“నవంబరు 7–13. హోషేయ 1–6; 10–14; యోవేలు: ‘మనస్పూర్తిగా వారిని స్నేహింతును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“నవంబరు 7–13. హోషేయ 1–6; 10–14; యోవేలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
నవంబరు 7–13
హోషేయ 1–6; 10–14; యోవేలు
“మనస్పూర్తిగా వారిని స్నేహింతును”
హోషేయ మరియు యోవేలును గూర్చి మీ అధ్యయనములో భాగముగా ఆత్మను ఆహ్వానించండి. ఆత్మ మీ భావనలు మరియు మీ ఆలోచనలను ప్రేరేపించే సందేశాలను గమనించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
ప్రభువుతో ఇశ్రాయేలీయుల యొక్క నిబంధన చాలా లోతైనదిగా, అర్థవంతమైనదిగా ఉండటానికి ఉద్దేశించబడింది, దానిని ప్రభువు ఒక వివాహముతో పోల్చాడు. వివాహము వలే, నిబంధన నిత్య ఒడంబడికను, పంచుకోబడిన అనుభవాలను, జీవితాన్ని కలిసి కట్టుట, ప్రత్యేక విశ్వాసపాత్రత, మరియు అన్నిటికంటే, హృదయపూర్వకమైన ప్రేమను కలిపియున్నది. ఈ విధమైన భక్తి ఉన్నతమైన అధిక అంచనాలతో వచ్చింది—మరియు అవిశ్వాసానికి విషాదకరమైన పరిణామాలు. ప్రవక్త హోషేయ ద్వారా, దేవుడు ఇశ్రాయేలీయులు తమ నిబంధనను ఉల్లంఘించినందుకు ఎదుర్కొన్న పర్యవసానాలలో కొన్నిటిని వివరించాడు. అయినప్పటికీ ఆయన సందేశము “అవిశ్వాసంగా ఉన్నందుకు నేను మిమ్మల్ని తిరస్కరించను.” బదులుగా “నేను నిన్ను తోడుకొనివచ్చెదను” (హోషేయ 2:14–15 చూడండి). “నీతిని బట్టి నిన్ను ప్రధానము చేసికొందును, ” అని ప్రభువు ప్రకటించాడు (హోషేయ 2:19). “వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, మనస్పూర్తిగా వారిని స్నేహింతును” (హోషేయ14:4). ప్రేమతో, భక్తితో మన నిబంధనలను జీవించటానికి మనము కోరినప్పుడు ఈరోజు ఆయన మనకిచ్చేది అదే సందేశము.
యోవేలు అదే సందేశాన్ని పంచుకున్నాడు: “మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయున్నాడు, కనుక ఆయనతట్టు తిరుగుడి” (హోషేయ 2:13). “యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును” (హోషేయ 3:16). హోషేయ మరియు యోవేలును మీరు చదివినప్పుడు, ప్రభువుతో మీ స్వంత అనుభవమును ధ్యానించండి. ఆయనకు విశ్వాసపాత్రంగా ఉండటానికి అతడి విశ్వసనీయత మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తుందో ఆలోచించండి.
హోషేయ మరియు యోవేలు గ్రంథాలను సమీక్ష కొరకు, బైబిలు నిఘంటువులో “హోషేయ, లేక హోషేయ” మరియు “యోవేలు” చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ఆయన వద్దకు తిరిగి రమ్మని ప్రభువు ఎల్లప్పుడు నన్ను ఆహ్వానించును.
హోషేయ భార్య గోమేరు, అతడికి నమ్మకద్రోహం చేసింది మరియు దేవుడు ఇశ్రాయేలీయులు, వారు దేవునితో చేసిన నిబంధనలను గూర్చి ఆయన ఎలా భావిస్తున్నాడో వారికి బోధించడానికి ఈ విచారకరమైన ఘటనను ప్రత్యేకించి చూపాడు. హోషేయ 1–3 మీరు చదివినప్పుడు, ప్రభువు తన నిబంధన జనులతో ఆయన అనుబంధాన్ని ఎలా చూస్తాడో ధ్యానించండి. ఇశ్రాయేలీయుల వలే, మీరు ప్రభువుకు నమ్మకద్రోహం చేసిన విధానాలను, ఆయనకు మీకు ఎలా చేరువయ్యాడో ధ్యానించవచ్చు. ఉదాహరణకు, ప్రభువు యొక్క ప్రేమ మరియు కరుణ గురించి హోషేయ 2:14–23 మరియు హోషేయ 14 మీకేమి బోధిస్తాయి? ఆయనకు మీ ప్రేమను, విశ్వాసమును మీరు ఎలా చూపిస్తారు?
డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, “Point of Safe Return,” Liahona, May 2007, 99–101 చూడండి.
దేవుని పట్ల భక్తి బాహ్యంగా వ్యక్తపరచబడటమే కాకుండా, లోపల అనుభూతి చెందాలి.
జంతు బలులు ఇవ్వమని ప్రభువు తన జనులకు ఆజ్ఞాపించాడు. హోషేయ కాలములోని జనులు ఆ చట్టమునకు విధేయులు అయినప్పటికీ, వారు గొప్ప ప్రాముఖ్యత గల ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నారు (హోషేయ 6:4–7 చూడండి). ప్రభువు “బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలుల కంటె దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది” అని చెప్పినప్పుడు దాని అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (హోషేయ 6:6). నీతి మేఘము లేక మంచు వలే ఉండుట అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? మన నీతి ఎలా ఉండాలి? (యెషయా 48:18; 1నీఫై 2:9–10 చూడండి).
ఆయన పరిచర్య సమయంలో రక్షకుడు హోషేయ 6:6 ఎలా ఉపయోగించాడో చూడటానికి మత్తయి 9:10–13; 12:1–8 కూడా మీరు చదవవచ్చు. హోషేయ మాటలను గ్రహించడానికి ఈ లేఖనాలు మీకు ఎలా సహాయపడతాయి?
యోవేలు 2:12–13 చదువుతున్నప్పుడు, ఒకరి వస్త్రములను చింపుకొనుట లేక చీల్చుట సాంప్రదాయకంగా సంతాపం లేక పశ్చాత్తాపం యొక్క బాహ్య సంకేతం (ఉదాహరణకు, 2 దినవృత్తాంతములు 34:14–21,27 చూడండి). మన హృదయాలను నలుగుగొట్టుట మన వస్త్రములను చింపుట నుండి భిన్నంగా ఎలా ఉన్నది?
యెషయా 1:11–17; మత్తయి 23:23; 1యోహాను 3:17–18 కూడా చూడండి.
“సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును.”
“యెహోవా దినము” గురించి యోవేలు ప్రవచించినప్పుడు, “ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును,” “బహు భయంకరము” (యోవేలు 2:1–2,11) అని అతడు వర్ణించాడు. దాని చరిత్ర అంతటా ఇశ్రాయేలు అనేక గొప్ప, భయంకరమైన దినాలను ఎదుర్కొన్నది, మరియు దేవుని యొక్క నిబంధన జనులు భవిష్యత్తులో ఎక్కువగా ఎదుర్కొంటారు. యోవేలు 2:12–17 లో ప్రభువు ఇచ్చిన సలహా గురించి మిమ్మల్ని ఆకట్టుకున్నదేమిటి? యోవేలు 2:18–32 లో ఆయన వాగ్దానము చేసిన దీవెనలను కూడా గమనించండి. 27—32 వచనాలలో వాగ్దానము చేయబడిన దీవెనలు యోవేలు 2 లో వివరించబడిన రోజులలో, మన దినమును కలిపి ఎందుకు ప్రత్యేకంగా విలువైనవి?
ప్రభువు “సర్వజనుల మీద [ఆయన] ఆత్మను కుమ్మరించును” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (యోవేలు 2:28). యోవేలు 2:28–29 లోని ప్రవచనాలు ఎలా నెరవేర్చబడినవి? (అపొస్తలుల కార్యములు 2:1; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:41 చూడండి.)
అధ్యక్షులు రస్సెల్ఎమ్. నెల్సన్ నుండి ఈ మాటలను మీరు ఆలోచించవచ్చు: “రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపించి, దారిచూపి, ఓదార్చే నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యము కాదు” (“Revelation for the Church, Revelation for Our Lives,” Liahona, May 2018,96). మన ఆత్మీయ మనుగడకు బయల్పాటు ఎందుకు అవసరము? వ్యక్తిగత బయల్పాటును పొందడానికి మీ సామర్థ్యమును మీరు ఎలా వృద్ధి చేయగలరు?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
హోషేయ 2:19–20.ఇశ్రాయేలుతో ఆయన నిబంధన అనుబంధమును వర్ణించడానికి వివాహము యొక్క రూపకమును ప్రభువు ఉపయోగించాడు (see also Guide to the Scriptures, “Bridegroom,” scriptures.ChurchofJesusChrist.org). వివాహము దేవునితో మన నిబంధనల కోసం ఒక మంచి రూపకంగా ఎందుకు ఉండగలదో మీ కుటుంబము చర్చించగలదు. దేవుడు మన గురించి ఎలా భావిస్తున్నాడో గ్రహించడానికి హోషేయ 2:19–20 ఎలా మనకు సహాయపడుతుంది? ఆయనతో మన నిబంధనలకు విశ్వాసపాత్రంగా మనము ఎలా ఉండగలము?
-
హోషేయ 10:12.పిల్లలు ఒక గడియారమును గీయుట మరియు రోజంతా వేర్వేరు సమయాలలో ప్రభువును వారు వెదకగల విధానాలను ప్రణాళిక చేయుటను ఆనందించవచ్చు.
-
యోవేలు 2:12–13యోవేలు 2:12–13 గురించి మాట్లాడటానికి సహాయపడుటకు, మీరు ఒక గదిలో ఒకవైపు రక్షకుని చిత్రమును మరియు వ్యతిరేక దిశలో పాపము అనే మాటను ఉంచండి. సూచనవైపు వంతులవారీ తిరగమని, “[మన] పూర్ణ హృదయముతో” ఆయనవైపు తిరగడానికి మనకు సహాయపడే విషయాలను వారు పంచుకొన్నప్పుడు రక్షకుని వైపు తిరగమని, కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. ప్రోత్సాహకార్యక్రమాలు, పని, పాఠశాల, మరియు అనుబంధాలు కలిపి, వారి జీవితాలలో అన్ని అంశాలను గూర్చి ఆలోచించమని కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి.
-
యోవేలు 2:28–29.మనపై ఆత్మ “కుమ్మరించబడుట” అనగా అర్థమేమిటి? ఒక ద్రవాన్ని కుమ్మరించుట ద్వారా మీరు దానిని రుజువు చేయవచ్చు, తరువాత దానికి విరుద్ధంగా బిందువులుగా లేక చుక్కలుగా కారటం చూపించవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.