“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో చారిత్రక గ్రంథాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో చారిత్రక గ్రంథాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు
పాత నిబంధనలో చారిత్రక గ్రంథాలు
యెహోషువ మరియు ఎస్తేరు యొక్క గ్రంథాలు పాత నిబంధన “చారిత్రక గ్రంథాలుగా” సాంప్రదాయకంగా పిలవబడినవి. పాత నిబంధనలో మిగిలిన గ్రంథాలు చారిత్రక విలువను కలిగిలేవు. బదులుగా, చారిత్రక గ్రంథాలు ఆవిధంగా పిలవబడినవి ఎందుకనగా వాటి రచనల యొక్క ప్రధాన ఉద్దేశము ఇశ్రాయేలు యొక్క జనుల చరిత్రలో దేవుని యొక్క ప్రభావము చూపుట. లేవియకాండము మరియు ద్వితీయోపదేశకాండము చేసినట్లుగా, మోషే ధర్మశాస్త్రమును సంక్షిప్తపరచుట ఉద్దేశము కాదు. కీర్తనలు మరియు విలాపవాక్యములు వలె, స్తుతి లేక కవిత్వ రూపంలో విలాపమును వ్యక్తపరచుటలేదు. యెషయా మరియు యెహెజ్కేలు గ్రంథాలు చేసినట్లుగా, అది ప్రవక్తలు మాటలను వ్రాయడానికి కాదు. బదులుగా, చారిత్రక గ్రంథాలు ఒక కథనాన్ని చెప్తాయి.
దృష్టికోణముగల ఒక విషయము
సహజంగా, ఆ కథనం ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకునే విధానము—నిజంగా, నిర్ధిష్టమైన దృష్టికోణము—నుండి చెప్పబడింది. ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ కోణాల నుండి ఒక పువ్వు, రాయి లేదా చెట్టును చూడటం అసాధ్యం అయినట్లే, ఒక చారిత్రక వృత్తాంతము అది వ్రాసే వ్యక్తి లేదా జన సమూహము యొక్క దృక్పథాన్ని ఏదైనా ఒక నిర్దిష్ట విధానములో సూచిస్తుంది. ఈ దృక్పథము రచయితల జాతీయ లేదా జాతి సంబంధాలు మరియు వారి సాంస్కృతిక నిబంధనలు మరియు నమ్మకాలను కలిపియున్నది. దీనిని తెలుసుకొనుట చారిత్రక గ్రంథాల రచయతలు మరియు సంగ్రహకులు మిగిలిన వాటిని విడిచిపెట్టి నిర్ధిష్టమైన వివరణలపై దృష్టిసారించారు.1 వారు ఇతరులు చేయని కొన్ని నిర్ధిష్టమైన అంచనాలు చేసారు. ఆ వివరణలు మరియు అంచనాలపై ఆధారంగా వారు నిర్ణయాలకు వచ్చారు. మనము బైబిలులోని గ్రంథాలలో విభిన్న దృక్పథాలను కూడా చూడవచ్చు (మరియు కొన్నిసార్లు అదే గ్రంథములోపల).2 ఈ దృక్పథముల గురించి మనము ఎక్కువగా గ్రహించే కొద్దీ, చారిత్రక పుస్తకాలను మనం బాగా అర్థం చేసుకోగలం.
పాత నిబంధన చారిత్రక గ్రంథాలకు ఉమ్మడిగా ఉన్న ఒక దృక్పథం దేవుని యొక్క నిబంధన జనులుగా ఇశ్రాయేలీయుల దృక్పథం. ప్రభువుయందు వారి విశ్వాసము వారి జీవితాలలో ఆయన హస్తమును మరియు వారి దేశ వ్యవహారాలలో ఆయన జోక్యమును చూడటానికి వారి సహాయపడింది. మతపరమైన చరిత్ర గ్రంథాలు విషయాలను ఈ విధంగా చూడటానికి ఇష్టపడనప్పుడు, ఈ ఆత్మ సంబంధమైన దృక్పథము దేవునియందు వారి స్వంత విశ్వాసమును నిర్మించడానికి వెదకువారికి పాత నిబంధన చరిత్ర గ్రంథాలను అంత విలువైనిగా చేస్తాయి.
మిగిలిన పాత నిబంధన కోసం సందర్భం
ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్న సంవత్సరాలు ముగియడంతో, ద్వితీయోపదేశకాండ గ్రంథము ఆగిన చోట చారిత్రక గ్రంథాలు ప్రారంభమైనవి. యెహోషువ గ్రంథము ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించడానికి సిద్ధపడియున్నారని చూపును, మరియు వారు దానిని ఎలా స్వాధీనం చేసుకున్నారో వివరిస్తుంది. న్యాయాధిపతులు నుండి 2 దినవృత్తాంతములు తరువాత వచ్చిన గ్రంథాలు, వాగ్దాన దేశములో వారు స్థిరపడిన సమయము నుండి, అష్షూరియా మరియు బబులోనుచేత వారు జయించబడే సమయం వరకు ఇశ్రాయేలీయుల అనుభవాన్ని వర్ణిస్తాయి. ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథాలు దశాబ్దాల తరువాత వారి రాజధానియైన యెరూషలేముకు ఇశ్రాయేలీయులలో అనేక గుంపులు తిరిగి వెళ్ళుటను వివరిస్తాయి. చివరిగా ఎస్తేరు గ్రంథము పర్షియా పాలన క్రింద బహిష్కరణలో జీవిస్తున్న ఇశ్రాయేలీయుల వృత్తాంతాన్ని వివరించును.
అక్కడే పాత నిబంధన కాలక్రమం ముగుస్తుంది. మొదటిసారి బైబిలు చదివే పాఠకులు కొందరు దాని పేజీలలో సగం కంటే ఎక్కువ చదవకముందే పాతనిబంధన కథనం చదవటం నిజంగా పూర్తి చేసారని తెలుసుకోవడానికి ఆశ్చర్యపడతారు. ఎస్తేరు తరువాత, ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి మనకు ఎక్కువ సమాచారం లభించదు. బదులుగా, తరువాత వచ్చే గ్రంథాలు—ప్రత్యేకంగా ప్రవక్తల గ్రంథాలు—చారిత్రక గ్రంథాలు సమర్పించిన కాలక్రమం లోపల సరిపోతాయి.3 ఉదాహరణకు, యిర్మీయా యొక్క ప్రవక్త పరిచర్య, 2 రాజులు 22–25లో వ్రాయబడిన సంఘటనలందు జరిగింది (మరియు 2దినవృత్తాంతములు 34–36) లో సాదృశ్యమైన వృత్తాంతము). దీనిని తెలుసుకొనుట మీరు చదివే చారిత్రక కధనాలు మరియు ప్రవచనాత్మక గ్రంథాలు రెండింటిని చదివే విధానాన్ని ప్రభావితం చేయగలదు.
ఏదైనా సరిపోనప్పుడు
పాత నిబంధన చదివినప్పుడు, బహుశా మీరు ఏ చరిత్రలోనైనా, జనులు చేస్తున్న దానిని లేక ఆధునిక లోకానికి వింతగా లేక కష్టమైనదిగా కనబడిన విషయాలను చెప్పుట గురించి చదువుతారు. పాత నిబంధనలు రచయతలు కొన్ని విధాలుగా మనకంటె చాలా భిన్నమైన, దృక్పథము నుండి లోకమును చూసారని—మనము దీనిని ఆశించవచ్చు. హింస, జాతి సంబంధాలు మరియు మహిళల పాత్రలు పురాతన రచయితలు ఈ రోజు మనకంటే భిన్నంగా చూసిన కొన్ని సమస్యలు.
ఇబ్బందికరంగా అనిపించే లేఖనములలో భాగాలను మనము అనుకోకుండా ఎదుర్కొన్నప్పుడు మనము ఏమి చేయాలి? మొదట, ప్రతి భాగాన్ని విస్తృత సందర్భంలో పరిగణించటానికి ఇది సహాయపడవచ్చు. ఇది దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎలా సరిపోతుంది? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క స్వభావము గురించి మీకు తెలిసిన దానితో ఇది ఎలా సరిపోతుంది? ఇతర లేఖనాలలో బయల్పరచబడిన సత్యములతో లేక జీవిస్తున్న ప్రవక్తల బోధనలతో ఇది ఎలా సరిపోతుంది? అది మీ స్వంత హృదయానికి, మనస్సుకు ఆత్మ యొక్క ప్రేరేపణలతో ఎలా సరిపోతుంది?
కొన్ని సందర్భాలలో, లేఖన భాగము వీటిలో సరిపోయినట్లు కనబడకపోవచ్చు. కొన్నిసార్లు లేఖన భాగము ఒక పజిల్ ముక్కలా ఉండవచ్చు, అది మీరు ఇప్పటికే సమకూర్చిన ఇతర ముక్కల మధ్య దానికి చోటు ఉన్నట్లు అనిపించదు. భాగాన్ని సరిపోయేలా బలవంతం చేయడానికి ప్రయత్నించడం ఉత్తమ విధానం కాదు. అయితే పూర్తి పజిల్‌ను వదిలేయడం మంచిదికాదు. బదులుగా, ప్రస్తుతానికి మీరు పజిల్‌ను ప్రక్కన పెట్టవలసి ఉంటుంది. మీరు ఎక్కువగా నేర్చుకొని, ఎక్కువ పజిల్‌ను కలిపి ఉంచినప్పుడు, ముక్కలు ఎలా కలిసిపోతాయో మీరు బాగా చూడగలరు.
ఒక నిర్దిష్ట దృక్పథానికి పరిమితం కావడంతో పాటు, లేఖనాత్మక చరిత్రలు మానవ తప్పిదానికి లోబడి ఉంటాయని గుర్తుంచుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది (విశ్వాస ప్రమాణములు 1:8 చూడండి). ఉదాహరణకు, శతాబ్ధాలుగా, “సిద్ధాంతము మరియు విధులను గూర్చి ముఖ్యమైన సత్యములు కలిపి [బైబిలు] నుండి స్పష్టమైన మరియు అతి ప్రశస్తమైన అనేక భాగములు [తీసివేయబడినవి],” (1నీఫై 13:28; 29,40 వచనాలు కూడ చూడండి). అదే సమయంలో, మన స్వంత దృక్పథము కూడా పరిమితమైనదని మనము సమ్మతించాలి: మనము పూర్తిగా గ్రహించని విషయాలు మరియు మనమింకా జవాబివ్వని ప్రశ్నలు ఎల్లప్పుడు ఉంటాయి.
రత్నాలను కనుగొనుట
కానీ ఈ లోపు, జవాబివ్వబడని ప్రశ్నలు పాత నిబంధనలో కనబడిన నిత్య సత్యము యొక్క ప్రశస్తమైన రత్నాలనుండి మనల్ని దూరంగా ఉంచాల్సినవసరం లేదు—ఆ రత్నాలు కొన్నిసార్లు కష్టమైన అనుభవాలు మరియు అపరిపూర్ణులైన జనుల చేత చేయబడిన బలహీనమైన ఎంపికలు గల రాతినేలలో దాచబడినప్పడు కూడ. బహుశా ఈ రత్నాలలో మిక్కిలి ప్రశస్తమైనవి దేవుని యొక్క ప్రేమను గూర్చి సాక్ష్యమిచ్చే కథనాలు మరియు లేఖనభాగాలు—ప్రత్యేకంగా యేసు క్రీస్తు యొక్క త్యాగమును అలోచించడానికి మన మనస్సులను నడిపించేవి. ఏ కోణంలో చూసినా, సువార్త సత్యములు అప్పుడు విలువైనవిగా ఉన్నట్లుగా ఈరోజు విలువైనవిగా ఉన్నాయి. ఈ వృత్తాంతములు దేవుని నిబంధన జనులను గూర్చి చెప్తున్నాయి కనుక—మానవ బలహీనతలు కలిగియున్నప్పటికీ, ప్రభువును ప్రేమించి, సేవించిన స్త్రీలు, పురుషులు—పాత నిబంధన యొక్క చారిత్రక గ్రంథాలలో సమృద్ధిగా సత్యము యొక్క రత్నాలు ఉన్నాయి.