“నవంబరు 21–27. యోనా; మీకా: ‘ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“నవంబరు 21–27. యోనా; మీకా,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
నవంబరు 21–27
యోనా; మీకా
“ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు”
మీ ఆలోచనలను వ్రాసినప్పుడు, లేఖనములందు మీరు నేర్చుకొన్న దానికి యోనా మరియు మీకాలో సూత్రములను ఎలా అన్వయించాలో ఆలోచించండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
తర్షీషుకు వెళ్ళే ఒక ఓడలో యోనా ఉన్నాడు. అది నీనెవెకు దూరంగా ఉండటం తప్ప, తర్షీషుకు వెళ్ళడంలో తప్పులేదు, అక్కడ యోనా దేవుని సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళాలి. కనుక ఓడ గొప్ప తుఫానును ఎదుర్కొన్నప్పుడు, అది తన అవిధేయత వలన అని యోనా ఎరుగును. యోనా పట్టుబట్టడంతో, అతడి సహ ప్రయాణికులు తుఫానును ఆపడానికి సముద్రపు లోతులలోనికి అతడిని పడవేసారు. అది యోనా మరియు అతడి మర్త్య పరిచర్య ముగింపుగా కనబడింది. అయితే ఆయన నీనెవె జనులను విడిచిపెట్టనట్లుగా మరియు మనలో ఏ ఒక్కరిని ఆయన విడిచి పెట్టనట్లుగా— ప్రభువు యోనాను విడిచిపెట్టలేదు. మీకా బోధించినట్లుగా, ప్రభువు మనల్ని నిందించుటలో ఆనందించడు, “ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు.” ఆయనవైపు మనం తిరిగినప్పుడు, “ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, [మన] పాపమున్నిటిని సముద్రపు ఆగాధములలో [ఆయన] పడవేయును” (మీకా 7:18–19).
యోనా మరియు మీకా గ్రంథాలను సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “యోనా” మరియు “మీకా” చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు.
మిగిలిన విషయాల మధ్య, మనము పశ్చాత్తాపము చెందినప్పుడు ప్రభువు ఎంత కనికరము కలిగియున్నాడో యోనా గ్రంథము చూపుతుంది. యోనాను మీరు చదివినప్పుడు, ఆయన కనికరమును గూర్చి మాదిరుల కొరకు వెదకండి. మీ జీవితంలో ఆ కనికరమును మీరు ఎలా అనుభవించారో ధ్యానించండి. ఇతరుల పట్ల ఎక్కువ కనికరముగా ఉండటానికి మీకు సహాయపడినట్లు మీరు నేర్చుకొన్నదేమిటి?
ప్రభువు యొక్క కనికరమును ప్రత్యక్షంగా చూపుట ప్రేమ మరియు కృతజ్ఞతగల భావాలను తరచుగా ప్రేరేపించును. అయినప్పటికీ, ఇశ్రాయేలీయులకు శత్రువులైన, నీనెవె జనులకు ప్రభువు కనికరమును చూపినప్పుడు, యోనా “చింతాక్రాంతుడై” మరియు “కోపగించుకొన్నాడు” (యోనా 4:1). యోనా ఈ విధంగా ఎందుకు భావించియుండవచ్చు? మీకు ఎప్పుడైనా ఇలాంటి భావాలు కలిగాయా? అధ్యాయము 4 లో యోనా ఏది గ్రహించడానికి సహాయపడటానికి ప్రభువు ప్రయత్నిస్తున్నాడని మీరనుకుంటున్నారు?
మీకా 7:18–19 లో బోధనలు ధ్యానించండి. ప్రభువు మరియు నీనెవె యొక్క జనులు గురించి తన స్వభావాన్ని మార్చుకోవడానికి యోనాకు ఈ సత్యములు ఎలా సహాయపడినవి?
(లూకా 15:11–32 కూడా చూడండి; జెఫ్రీ ఆర్. హాలండ్, “The Justice and Mercy of God,” Ensign, Sept. 2013, 16–21 కూడా చూడండి.
దేవుని పిల్లలందరూ సువార్తను వినవలసిన అవసరమున్నది.
దాని దౌర్జన్యము మరియు క్రూరత్వానికి పేరుపొందిన ఇశ్రాయేలు యొక్క శత్రువు, అష్షూరియా సామ్రాజ్యములో భాగముగా నీనెవె ఉన్నది. యోనాకు, నీనెవె యొక్క జనులు దేవుని వాక్యమును అంగీకరించడానికి మరియు పశ్చాత్తాపపడటానికి సిద్ధపడియున్నారనుట అవాస్తవమైనదిగా బహుశా కనబడియుండవచ్చు. అయినప్పటికీ, అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ బోధించినట్లుగా: “ఎవరు సిద్ధంగా ఉన్నారు మరియు ఎవరు లేరని న్యాయమూర్తులుగా మనల్ని మనం ఎప్పుడూ ఏర్పాటు చేసుకోకూడదు. ప్రభువు తన పిల్లలందరి హృదయాలను ఎరుగును, మరియు మనము ప్రేరేపణ కొరకు వెదకిన యెడల, ‘దేవుని వాక్యమును వినుటకు సిద్ధపాటులో’ (ఆల్మా 32:6)” ఉన్నారని, ఆయన ఎరిగిన వ్యక్తులను కనుగొనడానికి ఆయన మనకు సహాయపడతాడు, (“Sharing the Restored Gospel,” Ensign or Liahona, Nov. 2016, 58–59). యోనా 3 నుండి మీరు నేర్చుకొన్నది ఏది మారటానికి సిద్ధపడనట్లుగా కనబడిన వారితో కూడ సువార్త పంచుకోవడానికి మీకు సహాయపడింది?
యోనా స్వభావాన్ని (యోనా 1; 3–4) ఆల్మా మరియు మోషైయ కుమారుల భావాలతో (మోషైయ 28:1–5; ఆల్మా 17:23–25 చూడండి) పోల్చుట సహాయకరంగా ఉండవచ్చు.
3నీఫై 18:32 కూడా చూడండి.
యేసు క్రీస్తు మీకా యొక్క రచనలను వ్యాఖ్యానించాడు.
యెషయా మరియు కీర్తనలను రక్షకుడు వ్యాఖ్యానించుట అందరికీ తెలుసు. ఆయన మీకాను కూడ కొన్నిసార్లు వ్యాఖ్యానించాడని మీకు తెలుసా? క్రింది ఉదాహరణలను పరిగణించండి, మరియు ఈ లేఖన భాగాలు రక్షకునికి ఎందుకు ముఖ్యమైనవో ధ్యానించండి. అవి మీకు ఎందుకు ముఖ్యమైనవి?
మీకా 4:11–13 (3నీఫై 20:18–20 చూడండి). ప్రభువు కడవరి-దిన సమకూర్చుటను, గోధుమ పంట కోతతో పోల్చాడు (ఆల్మా 26:5–7; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:3–4 చూడండి). ఈ పోలిక ఇశ్రాయేలును సమకూర్చుట గురించి మీకేమి సూచిస్తుంది?
మీకా 5:8–15 (3నీఫై 21:12–21 చూడండి). కడవరి దినాలలో దేవుని జనులను గూర్చి ఈ వచనాలు మీకు సూచిస్తాయి?
మీకా 7:5–7 (మత్తయి 10:35–36 చూడండి). ఈ వచనాల ప్రకారము, మొదట “యెహోవా కొరకు ఎదురుచూచుట” ఎందుకు ముఖ్యమైనది? ఈ సలహా ఎందుకు ముఖ్యమైనది?
“యెహోవా నిన్నడుగుచున్నది ఏమిటి?”
“యెహోవా సన్నిధిని … మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారముు చేయుట” (మీకా 6:6) ఏలా ఉంటుందో ఊహించమని మీకా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన మీ జీవితాన్ని లెక్కించినప్పుడు ప్రభువుకు ముఖ్యమైనదేమిటో 6–8 వచనములు ఏమి సూచిస్తున్నాయి?
మత్తయి 7:21–23; 25:31–40; DaleG. రెన్‌లండ్ “Do Justly, Love Mercy, and Walk Humbly with God,” Ensign or Liahona, Nov. 2020, 109–12 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
యోనా 1–4.పరుగెత్తునట్లు నటించుట, తుఫానుగల సముద్రము వంటి శబ్దాలను చేయుట, లేక పెద్ద చేప ద్వారా మింగివేయబడినట్లు నటించుట వంటివి, యోనా వృత్తాంతమును చెప్పే చర్యలు చేయుటను మీ పిల్లలు ఆనందించవచ్చు (“Jonah the Prophet” in Old Testament Stories చూడండి). యోనా అనుభవము నుండి కుటుంబ సభ్యులు నేర్చుకొన్న దానిని వారిని అడగండి. యోనా నుండి పాఠము నుండి ఒక మాదిరి కొరకు, “Follow the Prophet” (Children’s Songbook, 110–11) యొక్క 7 వచనము చూడండి.
-
యోనా 3.సువార్త పంచుకోవటం గురించి యోనా నేర్చుకొన్నదేమిటి? పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్త సందేశమును వినుట ద్వారా దీవించబడిన వారు మనకు తెలిసిన వారెవరున్నారు?
-
మీకా 4:1–5ఈ వచనాల ప్రకారం, ప్రభువు యొక్క జనులకు ఏది శాంతిని, అభివృద్ధిని తెస్తుంది? మన ఇంటిలో ఈ ప్రవచనము నెరవేర్చబడుటకు సహాయపడటానికి మనమేమి చేయగలము?
-
మీకా 5:2గదిలో ఒకవైపు యేసు చిన్నబిడ్డగా తన తల్లితో ఉన్న చిత్రమును మరియు మరొకవైపు జ్ఞానుల చిత్రమును మీరు ప్రదర్శించవచ్చు (Gospel Art Book, no.33 చూడండి). మీకా 5:2 మరియు మత్తయి 2:1–6 కలిసి చదవండి. జ్ఞానులు యేసును కనుగొనడానికి మీకా ప్రవచనము ఎలా సహాయపడింది? కుటుంబ సభ్యులు జ్ఞానుల చిత్రమును యేసు చిత్రము ప్రక్కన మార్చండి. మీ కుటుంబము “The Christ Child: A Nativity Story” (ChurchofJesusChrist.org) వీడియోను చూడటం కూడ ఆనందించవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.