లేఖన కథలు
ప్రవక్తయైన యోనా


“ప్రవక్తయైన యోనా,” పాత నిబంధన కథలు (2021)

“ప్రవక్తయైన యోనా,” పాత నిబంధన కథలు

యోనా 1–4

ప్రవక్తయైన యోనా

ప్రభువు కరుణను నమ్ముటను నేర్చుకోవడం

విచారంగా కనిపిస్తున్న యోనా

యోనా ఒక ప్రవక్త. వారు పశ్చాత్తాపపడని యెడల, వారి పట్టణము నాశనం చేయబడుతుందని నీనెవెలోని జనులను హెచ్చరించమని ప్రభువు అతడికి చెప్పారు.

యోనా 1:1–2

పడవలోకి ఎక్కుతున్న యోనా

కానీ నీనెవె పట్టణ జనులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. వారికి ప్రకటించడం యోనాకు ఇష్టంలేదు. కనుక అతడు నీనెవె నుండి దూరంగా వెళ్ళే ఓడలోనికి ఎక్కాడు.

యోనా 1:3

తుఫాను చెలరేగిన సముద్రంపై ఓడ

యోనా ఓడలో ఉండగా, ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఓడలోని మనుష్యులు వారి ప్రాణాల కోసం భయపడ్డారు. వారిని రక్షించమని ప్రభువును ప్రార్థించమని వారు యోనాను అడిగారు.

యోనా 1:4–6

ఓడ నావికులతో మాట్లాడుతున్న యోనా

అతడు ప్రభువు అడిగిన దానిని చేయకుండా పారిపోతున్నాడు గనుక ప్రభువు తుఫానును పంపాడని యోనాకు తెలుసు. ఓడలోని జనులను కాపాడాలని యోనా అనుకున్నాడు. వారు అతడిని సముద్రంలో పడవేస్తే, తుఫాను ఆగిపోతుందని అతడు చెప్పాడు.

యోనా 1:12

యోనాను పడవలోనుండి విసిరివేస్తున్న నావికులు

యోనాను పడవపైనుండి పడవేయడానికి వారు ఇష్టపడలేదు. ఓడను ఒడ్డుకు నడపించడానికి వారు ప్రయత్నించారు, కానీ తుఫాను చాలా తీవ్రంగా ఉంది. చివరకు, వారు యోనాను సముద్రములో పడవేసారు.

యోనా 1:13–15

యోనాను మింగివేస్తున్నపెద్ద చేప

తుఫాను ఆగిపోయింది. కానీ, తరువాత యోనా పెద్దచేప చేత మింగివేయబడ్డాడు.

యోనా 1:15, 17

సముద్ర తీరమువద్ద యోనా

యోనా మూడు పగళ్ళు, మూడు రాత్రులు చేప కడుపులో ఉన్నాడు. ఆ సమయంలో యోనా ప్రార్థించి, పశ్చాత్తాపపడ్డాడు. అతడు సరైన దానిని చేయాలని, ప్రభువు చెప్పినది వినాలని అనుకున్నాడు. ప్రభువు యోనా ప్రార్థనలు ఆలకించారు మరియు చేప యోనాను పొడి నేల మీద కక్కివేయునట్లు చేసారు.

యోనా 1:17; 2:1–10

జనులకు ప్రకటిస్తున్న యోనా

నీనెవె జనులకు ప్రకటించమని ప్రభువు మరలా యోనాకు చెప్పారు. ఈసారి యోనా విధేయత చూపాడు. అతడు నీనెవెకు వెళ్ళి, పశ్చాత్తాపపడమని లేదా ప్రభువు వారి పట్టణాన్ని నాశనం చేస్తారని జనులతో చెప్పాడు. రాజు మరియు అతడి జనులు పశ్చాత్తాపపడ్డారు. ప్రభువు వారిని క్షమించి, నీనెవెను నాశనం చేయలేదు.

యోనా 3

కోపంగా చూస్తున్న యోనా

కానీ జనులు నాశనం చేయబడలేదని యోనా నిరాశ చెందాడు. వారు క్షమించబడడానికి అర్హులు కాదని అతడు అనుకున్నాడు.

యోనా 4:1–2

చనిపోయిన చెట్టును చూస్తున్న యోనా

యోనాకు ఒక పాఠము నేర్పడానికి, ఎండ నుండి యోనాకు నీడను ఇవ్వడానికి ప్రభువు ఒక మొక్కను మొలిపించారు. తరువాత ఆ మొక్క చనిపోయింది మరియు యోనా ఆ మొక్క కోసం బాధపడ్డాడు.

యోనా 4:5–9

జనసమూహానికి బోధిస్తున్న యోనా

ప్రభువు తన పిల్లల గురించి యోనాకు ఒక పాఠమును బోధిస్తున్నారు. జనులు పశ్చాత్తాపపడనప్పుడు అతడు విచారించాలని, వారు పశ్చాత్తాపపడినప్పుడు అతడు సంతోషంగా ఉండాలని యోనా నేర్చుకున్నాడు.

యోనా 4:10–11