 7:1–16లో వ్రాయబడినట్లుగా, రాబోయే విషయాలను—ఇతరుల దృష్టిలో జరగనట్లుగా కనబడే విషయాలను ప్రవచించుటకు ఎలీషాను ప్రభువు ప్రేరేపించాడు. మీరు ఈ వచనాలను చదివినప్పుడు, నేడు ఆయన ప్రవక్తల ద్వారా ఇవ్వబడే ప్రభువు వాక్యమునకు మీరు ఎలా స్పందిస్తున్నారో ఆలోచించండి. జీవిస్తున్న ప్రవక్తలనుండి మీరు వినిన బోధనలు, ప్రవచనాలు లేదా వాగ్దానాలు ఏవి? ఆ వాగ్దానములపై విశ్వాసముతో పని చేయడానికి మీరేమి చేస్తున్నారు?

3 నీఫై 29:76; సిద్ధాంతము మరియు నిబంధనలు 76:-38 కూడా చూడండి.

2 రాజులు 5

నేను వినయముగా, విధేయతగా ఉన్న యెడల యేసు క్రీస్తు నన్ను స్వస్థపరచగలడు.

ఒక కథలో ఆత్మీయ విషయాలతో భౌతిక విషయాలను పోల్చినప్పుడు, లేఖనాలలోని వ్యక్తిగత అర్థమును కనుగొనటం కొన్నిసార్లు సులభమౌతుంది. ఉదాహరణకు 2 రాజులు 5 చదువుతున్నప్పుడు, నయమాను యొక్క కుష్టరోగమును మీరు ఎదుర్కొంటున్న ఆత్మీయ సవాలుతో పోల్చవచ్చు. నయమాను వలె, మీకు సహాయపడటానికి ప్రభువు “యేదైన నొక గొప్ప కార్యము” (13వ వచనము) బహుశా మీరు ఆశించయుండవచ్చు. నయమాను యొక్క అనుభవం మీకేమి బోధిస్తుంది? మీ జీవితంలో, “స్నానం చేసి, శుద్ధుడవు కమ్ము” అనే సాధారణమైన సలహాను అనుసరించుటలో సమానమైనది ఏది?

నయమాను యొక్క అనుభవం ఇశ్రాయేలు దేవునియందు అతడి విశ్వాసమును ఎలా ప్రభావితం చేసిందో గమనించండి (15 వచనము చూడండి). దేవునియందు మీ విశ్వాసమును ఏ అనుభవాలు బలపరచాయి?

లూకా 4:27; 1 పేతురు 5:5–7; ఆల్మా 37:3–7; ఈథర్ 12:27; ఎల్. విట్నీ క్లేటన్, “అతడు చేయమని నీకేమి చెప్పినను, దానిని చేయుము,” లియహోనా, మే 2017, 97–99; “Naaman and Elisha” (వీడియో), ChurchofJesusChrist.org కూడా చూడండి.

2 రాజులు 6:8–23

“మన పక్షమున నున్నవారు వారికంటె అధికులైయున్నారు.”

ఎలీషా యొక్క యువ సేవకుని వలె, మీరు ఎప్పుడైనా సంఖ్యలో మించియుండి కూడా భయపడి, “మనము ఏమి చేయుదుము?” (2 రాజులు 6:8–23 చూడండి) అని ఆశ్చర్యపడ్డారా? ఎలీషా యొక్క జవాబు గురించి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి? ఈ వృత్తాంతము మీ శ్రమలు, మీ బాధ్యతలు లేదా సువార్త జీవించడానికి మీ ప్రయత్నాలను గూర్చి మీరు ఆలోచించి, భావించే విధానమును ఎలా మారుస్తుంది?

మీరు ధ్యానించినప్పుడు, అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ యొక్క మాటలను పరిగణించండి: “ఎలీషా యొక్క సేవకుని వలె, మీకు వ్యతిరేకముగా ఉన్న వారిని మీరు చూడగల దానికంటె మీతో ఉన్నవారే అధికులైయున్నారు. మీతో ఉన్నవారు కొందరు మీ మర్త్య కన్నులకు అదృశ్యంగా ఉన్నారు. ప్రభువు మిమ్మల్ని వహించును మరియు కొన్నిసార్లు మీతో నిలబడుటకు ఇతరులను పిలుచుట ద్వారా దానిని చేయును” (“ప్రారంభించిన వారలారా,” లియహోనా, నవం. 2008, 58).

కీర్తనలు 121; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

2 రాజులు 2:1–14.ఏలీయా యొక్క దుప్పటిని (లేక దుస్తులు—అతడి ప్రవచనాత్మక పిలుపుకు ఒక చిహ్నము) ఎలీషా “తీసుకొనుట” చూచిన జనుల గురించి ఆలోచించండి. ఎలీషా పరిచర్యకు వారు స్పందించిన విధానమును ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? (1 రాజులు 19:19 కూడా చూడండి.) కుటుంబ సభ్యులు ఒక “దుప్పటిని” ధరించుటకు వంతులు వారీగా చేసి, ఆయన సంఘములో సేవ చేయుటకు పిలిచిన వారికి ప్రభువు సహకరించి, బలపరచుటను వారు చూసిన విధానములను గూర్చి సాక్ష్యమివ్వవచ్చు.

2 రాజులు 4.2 రాజులు 4 (వచనాలు 1–7, 14–17, 32–35, 38–41, 42–44 చూడండి) లోని అద్భుతాలలో ఒకటి గురించి చదవమని కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు మరియు అతడు లేక ఆమె వర్ణిస్తున్న అద్భుతము ఏదో మిగిలిన కుటుంబ సభ్యులు ఊహించుటకు సహాయపడుటకు ఒక కిటుకును వ్రాయండి. ఈ అధ్యాయము నుండి ప్రభువు, ఆయన అద్భుతములను గూర్చి మనము ఏమి నేర్చుకుంటాము? మన జీవితాలలో మనము చూసిన పెద్దవి లేక చిన్న అద్భుతాలేవి?

2 రాజులు 5:1–15.మీరు ఈ వచనాలు చదివి, చేయమని నయమానును అడిగిన సాధారణమైన విషయాన్ని ధ్యానించండి, మన ప్రవక్తను మనల్ని చేయమని అడిగిన సాధారణమైన విషయాలను పరిగణించండి. ఆయన సలహాను మన కుటుంబం ఎలా అనుసరించగలదు?

మీ కుటుంబము “నయమాను మరియు ఎలీషా” వీడియోను కూడా చూడవచ్చు (ChurchofJesusChrist.org) లేదా ( పాత నిబంధన కథలు లో) “ఎలీషా నయమానును స్వస్థపరచుట” చదవవచ్చు.

2 రాజులు 5:20-27.యౌవనుల బలము కొరకు లో (19 పేజీ). “నిజాయితీ మరియు న్యాయబుద్ధి” చదవడం నుండి గెహాజీ ఏవిధంగా ప్రయోజనం పొందియుండవచ్చు? నిజాయితీగా లేకపోవడం మనకు ఎలా హాని కలిగిస్తుంది? నిజాయితీగా ఉండటం వలన మనం ఏవిధముగా దీవించబడతాము?

2 రాజులు 6:13–17.ఈ వచనాలలో వివరించిన ఎలీషా మరియు అతని సేవకుని అనుభవము యొక్క చిత్రమును గీయుటను కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు. మనము ఒంటరిగా లేక చాలా ఒత్తిడిగా భావించినప్పుడు కూడా ఈ వచనాలు మనకు ఎలా సహాయపడతాయి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ప్రశ్నలను ప్రోత్సహించండి. పిల్లల నుండి ప్రశ్నలు రావడం వారు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఒక సూచన. వారి ప్రశ్నలకు జవాబులు మీకు తెలియని యెడల, వారితో కలిసి జవాబులు కోసం వెదకండి. (రక్షకుని విధానములో బోధించుట, 25–26 చూడండి.)

నదిలో శుభ్రం చేసుకుంటున్న నయమాను

నయమాను కుష్టురోగము నుండి స్వస్థపడుట యొక్క దృష్టాంతము, పౌల్ మాన్ చేత,