2022 పాత నిబంధన
జూలై 18–24. ఎజ్రా 1; 3–7; నెహెమ్యా 2; 4–6; 8: “నేను చేయుపని గొప్పది”


“జూలై 18–24. ఎజ్రా 1; 3–7; నెహెమ్యా 2; 4–6; 8: ‘నేను చేయుపని గొప్పది,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జూలై 18–24. ఎజ్రా 1; 3–7; నెహెమ్యా 2; 4–6; 8,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022

చిత్రం
జెరుబ్బాబెలు దేవాలయము

జెరుబ్బాబెలు దేవాలయము యొక్క వివరణ, శామ్ లాలర్ చేత

జూలై 18–24

ఎజ్రా 1; 3–7; నెహెమ్యా 2; 4–6; 8

“నేను చేయుపని గొప్పది”

అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ ఇలా బోధించారు, “దేవుని వాక్యము … పరిశుద్ధులను బలపరచడానికి మరియు వారు చెడును నిరోధించి, మంచిని పట్టుకొని, ఈ జీవితంలో ఆనందాన్ని కనుగొనగలిగేలా వారికి ఆత్మను ధరింపజేయగల శక్తి కలిగియుంది” (Teachings of Presidents of the Church: Ezra Taft Benson [2014], 118).

మీ మనోభావాలను నమోదు చేయండి

సుమారు 70 ఏళ్ళు యూదులు బబులోనులో చెరపట్టబడియున్నారు. వారు యెరూషలేమును, దేవాలయమును కోల్పోయారు మరియు అనేకులు దేవుని ధర్మశాస్త్రానికి తమ నిబద్ధతను మరచిపోయారు. కానీ, దేవుడు వారిని మరచిపోలేదు. వాస్తవానికి, “మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలములకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును” (యిర్మీయా 29:10) అని తన ప్రవక్త ద్వారా ఆయన ప్రకటించారు. ఈ ప్రవచనమును నేరవేర్చునట్లు ప్రభువు యూదులు తిరిగివచ్చుటకు మార్గమును ఏర్పరిచారు మరియు తన జనుల కొరకు “గొప్ప పనిని” సాధించుటకు ఆయన సేవకులను పుట్టించారు (నెహెమ్యా 6:3). యెహోవా మందిర పునర్నిర్మాణమును పర్యవేక్షిస్తున్న జెరుబ్బాబెలు అనే దేశపరిపాలకుడు; జనుల హృదయాలను ప్రభువు యొక్క ధర్మశాస్త్రము వైపు త్రిప్పిన యాజకుడు మరియు లేఖకుడైన ఎజ్రా; యెరూషలేము చూట్టూ రక్షిత ప్రాకారాల పునర్నిర్మాణమును నడిపించిన యూదా యొక్క దేశపరిపాలకుడైన నెహెమ్యా ఈ సేవకులలో ఉన్నారు. వారు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, కానీ ఆశించని వనరుల నుండి సహాయాన్ని అందుకున్నారు. వారి అనుభవాలు మన అనుభవాలను ప్రేరేపించి, తెలియజేయగలవు, ఎందుకంటే మనము కూడా గొప్ప పనిని చేస్తున్నాము. వారి పనివలె, మన పని ఎక్కువగా యెహోవా మందిరము, ప్రభువు యొక్క ధర్మశాస్త్రము మరియు ఆయన యందు మనము కనుగొను ఆత్మీయ రక్షణకు సంబంధించినది.

ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథాలను సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “ఎజ్రా” మరియు “నెహెమ్యా” చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఎజ్రా 1

ప్రభువు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి జనులను ప్రేరేపించును.

పారసీకదేశము బబులోనును జయించిన తర్వాత, దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఒక యూదుల సమూహాన్ని యెరూషలేముకు పంపవలెనని పారసీకదేశపు రాజైన కోరెషు ప్రభువు చేత ప్రేరేపించబడ్డాడు. మీరు ఎజ్రా 1 చదువుతున్నప్పుడు, ముఖ్యమైన ఈ పనిలో యూదులకు సహకరించడానికి ఏమి చేయడానికి కోరెషు సిద్ధంగా ఉన్నాడో గమనించండి. ఆయన సంఘ సభ్యులు కాని వారితోపాటు, మీ చుట్టూ ఉన్న స్త్రీ పురుషుల ద్వారా ప్రభువు పనిచేయడాన్ని మీరెలా చూస్తారు? ప్రభువు మరియు ఆయన కార్యము గురించి ఇది మీకు ఏమి సూచిస్తుంది?

యెషయా 44:24–28 కూడా చూడండి.

ఎజ్రా 3:8–13; 6:16–22

దేవాలయాలు నాకు ఆనందాన్ని తీసుకురాగలవు.

బబులోనీయులు యెరూషలేముపై దండయాత్ర చేసినప్పుడు, వారు దేవాలయాన్ని దోచుకొని, దానిని పడగొట్టి తగులబెట్టారు (2 రాజులు 25:1–10; 2 దినవృత్తాంతములు 36:17–19 చూడండి). దీనికి సాక్ష్యులైన యూదుల మధ్య మీరున్నట్లయితే, మీరెలా భావించియుండవచ్చని మీరనుకుంటున్నారు? (కీర్తనలు 137 చూడండి). దశాబ్దాల తర్వాత, దేవాలయాన్ని పునర్నిర్మించడానికి తిరిగి వెళ్ళేందుకు వారు అనుమతించబడినప్పుడు యూదులు ఎలా భావించారో గమనించండి (ఎజ్రా 3:8–13; 6:16–22 చూడండి). దేవాలయం గురించి మీ మనోభావాలను ధ్యానించండి. దేవాలయాలు ఎందుకు ఆనందానికి నిలయాలు? దేవాలయాల కొరకు మీ కృతజ్ఞతను ప్రభువుకు మీరెలా చూపగలరు?

చిత్రం
దేవాలయ పరిసరాలలో నడుస్తున్న కుటుంబము

దేవాలయము మన జీవితాల్లో ఆనందానికి నిలయం కాగలదు.

ఎజ్రా 4–6; నెహెమ్యా 2; 46

వ్యతిరేకత ఉన్నప్పటికీ, దేవుని కార్యము ముందుకు సాగడానికి నేను సహాయపడగలను.

ప్రభువు యొక్క కార్యమునకు వ్యతిరేకత లేకపోవడం అరుదు మరియు జెరుబ్బాబెలు, నెహెమ్యాల చేత చేయబడిన ప్రయత్నాల విషయంలో ఇది నిశ్చయముగా సత్యము. ఈ రెండు సందర్భాలలో కూడా, “యూదులకు విరోధులైన వారు” (ఎజ్రా 4:1) సమరయులు—అనగా అన్యులతో కలిసిపోయిన ఇశ్రాయేలు వంశస్థులు. దేవాలయ నిర్మాణమునకు వారి వ్యతిరేకత (ఎజ్రా 4–6 చూడండి) గురించి చదవడం, నేడు దేవుని కార్యము ఎదుర్కొంటున్న వ్యతిరేకత గురించి మరియు వ్యతిరేకత వచ్చినప్పుడు మీరెలా స్పందించవచ్చోనని మీరు ధ్యానించడానికి దారితీయవచ్చు.

అదేవిధంగా, యెరూషలేము ప్రాకారాలను బాగుచేస్తున్న నెహెమ్యా పని (నెహెమ్యా 2; 4; 6 చూడండి) గురించి చదవడం, మీరు చేయాలని దేవుడు కోరుతున్న పనిపై మీరు ప్రతిబింబించేటట్లు చేయవచ్చు. నెహెమ్యా యొక్క మాదిరి నుండి మీరేమి నేర్చుకుంటారు?

ఎజ్రా 7; నెహెమ్యా 8

లేఖనములు చదివినప్పుడు, నేను దీవించబడతాను.

దేవాలయము పునర్నిర్మించబడిన తర్వాత కూడా యెరూషలేములోని జనులు కొంతవరకు ఆత్మీయముగా శ్రమపడ్డారు, ఎందుకంటే తరతరాల వరకు వారు “మోషే ధర్మశాస్త్రగ్రంథమునకు” (నెహెమ్యా 8:1) ప్రవేశసౌలభ్యాన్ని పరిమితం చేసారు. యెరూషలేముకు వెళ్ళడానికి లేఖకుడైన ఎజ్రా పారసీకదేశపు రాజు నుండి అనుమతి పొందాడు, అక్కడ అతడు “సమాజమంతటి యెదుటకు ఆ ధర్మశాస్త్రగ్రంథాన్ని తీసుకొనివచ్చాడు” (నెహెమ్యా 8:2). ఎజ్రా 7:10లో వివరించబడినట్లుగా ఎజ్రా యొక్క మాదిరిని మీరెలా అనుసరించగలరు? ధర్మశాస్త్రగ్రంథాన్ని జనులకు చదివి వినిపిస్తున్న ఎజ్రా వృత్తాంతాన్నిచ్చు నెహెమ్యా 8 మీరు చదువుతున్నప్పుడు, మీ జీవితంలో దేవుని వాక్యము యొక్క శక్తి గురించి మీరు కలిగియున్న ఆలోచనలేవి?

Teachings: Ezra Taft Benson, 115–24 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఎజ్రా 3:8–13; 6:16–22.దేవాలయము పునర్నిర్మించబడి, ఆ తరువాత అది ప్రతిష్ఠించబడినప్పుడు, దాని కొరకు యూదులు తమ ఆనందాన్ని ఎలా చూపారు? దేవాలయము కొరకు మన ఆనందాన్ని చూపడానికి మనమేమి చేస్తున్నాము? బహుశా మీ కుటుంబము దేవాలయ చిత్రాలను చూడవచ్చు మరియు దేవాలయాలు మీకు ఆనందాన్ని ఎలా తీసుకురాగలవో మాట్లాడవచ్చు.

ఎజ్రా 7:6, 9–10, 27–28.అతడు యెరూషలేముకు ప్రయాణిస్తున్నప్పుడు, దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నదని ఈ వచనాలలో అనేకసార్లు ఎజ్రా వ్రాసాడు. ఈ వాక్యభాగానికి అర్థము ఏమైయుండవచ్చు? దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నట్లు మనమెలా భావించాము? బహుశా కుటుంబ సభ్యులు తమ జీవితాల నుండి ఉదాహరణలు పంచుకోవచ్చు.

నెహెమ్యా 2; 4; 6.వారు “ఒక గొప్ప పని” (నెహెమ్యా 6:3) చేయుచుండగా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు, నెహెమ్యా వృత్తాంతము కుటుంబ సభ్యులను ప్రేరేపించగలదు. ముఖ్యమైన వాక్యభాగాలను మీరు కలిసి చదువుతున్నప్పుడు, మీ ఇంటిలో మీరు కలిగియున్న వస్తువులతో కుటుంబ సభ్యులు ఒక గోడను నిర్మించవచ్చు (నెహెమ్యా 2:17–20; 4:13–18; 6:1–3 వంటివి). వ్యతిరేకతను ఎదుర్కోవడం గురించి నెహెమ్యా నుండి మనమేమి నేర్చుకుంటాము? ఏ గొప్ప పనిని మనము చేయాలని ప్రభువు కోరుతున్నారు? ఈ పనికి వ్యతిరేకతను జయించడానికి ప్రభువు మనల్ని ఎలా బలపరిచారు?

నెహెమ్యా 8:1–12.నెహెమ్యా 8లో, దేవుని వాక్యాన్ని వినడానికి ఆతృతగా ఉన్న జనులకు మోషే ధర్మశాస్త్రాన్ని ఎజ్రా చదివి వినిపించాడు. 1–12 వచనాలు చదవడం, దేవుని వాక్యం కొరకు మీ కుటుంబపు మెచ్చుకోలును అధికం చేయడంలో సహాయపడగలదు. దేవుని ధర్మశాస్త్రము గురించి జనులు ఎలా భావించారు? “చదివి వినిపించిన దానిని బాగుగా గ్రహించునట్లు” మనము ఒకరికొకరము ఎలా సహాయపడగలము? (8వ వచనము).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఒక కుటుంబముగా లేఖనములను పంచుకోండి. మీ కుటుంబ లేఖన అధ్యయనములో, కుటుంబ సభ్యులు వారి వ్యక్తిగత అధ్యయనము నుండి ప్రత్యేకంగా వారికి అర్థవంతమనిపించిన వాక్యభాగాలను పంచుకోవడానికి అనుమతించండి.

చిత్రం
జనులకు లేఖనములను చదివి వినిపిస్తున్న ఎజ్రా

యెరూషలేములోనున్న జనులకు లేఖనములను చదివి వినిపిస్తున్న ఎజ్రా యొక్క వివరణ, హెచ్. విల్లార్డ్ ఆర్ట్‌లిప్ చేత, © Providence Collection/licensed from goodsalt.com

ముద్రించు