2022 పాత నిబంధన
మే 9–15. సంఖ్యాకాండము 11–14; 20–24: “మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, భయపడకుడి”


“మే 9–15. సంఖ్యాకాండము 11–14; 20–24: “మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, భయపడకుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (3021

“మే 9–15. సంఖ్యాకాండము 11–14; 20–24,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
డిజర్ట్ వేలీ

మే 9–15

సంఖ్యాకాండము 11–14; 20–24

“మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, భయపడకుడి”

ఈ సంక్షేప వర్ణన సంఖ్యాకాండము గ్రంథములో అనేక విలువైన పాఠములలో కొన్నిటిని నొక్కిచెప్పును. ఆత్మ మీరు చూడటానికి సహాయపడే ఇతరులకు బహిర్గతంగా కూడా ఉండండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

నడిచి వెళ్లినా కూడా, సీనాయి అరణ్యము నుండి కనానులో వాగ్దాన దేశమునకు ప్రయాణించడానికి సాధారణంగా 40 సంవత్సరాలు పట్టదు. కానీ ఇశ్రాయేలీయులకు అంతకాలం అవసరము, భౌగోళిక దూరమును చేరుకొనుటకు కాదు కానీ ఆత్మీయ దూరాన్ని చేరుకొనుటకు: వారు ఎవరు మరియు ఆయన నిబంధన జనులుగా ప్రభువు వారు కావాలని కోరిన దానికి మధ్య దూరము.

సంఖ్యాకాండము గ్రంథము ఆ 40 సంవత్సరాలందు జరిగిన దానిలో కొంత, వాగ్దాన దేశములో ప్రవేశించడానికి ముందు ఇశ్రాయేలీయులు నేర్చుకోవాల్సిన పాఠములను కలిపి వివరించును. ప్రభువు యొక్క ఏర్పరచబడిన సేవకులకు విశ్వాసపాత్రంగా ఉండుట గురించి వారు నేర్చుకున్నారు (సంఖ్యాకాండము 12 చూడండి). భవిష్యత్తు నిరాశజనకంగా కనబడినప్పుడు కూడా, ప్రభువు యొక్క శక్తిని విశ్వసించుట గురించి వారు నేర్చుకున్నారు (సంఖ్యాకాండము 13–14 చూడండి). విశ్వాసరహితంగా ఉండటం లేదా నమ్మకపోవడం ఆత్మీయంగా హాని కలిగిస్తుందని వారు తెలుసుకున్నారు, కానీ వారు పశ్చాత్తాపపడగలరు మరియు స్వస్థత కొరకు రక్షకుని వైపు చూడగలరు (సంఖ్యాకాండము 21:4–9 చూడండి).

కొన్ని విధాలుగా మనమందరం ఇశ్రాయేలీయుల వలె ఉన్నాము. ఆత్మీయ అరణ్యములో ఉండటం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు మరియు వారు నేర్చుకొన్న అదే పాఠములు మన స్వంత వాగ్దాన దేశములో ప్రవేశించడానికి సిద్ధపడటానికి మనకు సహాయపడగలవు: మన పరలోక తండ్రితో నిత్యజీవము.

సంఖ్యాకాండము గ్రంథము యొక్క సంక్షేప వివరణ కొరకు, బైబిలు నిఘంటువులో “సంఖ్యాకాండము” చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సంఖ్యాకాండము 11:11–17, 24–29; 12

బయల్పాటు అందరికీ లభ్యముగా ఉన్నది, కానీ దేవుడు తన సంఘాన్ని ఆయన ప్రవక్త ద్వారా నడిపిస్తాడు.

సంఖ్యాకాండము 11:11–17, 24–29 లో, మోషే ఎదుర్కొన్న సమస్యను, దేవుడు ప్రతిపాదించిన పరిష్కారమును గమనించండి. మోషే “యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు” తాను కోరుతున్నానని చెప్పినప్పుడు అతడి ఉద్దేశ్యమేమిటని మీరనుకుంటున్నారు? (29 వచనము). ఈ వచనాలను మీరు ధ్యానించినప్పుడు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క ఈ మాటలను పరిగణించండి: “దేవుడు నిజముగా మీతో మాట్లాడాలని కోరుతున్నాడా? అవును! … ఓహ్, మీ పరలోకమందున్న తండ్రి మీరు చాలా ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నారు” (“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 95).

అయినప్పటికీ, ప్రతీ ఒక్కరు ఒక ప్రవక్తగా ఉండవచ్చని చెప్పుట మోషే చేసినట్లుగా వారందరు దేవుని యొక్క జనులను నడిపించగలరని అర్ధము కాదు. సంఖ్యాకాండము 12 లో వ్రాయబడిన సంఘటన దీనిని స్పష్టపరచును. ఈ అధ్యాయము మీరు చదివినప్పుడు, మీరు కనుగొనే జాగ్రత్తలేవి? వ్యక్తిగత బయల్పాటు మరియు ప్రవక్తను అనుసరించుట గురించి మీరు గ్రహించాలని ప్రభువు మిమ్మల్ని కోరుతున్నదేమిటని మీరు భావిస్తున్నారు?

1 నీఫై 10:17; సిద్ధాంతము మరియు నిబంధనలు 28:1–7; Dallin H. Oaks, “Two Lines of Communication,” Liahona, Nov. 2010, 83–86 కూడా చూడండి.

సంఖ్యాకాండము 13–14

ప్రభువునందు విశ్వాసముతో, నేను భవిష్యత్తు కొరకు నిరీక్షణను కలిగియుండగలను.

సంఖ్యాకాండము 13–14 మీరు చదివినప్పుడు, ఇశ్రాయేలీయుల స్థానములో మిమ్మల్ని మీరు ఉంచడానికి ప్రయత్నించండి. “ఐగుప్తుకు తిరిగి వెళ్లడానికి” వారు ఎందుకు కోరుకున్నారని మీరనుకుంటున్నారు? (సంఖ్యాకాండము 14:3). వాగ్దాన దేశములో ప్రవేశించుట గురించి నిరాశావాదులుగా ఉన్న వారిలా మీరు ఎప్పుడైనా ఉన్నారా? కాలేబు కలిగియున్న ఇతర “ఆత్మను” మీరు ఎలా వర్ణించగలరు? (సంఖ్యాకాండము 14:24). కాలేబు మరియు యెహోషువ యొక్క విశ్వాసము గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది ఏమిటి మరియు మీరు ఎదుర్కొనే పరిస్థితులకు వారి మాదిరులను మీరు ఎలా అన్వయిస్తారు?

Teachings of Presidents of the Church: Gordon B. Hinckley (2016), 75–76 కూడా చూడండి.

సంఖ్యాకాండము 21:4–9

విశ్వాసమందు యేసు క్రీస్తును నేను చూసిన యెడల, ఆయన నన్ను ఆత్మీయంగా స్వస్థపరచగలడు.

సంఖ్యాకాండము 21:4–9 లో వ్రాయబడిన కధనమును మోర్మన్ గ్రంథ ప్రవక్తలు ఎరుగుదురు మరియు దాని ఆత్మీయ ప్రాముఖ్యతను గ్రహించారు. 1 నీఫై 17:40–41; ఆల్మా 33:18–22; మరియు హీలమన్ 8:13–15 ఈ కధనాన్ని మీరు గ్రహించడానికి ఇవి ఏమి చేరుస్తాయి? ఈ లేఖన భాగాలను మీరు అధ్యయనం చేసినప్పుడు, మీరు ఆశిస్తున్న ఆత్మీయ స్వస్థత గురించి ఆలోచించండి. ఇశ్రాయేలీయులు స్వస్థపడుటకు “ఇత్తడి సర్పమును [చూడాలి]” (సంఖ్యాకాండము 21:9). మరింత సంపూర్ణంగా “దేవుని యొక్క కుమారుని వైపు విశ్వాసముతో చూచుటకు” ఏమి చేయడానికి మీరు ప్రేరేపించబడుతున్నారు?హీలమన్ 8:15).

యోహాను 3:14–15; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36; Dale G. Renlund, “Abound with Blessings,” Liahona, May 2019, 70–73 కూడా చూడండి.

చిత్రం
ఇత్తడి సర్పము

ఇత్తడి సర్పమును చూచుట ద్వారా ఇశ్రాయేలీయులు స్వస్థపరచబడ్డారు.

సంఖ్యాకాండము 22–24

ఇతరులు నన్ను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, నేను దేవుని చిత్తమును అనుసరిస్తాను.

మోయాబు రాజైన బాలాకు, ఇశ్రాయేలీయులు సమీపిస్తున్నారని తెలుసుకొన్నప్పుడు దీవెనలు మరియు శాపములు ప్రకటించడానికి ప్రసిద్ధి చెందిన బిలామును పిలిపించాడు. అతడు వారిని శపించుట ద్వారా ఇశ్రాయేలీయులను బలహీనపరచాలని బాలాకు కోరుకున్నాడు. బాలాకు బిలామును ఒప్పించడానికి ఎలా ప్రయత్నించాడో గమనించండి, (సంఖ్యాకాండము 22:5–7, 15–17 చూడండి) మరియు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మీరు ఎదుర్కొనే శోధనలను గూర్చి ఆలోచించండి. సంఖ్యాకాండము 22:18, 38; 23:8, 12, 26; 24:13 లో బిలాము యొక్క జవాబులను గూర్చి మీకు ఆశ్చర్యము కలిగించేది ఏది?

విచారకరంగా, చివరకు బిలాము ఒత్తిడికి లొంగిపోయినట్లు, ఇశ్రాయేలీయులను మోసగించినట్లు కనబడుచున్నది (సంఖ్యాకాండము 31:16; యూదా 1:11 చూడండి). ఇతరులనుండి ఒత్తిడి లక్ష్యపెట్టకుండా మీరు ప్రభువుకు ఎలా నమ్మకంగా ఉండగలరో లోతుగా ఆలోచించండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సంఖ్యాకాండము 11:4–6.సంఖ్యాకాండము 11:4–6 లో ఇశ్రాయేలీయుల స్వభావానికి పోలికగా మీ స్వభావము ఎప్పుడైనా ఉన్నదా? సిద్ధాంతము మరియు నిబంధనలు 59:15–21 లోని సలహా ఎలా సహాయపడగలదు?

సంఖ్యాకాండము 12:3అతడు “మిక్కిలి సాత్వికుడు” అని సంఖ్యాకాండము 12 లో లేదా మీరు చదివిన ఇతర లేఖన భాగాలలో మోషే ఎలా చూపాడు? మనం మరింత సాత్వికంగా ఎలా మారగలం అనే దాని గురించి మనం ఏమి నేర్చుకుంటాము? మనము ఆవిధంగా చేసినప్పుడు ఏ దీవెనలు రావచ్చు?

సంఖ్యాకాండము 13–14.మీ కుటుంబంలో ఇద్దరు (లేదా ఎక్కవ మంది) మీ గృహములో మరొక భాగము వాగ్దాన దేశమైనట్లుగా “సంచరించుటకు” (సంఖ్యాకాండము 13:17 ) నటించుము. తరువాత వారు సంఖ్యాకాండము 13:27–33 లేదా సంఖ్యాకాండము 14:6–9 దానిపై ఆధారపడి వారు ప్రతీఒక్కరు నివేదికను ఇవ్వగలరు. ఈ వచనాలలో రెండు వేర్వేరు నివేదికల నుండి విశ్వాసము గురించి మనం ఏమి నేర్చుకుంటాము? కాలేబు మరియు యెహోషువ వలె మరింతగా మనము ఎలా ఉండగలము?

సంఖ్యాకాండము 21:4–9.సంఖ్యాకాండము 21:4–9, 1 నీఫై 17:40–41; ఆల్మా 33:18–22; మరియు హీలమన్ 8:13–15 తోపాటు చదివిన తరువాత, మీ కుటుంబం ఒక కాగితము లేదా మట్టితో ఒక పామును చేయవచ్చు లేదా “దేవుని యొక్క కుమారుని వైపు విశ్వాసముతో” చూచుటకు మీరు చేయగల కొన్ని సాధారణమైన విషయాలను దానిపై లేదా కాగితంపై వ్రాయండి (హీలమన్ 8:15).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

మీ కుటుంబము ఆత్మీయ స్వయంసమృద్ధిని వృద్ధి చేయడానికి సహాయపడండి. “కేవలము సమాచారం ఇవ్వడం కంటే, [మీ కుటుంబ సభ్యులు] లేఖనాలలో మరియు ప్రవక్తల మాటలలో వారికై వారు సువార్త సత్యములను కనుగొనడానికి సహాయపడండి” (Teaching in the Savior’s Way, 28).

చిత్రం
మోషే మరియు ఇత్తడి సర్పము

మోషే మరియు ఇత్తడి సర్పము, జూడిత్ మెహ్‌ర్ చేత

ముద్రించు