2022 పాత నిబంధన
నవంబరు 14–20. ఆమోసు; ఓబద్యా: “యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు”


“నవంబరు 14–20. ఆమోసు; ఓబద్యా: ‘యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“నవంబరు 14–20. ఆమోసు; ఓబద్యా,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

చిత్రం
చీకటి గదిలో క్రొవ్వొత్తుల వెలుగులో యేసు ముఖం

క్రిస్ యంగ్ చేత జీవాహారము

నవంబరు 14–20

ఆమోసు; ఓబద్యా

“యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు”

కేవలం మీకోసం ఉద్దేశించబడిన దేవుని వాక్యములోని సందేశాలకు మీ మనస్సు, హృదయమును పరిశుద్ధాత్మ తెరవగలదు. ఈ వారము మీరు ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నాడని మీరు అనుకుంటున్నారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

దేవుడు తన నిబంధన జనముగా ఉండటానికి అబ్రాహాము సంతానమును ఏర్పరచుకున్నాడు, ఆవిధంగా వారు సమస్త జనులకు “ఒక ఆశీర్వాదముగా” ఉంటారు (ఆదికాండము 12:2–3 చూడండి). కానీ బదులుగా, ఆమోసు పరిచర్య సమయానికి, నిబంధన జనులలో అనేకులు, పేదవారిని అణచివేసారు, ప్రవక్తలను నిర్లక్ష్యము చేసారు, వారు పూజించే క్రియలు వట్టివి మరియు అర్ధరహితమైనవి (ఆమోసు 2:6–16 చూడండి). నిజము, వారిని చుట్టుముట్టిన దేశాలు గొప్ప పాపములను బట్టి కూడా నేర భావన కలిగియున్నవి (ఆమోసు 1; 2:1–5), (ఆమోసు 3:2 చూడండి), కానీ దేవుని యొక్క జనులు కొరకు అది ఎన్నడూ మినాహాయింపు కాదు. కనుక దేవుడు యూదా నుండి ఆమోసు అను పేరుగల గొఱ్ఱెలకాపరిని ఇశ్రాయేలు రాజ్యమునకు పశ్చాత్తాపమును ప్రకటించటానికి పంపాడు. తరువాత, యూదా రాజ్యము నాశనము చేయబడినప్పటికీ, ప్రభువు తన జనులను మరలా సేకరించి, దీవిస్తాడని కూడా దేవుడు ప్రకటించాడు. నిబంధన జనులు ప్రభువు నుండి తప్పిపోయారు, ఇరువురు ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు, కానీ శాశ్వతంగా వారు త్రోసివేయబడరు. దేవుడు తన ప్రవక్తలైన సేవకులకు తన రహస్యాలను బయల్పరిచినప్పుడు (ఆమోసు 3:7 చూడండి), ఆయనతో మనము చేసిన నిబంధనల ప్రకారము జీవించటానికి మనకు సహాయపడటానికి ఆయన ఇంకా కోరుతున్నాడనే ఒక సూచనగా దానిని మనము తీసుకోవచ్చు.

ఆమోసు మరియు ఓబద్యా గ్రంథాలను గూర్చి ఎక్కువ తెలుసుకోవాటానికి, బైబిలు నిఘంటువులో, “ఆమోసు” మరియు “ఓబద్యా” చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆమోసు 3:1–8; 7:10–15

ప్రభువు తన ప్రవక్తల ద్వారా సత్యమును బయల్పరచును.

ఆమోసు 3:3–6 లో, కారణాలు మరియు ప్రభావాలకు అనేక మాదిరులను ప్రవక్త ఆమోసు ప్రతిపాదించాడు: ఎందుకంటే సింహము ఎరను ఆహారమును కనుగొంటుంది, సింహం గర్జిస్తుంది; పక్షి కోసం ఎర ఉచ్చు అమర్చబడినందున, పక్షి చిక్కుకుపోతుంది. (6 వచనము యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదము, “చేయబడెను”మాట “తెలియజేయబడెను” [ఆమోసు 3:6, పుట అడుగున వ్రాయబడిన వివరణb]) అని మార్చబడింది. 7–8 వచనాలు , ఆమోసు ప్రవక్తలకు ఈ తర్కము అన్వయించాడు. ఒక ప్రవక్త ప్రవచించటానికి కారణమేమిటి? ఆమోసు 7:10–15 మీరు చదివినప్పుడు ప్రవక్తలను గూర్చి మీరు ఇంకా ఏమి నేర్చుకుంటారు? ప్రభువు ఇంకా “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరుస్తున్నాడని” (ఆమోసు 3:7) మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారో ధ్యానించండి. దేవుని గురించి మీకు ఈ సత్యము ఏమి సూచిస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 1:38; 21:4–8; 35:13–14 కూడా చూడండి.

ఆమోసు 4–5

“యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు.”

ఆమోసు 4:6–13 మీరు చదివినప్పుడు, ఇశ్రాయేలీయుల జనులపై ప్రభువు పంపిన తీర్పులను గమనించండి. ఈ ప్రతీ అనుభవాల తరువాత ఏమి జరుగుతుందని ప్రభువు ఆశించాడో దాని గురించి ఈ వచనాలు ఏమి సూచిస్తాయి? (హీలమన్ 12:3 కూడా చూడండి). ఈమధ్య మీరనుభవించిన శ్రమను గూర్చి ఆలోచించండి. మీ శ్రమ దేవుని చేత పంపబడనప్పటికీ, ఆయనను వెదకుటకు అది మీకు ఎలా అవకాశాలను ఇస్తుందో ధ్యానించండి.

ఆమోసు 5:4, 14–15 చదవండి, మీ శ్రమల కాలములందు కూడా, ఆయనను మీరు వెదకినప్పుడు, ప్రభువు మీకు ఎలా “కనికరము” (15 వచనము) చూపాడో ధ్యానించండి.

డోనాల్డ్ ఎల్. హాల్‌స్ట్రామ్, “Turn to the Lord,” Ensign or Liahona, May 2010, 78–80 కూడా చూడండి.

ఆమోసు 8:11–12

ప్రభువు యొక్క వాక్యము ఆత్మీయ ఆకలి, దప్పికను తృప్తిపరచగలదు.

మనమందరం ఆత్మ సంబంధమైన ఆకలి మరియు దాహముగల సమయాలను అనుభవిస్తాము, కానీ మనకు “సముద్రమునుండి ఆ సముద్రము వరకు సంచరించు” (ఆమోసు 8:12) అవసరము లేదు. ఆత్మసంబంధమైన ఆకలిని తృప్తిపరచేది ఏమిటో మనమెరుగుదుము, మరియు ప్రభువు యొక్క వాక్యముతో సమృద్ధిగా మనము దీవించబడ్డాము. ఆమోసు 8:11–12 మీరు చదివినప్పుడు, దేవుని వాక్యము లేకుండా జీవించడానికి కరువు ఎందుకు మంచి పోలిక అని ఆలోచించండి. మత్తయి 5:6; యోహాను 6:26–35; 2నీఫై 9:50–51; 32:3; ఈనస్ 1:4–8 లో మీరు కనుగొన్న అదనపు అంతర్‌జ్ఞానములేవి?

జెఫ్రీ ఆర్. హల్లండ్, “He Hath Filled the Hungry with Good Things,” Ensign, Nov. 1997, 64–66; Gospel Topics, “Apostasy,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
యౌవనుల గుంపు దేవాలయము యెదుట నిలబడుట

దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము చేయుట ద్వారా సీయోను కొండపై రక్షకులుగా మనము కాగలము.

ఓబద్యా 1:21

“సీయోను కొండమీద … రక్షకులు” ఎవరు?

అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ, “సీయోను కొండమీద … రక్షకులు” లేఖనభాగము, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యముకు ఆ లేఖన భాగాన్ని సంబంధింప చేస్తూ, ఒక సాధ్యమైన అనువాదము ఇచ్చారు: “[దేవాలయములో] మనము వాస్తవంగా సీయోను కొండమీద రక్షకులము. దీనికి అర్థమేమిటి? మన విమోచకుడు సమస్త మానవుల కొరకు ప్రతినిధిగా ఆయన ప్రాణమును త్యాగము చేసి, ఆవిధంగా చేయుటలో ఆయన మన రక్షకుడయ్యాడు, ముందు మాదిరిగా మనము కూడా స్వల్ప పరిమాణములో దేవాలయములో ప్రతినిధి కార్యములో ఒడంబడిక చేసుకున్నప్పుడు, భూమిపై ఉన్నవారి చేత ఆత్మలోకములో ఉన్నవారి తరఫును ఏదైన చేయబడితే తప్ప ఏ వృద్ధి పొందని వారికి రక్షకులము అవుతాము.” (“Closing Remarks,” Ensign or Liahona, Nov. 2004,105).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

ఆమోసు 3:7.సంఘ అధ్యక్షుడి నుండి అనేక ఇటీవల సందేశాలను మీరు సమీక్షించవచ్చు మరియు ఆయన ద్వారా మీ కుటుంబముకు ప్రభువు బయల్పరిచే దానిని చర్చించండి. ఒక ప్రవక్త సంఘమును నడిపించుట ఎందుకు ముఖ్యమైనది? ఆయన నిజమైన ప్రవక్త అని మనం ఎలా తెలుసుకోగలిగాము? ఆయన సలహాను అనుసరించుటకు మనము ఏమి చేస్తున్నాము?

ఆమోసు 5:4.మీ కుటుంబము మీ ఇంటిలో వ్రేలాడదీయటానికి, దానిపై ఈ వచనముతో ఒక పోస్టరును చేయవచ్చు. ప్రభువును వెదకుట అనగా దాని అర్థమేమిటి? మనము ఆయనను ఎలా వెదకగలము? మనము ఆవిధంగా చేసినప్పుడు మనం పొందే దీవెనలు ఏవి? మత్తయి 7:7–8; ఈథర్ 12:41; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 88:63 వంటివి, ప్రభువును వెదకుట గురించి బోధించే మిగిలిన లేఖన భాగాలను పంచుకోమని మరియు చర్చించమని మీ కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు.

ఆమోసు 8:11–12.ఈ వచనాలలో లేఖన భాగాలతో సంబంధించే అభినయాలను చేయుటను పిల్లలు ఆనందించవచ్చు. మన శరీరాలు ఆకలిగొని లేక దప్పిగొన్నప్పుడు, మనం ఏమి చేస్తాము? మన ఆత్మలు ఆకలిగొనిన లేక దప్పిగొన్నప్పుడు, మనము ఏమి చేస్తాము? “The Great Apostasy” (ChurchofJesusChrist.org) వీడియోను కూడా మీరు చూడవచ్చు మరియు మన ఆత్మ సంబంధమైన ఆకలిని పునఃస్థాపించబడిన సువార్త ఎలా తృప్తి పరుస్తుదో మాట్లాడండి.

ఓబద్యా 1:21.“సీయోను కొండమీద … రక్షకులుగా” ఉండుట అనగా అర్థమేమిటి? (సాధ్యమైన ఒక వివరణ కొరకు, “Ideas for Personal Scripture Study”) లో అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ చేత వ్యాఖ్యానము చూడండి. మన పూర్వీకులలో ఎవరికి రక్షించే విధులు అవసరము? వారికి సహాయపడటానికి మనము ఏమి చేయాలి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

ఆత్మను ఆహ్వానించడానికి, సిద్ధాంతమును నేర్చుకోవడానికి సంగీతాన్ని ఉపయోగించండి. ఒక కీర్తనను వినుట లేక చదువుట సువార్త సూత్రములను నేర్చుకోవడానికి మీకు సహాయపడగలదు. ఉదాహరణకు, జీవిస్తున్న ప్రవక్తలందు గొప్ప విశ్వాసమును ప్రేరేపించడానికి, మీరు “We Thank Thee, OGod, for a Prophet” (Hymns, no.19) వినవచ్చులేక చదవవచ్చు. (Teaching in the Savior’s Way,22 చూడండి.)

చిత్రం
సాంటో డోమెంగో డోమినికన్ రిపబ్లిక్ దేవాలయము

సాంటో డోమెంగో డోమినికన్ రిపబ్లిక్ దేవాలయము

ముద్రించు